top of page
Original_edited.jpg

ప్రమోషన్

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #Promotion, #ప్రమోషన్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Promotion - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 21/11/2025

ప్రమోషన్ - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


ఆ ఊరికి కొత్తగా బదిలీ అయి వచ్చాడు సుబ్బారావు, పక్క సీటులో కూర్చున్న శేఖరుతో పరిచయమైంది.


"ఇక్కడ ఆఫీసు ఎలా ఉంటుంది ?, ఏమీ గడబిడలు ఉండదు కదా? ఆఫీసరుతో టెన్షన్ ఉండదు కదా!" అని ఎంక్వయిరీ చేశాడు సుబ్బారావు.


"ఏం పర్వాలేదు, మన ఆఫీసర్ ఉన్నాడు కదా, అప్పారావు, చాలా మంచి మనిషి !ఒట్టి భోళా శంకరుడు! తిండిపోతు అనుకో. నాలుగు సార్లు ఇంటికి తీసుకెళ్ళి కడుపునిండా భోజనం పెడితే, మనకు ప్రమోషన్ ఇచ్చేస్తాడు. తిండి పిచ్చి. అస్తమానం తిండి గురించే మాట్లాడుతాడు. ఆఫీసు పనుల గురించి ఎక్కువగా పట్టించుకోడు. ఆఫీసులో వాళ్లంతా సిన్సియర్గా పనిచేసుకుంటూ పోతారు, కాబట్టి సరిపోయింది"


"అయితే ఆఫీసు గురించి టెన్షన్ లేదన్నమాట "


"నాకు ప్రమోషన్ ఎలా వచ్చిందో తెలుసా? నాలుగు ఆదివారాలు తీసుకెళ్లి, మా ఆవిడ చేత రకరకాల పిండి వంటలు చేయించి, భోజనం పెట్టా, ఆనంద పడిపోయాడు. ఆరు నెలలు తిరిగిందో లేదో నాకు పై పోస్టుకు ప్రమోషన్ ఇచ్చేసాడు" అంటూ నవ్వాడు శేఖర్, 


"ఇదేదో సిస్టం బాగానే ఉంది, నేను కూడా అవలంబిస్తాను", అన్నాడు సుబ్బారావు.


ఇంటికి వెళ్లి భార్యతో చెప్పాడు, వచ్చే ఆదివారం మా ఆఫీసర్ మన ఇంటికి భోజనానికి వస్తాడు అని, భార్య సుబ్బలక్ష్మి ఆనంద పడిపోయింది. 

"అయితే ఆయన భోజనానికి వస్తే ఏమేం చేస్తారండి, స్వీట్లు కూడా చేస్తారా?" అంది.


"చెయ్యకపోతే ఎట్లాగే? నీ తెలివి తెల్లారినట్టు వుంది, సుబ్బరంగా మెక్కుతాడు, తిండిపోతు అట. కడుపునిండా తిండి పెడితే, మనకి మంచి రిమార్క్స్ రాసి, ప్రమోషన్ ఇచ్చేస్తాడుట.

మా ఆఫీసులో అందరూ చెప్పుకుంటున్నారు "


"అయితే మీకు ప్రమోషన్ ఇచ్చేస్తారు, అప్పుడు మీకు జీతం పెరుగుతుంది కదా! నాకు పట్టు చీర కొనాలి మరి, !" ఆరోజు ఎప్పుడొస్తుందో అని ఆనందపడిపోతోంది సుబ్బలక్ష్మి, 

 

"సరేలే ఆయన వచ్చినప్పుడు వెర్రి మొర్రి గా మాట్లాడకు బాగుండదు"


"లేదండి, నేనెందుకు మాట్లాడతాను నోరు మూసుకొని కూర్చుంటాను,” 

అంది సుబ్బలక్ష్మి.


ఆదివారం రానే వచ్చింది.

సుబ్బారావు ఉదయమే లేచి చక చకా ఇంటి పనులు, వంట పనులు అన్ని చేసేసుకున్నాడు. చిన్న చిన్న సహాయం చేస్తుంది సుబ్బలక్ష్మి. అయోమయం, ఒకటి చేయమంటే ఒకటి చేస్తుంది.

12 గంటలకు వచ్చాడు అప్పారావు.


"రండి సార్! రండి ", అంటూ లోపలికి తీసుకెళ్లాడు.

 సోఫా మీద కూర్చోబెట్టాడు.

 

"నమస్కారం అండి ఆఫీసర్ గారు ! " అంది సుబ్బి ఆనందంగా, ముందుకు వచ్చి, 

 

"ఈవిడ సుబ్బలక్ష్మి మా ఆవిడ, 

 వెళ్ళవే! మంచినీళ్లు తీసుకొచ్చిసారు కియ్యి!" అన్నాడు.


డైనింగ్ టేబుల్ మీద అన్ని వంటకాలు పెట్టారు. 

ఇద్దరూ కూర్చుని భోంచేస్తున్నారు, సుబ్బలక్ష్మి వడ్డిస్తోంది. 


"అబ్బా! వంకాయ కారం పెట్టిన కూర చాలా బాగుందోయ్, "


"అవునండి, అన్ని వంటకాలు మా ఆయనే చేశారు. సాంబార్ ఇంకా టేస్ట్ గా వండుతారు.

మీ గురించి పరమాన్నం కూడా వండారు. దండిగా జీడిపప్పులు, కిస్మిస్లు వేశారు, " అంటూ మొదలెట్టింది సుబ్బలక్ష్మి.


పక్కనుంచి సుబ్బారావు సైగ చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడొద్దని. 

అదేం పట్టించుకోవటం లేదు సుబ్బలక్ష్మి. మాటలు మొదలెడితే ప్రవాహం లాగా వెళ్ళిపోతుంది. ఎవరు ఆపలేరు ఆమెని. 


సుబ్బలక్ష్మి కబుర్లు చెబుతూ ఉంటే అప్పారావు కడుపునిండా భోంచేసాడు. 

"వంటకాలు అన్ని చాలా బాగున్నాయి. ఏమాటకామాటే, నువ్వు చాలా బాగా వంట చేస్తావు, " అంటూ నవ్వాడు అప్పారావు.


"అవును సార్! ఆయన చాలా బాగా చేస్తారు. రేపు మా ఆఫీసర్ వస్తాడు, వట్టి తిండిపోతూ, ఆబగా తింటాడు, ఇలా మనం నాలుగు సార్లు భోజనానికి పిలిచి, భోజనం పెడితే, నాకు ప్రమోషన్ ఇచ్చేస్తాడు అని చెప్పారండి, మీ గురించి. మరి, మా ఆయనకి ఎప్పుడు ప్రమోషన్ ఇస్తారండి? ఆయనకి జీతాలు పెరిగితే నాకు పట్టు చీర కొంటానని చెప్పారు, ఎప్పటినుంచో నాకు పట్టుచీర కొనుక్కోవాలని ఉంది సార్. "


సుబ్బారావు సైగ చేస్తున్న వినిపించుకోకుండా ఏదేదో వాగుతూనే ఉంది సుబ్బలక్ష్మి. 


ఆఫీసర్ గారి మొహం కాస్త మాడిపోయింది.


"వెళ్ళొస్తానోయ్, నీ విందు భోజనానికి థాంక్స్, " అంటూ చకచకా వెళ్ళిపోయాడు కోపంగా. 


“కొంప ముంచావు గదటే సుబ్బీ! నీ తింగరి వాగుడు, నువ్వు, ఆఫీసర్ తో అలాగేనా మాట్లాడేది?", 

సుబ్బారావు మొత్తుకున్నాడు. 


మర్నాడు ఆఫీస్ లో ఆయన మొహం చూడడానికి ఎంతో సిగ్గుపడ్డాడు జరిగిందంతా శేఖరుతో చెప్పాడు కూడా.


"కథ అడ్డం తిరిగింది అన్నమాట" అంటూ నవ్వాడు శేఖర్.


__&&&&&_&&&_


మరి సుబ్బారావుకి ప్రమోషన్ వచ్చిందా రాదా? ఏమనుకుంటున్నారు మీరు?

&&&


రెండు నెలల తర్వాత సుబ్బారావుని పిలిచి ఆఫీసరు

"ఇదిగో! నీ ప్రమోషన్ లెటర్” అంటూ అప్పారావు ఇచ్చారు.


సుబ్బారావుకి తనకి అసలు ప్రమోషన్ వస్తుందని అనుకోలేదు. ఒక్కసారి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయాడు!


"అదేమిటి సార్, ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని చాలా అవమానపరిచాను, క్షమించండి” అంటూ బాధపడ్డాడు సుబ్బారావు.


"లేదు సుబ్బారావు! మంచే జరిగింది, మీ ఆవిడ పాపం అమాయకురాలు! మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారో చక్కగా తెలియజేసింది. నాకు నిజంగానే తిండి పిచ్చి ఉంది.

మీ ఆవిడ బోళా మనిషి, ఆమెకేమీ తెలియదు పాపం.

ఆమె వల్ల నేను ఒక పాఠం నేర్చుకున్నాను.

మనకుండే బలహీనతల వలన నలుగురిలోనూ మనకు సిగ్గుచేటు.

ఆమె తెలియజేయడం వలన నాకు మంచే జరిగింది. 

నీ మీద నాకేమీ కోపం లేదు, అందుకే నీకు ప్రమోషన్ ఇచ్చాను.”

అన్నాడు అప్పారావు


ఆ రోజే పట్టు చీర కొని సుబ్బలక్ష్మికి తీసుకెళ్లాడు సుబ్బారావు. 


&&&&&&_


అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.

చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,

**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం

**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం

సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి

ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు

**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,

కథలు, రుబాయీలు, బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,

రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,

ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


bottom of page