top of page
Writer's pictureMohana Krishna Tata

తథాస్తు


'Thathasthu - New Telugu Story Written By Mohana Krishna Tata

'తథాస్తు' తెలుగు కథ

రచన : తాత మోహనకృష్ణ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

చాలా సంవత్సరాల క్రిందట, ఒక ఊరిలో భార్య- భర్త ఉండేవారు. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదు. రాము చాలా మంచివాడు. కష్టపడి వ్యవసాయం చేస్తాడు. దురలవాట్లు లేవు. భార్య ను బాగా చూసుకుంటాడు. ఒక రోజు రాము ను, పండక్కి తనకి ఒక మంచి చీర కొనమని కోరింది కాంతం.


"కాంతం! ఈసారి కష్టమే, మరోసారి కొంటాను! నా మాట వినవే. "


"ఈ మాట మీరు ఇప్పటికి చాలా సార్లు చెప్పారు. ఆడవారికి చీరలు, నగలు అంటే ఎంత ఇష్టమో, మీకు తెలియదా?"


"తెలుసే! కానీ ఏమి చేయమంటావు? ఈసారి కుదరదంతే!"


"ఒక చీర కూడా కొనలేని మీరూ ఒక భర్తేనా?”


చిన్న చిన్న గా మొదలైన గొడవ కాస్తా పెద్దగా అయ్యింది. దేవుడా! ఈ భర్త నెందుకు ఇచ్చావు. మా నాన్న చెప్పిన మరొక సంబంధం చేసుకుని ఉంటే, ఈ పాటికి మహారాణి లాగా ఉండేదానిని. కాలం వెనుకకు వెళ్తే బాగుణ్ణు” అనుకుంది.


అక్కడే ఉన్న తథాస్తు దేవతలు - "తథాస్తు" అన్నారు. కాలం తన పెళ్ళిచూపులు ముందు రోజు కు వెళ్ళి ఆగింది.


"తల్లీ! కాంతం! నీకు రెండు పెళ్ళి సంబంధాలు వచ్చాయి. నీకు ఎవరు నచ్చారో చెప్పు" (ఈసారి, ఆ రాము కాకుండా, ఈ సోము ను చేసుకుంటాను. సోము కు బాగా డబ్బు ఉంది - మనసులో అనుకుంది కాంతం)


అప్పుడు కాంతం, తనకు సోము అంటే ఇష్టమని చెప్పింది. కాంతం-సోము పెళ్ళి జరిగింది. కొన్ని రోజులు, ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. కాంతం కోరుకున్న చీరలు, బీరువా నిండా ఉన్నాయి. ఒక రోజు, భర్త సోము - తాగి ఇంటికి వచ్చాడు.


"ఇదేమిటి ఈ పాడు అలవాటు" అంది కాంతం.


"నేను అప్పుడప్పుడు ఇలాగే తాగుతాను. నీకెందుకు" అన్నాడు సోము.


"వద్దు అండి! ఈ తాగుడు వల్ల ఆరోగ్యం పాడవుతుంది. సంసారం గుల్ల అవుతుంది. "


"నా ఇష్టం. ఇంకా మాట్లాడితే, నిన్ను తంతాను" అని బాగా కొట్టాడు.


రోజూ, ఇలాగే తాగొచ్చి కొట్టేవాడు. వేరే పాడు అలవాట్లు చాలా ఉన్నాయని కాంతం కు తెలిసింది. అప్పుడు అర్థమైంది కాంతం కి - మంచి మనసు ఉండి, మంచి గా చూసుకునే భర్త ఉంటే భార్య కు అదే చాలు. ఇలాంటి మొగుడు వద్దని అనుకోని, మళ్ళీ తనకు పాత జీవితం కావాలని వేడుకుంది. రోజూ ఇలాగ, వేడుకుంటూనే ఉంది కాంతం.


ఆ తథాస్తు దేవతలు - కాంతం మారినట్టు గ్రహించి, మళ్ళీ "తథాస్తు" అన్నారు.


కాంతం కి రాము విలువ తెలిసింది. ఇంకెప్పుడూ రామును సతాయించలేదు.

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

67 views1 comment

1 Comment


sudershanap44
Jul 23, 2023

బాగుంది కథ -అభినందనలు


Like
bottom of page