'Raktha Sambandham Raksha Bandhanam Part 1/2' - New Telugu Story Written By Surekha Puli
'రక్త సంబంధం రక్షా బంధనం పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న, అని అమ్మ ప్రతీ బిచ్చగాడికి అన్నం పెట్టేది. ఒక్కొక్కసారి వండిన వేడి భోజనమైనా సరే ముందుగా అడిగినవాడికి, ఆ తరువాత ఇంట్లో వాళ్ళు. ఎన్నో మార్లు నాన్న మందలించినా "ఆకలి బాధ చాలా దుర్భరమైనది, లేనివాడికి వున్నంతవరకు భోజనం పెడితే పుణ్యం" అంటూ సమాధానపర్చేది. "నీ పేరు అన్నపూర్ణగా మార్చుకో", నాన్న అనేవాడు.
గోవిందరావు ప్రైవేట్ స్కూల్ టీచర్, బొటాబొటిగా సరిపడే జీతం. కొడుకు గోపాల్ వరంగల్ కాకతీయలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువు; అడిగినప్పుడల్లా కాదనకుండా కాలేజీ ఫీజు, బుక్స్, హాస్టల్ ఫీజు అన్నిటికి చాలా డబ్బులు సర్దుబాటు చేసేవాడు గోవిందరావు.
హౌస్ సర్జన్ కోర్స్ స్టైఫండ్ డబ్బులతో రాఖీ పండుగకు చెల్లెలు కోసం చీర బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు గోపాల్.
అమ్మను తోడుగా వెంట తీసుకుని సికింద్రాబాద్ అంజలి టాకీస్ ఎదురుగా వున్న పట్టు చీరల షాప్ లో ధర్మవరం వేలడంత జరీ వున్న కుంకుమ ఎరుపు రంగు చీర కొన్నాడు.
శ్రావణ పౌర్ణమి రోజు సంతోషంగా అన్నాదమ్ములకు, అక్కాచెల్లెళ్ళు సంప్రదాయగా తమ సోదరులు అన్ని వేళల విజయం సాదించాలని వారి నుదిట వీర తిలకం పెట్టి, మంగళ ప్రధమైన ఎర్రని పట్టు దారాన్ని మరియు తమతమ స్తోమతను అనుసరించి రాఖీ జత చేసి ముంచేతికి కడతారు. తరువాత సోదరులకు హారతి ఇచ్చి సదా తోబుట్టువులు ఒకరికొకరు రక్షణగా వున్నాము, వుంటాము అని వాగ్దానము చేసుకుంటారు. ఏదైనా తీపి వంటకాలు తిని సంతోషంగా వుంటారు. సోదరులు వారి అనుకూల పద్దతిలో బహుమతులు ఇస్తారు. భారత దేశంలో ఈ ప్రక్రియ ఆనవాయితీగా ఒక పవిత్ర సంబంధానికి బంధనం అనెడి ప్రతీక.
గోవిందరావు సుభద్రల మరో సంతానం సుజన. పంచపాళీ తీసుకొని అన్న గోపాల్ కోసం అందమైన రాఖీతో పాటు, అమ్మ చేసిన పాయసంతో చక్కగా ముస్తాబై వచ్చింది.
ప్రేమతో కొన్న చీరను చెల్లికి బహుకరించాడు. “సుజీ, గిఫ్ట్ నచ్చిందా”?
“చాలా బాగుంది. ” చీర` కుడివైపు పైటలాగా వేసుకొని మురిసిపోయింది.
అన్నకు, అమ్మానాన్నల కాళ్ళకు దండం పెట్టి, అందరి ఆశీర్వాదాలకు ప్రీతి పాత్రురాలైంది.
“గోపీ, నీకు తెల్సిన ఫ్రెండ్స్ లో చెల్లికి మంచి అబ్బాయిని చూడు, ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల విషయంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ” నాన్న చెప్పాడు.
“మీరూ, అమ్మ, చేయాల్సిన పని నాకు చెబితే ఎట్లా? మా టీం అంతా మెడికోస్, కొంచెం కష్టం నాన్నగారు. ”
“అన్నా, అవన్నీ పట్టించు కోవద్దు, నీ కోర్స్ పూర్తి చేయి, డాక్టర్ గోపాల్ అనే నువ్వు; ముందు పెళ్ళి చేసుకోవాలి. ”
సుభద్ర అందుకుంది “ఎవరికి పెళ్లి కుదిరితే వాళ్ళు ముందు సాగాల్సిందే. ”
“అమ్మా, నేను కనీసం డిగ్రీ అయినా పూర్తి కానిదే, ప్లీజ్ పెళ్లి మాట ఎత్తకండి. ”
గోవిందరావు గొంతు విప్పాడు “అలాగే చదుకో, సంబంధాలు చూస్తూ వుంటే తప్పేమి వుంది. దేని దారి దానిది. ”
తండ్రి మాటకు తిరుగు చెప్పే అలవాటు లేక సుజన సిరీస్ అయింది.
గోపాల్ టాపిక్ మారుస్తూ, "కొత్త చీర కట్టుకో సుజీ, అందరమూ కలసి భోజనం చేద్దాం, సాయంత్రమే నేను వరంగల్ వెళ్ళాలి. ” తల్లీకూతుళ్ళు ఇద్దరూ వంటింటి వైపు దారి తీశారు.
***
“అమ్మా శివుని గుడి వద్ద ఆరడుగుల వినాయకుడిని పెట్టారట, చూద్దాం పద" చందాలు ఆశించక, స్వంత ఖర్చులతో ఆరడుగుల వినాయకుడికి పూజలు, నిమజ్జనం రోజున వీధిలో అందరికి అన్నదానం అమర్చిన ఆండాళ్ళమ్మ గారు అందరికి ఆదరణీయురాలు.
అన్నదానం స్వీకరించిన వారంతా ఆండాళ్ళమ్మ గారికి పాదనమస్కారం చేసి వెళుతున్నారు. సుజన కూడా తల్లితో పాటు పాద నమస్కారం చేస్తుంటే, సుజన్ను ఎద దగ్గరగా తీసుకొని, “జానకీ, పాపకు పెళ్లి సంబంధాలు చూసే సమయంలో ముందుగా నాకు చెప్పాలి”.
“అలాగే” తలఊపింది.
బాల్య వితంతు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రధారణ, నుదిటిన పాపిట మొదలు వరకు ఎర్రచందన నామం, కొంత నెరిసిని పెద్ద ముడికట్టిన జుట్టు, నియమనిష్ఠలతో గౌరవంగా వుంటూ రాజేశ్వర్రావును అనాధాశ్రమం నుండి దత్తత తీసుకుంది. పెద్ద ఇల్లు, బోలెడు ఖాళీ స్థలంలో ఈశాన్యదిశగా తులసి కోట. పండగలకు అన్నదానాలు. వ్యాపకం కోసం తక్కువ వడ్డీలకే బీదలకు డబ్బులు ఇచ్చేది. ఆస్తి అనాథ బాలుడికి చెందుతుందని ఆత్మీయులందరు ఆనవాళ్ళుకాగా, పనివాళ్ళే నావాళ్ళుగా మిగిలారు ఆ స్త్రీ మూర్తికి.
గోపాల్ మెడిసిన్ హౌస్ సర్జన్ కోర్స్ చివరి రోజుల్లో ఉండగా, పూలదండలతో క్రిస్టన్ అమ్మాయిని తోడుగా తెచ్చి నాన్న కాళ్ళ వైపు వంగి “గ్లోరి, నా క్లాస్మెట్, చర్చలో పెళ్లిచేసుకున్నాం, ముందుగానే మీకు తెలియచేయలేదు, క్షమించండి. ”
అంతే!
గోవిందరావుకు మాట రాలేదు కుప్పకూలిన భర్తను చూసి సుభద్ర “బయటకు నడు” అని కొడుకుని పక్కకు జరిపింది. ఇంటిముందు పూలతో అలంకరించిన కారు, అందులో పెద్ద వయసు జంట, బహుశా గ్లోరీ తల్లిదండ్రులేమో. సుభద్ర, సుజనా కల్సి గోవిందరావుని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎడమవైపు కన్ను, నోరు, చేయి పక్షవాతం దెబ్బ.
***
పండరీనాథ్ రాజకీయాల్లో పలుకుబడి కల్గిన వ్యక్తి. అదనుచూసుకొని డబ్బు అవసరమైన వారి బలహీనతలు కనుక్కుని డబ్బు సద్దుతాడు. "మీవద్ద డబ్బు సమకూరినప్పుడే అప్పు తీర్చండి” అంటూ కపట వినయం ప్రకటించి ఆస్తులను కుదువ పెట్టించి, చెప్పిందాని కంటే ఎక్కువ వడ్డీ రాయించుకుని ఎందరో భూములను, ఇళ్ళను కాజేసుకునే దళారి.
గోవిందరావు కొడుకు మెడిసిన్ చదువుకోసం అప్పు చేసి ఏడాది అయినా వడ్డీ కట్టలేక పోయాడు. ఫలితంగా లాయర్, పోలీసులు వెంట రాగా పండరీనాథ్ ఇంట్లోని మొత్తం సామానులతో పాటు మనుషులను కూడా రోడ్డున పడేసాడు.
మధ్యాహ్నం ఎండలో ఈజీ చైర్లో అనారోగ్యంతో ఉన్న గోవిందరావు మాటలేమి మాట్లాడ లేక సతమతమవుతున్నాడు. సుభద్ర భర్త ప్రక్కనే కుమిలిపోతున్నది.
ఈ దుర్భర క్షోభను వినోదంలా చూస్తూ చుట్టూ జనం నోటికి తోచిన విధంగా సొల్లు మాటల రంపపు కోత!
ఈ దుస్థితికి కారణాలు వెదికే కంటే ఉపాయము ఆలోచించాలి.
***
సుజనకు ఆండాళ్ళమ్మ గారు గుర్తుకొచ్చారు. కథ విన్న తరువాత పండరీనాథ్ను పిలిపించి చాలాసేపు మాట్లాడింది. బోనాల జాతరలో పోతరాజుగా కనబడిన పండరీనాథ్ ఆండాళ్ళమ్మ గారి ముందు చేతులు కట్టుకొని పీనుగులా అయ్యాడు. అన్ని మాటలకు సరే అని తలుపుతున్నాడు. “సుజనా, అప్పు తీసుకున్న దస్తావేజుల నిబంధనలు, షరతులు మీ నాన్న సరిగ్గా చదివినట్లు లేదు. నమ్మించి మోసం చేసాడు పండరీ. ఫర్వాలేదు, ముందుగా మీకు ఇల్లు కావాలి. కొన్ని రోజుల వరుకు నా ఇంట్లో ఉండండి, మీ నాన్న తీసుకున్న అసలు, వడ్డీ పోగా మిగిలిన మదింపు పైకముతో మలక్ పేట వడ్ల మిల్లు వెనుక నీ పేరిట ఒక చిన్న ఇల్లు తీసుకుంటాను. ”
అనుభవజ్ఞులమనే ధీమా కూడా తప్పు దోవ పట్టిస్తుంది.
భోరున రోదిస్తూ “అమ్మా మీరు నాకేమౌతారు? ఇంతటి దయకు నేను అర్హురాలినా?”
“ఆపదలో ఆదుకోవడం మానవ ధర్మం, అమ్మమ్మా అని పిలువు. ”
అంబాసిడర్ కారు వచ్చింది, “సుజనా, కారులో వెళ్లి మీ అమ్మానాన్నలను తీసుకొనిరా”
“మరి మా సామాను?”
“అవి భద్రంగా మీ కొత్త ఇంటికి చేరుతాయి, ఈ పనులన్నీ శివశంకర్ దగ్గరవుండి చేస్తాడు. వెళ్ళు”.
దేవతలు గుడిలో కాదు, మనుషుల్లోనే వున్నారు. చేతులెత్తి మహతల్లికి నమస్కరించింది.
ఆండాళ్ళమ్మ గారు స్వగతంలో అనుకున్నది “సుజన ఈ ఇంటి కోడలైతే బావుండునని, కాని బహుశా సుభద్రమ్మ ఒప్పుకోక పోవచ్చును. ”
అమ్మ నస మొదలైనది. "క్లాక్టవర్ గార్డెన్లో విశ్రాంతి తీసుకుందాం, పద". అమ్మ మాట వినే ధోరణిలో లేదు. శివశంకర్ ఇద్దరి అనుచరులతో సామాను లారీలో ఎక్కించి, ముగ్గురికి ఆనంద్భవన్ హోటల్ భోజనం తెచ్చాడు.
“సుజనమ్మా, మీరు పెద్దమ్మగారి ఇంటికి.. ”
“వస్తున్నాం, కొంచెం నాన్నకు సాయం పడితే.. ” శివశంకర్ గోవిందరావుని కార్లో కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు.
“ఆండాళ్ళమ్మ గారు తన మనవడు రాజుకు, నీకూ పెళ్లి చేసే ప్రయత్నంలో వున్నది. ” అమ్మ గుసగుస.
ప్రస్తుతము సుజనకు కావల్సింది కూడు, నీడ. పెళ్లి కాదు. రాత్రి గడిచింది. సూర్యోదయం కాక ముందే ఆండాళ్ళమ్మ గారు లేచి కాలకృత్యాలు, చన్నీళ్ల స్నానం చేసి, శివుని గుడిలో నూటొక్క ప్రదక్షిణాలు చేసి, పాలు తాగారు. మా కోసం ఉప్మా చేసింది.
దుఃఖపూరిత సంభాషణలు లేవు, చివర్న మరొకసారి కాళ్ళు మొక్కి, ఆశీర్వాదం తీసుకుంది సుజన.
***
పాత ఇల్లు! అన్ని సదుపాయాలు బాగున్నాయి, పాత అనే పదం మర్చిపోతే మంచిది. చుట్టు ప్రక్కన అంతా కొత్త మనుష్యులు.
పూర్వీకుల ఇల్లు కోర్టు ఆదేశం ప్రకారం పరాధినమైనది.
కొడుకు పుట్టగానే ఆస్తులన్నీ అబ్బాయికే చెందుతాయని సంబరపడతారు. కానీ గోవిందరావు విషయంలో ముప్పావు ఆస్తి గ్రద్ద తన్నుకుపోగా, సుజన సమయ స్పూర్తి, ఆండాళ్ళమ్మ గారి సహాయం వలన మిగిలిన పావు ఆస్తి దక్కింది, .
ఒకనెల తరువాత శివశంకర్ ఇంటి రిజిస్టర్డ్ డాకుమెంట్స్ తెచ్చాడు, సుజన పేరిట గిఫ్ట్ డీడ్.
అమ్మ సణుగుడు మొదలైంది “ఆండాళ్ళమ్మ గారు రాజును దత్తత తీసుకుంది. ఫారిన్లో లా చదువుతున్నాడు, రాజు ఒక అనాథ అని నేను పెళ్లి ఒప్పుకోలేదు. ”
“అమ్మా, పెద్దవాళ్లు సరే అంటే పెళ్ళిజరిగేనా? అబ్బాయి, అమ్మాయి చూసుకోవాలి కదా”
“అతన్ని చూస్తే నువ్వు పెళ్లికి ఇట్టే ఒప్పుకుంటావు. ఎన్ని గొప్ప గుణాలున్నా అనాథ మనకు వద్దు”.
సుజన జవాబు చెప్పలేదు.
అంతస్తులు పోయి అపార్టుమెంట్లు వచ్చాయి, రేడియోల స్థానంలో టీవీలు, లైవ్ టెలీకాస్ట్లు. టీవీకి అంకితమైన వారు అధికమయ్యారు. కానీ అన్నదానం పేరిట వృధాగా నేలపాలు చేస్తున ఆహారము విలువ తెలియదు. రోజువారీ కూలీలు కూడా ఫ్రీగా వచ్చిన భోజనం కోసం వెతుకులాట, హాయిగా కూలి డబ్బులతో మద్యపాన అంకితులు. నేరచరితులు కూడా అన్నదానం వంకతో చరితార్థులుగా ఖ్యాతి కెక్కుతున్నారు!
***
"కిడ్స్ గ్రూమింగ్" స్కూల్ సెక్రటరీ మిశ్రాగారు సుజనా మేడమ్ ను పిలిపించారు. “మేడం కూర్చోండి, ”
ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఎండాకాలం, ఎయిర్ కండిషన్ రూంలో రిలాక్స్ గా ఉంది.
“మేడమ్ ఒక డాక్టర్ ఫామిలీ వాళ్ల ట్విన్స్ కిడ్స అడ్మిషన్ కోసం వస్తున్నారు, ప్లీజ్ కోఆర్డినేట్ విత్థెం. వన్ అడ్మిషన్ రెండున్నర లక్షలు డొనేషన్ అండ్ లక్ష ఇరిలీ ఫీజు”.
“సర్ అంత పెద్ద అమౌంట్ వాళ్ళు ఇవ్వలేక రిటర్న్ వెళ్లి పోతే?”
“షో యూర్ టాలెంట్, ఎస్ప్లోర్ స్కూల్ ప్లస్ పాయింట్స్, బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఐ థింక్ యూ కేన్ డుఇట్”.
“ఐ విల్ ట్ర్య్ సర్”
“యు బీయింగ్ ఇన్ అడ్మిన్, యు మస్ట్ గ్రాబ్ థిస్ ఛాన్స్. ” స్కూల్ సెక్రటరీ నుండి విజిటింగ్ కార్డ్ తీసుకుంది.
డాక్టర్ పాల్ చిన్న పాప, బాబులతో సుజన రూమ్ లోకీ వచ్చారు. పదేళ్ల తరువాత ఉహించని కలయికతో ఇద్దరూ షాక్ అయ్యారు.
“సుజీ, నువ్వు ఇక్కడా?”
“అన్నా.. నేనే.. ప్లీజ్ కూర్చో.. లెట్స్ టాక్ ది సబ్జెక్ట్” చాలా మర్యాదగా చెప్పింది.
“ఇప్పుడు ఎక్కడుంటున్నారు, అమ్మానాన్న ఎలా వున్నారు?”
“ఇది స్కూల్, నువ్వు ఒక పేరెంట్, నేను ఈ స్కూల్ అడ్మినిస్టేటర్, పెర్సొనల్ మేటర్స్ అన్నీ ఆఫ్టర్ ది స్కూల్”, వినయంగా చెప్పింది.
మానజ్మెంట్ చెప్పిన రీత్యా డోనేషన్, ఫీజు, డాక్టర్ పాల్ చేత ఒప్పించి పిల్లలిద్దరినీ జాయిన్ చేయించుకుంది. స్కూల్ గేట్ వరకు సుజన వచ్చి “అమ్మానాన్నా బాగున్నారు. ”
“మీరు ఇల్లు ఖాళీ చేసినట్టు తెల్సింది, కానీ కొత్త ఇంటి అడ్రస్ తెలియలేదు. ఒక్కసారి అమ్మానాన్నాలను కలవాలి. ”
“వద్దు, కలవద్దు. నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోయిన షాక్ తో నాన్నకు పక్షవాతం, నీ మెడిసిన్ చదువుకు చేసిన అప్పు తీర్చలేక, వడ్డీ కట్టలేక, రోడ్డన పడ్డ మేము దిక్కులేని పరిస్తితిలో మన ఇల్లు వదులు కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రైస్ మిల్స్ వద్ద ఉన్నాము.
ఘట్కేసర్లో ఒక ఆచార్యులు ఆయుర్వేద ట్రీట్మెంట్ వలన మూడొంతులు పక్షవాతం తగ్గింది. సీరియస్ సిట్యుయేషన్ ఏది తట్టుకోలేరు, కొన్నాళ్ళు పోయాక వద్దువుగానీలే. ”
“కనీసం అమ్మని కలిస్తే?”
“సరే ఏదో ఒక రోజున నేను ప్రయత్నిస్తాను. ”
“ఆంటీకి బై చెప్పండి” గోపాల్ అన్నాడు.
“ఆంటీ కాదు మాం కు బై” సవరించింది.
సాయి స్కూల్ ఆయా కొడుకు, నాన్న కేర్ టెకర్ గా నియమించి ప్రతీ నెలా నాన్నని ట్రేటమెంట్ కు తీసుకెళ్లేది. నాన్న మంచి నిద్రలో ఉన్న సమయంలో గోపాల్ని కలిసిన సంగతి అమ్మతో చెప్పింది. ఒక్కసారిగా భోరుమంది “గోపాల్ నా పంచప్రాణాలు, మనింటికి రమ్మను. ”
“అన్నని చూడగానే నాన్న ఆరోగ్యం తిరగబడితే కష్టం, వీలుచూసికొని మనం అన్నని కలుద్దాం. ”
***
సంతోషం పొంగిపోయింది సుభద్ర కొడుకుని చూడగానే, “మమ్మల్ని వదిలి ఎలావున్నావు కన్నా?”
“అమ్మా, తప్పని పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అయినా నేను సంతోషంగా ఉన్నానమ్మా, నాకు ఇద్దరు కవలలు; పాపా, బాబు. ఒక్క సారి నా ఇంటికి రండి ప్లీజ్!”
“గోపీ, డబ్బు-దర్పం సుఖానికి సంకేతాలు కావు, తల్లిదండ్రులను కష్టపెట్టి, నువ్వు సుఖపడుతున్నది ఒక సుఖమా? మాతో ఒక్కసారి సంప్రదించి ఉంటే బాగుండేది కదా”.
“మీరు ససేమిరా ఒప్పుకోరు కదమ్మా”
“అందుకని ఇతర కులమే కాదు, మతం కూడా మార్చుకుంటే, ఏ తల్లిదండ్రులైనా అంగీకరిస్తారా?“
“అమ్మా మీరనుకునేంత నీచమైన మతం కాదు, ఎంతో మర్యాదగల కుటుంబీకులు, మీరు వచ్చి చూడండి. ”
“మా పరిస్థితులు ఆలోచించవా? సుజన ఒక్కతే ఇంటిభారం మొస్తుంది తెలుసా? నాకు మీనాన్న ఆరోగ్యం, ఆయుష్షు ముఖ్యం. అయినా చూస్తాలే.. ”
చీకటి పడే వేళ సుజన సాయి సాయంతో నాన్నను ఇంటికీ తెచ్చారు. “సంవత్సరం పాటు పత్యం, మందులు వాడాలట, ఫిజియో థెరపీ, వాకింగ్ కంపల్సరీ” సుభద్ర దేవుడిపటానికి దణ్డం పెట్టిన్ది.
========================================================================
ఇంకా వుంది...
========================================================================
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి
@surekhap4148 • 6 hours ago
హృదయపూర్వక ధన్యవాదాలు
నడుస్తున్నంత వరకు కథ బాగుందమ్మ-అభినందనలు.