'Sailu Pantham' - New Telugu Story Written By Mohana Krishna Tata
'శైలు పంతం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ఏమండీ! ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. బజార్ కు వెళ్ళి తీసుకురండి!" అని గట్టిగా ఆర్డర్ వేసింది శైలజ.
"అలాగే శైలు" అన్నాడు రమేష్. ఇద్దరికీ పెళ్ళై 6 నెలలు అయ్యింది.
శైలు, చూడడానికి అందంగా, చలాకీ గా ఉంటుంది. చక్కగా చీర కట్టుకొని, పాపిడి బొట్టు పెట్టుకొని, లక్షణంగా కనిపిస్తుంది. కమ్మగా వండి పెడుతుంది. ఇంటి పనులు చక్కగా చేసుకుంటుంది. కానీ, దేనికైనా పంతం పడితే, ఆమె తో పోరాడి, జయించడం కష్టమే!
ఒక రోజు ఇంటికి శైలు ఫ్రెండ్ వచ్చింది. ఇద్దరూ, బాల్కనీ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
"ఎన్ని రోజులైందే నిన్ను చూసి శైలజ"
"అవునే సంగీత! ఎప్పుడో నా పెళ్లి కి వచ్చావే!"
"కొత్త 'ఫ్లాట్' కొన్నావని విన్నానే సంగీత! నిజమేనా?"
"నీకెవరే చెప్పారు?"
"మన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందే సంగీత!"
"అందుకే కదే శైలజ, చెప్పడానికి వచ్చాను. అది ఒక గేటెడ్ కమ్యూనిటి. పార్క్స్, స్విమ్మింగ్ పూల్, మార్కెట్ అన్ని లోపలే. మనకు చారు లో కరివేపాకు అయిపోయిందనుకో, చారు ఉడికే లోపు కిందకు వెళ్ళి, సూపర్ మార్కెట్ లో తెచ్చుకోవచ్చు. మొగుడిని బతిమాలాల్సిన అవసరం లేదు. "
"అవునే నిజమే! మా ఆయనకి 10 సార్లు చెబితే గాని, ఏదీ తీసుకురారు" అంది శైలు.
నీకు వంట చేయడానికి మూడ్ లేదనుకో, ఇంటి ముందే హోటల్ లో, ఒక ఫోన్ కాల్ తో ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు.
ఇంకా, ఎనెన్నో.. ఉన్నాయనుకోవే!.. నా మాట విని నువ్వు కూడా మీ అయన చేత 'ఫ్లాట్' కొనిపించు. ఎంచక్కా, మనం రోజూ బాల్కనీ లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. సరే శైలజ! ఖాళీ ఉన్నప్పుడు రా! మా కొత్త ఇల్లు చూపిస్తా. నేను వెళ్ళొస్తా!"
శైలజ మెదడులో 'ఫ్లాట్' బీజం వేసింది సంగీత. అది రోజు రోజు కు పెరిగి పెద్దదవుతుంది.
ఆ రోజు రాత్రి, శైలు కొత్త చీర కట్టుకుని, మల్లె పూలు పెట్టుకొని, బెడిరూం లోకి వచ్చింది. ఆ రంభే దిగి వచ్చిందా! అన్నట్టుగా ఉంది శైలు. ఆ మల్లె పూల గుబాళింపు మత్తెక్కిస్తోంది.
"ఏమండీ!!! ఏమండీ!!!!” అంటూ, గుండె పై తల పెట్టింది..
“ఏమండీ.. ఏమో.. మరేమో.. !"
"ఏమిటి శైలు.."
"మా ఫ్రెండ్ వచ్చింది కదా! గుర్తుందా! అదే సంగీత!!!"
"అవును"
"వాళ్ళు, గేటెడ్ కమ్యూనిటీ లో 'ఫ్లాట్' తీసుకున్నారు! అన్నీ లోపలే ఉంటాయంట. బయట కు రావక్కర్లేదంట! మనం కుడా తీసుకుందామండీ.."
"ఇప్పుడు మన ఇల్లు కేమైందే! చక్కటి గాలి, వెలుతురు వస్తుందిగా" అన్నాడు రమేష్.
"ఎంతైనా గేటెడ్ కమ్యూనిటీ కాదు కదండీ.. !"
"అవునననుకో, కానీ ఇప్పుడెందుకు.. అని"
"ఏమి ఆలోచించారండీ! చేప్పండీ.. ప్లీజ్.. !!!”
"చూద్దామ్ లే శైలు"
"ఇలా నా వంక చూసి చెప్పండి" అని ముఖం కోపంగా పెట్టింది.
"అలాగేలే.. రేపు ఉదయం చూద్దాం, నేనింక.. మాట్లాడలేను శైలు.. నిద్రొస్తుంది..”
మర్నాడు ఉదయం ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు రమేష్.
"ఏమండీ!!! ఏమండీ!!.. ఎప్పుడు వెల్దాము కొత్త ఇల్లు చూడడానికి?"
ఏమ్మాట్లాడకుండా.. హడావిడిగా ఆఫీస్ కు వెళ్ళిపోయాడు రమేష్.
శైలు.. పంతం వీడ లేదు.
సాయంత్రం రమేష్ వచ్చిన టైం అయ్యింది. కాఫీ తెచ్చింది శైలు. “ఏమండీ!! కాఫీ తాగండి, మంచి ఆలోచనలు వస్తాయి!!”
కాఫీ తీసుకుని సిప్ చేసాడు రమేష్..
"కాఫీ లో పంచదార వెయ్యలేదా? "
శైలు ఏమి మాట్లాడలేదు. అంతా నిశబ్దం.
ఈలోపు - రాత్రి డిన్నర్ టైం అయ్యింది. "ఈరోజు వంట ఏమిటి చేసావు శైలు. బాగా ఆకలి వేస్తుంది"
“ఈరోజు మూడ్ లేదండి, అందుకే మార్నింగ్ చేసిన పప్పు మాత్రమే ఉంది. ఏమండీ!! ఏమండీ!! గేటెడ్ కమ్యూనిటీ లోనే, హోటల్ కూడా ఉంటుందంటా.. మూడ్ లేనప్పుడు.. సరదాగా మనం వెళ్ళొచండి. ఇక్కడైతే హోటల్ చాలా దూరం కదండీ!”
"వేడి అన్నం లో పప్పు చాలా బాగుంటుంది. పద.. ఒక పట్టు పడదాం శైలు"
డిన్నర్ అయిన తర్వాత - బెడ్రూమ్ లో రమేష్ లాప్ టాప్ లో వర్క్ చేస్తున్నాడు.
"ఏమండీ!! ఏమండీ!! ఏమండీ!! ఈరోజు ఫైనల్ చేయాల్సిందే. ఏ ఫ్లోర్ లో 'ఫ్లాట్' తీసుకుందాం?”
రమేష్ సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడు.
"ముందు ఫ్లాట్ నెంబర్ చెప్పండి! అప్పటివరకు నేను మీతో మాట్లాడను. కాఫీ లో పంచదార ఉండదు. డిన్నర్ లోకి కూర, సాంబారు ఉండదు. రెండు రోజుల్లో డిసైడ్ చెయ్యకపోతే, నేను పుట్టింటికి వెళ్ళిపోతా. మా అమ్మ వాళ్ళది గేటెడ్ కమ్యూనిటియే"
వేరే దారి లేక - రమేష్, శైలు తో ఫ్లాట్ చూడడానికి వెళ్లి, బుక్ చేసాడు.
***
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
శైలు పంతం బాగుందండి-అభినందనలు