top of page

రక్షా కంకణం


'Raksha Kankanam' - New Telugu Story Written By Namani Sujana Devi

Published In manatelugukathalu.com On 18/10/2023

'రక్షా కంకణం' తెలుగు కథ

రచన: నామని సుజనాదేవి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

రెండు క్షణాల తేడాతో నేను ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న స్పప్నం ఆరోజు సాకారం అవుతుందని, అది నా ఆలోచనా నిర్ణయాన్నే మార్చేస్తుందని ఆక్షణం నాకు తెలియదు.


‘ఏమండీ! పక్కింటి స్వప్నను హాస్పిటల్ లో చేర్చారట. కల్తీ కూల్ డ్రింక్ తాగిందట. పాపం రమేష్ ఎంత ప్రాణంగా చూసుకుంటాడో! అతనొకటే ఏడుపు’

బయట నుండి వచ్చిన రాధిక చెబుతుంటే వింటూనే ఆఫీస్ కి వెళ్ళడానికి బండి తీశాను.


ట్రాఫిక్ సిగ్నల్ రెండు క్షణా ల తేడాతో పడటంతో, ‘హతవిధీ’ అనుకుంటూ ఆగాను. కనీసం మూడు నిమిషాలు తప్పదు అనుకుంటూ యధాలాపంగా తల పక్కకు తిప్పాను.


ఒక షాపు ముందు ఒంటినిండా పూర్తిగా బట్టలు లేని మతిస్థిమితం లేని ఓ బిచ్చగత్తె కు దుప్పటి కప్పుతున్న ఆమె కనిపించింది.


ఆమె! ఆమె!


తన ఆరాధ్య దేవత, తను అన్వేషిస్తున్న త్రైలోక్య కదూ!


లేకపోతె జీవిగంజి పోయమని పక్కవారు ప్రాధేయ పడుతున్నా పట్టించుకోని ఈ కాలంలో, ప్రేమ, కరుణ, మానవత్వం రంగరించి చేసిన అపురూప శిల్పం, అందమైన రూపంతో పాటు అందమైన మనస్సు ఉన్న ఆమె తన త్రైలోక్య కాక మరొకరు ఎలా అవుతారు?


ఆలోచనల్లో ఉండగానే, ఆహార పొట్లం, చీర ఇచ్చి వెనుదిరిగింది ఆమె. తన అనుమానం నిజమే! వందమందిలో ఉన్నా గుర్తుపట్టగలడు. ఆమె తన త్రైలోక్యనే! ఓ పక్కగా ఆపిన స్కూటీపై పెట్టిన హెల్మెట్ తీసిపెట్టుకుంది ఆమె. ఆ వెంటనే సిగ్నల్ పడడం తో బండిని ముందుకు దూకించింది. వెనకవాళ్ళు హారన్ కొడుతుండటం తో బండి ముందుకు దూకించాను.


నెమ్మదిగా నడుపుతూ ఆమె బండిని ఫాలో అయ్యాను. వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర బండి ఆపి డిక్కీ లోనుండి కొబ్బరికాయ, పూలు ఉన్న సంచీ తీసుకుని కదిలింది.


ఏం చేయాలో తోచక నేనూ ముందుకు కదిలాను. ఆమెకంట పడకుండా దర్శనం చేసుకున్నాను. తర్వాత ప్రాంగణం లోని మెట్ల దగ్గర కూర్చున్న ఆమె దగ్గరకు వెళ్లాను. అల్లంత దూరాన నన్ను చూసిన ఆమె కళ్ళు నులుముకుని మరీ చూసింది.


‘ఎన్ని సార్లు నులుముకుని చూసినా నేనే! నీ ప్రియమైన, నువ్వు ప్రేమించిన రమణ నే! ఆకలి తీర్చే అన్నపూర్ణలా, దుప్పటి కప్పి ఆదరించే మానవత్వ ప్రతీకలా ఉన్నది నువ్వే అని ఫాలోఅవుతూవచ్చా ’


‘ఓహ్! అదంతా చూసావా? పొద్దున్న వాకింగ్ లో చూసా అని గుడికి వస్తూ ఇచ్చి, వ్రుద్దాశ్రామానికి ఫోన్ చేశా! పోనీలేగాని, రమణా! నువ్వేంటి ఇక్కడ? అసలు ఏమై పోయావు ఇన్నిరోజులు?’


‘అంటే, నేను వేయాల్సిన ప్రశ్నలు ముందు నువ్వే వేసి నన్ను దోషిగా నిలబెడదామనా?’ ఆమె మెడలోని మంగళ సూత్రం, నల్లపూసల గొలుసు చూస్తూ అడిగాను.


‘అవును! గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, సిగ్గు విడిచి రాసిన నా ఉత్తరానికి కనీసం జవాబే ఇవ్వలేదు ‘


‘ఉత్తరం ఏంటి? నేను ఊరి నుండి వచ్చేసరికి మీరు ఇల్లు ఖాళీ చేసారు అని చెప్పారు. ’


‘ అబ్బే! అది కాదు! నువ్వు నాలుగురోజులు మీ అక్కకు ఒంట్లో బాలేదని వెళ్ళిన రోజే, మా నాన్నకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ రావడం, తర్వాత మంచిరోజులు లేక పోవడంతో ఆ రెండు రోజుల్లోనే మేము ఇల్లు ఖాళీ చేయడం జరిగింది. నీకు విషయం చెప్పాలని ఎంత ఆరాట పడ్డానో! చివరకు నీకు ఉత్తరం కూడా రాసి కవర్లో పెట్టి, భయంగానే మా నాన్న చూడకుండా మీ తమ్ముడికి ఇచ్చాను. నాకు సెల్ లేదుగాని, నీకు ఉంది కదాని ఆ సెల్ కి బయట నుండి ఎన్నిసార్లు కాల్ చేసానో’


‘అవునా! నా సెల్ నీళ్ళల్లో పడితే సిమ్ మార్చాను. నీ కోసం ఎన్ని ఏళ్ళు పిచ్చివాడిలా ఎదురు చూసానో! చివరికి మా నాన్న అవసాన దశలో తప్పనిసరై రమణిని పెళ్ళి చేసుకున్నాను. అయినా ఎంత కాలమైనా, మళ్ళీ నీతోనే నా జీవితం అని అప్పటి నుండి వెదుకుతూనే ఉన్నాను’


‘ఆ రోజులు మర్చిపోవాలి కదా! ఇప్పుడు ఇద్దరం పెళ్ళయిన వాళ్ళం’


‘అయితే! మన బంధం విడిపోయేది కాదు. ఎవరేమైనా కానీ, ఇప్పటి నుండి నిన్ను నేను వదిలే ప్రసక్తే లేదు’


‘కానీ అది తప్పు రమణా! ఇప్పుడు నేను మరొకరి భార్యని’


‘అది ఒక శారీరక అవసరం మాత్రమె. మనది దానిని మించిన పవిత్రమైన అనుబంధం. నీకోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను. ఎప్పుడో అనుకున్నాను. నువ్వు కలిసాక నీతోనే సహజీవనం అని. ఇప్పటికి కలిసావు. ’


‘పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చే సమయం అయ్యింది. నేను వెడతాను. ’


‘అప్పుడేనా? మళ్ళీ ఎప్పుడు, ఎలా ? ఇంతకీ ఎక్కడ ఉంటున్నారు? నీ సెల్ నంబర్, అడ్రస్ ఇవ్వు. నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా’


‘రెండురోజుల్లో నేనే కలుస్తా. నువ్వు ఊహించని బహుమతి ఇస్తా! బై’


నేను నిర్ఘాంతపోయి చూస్తుండ గానే వడివడిగా వెళ్ళిపోయింది.


ఆలోచనల్లో ఉత్తరం గుర్తుకు రావడం తో తమ్ముడికి ఫోన్ చేసి నిలదీశాను. వాడు చెప్పిన విషయాలకు నా మనసు మొద్దు బారింది. అది ఏమిటంటే, వాడు ఆ ఉత్తరం తీసుకుని వస్తుంటే, త్రైలోక్య వాళ్ళ నాన్నబండి పై వచ్చి దారిలోనే తీసుకున్నాడట. ఎవరికీ చెప్పవద్దు అని బెదిరించాడట. అంతేకాదు. నేను వచ్చాక మా నాన్న సెల్ లోని సిమ్ కూడా కావాలనే, ఎవరికీ అనుమానం రాకుండా మార్చాడట. వేరువేరు కులాల వారమైన తాము ఒకటి కావడం ఇరు కుటుంబాలకు నచ్చక పోవడంతో ఇద్దరూ ఒకరి సహాయం ఒకరు తీసుకుని, గుట్టు చప్పుడు కాకుండా వేరుచేశారు అన్నమాట. కాని ఇప్పుడు ఆగ్రహం వ్యక్త పరచడానికి ఆ తరం లేదు.


అన్యమనస్కంగానే ఇంటికి వెల్లెసరికి, మా ఇంటి పక్క రమేష్ ఇంటి ముందు అందరూ పోలీసులు ఉన్నారు. హడావుడిగా ఉంది. అయ్యో అయితే స్వప్నకు ఏమైనా అయ్యిందా? అనుకుంటూ లోనకు వెళ్లాను.


‘ఏమండీ! పక్కింటి రమేష్ లేడూ! అతను పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించాడట. అతనికి ఇష్టంలేకుండా, తండ్రి భయానికి స్వప్నను పెళ్ళిచేసుకున్నాడ ట. ఇప్పుడు ప్రియురాలు కలవడంతో, స్వప్నను వదిలించుకోవడానికి కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించాడట. స్వప్న నాన్న వాళ్ళు అనుమానం వ్యక్తం చేయడం తో పోలీసులు వస్తే అసలు విషయం ఒప్పుకున్నాడు ఆ రమేష్. ఎంత ఘోరం చూసారా?’


రాధిక ఇంకా చెబుతూ పోతోంది. నేను స్థాణువునయ్యాను.


నా మనసు ఆత్రంగా ఉంది. ఇద్దరి నాన్నలు కలిసి తమను విడదీసిన విషయం ఎప్పుడెప్పుడు త్రైలోక్యకు చెబుదామా అని క్షణాలు లెక్కపెడుతున్నాను. రెండు రోజుల్లో నన్ను ఎక్కడ, ఎలా కలుస్తుంది? అంటే నేను ఎక్కడ ఉంటున్నానో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో ఆమెకు తెలుసా? రకరకాల ఆలోచనలు నను నిలువనీయడం లేదు.


ఆ రోజు సెలవుదినం కావడం తో పేపర్ చదువుతూ హాల్లో కూర్చున్నాను. ఇంతలో బయట ముగ్గేస్తున్న మా ఆవిడతో పాటు మరొకరి మాటలు వినబడుతున్నాయి.


‘ఏమండీ! మీ ఫ్రెండ్ త్రైలోక్య అంట వచ్చారు. ’ మా ఆవిడ అంటూ లోనకి వచ్చింది.

ఉలిక్కి పడ్డాను. ఎవరికీ తెలియకుండా మొన్నటి గుడిలోనో, ఆఫీస్ లోనో కలుస్తుంది అనుకున్నా. ఆలోచనల్లో ఉండగానే, ‘వదినా! ఇలా కూర్చో! ’ అంటూ నా పక్కన రాధికను కూర్చోబెట్టి, ఇద్దరికీ బొట్టు పెట్టి నా చేయిని తీసుకుని రాఖీ కట్టి, నోటిలో స్వీట్ పెట్టింది.


నేను నిర్ఘాంత పోయాను ఆమె సంభోధనకు, చర్యలకు, . చిత్రంగా ఆమె చేయి అందుకోవాలని, ఆమె నా నోటిని తీపి చేయాలని ఆ మధుర క్షణాలను ఎన్నో రకాలుగా ఊహించుకున్న నేను, ఇప్పుడు ఆమె స్పర్శ కేవలం ఒక ఆత్మీయురాలిగా తప్ప మరే పులకింతలు కలిగించ లేకపోయింది చిత్రంగా. ఇదేనా ఆమె ఇస్తానన్న బహుమతి.


‘రమణా! సారీ.. అన్నయ్యా! తోబుట్టువులు సోదరుడి క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రావణ పౌర్ణమి రోజు ఈ రాఖీ కడతారట. తోబుట్టువులు లేని నేను ప్రస్తుతం మిమ్మల్ని ఆ స్థానంలో చూసుకుంటున్నాను. తర్వాత వదినతో కలిసి మీ బావ ను కలవడానికి వస్తారు కదూ! పండగ రోజు కదా మా ఆడపడుచులు వస్తారు. ఇక వెడతాను ’


సుడిగాలి లా వచ్చి వెడుతున్న ఆమెను ఆపుతూ రాధిక బొట్టు పెట్టి, ఆత్మీయంగా చీర అందించింది. నాకళ్ళ లోని నీళ్ళల్లో పాత త్రైలోక్య రూపం కరిగిపోయింది. భావితరాన్ని అడ్డ దారుల నుండి ప్రగతి పథానికి సున్నితంగా, తెలివిగా దారి మళ్లించిన మహిళామూర్తిగా ఆత్మీయురాలిగా ఆవిర్భవించింది.


**********************

నామని సుజనాదేవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :

తెలంగాణా లో రచయిత్రి , కవయిత్రి నామని సుజనాదేవి పరిచయం క్లుప్తంగా.

పూర్తి పేరు : నామని సుజనాదేవి

విద్యార్హతలు : B.Sc.,B.Ed.,M.A.(English),LL.B.,PGDCA., FIII(Fellow of Insurance Institute of India) M.Sc.(Psychology),M.A.(Telugu) English&Telugu Type Writing lower.

వృత్తి :భారతీయ జీవితబీమా సంస్థలో పరిపాలనాధికారి

ప్రవృత్తి : కధలు,కవితలు వ్రాయడం,చెస్,క్యారమ్స్,టి‌టి ,అథ్లెటిక్స్ మొదలగు ఆటలు ఆడటం,వ్యాసరచన,వక్తృత్వం లాంటి అన్నిపోటీల్లోపాల్గొనటం మూడు కధా సంపుటాలు రెండు కవితా సంపుటాలు వెలువరించడం. ‘మనో స్పందన’ కధా సంపుటికి రాష్ట్ర స్థాయి తృతీయ పురస్కారం రావడం.

1.భారత మహిళా శిరోమణి అవార్డ్ ౩. సంపూర్ణ మహిళా అవార్డ్ 4 . అలిశెట్టి ప్రభాకర్ స్మారక కవితా పురస్కారం 5. శ్రీ శ్రీ సాహితీ పురస్కారం 6. గ్లోబల్ పీస్ (ప్రపంచ శాంతి) అవార్డ్ 7. ఉగాది పురస్కారం , రుద్రమదేవి మహిళా పురస్కారం 8. శ్రీ అయితా చంద్రయ్య సంప్రదాయ కధా పురస్కారం 9. బెస్ట్ సిటిజెన్ అవార్డ్ 10. ‘విశ్వ శాంతి సేవా పురస్కారం ‘ 11. శాతవాహన విశ్వ విద్యాలయ కధా పురస్కారము 12. సోమరాదాక్రిష్ణ స్మారక వ్యాస పురస్కారం 13. ‘గురజాడ సాహిత్య పురస్కారం ‘ 14. సైదా సాహెబ్ స్మారక మినీ కవిత లో ప్రధమ బహుమతి 15. ఆంద్ర ప్రదేశ్ మాసపత్రిక హాస్య కధల పోటీలో ప్రధమ బహుమతి 16. రెండు సార్లు నెలవంక నెమలీక కధా పురస్కారం 17. ప్రతిలిపి ద్వారా ‘కధా కిరీటి ‘, ‘ కవి సుధ ‘ బిరుదులు, సహస్ర కవిమిత్ర బిరుదు 18. ‘సాహితీ రత్న’ అవార్డ్ 19. కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్ సాహితీ అవార్డ్ 20. ఇప్పటివరకు దాదాపు 70 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లో ,6 విశాఖ ఆకాశవాణి లో,3 హైదరాబాద్ ఆకాశవాణి లో ప్రసారం చేయబడినాయి. 21. 225 కధలు,175 కవితలు,25 ఆర్టికల్స్ ఈనాడు,తెలుగువెలుగు ,విపుల ఆంధ్రభూమి, స్వాతి, ఆంధ్రజ్యోతి,కధాకేళి, ముంబైవన్,ఉషోదయ వెలుగు ,వైఖానసప్రభ మొదలగు పత్రికల్లో ప్రతిలిపి, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, వసుధ ,మామ్స్ ప్రేస్సో వంటి వెబ్ మాగజీన్ లలో ప్రచురించబడ్డాయి. 22. LIC డివిజన్ లెవల్ చెస్ లో 10 సార్లు, అధ్లేటిక్స్ 3 సార్లు,టి.టి.లో 5 సార్లు ప్రధమ స్థానం పొంది జోనల్ లెవెల్ లో పార్టీసీపేట్ చేయడం. 23. రాష్ట్రస్థాయి జాతీయ వెటరన్ అధ్లేటిక్ మీట్లలో 2000 నుండి 2003 వరకు దాదాపు 15 నుండి 20 వరకు గోల్డ్,సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ పొందడం. జోనల్ లెవల్ అధ్లేటిక్ మీట్లో 400మీటర్ల పరుగుపందెంలోబ్రాంజ్ మెడల్ 24. 11 వ్యాసాలకు, దాదాపు 27 కధలకు , 12 కవితలకు కొన్ని ఆర్టికల్స్ కు బహుమతులు పొందడం. 25. దూరదర్శన్ హైదరాబాద్ , వరంగల్ సప్తగిరి చానల్స్ ద్వారా ఇంటర్వ్యులు, మనమాట- మన పాట కార్యక్రమం, ఉగాది కవిసమ్మేలనాలలో పాల్గొనడం 26. మహాత్మా జ్యోతీరావ్ ఫూలే సాహిత్య అవార్డ్ 27. క్రియేటివ్ ప్లానెట్ జాతీయ కవితా పురస్కారం 28. .శ్రీరామదాసి సాహిత్యపురస్కారం , ఎడపల్లి, నిజామాబాద్ 29. 405 కధలు వచ్చిన ప్రతిష్టాత్మక నవ్య ఉగాది పోటీలో ‘అనుబంధం’ కధ కు బహుమతి 30.అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ అమెరికా వారు జూన్ 2019 లో నిర్వహించిన కధల పోటీలో ‘తేడా’ కధకు బహుమతి రావడం. 31. గో తెలుగు వెబ్ సైట్ వారు వారు నిర్వహించిన పోటీ లో ‘ప్రేమ నేర్పిన పాఠం ‘ కి జూన్ 2019 లో బహుమతి 32. కెనడా డే 2019లో నిర్వహించిన పోటీలో ‘వాగార్దావివ సంత్రుప్తౌ’ కధ కు బహుమతి 33. తెలుగు కళా సమితి అమెరికా వారు నిర్వహించిన కధల కవితల పోటీలో , ‘చేయనితప్పు’ కధకు, ‘అలుపెరుగని పోరాటం’ కవితకు ప్రధమ బహుమతులు. 34. నిడదల నీహారికా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో 2020 ‘కుజ దోషం’ సంక్రాంతి కదల పోటీలో 20౦౦ నగదు బహుమతి. 35. ప్రతిష్ట్మాత్మక ఈనాడు కధావిజయం పోటీలో వెయ్యి కధల్లో నాకధ ప్రచురణకు సెలక్ట్ కావడం. 36. పుప్పాల ఫౌండేషన్ కధా పురస్కారం ‘వ్యత్యాసం' కధకు 18-1-20లో 37.హాస్యానందం చక్కరకేలీ పోటీలో ‘ఆనందం –ఆరోగ్య రహస్యం’ కధకు 5-1-20 లో బహుమతి ప్రధానం. 38. అంపశయ్య నవీన్ గారి ప్రధమ నవలల పోటీలో నా నవల ‘ఐ లవ్ మై ఇండియా’ కు పదివేల బహుమతి 24-12-19న స్వీకరించడం. 39. ‘తెలుగు పునర్వైభవం ‘ అంశం పై సాహితీ కిరణం నిర్వహించిన కవితల పోటీలో నా కవితకు ఫిబ్రవరి 2020లో బహుమతి రావడం. 40. ‘పొడుస్తున్న పొద్దు’ కధకు మామ్స్ ప్రేస్సో వెబ్ సైట్ లో ఏప్రిల్ 2020లో బహుమతి రావడం 41. రెండు తెలుగు రాష్టాల వారికి పెట్టిన పోటీలో నా కధా సంపుటి ‘స్పందించే హృదయం’ కు ‘సుందరాచారి స్మారక పురస్కారం’ 42. మామ్స్ ప్రేస్సో లో ‘ఇంటింటి రామాయణం’ బ్లాగ్ కి బహుమతి 43. తెలుగు సాహితీ వనం నిర్వహించిన పోటీలో నా కధ ‘తేడా’ కి జూన్ 20 లో బహుమతి 114. ప్రియమైన కధకుల గ్రూప్ లో ‘అనుబంధం’ కధకి జూలై 20 లో తృతీయ బహుమతి

114 views0 comments
bottom of page