top of page
Original.png

రూమ్ నెంబర్ 13

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #RoomNumber13, #TeluguCrimeStory, #కొసమెరుపు

ree

Room Number 13- New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 27/12/2025

రూమ్ నెంబర్ 13 - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


13, పదమూడు సంఖ్య అంటే చాలా దేశాల్లో అపశకునం లా భావిస్తారు. కొన్ని దేశాల్లో హోటల్స్ లో 13 నెంబర్ రూమ్ కి ఉండదు. 13 వ సంఖ్య దురదృష్టకరమని నమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి. క్రైస్తవ మతంలో, యేసుక్రీస్తు చివరి విందులో 13 మంది వ్యక్తులు ఉన్నారు, వారిలో ఒకరు మోసపూరితమైన వ్యక్తి జుడాస్ ఇస్కారియోట్! 

                      ******

అది ఆంధ్ర ప్రదేశ్ లో చిన్న సైజు టౌన్. అక్కడ ఉంది

లీలామహల్ ధియేటర్ సందులో ఉంది నీలమణి లాడ్జి. 

అందులో ఎప్పుడూ చాలారూములు ఖాళీ గా ఉంటాయి. కాని లాడ్జి కీ దగ్గర గా ఉన్న పోచమ్మ గుడికి జాతర జరిగినప్పుడు ఒక వారం ముందునుంచి హోటల్ సందడిగా ఉంటుంది. చెక్ అవుట్ టైమ్ కూడా పన్నెండు గంటలే ఉంటుంది. హోటల్ యజమాని మారుతీ రావు. అతని కొడుకు అనిల్. ఇంటర్ తర్వాత చదువు ఆపేశాడు. 

                       ********

ఆరోజు ఆదివారం. 

 జూన్ 4. రాత్రి 9 గంటలు. 

ఇరవై ఏళ్ల యువకుడు వచ్చాడు నీలమణి లాడ్జికి. మనిషి గడ్డం పెంచుకుని, జీవితం మీద ఆశ కోల్పోయిన వాడిలా ఉన్నాడు. అతనికి రూమ్ నెంబర్ 13 "కీ" ఇచ్చాడు మారుతీ రావు. అతను "కీ" తీసుకుని వెళ్ళి పోయాడు.  

 రెండు రోజుల తర్వాత రూమ్ 13 నుండి దుర్గంధం రావడం తో తలుపు పగల గొట్టి చూసారు హోటల్ స్టాఫ్. 

 

ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. చొక్కా జేబులో సూసైడ్ నోట్ ఉంది. పోలీసులు కూడా ఆత్మహత్య అని కేస్ మూసివేశారు. అప్పటి నుండి రూమ్ నెంబర్ 13 తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడలేదు. చనిపోయిన వ్యక్తి అందులో దయ్యమై తిరుగుతున్నాడని ప్రచారం మొదలయ్యింది. నీలమణి లాడ్జిలో రూమ్ నెంబర్ 13 

శాశ్వతంగా మూత పడింది.  

                   *********

రెండేళ్ళ తర్వాత :

తణుకు రూరల్ పోలీస్ స్టేషన్.  

సబ్ ఇన్ స్పెక్టర్ రంజిత్ ఈనాడు, ఆంధ్ర జ్యోతి చదువుకుంటూ, టీ తాగుతూ, ఈ రోజు కార్యక్రమం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు.  

సరిగ్గా అదే సమయంలో నవ్య తండ్రి నరసింహం తన కూతురు కనబడలేదని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాడు.  

నరసింహం సైకిల్ మీద వెళ్ళి ఊళ్ళో కూరలు అమ్ముకుంటూ ఉంటాడు.  

"మీ కూతురు ఎప్పటినుండి కనబడటం లేదు?" 

"అదే సార్ పోచమ్మ జాతర మొదలయినప్పటినుండి" 

"అలా కాదు తేదీ చెప్పండి. " 

"జూన్ 4 వ తేదీ" 

"సరే అమ్మాయి ఫోటో ఇవ్వండి. వెతికి పెడతాం" 

నరసింహం వాట్సాప్ లో కూతురి ఫోటో పంపాడు.  

                *********

నవ్య స్నేహితుల్ని విచారించడం మొదలు పెట్టాడు రంజిత్. నవ్య అరవింద్ అనే కుర్రాడితో సన్నిహితంగా  మసులుతోంది అని తెలిసింది. అరవింద్ ఇంటికి వెడితే అరవింద్  కూడా కనబడటం లేదని తెలిసింది.  


'ఇద్దరూ కలిసి ఎక్కడికైనా' అని ఆలోచిస్తున్నాడు రంజిత్.  


"మీ అబ్బాయి కనబడక పోతే మీకు ఎందుకు అనుమానం రాలేదు. ?" 


" ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళాడనుకున్నాం" 


రంజిత్ కి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తుంటే అరవింద్ స్నేహితుడు భాస్కర్ ఒక ముఖ్య విషయం చెప్పాడు రంజిత్ కి.  


అదేమిటంటే జాతర సమయం లో పెళ్లి కాని యువతీ యువకులు నీలమణి లాడ్జి లో రూమ్ బుక్ చేసుకుని సరదా తీర్చుకుంటారని. రంజిత్ కి చిన్న ఆధారం దొరికినట్టయ్యింది.  

                   ********

రంజిత్ నీలమణి లాడ్జి ఓనర్ మారుతీ రావును ప్రశ్నించడం మొదలు పెట్టాడు.  

"నవ్య అనే అమ్మాయి మీ లాడ్జి కి వచ్చిందా?" 

"సాధారణంగా మా లాడ్జి కి ఆడవాళ్లు రారు", స్థిరంగా పలికాడు మారుతీ రావు.  

"పెళ్లి కాని యువతీ యువకులు రావచ్చు అన్న మాట" 

"ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు" 

"అలాగ. రూమ్ నెంబర్ 13 ఎందుకు ఇవ్వడం లేదు. ? " 

"రెండేళ్ళ క్రితం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అపశకునం అని ఎవరూ ఆ రూమ్ తీసుకోరు. " 

"అలాగ. ఐతే ఆ రూమ్ వెతకాలి" అన్నాడు రంజిత్

"సెర్చ్ వారెంట్ ఉందా? " అడిగాడు మారుతీ రావు అసహనంగా.  

"తెప్పిస్తా"

సెర్చ్ వారెంట్ వచ్చాక రంజిత్ రూమ్ నెంబర్ 13 లోకి ప్రవేశించాడు. రూమంతా దుమ్ముతో, సాలెగూడులతో చికాకుగా ఉంది. రంజిత్ కి చిన్న నోట్ బుక్ దొరికింది.  

తరువాత ఒక గద్ద బొమ్మ ఆకర్షించింది. గోడ నున్న పెయిటింగ్ లో ఉన్న సీక్రెట్ కెమెరా మీదకి రంజిత్ దృష్టి వెళ్ళలేదు.  

                  *******

రంజిత్ కి హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. 

"నవ్య మిస్సింగ్ కేస్ లో మారుతీ రావును ప్రశ్నించవద్దని" 

అదేమిటంటే వేరే అసైన్‌మెంట్ ఇస్తామన్నారు.  మారుతీ రావు రాజకీయ పలుకుబడి ఉపయోగించి పోలీసు విచారణ నుండి తప్పించుకున్నాడు.  రంజిత్ కి శ్రీకాకుళం బదిలీ అయింది. నవ్య కేస్ మధ్యలో వదిలేసానే అని ఆశాభంగం కలిగింది.  

             ********

రెండేళ్ళ తర్వాత ప్రమోషన్ మీద తణుకు వచ్చాడు రంజిత్. పాత కేస్ ఏమయ్యిందా అని విచారించాడు. ఏమి జరగలేదు. మారుతీ రావు గుండె పోటు వచ్చి చనిపోయాడని, కొడుకు అనిల్ ఓనర్ అయ్యాడని తెలిసింది.  


నీలమణి లాడ్జి కి వచ్చాడు. రూమ్ నెంబర్ 13 అదే తాళం తో ఉంది. మారుతీ రావు కొడుకు ఎవరితోనో మాటలాడుతున్నాడు రేపు వీడియో ఇస్తానని. రంజిత్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. పైగా గడ్డం ఉంది. 

 

"రూమ్ 13 కావాలి" 

" అది కుదరదండి" అన్నాడు అనిల్.  

"ఒక షరతు మీద ఇస్తాను" 

"రాత్రి 8 గంటలకు చెక్ అవుట్ చెయ్యాలి" 

"అలాగే" 

                     ******

ఆ రోజు జూన్ 4. పోచమ్మ జాతర. రాత్రి పది గంటల సమయం లో 

ఒక యువకుడు, యువతి ప్రవేశించారు. వాళ్ళిద్దరూ కొద్ది సేపటిలోనే నగ్నంగా తయారయ్యి రాసక్రీడలు ప్రారంభించారు. వారి కామక్రీడల్ని అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరా బంధిస్తోంది.  


తెర వెనుక ఉన్న వ్యక్తి సాక్షి గా ఆ సంఘటనలను వీక్షిస్తున్నాడు. అప్పుడే పెయిటింగ్ లో ఉన్న సీక్రెట్ కెమెరా ని తెర వెనుక వ్యక్తి చూసి ఆశ్చర్య పోయాడు ! 

పన్నెండు గంటల సమయంలో రూమ్ లోకి ఓ వ్యక్తి  వచ్చి ఆ జంటను పిస్తోలు తో బెదిరించాడు. 


అతను ఎవరో కాదు అనిల్! 

అనిల్ ని చూసి తెర వెనుక నున్న వ్యక్తి ఆశ్చర్య పోయాడు.  అమ్మాయిని తీసుకొని వచ్చిన వ్యక్తి ని బయటకు గెంటాక, అమ్మాయి కేసి పిస్తోలు గురి పెట్టి "నడు నాతో" అన్నాడు.  


అప్పుడు తెర వెనుక వ్యక్తి, "వేషాలు వెయ్యకు. అమ్మాయిని తీసుకు వెళ్ళే చోటికి పద" అన్నాడు అనిల్ కణత మీద పిస్తోలు పెట్టి.  


అనిల్ గద్ద బొమ్మని గట్టిగా తాకగానే సొరంగ మార్గం తెరుచుకుంది. ముగ్గురూ సొరంగ మార్గం గుండా ఆ చోటికి చేరారు. సొరంగం చివర  పోచమ్మ గర్భగుడికి కలిసింది. 

"అమ్మాయి వచ్చిందా? అమ్మ వారికి బలి ఇవ్వాలి" అడిగాడు పోతరాజు పూనకంతో.


ఈ  సారి బలి తో దేవత తృప్తి పడుతుంది అని పోతరాజు అనుకున్నాడు.  

"అమ్మాయి వచ్చింది. పోలీసులు వచ్చారు" అన్నాడు రంజిత్! 

పోతరాజు నిర్ఘాంత పోయాడు.  

అనిల్, పోతరాజు అరెస్టయ్యారు. రూమ్ నెంబర్ 13 లో జరిగే అకృత్యాలన్నీ బయటికి వచ్చాయి.  

                 *********

"ఏలా సాల్వ్ చేసారు ఈ కేస్? " అడిగాడు సి. ఐ

"మొదటి సారి నన్ను ఈ కేస్ నుండి తప్పిస్తున్నప్పుడు అనుమానం వచ్చింది. తర్వాత మొదటి సారి రూమ్ నెం. 13 లో జరిగింది ఆత్మహత్య కాదని, జర్నలిస్టుది హత్య అని అతని నోట్ బుక్ ద్వారా తెలిసింది. నోట్ బుక్ కి రక్తపు మరక ఉంది. రూమ్ నెంబర్ 13 లో అతను నగ్న  వీడియో చిత్రీకరణ చూశాడని అనుమానం. అందుకే అతన్నీ లేపేసి దయ్యం తిరుగుతోందని ప్రచారం చేసారు. పోచమ్మ గర్భగుడి లోకి వెళ్ళినప్పుడు అదే గద్ద బొమ్మ కనిపించింది. అప్పుడే అనుమానం వచ్చింది. పూజారి గర్భగుడి లో ఎక్కువ సేపు నిలువనీయలేదు.  

               ********

వారం క్రితం పైకి లేచిన గుడి పరిసరాల్లో నేల మీద నుండి పైకి లేచిన చెయ్యి కనబడింది. ఎవరిదై ఉంటుందా అని విచారిస్తే లేచి పోవడానికి ప్రయత్నించి, హత్యకు గురయిన వర లక్ష్మి ది అని చెప్పారు గ్రామస్థులు. చేతి మీద సోమయ్య అని పచ్చబొట్టు ఉంది. వరలక్ష్మి ఇల్లు గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. నాకు అనుమానం వచ్చింది.  

                   *******.  

ఆ తరువాత నాలుగు రోజుల క్రితం గుడి పరిసరాల్లో ఒక ఊర కుక్క మట్టిని తవ్వుతుంటే అక్కడ అస్థిపంజరం బయటపడింది. అస్థిపంజరానికున్న లాకెట్ మీద "B" అనే అక్షరం ఉంది. 

ఆ లాకెట్ మిస్ అయిన భావన అనే అమ్మాయిది అని తల్లి తండ్రులు గుర్తించారు. గుడికి, రూమ్ నెం. 13 కి, జూన్ 4 కి సంబంధం ఉందనిపించింది. ఆ కోణంలో దర్యాప్తు చేసాను. రూమ్ నెం. 13 కి డూప్లికేట్ కీ వాడి జూన్ 4 న చెక్ అవుట్ చేసినట్టే చేసి మళ్ళీ వెళ్ళాను. 

చివరికి ఛేదించగలిగాను. "


"వస్తాను సాయంత్రం కలుద్దాం" అని రంజిత్ బైక్ స్టార్ట్ చేసాడు.  

         

సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page