'Rani Party' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 20/10/2023
'రాణి పార్టీ' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
రాణి ఒక సాధారణ గృహిణి. చూడడానికి అందంగా, అమాయకంగా ఉంటుంది..కానీ...అవకాశం దొరికితే, దేనినైనా వదలదు. పెళ్ళి కెళ్తే, భోజనం తిన్నాకా...మళ్ళీ ఎవరైనా...."భోజనం చేద్దాం పదా!" అని అడిగితే, మళ్ళీ భోజనం చేసేస్తుంది. ఫ్రీ గా ఏదైనా వస్తే, ఏదీ వదలదు...ఎక్కువ డబ్బులిచ్చి ఏదీ కొనదు..
రాణి భర్త రాజు ఆక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు రాణి ఉద్యోగం చేసుకుంటూ..తన కూతురు రమ్య తో ఉంటుంది....ఆ ఉద్యోగం కుడా...భర్త చనిపోయినందుకు పోరాడి తెచ్చుకుంది రాణి.
***
పెళ్ళైన కొత్తలో...భర్త కు రాణి మనస్తత్వం గురించి, చాలా లేట్ గా తెలిసింది. ఒక రోజు రాణి తన భర్త రాజు తో కార్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాది..అలా వెళ్తూ..చాలా దూరం వెళ్ళిపోయారు. భార్య పక్కన కూర్చొని తియ్యని కబుర్లు చెబుతుంటే, అనుకోకుండా హైవే ఎక్కి...చాలా దూరం వచ్చేసారు. సడన్ గా, వర్షం మొదలైంది...కారు హైవే పైన ఆగిపోయింది. రాణి ని దిగి, రోడ్డు పక్కన కూర్చోమన్నాడు. ఈలోపు రాజు కార్ చెక్ చేస్తున్నాడు.
హైవే అవడం...అందులోని రాత్రి కావడం..చీకటిలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. రాజు కారును బలంగా గుద్దింది. రాజు..గాయాలతో..పక్కకు పడిపోయాడు..అక్కడే ఉన్న రాణి కి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు...అటుగా..వస్తున్న క్యాబ్ ను ఆపి, హెల్ప్ అడిగింది...పరిస్థితి చూసి...డ్రైవర్ పది వేలు అడిగాడు హాస్పిటల్ కు తీసుకుపోవడానికి. డబ్బులు ఎక్కువని..వద్దని చెప్పి...అంబులన్స్ కోసం ఫోన్ చేస్తూనే వుంది...ఒక అరగంట తర్వాత వచ్చింది. హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళే దారిలో రాజు చనిపోయాడు. కొంచం ముందు తీసుకుని వచ్చుంటే, బతికేవాడని..డాక్టర్ చెప్పాడు...రాణి చాలా బాధపడింది. క్యాబ్ వాడు ఎక్కువ అడిగాడని, వాడిని తిట్టుకుంది.
****
ఇంత జరిగినా...రాణి మనస్తత్వం లో ఏ మార్పు రాలేదు.
ఎప్పుడూ..వచ్చే దారిలో, ఏమైనా వస్తువులు దొరికినా...ఎవరైనా పేరంటానికి పిలిచినా...ఫ్రీ గా వస్తుందంటే, దేనికైనా రెడీ రాణి. ఎవరికీ ఏమి ఇవ్వడం, పంచడం, పార్టీ ఇవ్వడం లాంటి వాటికి చాలా దూరం. ఈ విషయం కాలనీ లో అందరికీ తెలుసు. ఆమె పని చేసే ఆఫీసు లో కుడా అందరికీ తెలుసు.
ఒకసారి..ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా...దారిలో..ఒక చిన్న లేడీస్ పర్సు దొరికింది. ఎవరూ చూడట్లేదని గమనించి..పర్సు తీసుకుని తన బ్యాగ్ లో వేసుకుంది. పక్కన ఉన్న పార్క్ లో బ్యాగ్ తీసి చూసింది..చాలా ఆనంద పడింది.
మర్నాడు..ఆఫీసు లో చాలా హుషారుగా రాణి అందరికీ పార్టీ ఇస్తానని ప్రకటించింది...చాలా మంది స్పృహ తప్పిపోయి పడిపోయారు..ఇది కలా? నిజమా? అని అడిగారు అందరూ...నిజమే! మీకు కావలసినవి తినండి...తాగండి.. మన క్యాంటీన్ లో..అంది రాణి.
ఏదో లాటరీ తగిలి ఉంటుందని...ఇదే మంచి అవకాశం అని అందరూ ఎంజాయ్ చేసారు...
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాణి కు ఇంట్లో అందరూ చాలా మూడీ గా ఉన్నారని గమనించింది.
"ఏమిటి! అందరూ అదోలాగ ఉన్నారు? ఏమిటి విషయం?"
"అమ్మా! ఒక విషయం చెబుతాను..తిట్టకూడదు."
"చెప్పు! ఈరోజు ఎంత నష్టం తీసుకొచ్చావు తల్లీ ?"
"నా డబ్బులున్న పర్సు దారిలో పడిపోయింది. మా ఫ్రెండ్ కు ఆ పర్సు దొరికింది. అది నాకు ఇవ్వడానికి తన బ్యాగ్ లో పెట్టుకుని వస్తుంటే, అందులోంచి ఆ పర్సు ఎక్కడో పడిపోయింది.."
"ఏ ఏరియా లో?"
"బాలాజీనగర్ లో"
"రాణి కీ గుండె లో రాయి పడినట్టయ్యింది...తనకు అక్కడే పర్సు దొరికింది. ఆ డబ్బులు ఫ్రీ గా వచ్చాయని...మొత్తం పార్టీ కోసం ఖర్చు చేసింది. ఎంతైనా...మా ఆఫీస్ స్టాఫ్ చాలా అదృష్టవంతులు...నాకే అంతా లాస్" అనుకుని తల పట్టుకుంది.
"నువ్వు ఒక సంవత్సరం పాటు, ఇంట్లో పనులన్నీ చెయ్యాలి...నేను హెల్ప్ చెయ్యను" అని తన కూతురికి ఆర్డర్ వేసింది రాణి.
*****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments