top of page

ఫోను వాడకంలో హుందాతనం


'Phone Vadakamlo Hundathanam' New Telugu Article

Written By A. Annapurna

'ఫోను వాడకంలో హుందాతనం' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఈ స్మార్ట్ ఫోను వచ్చాక ప్రతి వాళ్ళకీ లోకువ అయ్యాము. మన కాలాన్ని, ఇష్టాన్ని గ్రహించకుండా మెసేజులు పెట్టి చంపేస్తుంటారు కొందరు. మెస్సేజ్లు మాత్రమే కాదు. అడ్డమైన ఫోటోలు తీసి పంపడం, దేవుళ్ళు, భక్తి ప్రవచనాల వీడియోలు .. ఒకటేమిటి మనకి ఇష్టమోకాదో గ్రహించరు. చేతిలో ఫోను వుంది అంతే!


ఈ మధ్య శ్రీరామ నవమి వచ్చినపుడు అపార్టుమెంటులో కళ్యాణం చేసినవారు పెట్టిన ఫొటోలతో పిచ్చి పట్టేసింది. ఎదో ఒకటి పెడితే చాలదా .. బాబోయి నాకు ఇంట్రెస్ట్ లేదు పంపవద్దు అంటే శాపనార్ధాలు పెట్టేరు.


ఇక వాళ్ళు వెళ్లిన పెళ్లి, మరో ఫంక్షన్ డేన్స్, వంటకాలు తింటున్నట్టు, ఫంక్షన్ హాలు డెకరేషన్.. వాళ్లకి ఇంపార్టెన్స్ కావచ్చు. మనకెందుకు? అనే ఆలోచన ఉండదు. కొందరు వాళ్ళు కట్టుకున్న సారీస్, చేసుకున్న మేకప్పు, వేసుకున్న నగలు .. ఇలా అర్థం పర్ధం ఉండదు.


ఎవరికైనా ఫోను నెంబర్ ఇవ్వాలంటే భయం. వాట్సాప్ మెస్సేజిలు, కాల్స్ ఫ్రీ అవడం బిగ్ హెడేక్ అయి పోయినది. ఏజ్ లిమిట్ అంటూ లేదు.. అన్ని వయసులవారు దీనికి అడిక్ట్ అయిపోయారు. ఎంత సదుపాయమో అంత చిరాకు కూడా తెప్పిస్తుంది. కొందరు ఎంతో హుందాగా వుంటారు.


ఇక మరీ దగ్గిర ఫామిలీ మెంబర్స్కి సహాయం చేద్దాం కదాని అడగటంపాపం.. కొన్ని వేల పెళ్లి సంబంధాలు పెట్టేసారు. అందులో పెళ్లి ఐనవాళ్లు, కానివాళ్ళు, ఏజ్ బార్ అయినవాళ్లు.. పిచ్చి ఫొటోలతో పంపడం మొదలు పెట్టేరు. బాబోయి.. నా సహాయం మాట అటుంచి, ఫోను నిండా పెళ్లి సంబంధాలు వచ్చేసాయి.


అవన్నీ డిలీట్ చేయడం తో జబ్బలు నొప్పివచ్చి ఫిజియో థెరపీకి వెళ్లాల్సివచ్చింది. ఏమీ తోచక, ఎవరికీ వారు వ్యాపకం కల్పించుకోలేక, ఎవరైనా దొరికితే చాలు ఎడాపెడా వాయిస్తున్నారు.


వారికీ పురాణాలు పుణ్య క్షేత్రాలు అంటే ఇష్టం ఉండచ్చు. ఎదుటివారికి ఆ ఇష్టం ఉందొ లేదో గ్రహించాలి. కొందరు యూట్యూబ్ లోవచ్చే ప్రతి ఆరోగ్య చిట్కాలు నమ్ముతారు. దాన్ని మనకు పంపుతారు.


అదో బోరు. కాలి గోరుకు వచ్చే ఇన్ఫెక్షన్ మొదలు తలకు వేసుకునే రంగు వరకూ వదలకుండా ఫాలో అవుతారు. అంతటితో వదిలేస్తే బాగానే ఉండును. మనకి ఆసలహా ఇస్తారు.


మాకు తెలిసిన వాళ్ళు బీ పీ సుగరుకి టాబిలెట్స్ అక్కరలేదు. మీ పెరటిలోను. రోడ్డు పక్కనా దొరికే మొక్కల ఆకులను రసం చేసుకుని తాగండి.. నెల రోజులకు మీరు మీరు కాదు.. గంధర్వులు అయిపోతారు. ఏ జబ్బు మీ దగ్గిరకి రాదు.. అంటారు.


ఇంకొకరు నాలుగు మైళ్ళు పరిగెత్తండి అంటే, మరొకరు ఆబ్బె ఏమీ అక్కరలేదు . మెడిటేషన్ చేస్తే చాలు అని ఊదరగొట్టేస్తారు.

ఇవికొన్నే! ఇంకా చాలా బాధలు వాట్సప్ లో కనిపిస్తాయి. అందరికీ ఈ అనుభవాలు ఉంటాయి.

కానీ హుందాగా ఉండేవారూ నూటికి ఒకరో ఇద్దరో.

వారి గురించి కూడా తప్పకుండా చెప్పాలి .


నాకు అపురూపమైన స్నేహితురాలు ''సీమ'' చాలా ముఖ్యం అనుకున్నప్పుడే ఫోను చేస్తారు. ఆ మాటలు ఇంకా వినాలని అనిపించేటంత మృదు మధురం. !


అస్సలు మెస్సేజ్లు పెట్టరు . ఆమెను రోజూ గుర్తు చేసుకుంటాను. ఆమెకు చాలామంది తెలియరు. కానీ ఆవిడ చాలామందికి తెలుసు సింగర్ బాలూ గారి ద్వారా! ఈటీవీ స్వరాభిషేకంలో ఆమెను పరిచయం చేశారు. ఆమె గొప్ప చదువరి.. ఇప్పటికి చదివిన పుస్తకాలు ఎన్నో వేలు దాటి ఉంటాయి!


ఆవిడ ప్రముఖ సినిమా పాటల రచయిత ''వేటూరి సుందర రామమూర్తిగారి సతీమణి సీతామహాలక్ష్మి గారు''. అవును.. మాస్నేహం ఎంత ఆత్మీయం అంటే ఆవిడను నేను ''సీమా.. '' అని పిలుచుకునే అంత. !


ఆవిడ పరిచయం నా కెంతో ఇష్టం !

***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)
39 views0 comments
bottom of page