ప్రేమ ప్రపంచం
- Yasoda Gottiparthi

- 2 days ago
- 5 min read
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Prema Prapancham - Telugu Family Story | Yasoda Gottiparthi
ప్రేమ ప్రపంచం - తెలుగు కుటుంబ కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 06/05/2026
“మీ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా నా మీద నిఘా ఎక్కువైంది. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ఎప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంది. ఇంకా ఎలా కలుసుకుంటామో చెప్పు ఆకాష్?”
“మనసుంటే మార్గం ఉంటుంది.
నువ్వు బయటకు రావాలంటే ఏదైనా ఆలోచించు.. ఆలోచన మనిషిని అభివృద్ధిలోకి తీసుకుపోతుంది.”
“అభివృద్ధి ఎవరికి? మా అమ్మానాన్న నా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. నాకు పెళ్లి చేయాలని, తమకు పేరు కీర్తి రావాలని.. నేను అత్తింటిలో సుఖంగా ఉండాలని, ప్రతి తల్లిదండ్రులకి ఒక ఆశ ఉంటుంది.
అన్నీ తెలిసి కూడా.. ఏమనంటే తమ సంతానం యోగ్యంగా ఉండాలని, సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదని, మంచి నైతికత కలిగి ఉండాలని, ఆజ్ఞాకారిగా ఉండాలని, వృద్ధాప్యంలో మాకు సేవ చేయాలని.. సమాజంలో మాకు గౌరవం పెంచాలని, ముసలితనంలో మాకు పిల్లలు ప్రేమతో సేవ చేయాలని.. ఇలా ఎన్నో కలలు కంటున్నారు.. కానీ నేను గడప దాటాలనుకుంటున్నాను. చేసే పెళ్లిని వద్దనుకొని నా దారి నేను చూసుకుంటున్నాను.
మా ఇంటి వీధిలో మా అమ్మ నిలబడి ఉంది. మంచం వాకిలి మధ్యనే వాల్చి ఉంది.. దాని మీద మా నాన్న పడుకుని ఆకాశం వైపున నక్షత్రాలను కళ్ళార్పకుండా చూస్తున్నాడు.
ఇంతలో మా ఇంటి సహాయకుడు రంగయ్య పక్కగా వచ్చి నిలబడగా.. "ఏమిరా! ఉత్త చేతులతో వచ్చి నిలబడకపోతే నాకు ఒక కుర్చీ తెచ్చి వెయ్యి.. నీకు అంత ఇంతో తెలుగు చదవడం వచ్చు కదా! రామాయణం పుస్తకం తెచ్చి చదవడం మొదలు పెట్టురా.. నీకు భక్తి, మాకు జ్ఞానం వస్తుంది" అంటూ అమ్మతో,
"ఇప్పుడే ఎందుకు లేవే పక్క బట్టలు. ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండింది, వర్షం వచ్చేటట్టుంది.. " అంటుండగానే టపటపా చినుకులు పడడం ప్రారంభించాయి. ఇక లోపలికి వెళ్దామా అంటూ వస్తున్నారు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను.”
“అయ్యో! పెట్టేయకు ఆశా! నువ్వు బయటికిరా.. ఇప్పుడు నేను ఇక్కడే ఈ గోడ ప్రక్కగా నిలబడి ఉన్నాను. తెల్లవారి సరికి మా ఊరికి వెళ్ళవచ్చు. త్వరగా బయటకు వచ్చేసి, ఎవరూ చూడరు, పైగా వర్షం పడుతుంది. బయటకు ఎవరు రారు పదా..”
.. టూ వీలర్ ఎక్కారు.
"*****
తెల్లవారేసరికల్లా బిడ్డ ఇంట్లో కనిపించకపోయేసరికి ఆందోళన పడుతూ ఏమి చేయాలో అర్థం కాలేదు. బయటకు ఎవరికి తెలిసినా మా పరువు పోతుంది.
ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని బిడ్డ వివరాలు తెలుసుకోవడానికి వెతకడం ఆరంభించారు.
తొందర్లో అక్కడే పెట్టేసిన ఫోను తీసుకుని నెంబర్ చూచి,
చాలాసార్లు మాట్లాడిన నంబర్ ఎక్కడి నుండి వచ్చింది.. ఏ మాయా ప్రపంచంలోకి వెళ్ళింది, అంతా తెలుసుకోవాలంటే ఎంక్వయిరీ మొదలుపెట్టాలి.
దొరికిన ఫోన్ తీసుకొని నెంబర్ చూచి చేరిన స్థలం ఎక్కడుంది? అంతా తెలుసుకోబోతున్నారు.
పదేపదే చేసిన ఫోన్ నెంబర్కు కాల్ చేశారు.. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే వీళ్ళు పెద్ద ప్లాన్ వేసుకొని మన కళ్ళు కప్పారు.
అసలు దీనికి ఇంత చరిత్ర ఉన్నట్టు కూడా ఎన్నడు ఎప్పుడు బయటకూడా పడలేదు. అనుమానం పడేట్లు కూడా చేయలేదు.
“ఏమండీ! ఇప్పుడు పెళ్లి కొడుకు ఇంటి నుండి ఫోన్ కాల్ వచ్చినా సరే, పెళ్లి విషయమై ఎవరైనా వచ్చినా ఏం
చెప్తామండి?” అంటూ బిక్కు బిక్కుమంటూ జరిగిన నష్టం కంటే చుట్టుప్రక్కల వారి నుండి సూటిపోటి మాటలకు ఎక్కువ బాధ పడుతూ, "అమ్మాయి ఏమైంది?" అని భయపడాల్సి వస్తుంది.
*****
“సూర్యోదయం వరకల్లా మనం ఆ ఊరు చేరుకోవాలంటే ఇంకా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళాలి. మీ వాళ్ళు, మా వాళ్ళు మన వెంట పడ్డారంటే.. మనం వాళ్లకు దొరికామంటే మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేము ఆశా”, అంటూ “డ్రైవింగ్ ఇంకాస్త ఎక్కువ స్పీడ్ పెంచుతాను.”
“వద్దు ఆకాష్, ఏం నీకు యమపురికి వెళ్లాలని ఉందా?
ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే అంత తొందర పడకు.”
“మనం వాళ్ళ చేతిలో బంధీలవుతాం. అసలే బస్సులు వస్తున్నాయి, ఏ బస్సు నుండి అయినా మనలను పసిగడతారు. అప్పుడు నేను తూర్పు, నీవు పడమర అనీ తిరిగి దండం పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే పెద్ద క్యాప్ పెట్టుకున్నాను నువ్వు చున్ని ముసుగు వేసుకుని కప్పుకో.
అంతగా భయపడకు మనం ఇద్దరం ప్రేమించుకున్నాం.. పైగా మేజర్లం.
ఇప్పుడు ఈ గొడవలు అవసరమా? మనం ప్రశాంతంగా పారిపోవడమే మేలు. ఎలాగూ మన ప్రేమను ఇష్టపడరు. అలాంటి వాళ్ళ వల్ల మనకు కష్టాలు ఎందుకు?”
“కానీ ముందు దారి చూస్తూ డ్రైవ్ చేయి ఆకాష్.. ఆ సినిమా బండి చూడు ఏవో పేర్లు అని వ్రాసి ఉంది. అలాగే పాటలు వినపడుతున్నాయా?.. కాదు కాదు కనపడుతున్నాయి.
చదువుతున్నా విను..
పరుగులు తీసే ప్రేమ
చేరవే త్వరగా చిరునామా
ఇరువురిది ఒకే ప్రయాణం
ఇద్దరిదీ ఒకే ప్రపంచంగా
ఒకటైంది ఒకే ఊపిరిగా
సినిమా ఎంత బాగుందో చూస్తున్నావుగా, మరి మనం ఎంత దూరం వచ్చామో?”
“కాస్త ఓపిక పట్టు ఊరు వచ్చేస్తుంది.”
“ప్రక్కన నువ్వుంటేనే చాలు ఆకాశ్.”
“ఆకాశంలో మేఘం లా నేను వీడను నిన్ను.”
“వామ్మో! ఆ పాటలేమో?.. కానీ నీకు కవిత్వం కూడా వస్తుంది.”
“ముందు పెట్రోల్ బంక్ వస్తుంది చూడు. వచ్చేముందు నువ్వు ఫుల్ ట్యాంక్ చేయించుకుని రావాల్సింది.
ఇక్కడ బంక్ లేకుంటే ఎలా ఆకాష్”
డుక్ డుక్ శబ్దం ఆగిపోయింది.
అన్నంత పని అయింది.
ఇప్పుడు ఏం చేద్దాం?
“ఇంకా కాస్త దూరమే అక్కడికి నడిచి వెళ్దాం.”
“నడిచా.. ?.. నా వల్ల కాదు ఆకాష్. నాకు టూ వీలర్ మీదనే వెళ్లడం తెలియదు కార్లో తప్ప. అలాంటిది ఇప్పుడు నడవమని అంటున్నావా?”
“అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం. ఏదైనా వాహనం దొరుకుతుందేమో?వస్తుందేమో? చూద్దాం.
అదిగో ఆ బస్సు వచ్చింది.”
ఇద్దరూ బస్సు ఎక్కగానే..
కాసేపట్లో కలవారిపేట వచ్చింది దిగారు.
********
ఆశ ఇంట్లో ఫోన్ కాల్ ట్రై చేస్తూ, సిగ్నల్ లేకపోవడం స్విచ్ ఆఫ్ రావడంతో దిక్కుతోచక “తెల్లవారు వరకు వేచి చూద్దాం. మేము చూసిన సంబంధం చేసుకుని సుఖమైన జీవితాన్ని గడుపుతావని అనుకున్నాను. ప్రేమ, గీమ అంటూ సమాజంలో అశాంతి బీజం నాటటమే అవుతుంది.
సమాజం చెడిపోవడానికి, నాశనం చేయడానికి అగ్గిపుల్ల లాంటిది. నైతికత లేక అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు నడుస్తున్న నటన వింతగా ఉంటుంది. సిగ్గులేని వారి దృష్టి కూడా తేడాగా ఉంటుంది. ఎలాంటి వాడి చక్కర్ లో పడింది మన అమ్మాయి” అని వలవలా ఏడుస్తూ కమలమ్మ, అయినా సరే మన ప్రయత్నం చేద్దాం అనుకున్నారిద్దరూ..
"***
ఆకాష్, ఆశ ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించగానే ఆకాశ్ తల్లి తండ్రి సంతోషంగా ఆహ్వానించారు. తల్లి ఇద్దరికి దిష్టి తీసింది.
అంతా విడ్డూరంగా చూసింది ఆశ.
“ఎక్కడికో తీసుకెళ్తానని ఏ ఫ్రెండ్ ఇంట్లోనే పెట్టి ఏ రిజిస్టర్ ఆఫీస్ కో తీసుకుపోతానని అనుకున్నావు కదా! నీవు,
మీ అమ్మ నాన్న ఆశపడ్డ, కలలు కన్న అత్తగారిల్లు ఇదే.
మా అమ్మానాన్న వీళ్లు” అంటూ భుజాల మీద చేతులు వేసి రండి అంటూ కుర్చీల్లో కూర్చోబెట్టాడు.
“మనం ఇద్దరం నమస్కారం చేద్దాం ఆశ..” అంటూ వంగి పాదాలకు నమస్కారం చేశారు.
“నీకు ఇంకో పెద్ద అద్భుతం చూపించాలి ఆశా” అన్నాడు ఆకాష్.
"మా ఇంటికి వెళ్లి మా అమ్మ నాన్నను కూడా ఒప్పిద్దామా? ప్లీజ్ ప్లీజ్" అంది.
“మనం వెళ్లడం ఎందుకు? వాళ్లే మన దగ్గరికి వచ్చేలా చేస్తాను.”
ప్రక్కనే ఉన్న టేబుల్ వైపు దృష్టిపడి, అక్కడ ఉన్న గ్రూప్ ఫోటో చూసి.. “ఈ ప్రక్కన ఉన్న పెద్ద వాళ్ళు ఎవరు? మీ అమ్మ నాన్నకు మా కుటుంబం ముందే తెలుసా? ఆకాష్. "
ఇది మా పేరెంట్స్ ఫోటో. నాకు అంత అయోమయంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ?”
నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. మీ అమ్మానాన్నతో ఉన్న వీళ్ళు నీకు నానమ్మ, తాతయ్య. నీ మూడు సంవత్సరాల అప్పుడు వాళ్ళు అవసరం లేదనుకొని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేసి, వారి ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకుని.. దూరంగా ఉన్న వృద్ధాశ్రమంలో చేర్చి వారి బాగోగులను కూడా పట్టించుకోలేదు.
“అవునా నాకు వాళ్లు ఉన్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చూద్దాం. పైన ఉన్నారా? నానమ్మ" అంటూ పైకి వెళ్తుంటే..
“ఉండేవారు నిన్నటి వరకు ఇక్కడనే. ఈ రోజే వాళ్లను మళ్ళీ వాళ్ళు చేర్పించిన ఆ గృహంలోనే ఉంచాము. "
“ఎందుకలా చేశారు? మీరు కూడా అలాంటి వాళ్లేనా?”
“మేము మీ నాన్నమ్మకు బిడ్డ కుటుంబం. ఇన్నాళ్లు మా దగ్గర ఉన్నారని తెలిస్తే తన రాజకీయ పలుకుబడితో మాకు దూరం చేసేవారు.. కాబట్టి మేము వాళ్లకు తెలియకుండా అమ్మమ్మ, తాతయ్యను మా దగ్గరే పెట్టుకుని, వారిని చక్కగా చూచుకున్నాము.
కానీ నీ ప్రేమ విషయం తెలిసి వివరాలు తెలుసుకున్నాం.
దూరంగానే బ్రతికాము. ఇప్పుడు నీ వల్లనైనా పాత కక్షలు దూరమవుతాయేమోనని.. మీ తల్లిదండ్రి వివరాలు తెలుసుకుని కలిసి ఉంటారని మేమే ఈ ప్లాన్ చేశాము.”
“పద పద ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి వెళ్దాము. మా నానమ్మ వాళ్ళని చూడాలి. వాళ్ళని తొందరగా తీసుకువద్దాము. మా నాన్న అమ్మ ఇంత క్రూరులా? వాళ్లకు తగిన శాస్తి జరిగింది” అంటూ కోపంతో బయటకు వెళ్ళింది.
*************
“ఆశ, నువ్వు ఇలాంటి పనిచేస్తావు అనుకోలేదు. నువ్వెక్కడున్నా తిరిగి రావే.. నువ్వు ప్రేమ గీమా అంటూ అనవద్దు అని పేపర్లలోనూ, టీవీల్లోనూ ప్రకటనలు వేయించాము. నిన్ను సంతోషంగా స్వీకరిస్తాము. నీ కోరిక ఏదైనా తీరుస్తాము మా కళ్ళ ముందు ఉండే పిల్లవు ఇలా చేస్తావని అనుకోలేదు.”
వారం పది రోజుల్లోనే తల్లి మంచం పట్టింది.
‘ఏనాడైతే నేను అత్త మామను దూరం చేసుకున్నానో, ఆనాడు వాళ్లు కొడుకుకు దూరమై ఎంతగా బాధపడ్డారో.. అంతకంటే ఆ బాధను నాకు గుర్తు చేశావు.. దేవుడా’ అంటూ కన్నీరు మున్నీరవుతుంది ఆశ తల్లి.
‘ప్రాయశ్చిత్తం జరిగింది. పశ్చాతాపం కలిగింది. ఇద్దరికీ దొరకని బిడ్డ కోసం ప్రాకులాడటం కన్నా.. బ్రతికి ఉన్నారో లేదో కూడా చూడని పుణ్య దంపతులను, అత్తమామలనైనా ఇంటికి తీసుకొచ్చుకుంటాను..” అని “రంగయ్య.. కార్ సిద్ధం చెయ్యి..” అని సోఫాలో కూర్చుంది.
సుమన్ టీవీలో ప్లే అవుతున్న వార్తలు.. ఇప్పుడే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏనాటి నుండో కొడుకు, కోడలుకు దూరంగా.. వృద్ధాప్య గృహంలో గడుపుతున్న నానమ్మ, తాతను కలిసిన ఆశ, ఆకాశ్ ను చూసి.. యాంకర్ తో మాట్లాడుతున్న వారి వివరాల గూర్చి తెలుసుకుంటున్న వారిని గూర్చి చూడగానే..
గుండె ఆగిపోయినంత పని అయింది వారిద్దరికీ.. చచ్చిన పాముని ఇంకా చంపినట్లు అయింది.
ఇక వాళ్ళిద్దరూ మమ్మల్ని క్షమించరు. ఆ దేవుడు కూడా మమ్మల్ని కాపాడలేడు అంటూ బాధపడుతూ కారులో బయలుదేరారు.
ఆకాష్ పేరెంట్స్ ను చూసి ఆశ పేరెంట్స్ తమ వల్ల జరిగిన అన్యాయానికి "క్షమించండి అన్నయ్య వదిన" అంటూ క్షమాపణలు కోరారు.
"కొడుకును నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించినా, బిడ్డవయి అమ్మ నాన్నలను చక్కగా చూచుకొని వాళ్ళను సంతోష పెట్టావు అక్కా!"
“మా ఆశను కోడలుగా చేసుకో అమ్మా!’
ఇప్పుడు మనమంతా "ప్రేమ ప్రపంచంలో" ప్రయాణం చేద్దాం అంటూ ఆశను ఆకాష్ కు ఇచ్చి పెళ్ళి ఘనంగా చేశారు.
"కమ్మని గీతం నువ్వే
కన్నుల కమనీయం నీ నవ్వే
"నా కలల రాణి వి" నువ్వే అంటూ కౌగలించుకున్నాడు ఆకాష్ ఆశను.
శుభం
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం







Comments