ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం)

'Pragathi Premikulu' Telugu Web Series
Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు' తెలుగు ధారావాహిక పరిచయం..
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నా మాట..
మన భారతీయుల తత్వాన్ని, మన హైందవ సిద్ధాంతాలను, సనాతన హైందవ వైదిక ధర్మాలను, ఆధ్యాత్మిక విధానాలను,భక్తి యోగం, కర్మయోగం, రాజయోగాలను గురించి అమెరికాలోని చికాగో నగరంలో 1893 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగిన విశ్వమత మహాసభలో ప్రపంచ పలు మతా ప్రాగ్యుల ముందు ఎలుగెత్తి చెప్పి, అచ్చెరువొందేలా చేసి, విశ్వవిఖ్యాతి గాంచిన హైందవ జాతి పితామహుడు శ్రీ వివేకానంద స్వామీజీ సుచరిత్ర భావి భారత పౌరులు అందరూ తెలుసుకోవాల్సి వుంది.
ఆ తత్వాలకు వారసులైనప్పటికీ.. భిన్నంగా తమ స్వార్ధంతో సాటి మనుషులను చిన్నచూపు చూస్తున్నారు కొందరు. సాటి వారి ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తున్నారు. పైశాచిక చర్యలను సాగిస్తున్నారు. ఈ తత్వం దేశప్రగతికి గొడ్డలిపెట్టు.నేరం చేసిన వారు ఎవరైనా శిక్షార్హులు. నేర పరిశోధన పోలీస్ వ్యవస్థ బాధ్యతే కాక, వారికి యదార్థాలను
తెలియజేయడం అనేది అందరి కర్తవ్యం.
ఈ తత్వాలను నమ్మి, ఆదరించి అభిమానించే కొందరు యువతీ యువకుల సఖ్యత, సాధనే యీ నా నవల ప్రగతి ప్రేమికులు.
విన్నపము: వివేకానంద స్వామీజీ దివ్య చరిత్ర ను ది ప్రెసిడెంట్ రామకృష్ణ మట్ మైలాపూర్ చెన్నై పబ్లిష్ చేసి మన జాతి చదివేందుకు అందుబాటులో ఉంచారు. యువత, భావి భారత పౌరులు.. మనమందరం మననం చేయాలని స్వామి వారి దివ్య చరిత్ర ను ఆ అమూల్య గ్రంథం నుండి సంక్షిప్తంగా, యధాతథంగా రాశాను. ఆ మహనీయుల దివ్యచరిత్ర నా కల్పన కాదు.
ఇట్లు రచయిత సి ఎస్ శర్మ
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/chcs/profile
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.