top of page

పొరుగింటి పట్టుచీర


'Poruginti Pattuchira' - New Telugu Story Written By Mohana Krishna Tata

'పొరుగింటి పట్టుచీర' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏమండి! పెళ్ళిళ్ళ సీజన్ వస్తోంది. మన ఫ్యామిలీ లో పెళ్ళిళ్ళు చాలానే ఉన్నాయి. కట్టుకోవడానికి మంచి పట్టుచీర లేదండి. షాపింగ్ కు వెళ్దామా?" అడిగింది మేఘన


"అదేమిటీ? మన పెళ్ళికి నువ్వు కొనుకున్న పట్టుచీరలు చాలా ఉన్నాయికదా!. అలాగే, నేను ఒకటో, రెండో కొన్నాను కదా!.. అవన్నీ ఏవి?"


"ఉన్నాయిలెండి! డ్రై క్లీనింగ్ చేసి, బీరువా లోపల పెట్టాను.."


"ఇంకేమైతే!.. అవే కట్టుకో.. మూడు చీరలు.. సరిపోతాయి".


"అలాగనకండి! ఆ చీరలు ఇంతకు ముందు చాలా ఫంక్షన్స్ లో కట్టేసాను.. అందరూ చూసేసారు.. మళ్ళీ ఏ మొహం తో కట్టుకోమంటారు చెప్పండి? కట్టుకుంటే, మీకే ప్రాబ్లెమ్!"


"నాకేమి ప్రాబ్లెమ్ లేదు! కట్టుకో.."


"అయితే! కొనాలనుకుంటున్నారా?లేదా?"


"పట్టుచీరంటే.. ఇప్పటికిప్పుడు అంత ఖరీదు పెట్టి కొనలేను.."


"మీ మగవారి లాగా, మా ఆడవారు వేసుకున్న బట్టలే మళ్ళీ వేసుకోలేరు.. అసలే మా బంధువులంతా.. గుచ్చి గుచ్చి చూస్తారు.. చీరల్ని, నగల్ని.. ఒక పని చేస్తానండి!"


"ఏమిటి?"


"మన పక్కింటావిడ మొన్ననే కొత్త చీర కట్టుకుంది, ఫంక్షన్ లో.. చూసాను. అడిగి తెస్తాను"


"వద్దులేవే! ఏమనుకుంటారో?"


"ఏమీ అనుకోరు లెండి! ఆవిడ అప్పుడప్పుడు పంచదార, ఉప్పు, పప్పు పట్టుకెళ్ళట్లేదు మరి!"


"నీ ఇష్టం"


మేఘన ఎదురింటి పంకజం దగ్గరకు వెళ్ళింది.


"మేఘన.. ఏమిటండి ! ఇలా వచ్చారు? కాఫీ తెస్తాను ఉండండి" అంది పంకజం.


"వద్దు లెండి!.. మొన్న మీరు ఫంక్షన్ లో కట్టుకున్న కాఫీ కలర్ పట్టు చీర చాలా బాగుందండి! అప్పుడే చెబుదామనుకున్నాను.. హడావిడి లో కుదరలేదు"


"థాంక్స్ మేఘన!"


"మా ఊరిలో, మా దగ్గర చుట్టాల అమ్మాయి పెళ్ళి ఒకటుంది.. మీ పట్టుచీర ఇస్తే, ఇలా.. కట్టుకుని, అలా.. తెచ్చి ఇచ్చేస్తాను"


"పట్టుచీర? ఎలా ఇవ్వగలను చెప్పండి!"


"మీరు నా దగ్గర చాలా మార్లు పంచదార, పప్పు, తీసుకెళ్లారు.. కదండీ.. కావాలంటే ఇంకో కిలో పంచదార.. తీసుకెళ్ళండి!"


"ఉల్లిపాయలు చాలా రేట్ ఉన్నాయి.. ఒక మూడు కేజీ ఇస్తే, ఓకే".. మొహమాటం లేకుండా అడిగేసింది పంకజం.

"పట్టు చీర తెచ్చిన తర్వాత, చీర తో పాటు ఇస్తాను లెండి"


"మా ఆయనకు తెలియకుండా ఇస్తున్నాను.. జాగ్రత్త సుమండీ!"


"అంతగా చెప్పాలా? నా చీర లాగా చూసుకోను?" అంది మేఘన.

"వస్తానండి.. మళ్ళీ కలుద్దాం" అని మేఘన ఇంటికి చేరుకుంది.


"మేఘన.. పెళ్ళికి చాలా హుషారుగా బయల్దేరింది.."


"పట్టుచీర జాగ్రత్త మేఘన!"


"పట్టుచీర ఇక్కడే హ్యాండ్ బాగ్ లో ఉందండి"

"ఏవండీ! పెళ్ళికి మీరు వస్తే బాగున్ను!"


"నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది.. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు"


మొత్తం మీద పెళ్ళికి చేరుకుంది మేఘన..


"ఏమే మేఘన! నీ చీర చాలా బాగుందే! ఎంతేమిటి? ఒక పది వేలు ఉంటుందా?”


"ఉంటుంది.. లే పిన్ని"


అక్కడ నుంచి జారుకుంది మేఘన.. ‘అందరూ చీర గురించే తెగ అడుగుతున్నారు?’ అనుకుంది.


మేఘన పెళ్లికూతురు మధు రూమ్ కు వెళ్లి.. కంగ్రాట్స్ చెప్పింది.


"ఇప్పుడా! రావడం పిన్ని.. నీ చీర బాగుందే పిన్ని..ఈ కలర్ ఎక్కడా దొరకలేదు.. నా రిసెప్షన్ కు ఇస్తావా?"


"లేదు.. నేను నీ పెళ్ళయ్యాక.. వెళ్ళిపోతున్నాను.. మా వారు ఒక్కలే ఉన్నారు ఇంట్లో "


"ఒక్కరోజు పిన్ని.. ఇవ్వు.. ఇప్పుడు షాపింగ్ చేసే అంత టైం కూడా లేదు..”

"తప్పదా!"


"తప్పదు పిన్ని.."


“అలాగే ఇస్తాను.. కానీ.. ఈ చీర గురించి నీకు ఒక విషయం చెప్పాలి..”

"మీ అయన కి, నేను చెబుతాను లే పిన్ని.. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి"


పెళ్ళి గ్రాండ్ గా జరిగింది.. మేఘన మనసు అంతా పట్టుచీర మీదే..


ఈ లోపు పెళ్లికూతురు.. రిసెప్షన్ చీర పెళ్ళికొడుకు కు చూపించింది.


"ఇలాంటి చీప్ చీర కడతావేమిటి" అని పెళ్ళికొడుకు.. ఆ చీర ను పనిమనిషి కి ఇచ్చేసాడు. తాను కొని తెచ్చిన చీర కట్టుకోమని అడిగాడు పెళ్ళికొడుకు..


చేసేదేమి లేక.. పెళ్లికూతురు సరే అంది..


రిసెప్షన్ అయిన తర్వాత, చీర పంపించమని మేఘన.. పెళ్లి కూతురు కు చెప్పి ఊరు బయల్దేరి వచ్చేసింది.. భర్త అర్జెంటు గా రమ్మనందుకు..


మధు కు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు..

పిన్ని కి ఫోన్ చేసింది.. “పిన్ని! ఎలా ఉన్నావు? నీకో విషయం చెప్పాలి.."


"చీర పంపించావా?"


"చీరా!.. ఏమో.. మరేమో.. పిన్ని.. చీర.. "


"ఏమైందే! చెప్పు నాకు టెన్షన్ ఇక్కడ"


"చీర, మా ఆయనకు నచ్చలేదు.. అందుకే పనిమనిషి కి ఇచ్చేసాడు.."


"ఏమిటే! అంటున్నావు!"


"ఇందాకనే.. ఇక్కడ నాకు రిమైండర్ వచ్చింది మా పక్కింటావిడ నుంచి.."


"ఏమిటి.. అంటున్నావు పిన్ని?"


"అదే.. అదే.. మా అయన చీర గురించి అడుగుతున్నారని.. అంటున్నాను"


"బాబాయి కి సారీ చెప్పు.. ఈసారి మంచి చీర కొని పంపిస్తాను లే.."


ఇప్పుడు పంకజం కి ఏమి చెప్పను.. ?


"ఇది విన్నావా మేఘన! "


"ఏమిటండి?"


"ఎదురింటి పంకజం కి ఆక్సిడెంట్ అయ్యిందట.. హాస్పిటల్ లో జాయిన్ చేసారు.. ఇందాకల వాళ్ళాయన.. కనిపించి చెబుతూ కంట్లో నీళ్లు పెట్టుకున్నాడు.. వెళదాం పదా!.. వాళ్ళకి కొంచం ధైర్యంగా ఉంటుంది..”


మేఘన.. భర్త తో కలిసి హాస్పిటల్ కు వచ్చింది. రూమ్ నెంబర్ తెలుసుకుని, లోపలికి వెళ్ళింది మేఘన. పంకజం తలకు దెబ్బ తగలడం చేత, గతం మర్చిపోయిందని.. డాక్టర్ చెప్పగా విన్నా..


"అయ్యో పాపం! ఎప్పుడూ నవ్వుతూ ఉండేది.." అంటూ మేఘన.. చీర టెన్షన్ నుంచి పూర్తిగా రిలీఫ్ పొందింది.


*************************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


42 views0 comments
bottom of page