పాప కోసం
- Yasoda Gottiparthi

- Oct 23
- 2 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #PapaKosam, #పాపకోసం, #TeluguStories, #తెలుగుకథలు

Papa Kosam - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 23/10/2025
పాప కోసం - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
ఇంటి ముంగిట రంగవల్లులు రంగురంగుల ముద్దబంతి రెక్కలతో నింపి సోయగాలు పంచుతున్నాయి. గుమ్మానికి మామిడాకుల తోర ణాలు, పూలదండల చిరుమువ్వుల సవ్వడులు గాలికి సయ్యాట లాడుతూ వచ్చే అతిధులకు, మిత్రులకు స్వాగతం పలుకుతున్నాయి.
ఊరంతా పండుగ అయితే కాదు.. కానీ ఊరి ముత్తయిదువులు అంతా అక్కడికి చేరుకున్నారు. పట్టుచీరల ధగధగతో ఒకరి వెంట ఒకరునడుస్తూ గేటు దాటి లోపలికి రాగానే, ప్రక్కన నగిషీ చెక్కిన టేబుల్ పైన గులాబీలు, అత్తరు ఘుమ ఘుమలతో ఉల్లాస పరుస్తూ, వాళ్ళను నిలబడమని చేతికి గులాబీ ఇచ్చి అత్తరు చల్లి ఆహ్వానిస్తున్నారు.
గుమ్మoలో అడుగుపెట్టి లోపల ఉన్న రెండవ హాల్లోని సోఫాల్లో కూర్చుంటున్నారు. వచ్చారు కానీ అక్కడ ఏ ఫంక్షన్ అనేది తెలియక తికమక పడుతున్నారు.
రియల్ ఎస్టేట్ బిజినెస్ యజమాని లక్ష్మణ్ రెండు మూడు కార్లు, పెద్ద బిల్డింగు, డిజైన్స్ సోఫాలు, రంగురంగుల లైట్స్ తో ఇల్లు దేదీప్యమానంగా యుండి, సర్వెంట్స్ తిరుగుతూ వచ్చిన వాళ్ళను సాదరంగా లోనికి పిలుస్తూ, అందమైన ట్రేలలో వెల్కమ్ డ్రింకులు, జ్యూస్లు అందిస్తూ సంతోష పరుస్తున్నారు.
ఏమి ఫంక్షన్?ఎవరిది? అని అడగాలని నోటి వరకు వచ్చిన లోపలే దాచేసుకుంది రమణమ్మ. అడిగితే చెప్తారో లేదో? లేక తెలియకుండా ఎలా వచ్చారు? అని నవ్వు కుంటారు అని మూగదైంది.
లక్ష్మణ్, లావణ్య పై ఫ్లోర్ లో ముస్తాబవుతున్నారేమో? గొప్ప వాళ్ళ ఇళ్లలో అంతే.. ఇంటి వాళ్ళు మాత్రం అతిథులు వచ్చిన తర్వాత కిందికి దిగుతారు. వెనకటి సంప్రదాయంలో గుమ్మంలో నుండే పలకరింపులు ఆప్యాయతలు కనబరిచే వారు. ఆ రోజులే వేరమ్మ అని ఎవరికి వారే లోలోపల అనుకుంటున్నట్టు.. వాళ్ళ ముఖాలపై తెలుస్తుంది.
కిచెన్ లో ఉన్న రోహిణి అప్పుడప్పుడు బయటకు వచ్చినా వాళ్లకు కనిపించకుండా గమనిస్తుంది. లావణ్య కోడలుకు తొమ్మిదవ నెల అని తెలుసు. శ్రీమంతం చేస్తారేమో అనుకుంటే అక్కడ ఆ ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు అనుకునే లోగా గుమ్మంలో కనిపించింది.
కాసేపట్లో దగ్గర బంధువులు కొందరు గబగబా వచ్చి “హాయ్ సౌజన్య! విష్ యు హ్యాపీ బేబీ షవర్ టు యు". "హృదయ పూర్వక బేబీ షవర్ శుభాకాంక్షలు" అంటూ కొందరు..
కేరింతల చప్పట్లతో ‘నవ మాసాల గర్భిణీ నడిచి రావమ్మా!’ అంటూ శ్రీమంతo పాటలన్నీ పాడుతుంటే సౌజన్య ముందు షాక్ అయి కోలుకుని ఎగ్జైట్ అయి ‘థాంక్యూ! ఆల్..’ అంటూ లోపలికి నడుస్తుంటే చూసేవాళ్ళకు ఆమె నిండు చూలాలులా కనపడటం లేదు, కొంచెమే పొట్ట ఎత్తుగా కనిపించి.
సౌజన్య తల్లి ప్రక్కనే ఉంది..
లావణ్య కోడలును పరిచయం చేసి అందరి చేత పసుపు, కుంకుమ, గాజులు పెట్టించి ఘనంగా వేడుక జరిపించింది.
సౌజన్య ఆ రాత్రే ప్రసవించింది. అమ్మాయి పుట్టిందని అందరికీ తెలిసింది.
**********
ఉయ్యాల పండుగకు పిలిచి నపుడు రహస్యం బయట పడింది. సౌజన్యకు తల్లి అయ్యే భాగ్యం లేక లావణ్యకు అద్దె గర్భంతో మనుమరాలు వచ్చింది అని అర్ధమయ్యి, లోలోపల విడ్డూరంగా ఉన్నా వారి సంతోషంలో పాలు పంచుకున్నారు.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comments