top of page

ప్రేమికుల ప్రయాణం'Premikula Prayanam' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

'ప్రేమికుల ప్రయాణం' తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రవి ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అవి అతడు సిటీలో పేరున్న సాఫ్టువేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా పని చేస్తున్న రోజులు! అతని క్రింద కొత్తగా జూనియర్ గా జాయిన్ అయ్యింది పద్మజ. ఆమె.. అణకువ నమ్రత,.. పనిపట్ల ఆసక్తి,.. నేర్చుకోవాలనే తపన.. అతణ్ణి బాగా ఆకట్టుకున్నాయి

.

రవి బుద్ధి కుశలత, ఏకాగ్రత.. పనిలో నేర్పు.. పద్మజను ఆకర్షించి.. అతనికి చేరువ చేసాయి. పరస్పరం.. ఇద్దరి మధ్య.. చనువు పెరిగి.. కలుపుగోలుగా మెలగడం మొదలయ్యింది. దానికి.. వారి వయసు, ఆకర్షణ తోడయ్యాయి!


మంచి జీతం.. చీకు చింత లేని ఒంటరి జీవితాలు. సిటీ సరదాలు షికార్లు,.. వీకెండ్ సినిమాలు.. రెస్టారెంట్లు,.. విందులు వినోదాలతో.. ఇద్దరి మధ్య స్నేహం.. క్రమక్రమంగా వృధ్ధిచెందింది.

చదువు సంస్కారం అలవర్చిన వినమ్రత, ఒకరికొకరి పట్ల ఏర్పడిన గౌరవాభిమానాలు.. వారిమధ్య హద్దులు దాటని.. ఇష్టం ఆకర్షణ.. కాలక్రమేణా.. పెరుగుతూ వచ్చాయి!


ఆరోజు.. వీకెండ్ ప్రేమికుల రోజు...

శిల్పారామం లో.. కలుసుకుని.. సరదాగా గడుపుదామని నిర్ణయించుకున్నారు.

అనుకున్న సమయం కంటే.. అర గంట ముందుగానే అక్కడకు చేరుకున్నారు!

సమయముంది కదా అని.. దుకాణాల వైపు మళ్ళి.. ఫేన్సీ వస్తువుల కొనుగోలుచేస్తూ గడిపారు.

తిరిగి నిర్ణీత స్థలానికి చేరుకునే సమయంలో.. ఎదురుపడి విష్ చేసుకుని.. ఏకాంత ప్రదేశానికి చేరుకుని.. ముచ్చట్లకు దిగారు!


రవికి తను కొన్న ఫ్రెండ్షిప్ బేండ్ ఇచ్చింది పద్మజ!


రవి చిలిపిగా.. ఆ రబ్బర్ బేండు లాగి.. పద్మజకు.. గురిపెట్టాడు!


'నా మీదే ప్రయోగిస్తున్నావా? మళ్ళీ నీకు తిరిగి రాదు సుమా'.. అని.. చిరు కోపం ప్రదర్శించింది పద్మజ!


రవి నొచ్చుకుని.. సారీ చెప్పి.. తానుకొన్న కానుక, ..

'పంగలకర్ర' పద్మజ చేతి కిచ్చి.. 'అవసరమైనప్పుడు నీ.. రక్షణకు ఉపకరిస్తుంది!.. నీ హేండ్ బేగ్ లో ఉంచుకో!.. రాయి పెట్టి లాగి కొడితే.. బుల్లెట్లా దూసుకు పోతుంది! '.. అంటూ.. ఓరగా చూసి నవ్వాడు.

'నువ్వు నా పక్కన ఉంటే రక్షణ భయమెందుకు నాకు! ' అంటూ.. గోముగా అర్ధవంతంగా నవ్వి.. పరిశీలనగా అతడి కళ్ళలోకి చూసింది పద్మజ.


భావం అర్ధమైన రవి.. ఉద్వేగంతో.. 'నీకు నా మీద కుదిరిన ఈ నమ్మకం.. ఎన్నటికీ వొమ్ము కానీయను.. నీవు నాకు తోడై నిలుస్తానంటే ' అంటూ.. మృదువుగా చేతిలో చెయ్యేసి.. కృతజ్ఞతాపూర్వకంగా స్పందించాడు.


అలా.. వారి ప్రణయం.. పరిణయంగా పరిణతిచెంది, .. వారి దాంపత్యం.. మూడు పువ్వులు ఆరు కాయలుగా దశాబ్దాలు గడిచాయి!

నేటికీ ఆ వృద్ధ దంపతులు తరచూ.. నాటి సంఘటనను.. నెమరువేసుకుంటూ మైమరచి.. మురిసిపోతుంటారు!


######$$$######

గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!40 views0 comments

Comentarios


bottom of page