'Srimathi Chethi Coffee' - New Telugu Story Written By Mohana Krishna Tata
'శ్రీమతి చేతి కాఫీ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"వాణి! కాఫీ!"
"వస్తున్నానండి!"
"నీకు తెలుసు కదా! వాణి, నీ చేతి కాఫీ తాగనిదే నా రోజు మొదలవదని!"
"తెలుసు! తెస్తున్నా!"
"ఆహా! కాఫీ అమోఘం వాణి. రోజు నీ చేతి కాఫీ తాగే అదృష్టం నాకు లభించింది కదా "
"మరీ పొగడకండి.. "
వాణి, విజయ్ కు ఈ మధ్యే పెళ్ళయింది. వాణి కాఫీ ఒక్కటే కాదు, వంటి కుడా బాగా చేస్తుంది! ఇంటి పనులు కూడా చక చకా చేస్తుంది!
“ఇది నిజం కాదా చెప్పు! నీ చేతి కాఫీ కోసం కాదా!.. మన ఇంటికి అందరూ వచ్చేది.. మొన్నటికి మొన్న, మా ఫ్రెండ్ ని కాఫీ కోసం, మార్నింగ్ మన ఇంటికి రమ్మంటే.. సాయంత్రం వస్తానన్నాడు తెలుసా?”
"ఎందుకండీ"
"మార్నింగ్ ఆ వీధి చివర ఉన్న హోటల్ లో తాగుతాడంట.. మోషన్ ఫ్రీ గా అవుతుందని..
అమృతం తాగాలనిపించినప్పుడు మన ఇంటికి వస్తాడంట.. నీ చేతి కాఫీ మహిమ అటువంటిది కదా!"
మరి.. మన పెళ్ళిచూపులకు ముందు.. రెండు పెళ్ళిచూపులు చూసాము. ఎవరికీ ఓకే చెప్పాలో చాలా కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, మూడవ పెళ్ళి చూపులలో నువ్వు ఇచ్చిన కాఫీ తో రెండూ రద్దు చేసి.. నీకే తాళి కట్టాను..
పది లక్షలు కట్నం లేనిదే, పెళ్ళి లేదని కూర్చున్న, మా అమ్మ.. నీ చేతి కాఫీ తాగిన తర్వాత, ఎంత మారిపోయిందో తెలుసా!.. కట్నం లేకపోయినా పర్వాలేదు..
నువ్వే కోడలిగా రావాలని పట్టుబట్టింది.. ఒలింపిక్స్ లో కాఫీ పోటీలు పెడితే, ఖచ్చితంగా నీకే ఫస్ట్ వాణి!”
"శ్రీవారు కాఫీ ప్రియులు కనుకే అలాగ అనిపిస్తుంది.. నాదేముంది!.. కాఫీ పొడి గ్రైండ్ చేసి కాఫీ చేస్తాను అంతే!"
"అలగనుకు వాణి! నీ చేతిలో ఎదో మహిమ ఉండబట్టే కదా.. కాఫీ అమృతం లాగా మారుతున్నది..
కాఫీ గురించి చెబుతాను విను..
ఉదయమే కాఫీ తాగనిదే రోజు ఎలా మొదలవదో..
భోజనము లేట్ అయితే.. కాఫీ..
భోజనం తర్వాత కూడా తాగుతారు కొంత మంది కాఫీ..
కవులు, రచయితలూ, ఆలోచనల కోసం ఎక్కువగా తాగుతారు కాఫీ..
ఉపవాసం ఉన్నవారు తాగేది కాఫీ..
పెళ్ళిచూపులలో ముందుగా ఇచ్చేది కాఫీ..
ఎవరింటికైనా.. వెళ్తే మర్యాద గా ముందు ఇచ్చేది కాఫీయే,
ఇంతకుముందు కాఫీ అంటే కేవలం ఇన్‌స్టంట్ కాఫీ, లేదా ఫిల్టర్ కాఫీ.. ఈ రెండు రుచులే.. ఇప్పుడైతే.. కోరినన్ని రుచులు.. కోరినన్ని ఫ్లేవర్లు.
కాఫీ మానవుని అమృత సృష్టి కాదా.. ఆ అమృతాన్ని అందించడంలో నీది అందెవేసిన చెయ్యి కాదా?..
ఎక్కడైనా భోజనము హోటల్ లేకపోవచ్చు గాని.. కాఫీ షాప్ మటుకు ఖచ్చితంగా ఉంటుంది.. అందులో మళ్ళీ ఎన్నో రకాలు..
లిస్ట్ చెప్పాలంటే.. ఒక రోజు పడుతుంది
మొన్న మా బాస్ మనింటికి వచ్చి.. నీ కాఫీ తాగిన తర్వాత, మర్నాడు ఆఫీస్ లో లోన్ మంజూరు చేసేసాడు.. థాంక్స్ వాణి..
నీ టాలెంట్ వృధా కాకూడదు వాణి! ఒక కాఫీ షాప్ పెట్టచ్చు గా? ఎలాగో లోన్ డబ్బులు చేతిలో ఉన్నాయి కదా!”
"అయితే మన ఇంటి ముందరే పెడదామండి!" అంది వాణి.
"అలాగే! నీ ఇష్టం!" అన్నాడు విజయ్.
*************************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
కథ కాఫీ రుచిలా ఉంది-అభినందనలు.