top of page

పుష్పాంజలి


'Pushpanjali' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

'పుష్పాంజలి' తెలుగు కవిత

రచన: సుదర్శన రావు పోచంపల్లి


మేము సుగంధాలను గుప్పున

గుబాళించె కోమల కుసుమాలము

మా సౌరభాలను ఆఘ్రాణించండి

ఆనందం పొందండి అంతే కాని

కొన గొటితో త్రుంచకండి


మా కొమ్మలనే అమ్మలనుండి

మము దూరము చేయకండి

మా ఆయుష్షు చాలా చిన్నది

ఆ మాత్రం అమ్మ వడిలో

భద్రంగా బ్రతకనీయండి


ఝుమ్మనే తుమ్మెదలు మాపై

వ్రాలినా హాని తలపెట్టవు

మకరందాన్ని సేవించి మా

ఆతిథ్యము స్వీకరించి రివ్వున

ఎగిరిపోతాయి మరల మరల

వస్తుంటాయి మాకానందము

కలిగిస్తుంటాయి


కమ్మని తేనె గ్రోలుతూ

ఆ మధుర మాధవి సింహభాగం

మీకే అందిస్తుంటయి పాపం

ఆ ఇంగిత జ్ఞానముతో ఇసుమంతైనా

కలిగి మా కోమల కుసుమాల

దెస రాకండి మము త్రుంచుకొని

మీ మంచాన పరచి మమ్ముల

ఛిద్రము చేయకండి నలిపి

చీపురుతో చిమ్మేయకండి

చిరు లతలలో చిందులేస్తూ లిప్తకాలమైనా

మము తెమ్మెరలలో తేలి తూగాడనీయండి


మానవులారా మీకో నమస్కారం


***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


27 views0 comments
bottom of page