పిసినారి ఔదార్యం
- Veluri Sarada

- Jun 7
- 2 min read
పిసినిగొట్టుతనం, దానం, ఔదార్యం, మానవత్వం, సహాయం, సామాజిక వ్యంగ్యం, హాస్య వ్యంగ్య కథ, humor story

Pisinari Audaryam - Telugu Comedy Story | Mayukha
పిసినారి ఔదార్యం - తెలుగు హాస్య కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 07/06/2026
జోగారావు చిన్నప్పటినుంచి పిసినారి. అలా అంటే ఒప్పుకోడు. "నా తత్వం 'దుబారా' చేయకపోవడం" అంటాడు.
భార్య అన్నపూర్ణమ్మ దానికి క్లారిఫికేషన్ ఇస్తుంది, "మీది ముమ్మాటికి పిసినిగొట్టు తనమే. కనీస అవసరాలకి కూడా ఖర్చు పెట్టరు. మరి దీన్ని ఏమంటారు? పిసినిగొట్టుతనం కాక. దుబారా అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టడం. మీరు అలా చేయరు కదా! ఎప్పుడూ మనకి తప్ప కొత్తగా విస్తరేసి ఎవరికైనా భోజనం పెట్టామా? మన పక్కింటి దామోదరం తన 70వ ఏళ్ల పుట్టినరోజుకి అనాథాశ్రమంలో అందరికీ భోజనాలు పెట్టారట. మీరు కూడా, మీ పుట్టినరోజు వస్తోంది కదా! అందరికీ భోజనాలు పెట్టండి" అంది.
దాంతో జోగారావుకి గుండెల్లో బాంబు పేలింది.
"నేను పుట్టినరోజులే చేసుకోనప్పుడు, ఇక పంక్తి భోజనాలు ఏంటి నీ మొహం" అంటూ తేల్చేశాడు. అయినా అన్నపూర్ణమ్మ ఊరుకోలేదు. "మనకి కోట్ల ఆస్తి ఉంది. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్లకి మనం పోగు చేయవలసిన పనిలేదు" అంటూ మెత్తగా చివాట్లు పెట్టింది.
ఇది ఊరుకునేలా లేదు అనుకుని, ఆలోచించి, "బిచ్చగాళ్లకి కడుపు నింపాలి, అంతేనా!" అన్నాడు.
"పోనీలే, భర్త దారిలోకి వస్తున్నాడు" అనుకుని, సంతోషంతో "అవును, వాళ్లకు కడుపు నింపండి" అంది.
అంతే, ఎదురింటికి బిచ్చానికి వచ్చిన ముష్టివాడిని పిలిచాడు. "ఎప్పుడూ లేనిది ఈయన పిలిచాడు, ముష్టి వేస్తాడేమో!" అనుకుని, పరుగున వచ్చి, "బిచ్చం వేయండి బాబయ్యా!" అన్నాడు.
ఇక అప్పుడు మొదలెట్టాడు జోగారావు తన ఫిలాసఫీ. "చూడు బాబు! ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ఉంది! నువ్వు ఇలా పైసలు అడుక్కుంటే దానికి సేఫ్టీ ఎక్కడ? ఎవరో ఒకళ్లు వచ్చి ఎత్తుకుపోతారు! అందుకని......" అని ఆగాడు.
"అదేంటి బాబయ్యా, మాకు డబ్బే లేనప్పుడు ఇక క్యూఆర్ కోడ్లు, అకౌంట్లు ఎలా ఉంటాయి? మీరే దయతలచి ఒక రూపాయి వేయండి!" అన్నాడు బిచ్చగాడు.
"అమ్మో రూపాయే!" అనుకుని, "నీకు కడుపు నిండే మార్గం ఒకటి చెబుతాను, విను" అని జోకులు చెప్పడం మొదలుపెట్టాడు. ముందు మొహమాటానికి నవ్వినా, ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే వెంటనే తిట్లు లంకించుకున్నాడు.
"ఈ జోకులు విని నేను ఆనందంతో కడుపు నింపుకోవాలా? నువ్వు రోజూ విను, నువ్వు రోజూ తిండి మానేయ్!" అంటూ తిట్టాడు.
"ఒరేయ్ పిచ్చివాడా! 'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం' అన్నారు పెద్దలు. నీకు అన్నం పెడితే ఒకపూటే కడుపు నిండుతుంది. అదే ఈ జోకు తలుచుకున్నప్పుడల్లా నీ కడుపు నిండుతూనే ఉంటుంది" అన్నాడు జోగారావు.
ఇదంతా చూస్తున్న అన్నపూర్ణమ్మ, భర్త పిసినిగొట్టుతనానికి తిట్టుకుంది. 'కడుపునింపమంటే తిండి పెడతాడు అనుకున్నాను కానీ, ఇలా గాలి కబుర్లతో అని అనుకోలేదు' అని వాపోయింది.
******శుభం *******
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.









Comments