top of page
Original.png

సమయ స్ఫూర్తి!

8 hours ago
2 min read

రాజు విశ్వక్సేనుడికి మరియు గాయపడిన గుర్రానికి వైద్యం అందిస్తున్న యువకుడు – సమయస్ఫూర్తి తెలుగు నీతి కథ

Samaya Spoorthi! - Telugu Moral Story | Purushotham Boga

సమయ స్ఫూర్తి! - తెలుగు నీతి కథ | బోగా పురుషోత్తం

Published in manatelugukathalu.com on 05/11/2026


ఆపదలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో స్పందించడం ఎంత గొప్ప మార్పును తీసుకురాగలదో తెలిపే అద్భుతమైన తెలుగు నీతి కథ సమయస్ఫూర్తి! మానవత్వం, సేవాభావం, ప్రజల పట్ల బాధ్యతాయుతమైన నాయకత్వం యొక్క గొప్పతనాన్ని ఈ కథ చాటిచెబుతుంది.


వికాసపురి రాజు విశ్వక్సేనుడు గొప్ప పరిపాలనాదక్షుడు అని పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండేవాడు. 


అయితే తన సామ్రాజ్యం ఎత్తైన కొండలపై ఉండటం వల్ల ప్రజల కష్టాలను తెలుసుకుని పరిష్కరించలేకపోయాడు. అందుకు తగిన అధికార గణం, సిబ్బంది తన వద్ద లేకపోవడంతో సమస్యలు ఎలా తెలుసుకోవాలో తెలియక తికమకపడ్డాడు.


చివరకు బాగా ఆలోచించి ఓ గుర్రాన్ని కొనుగోలు చేసి రాజు ఒక్కడే బయలుదేరాడు. అది బాగా వృద్ధ గుర్రం కావడంతో ఎత్తైన కొండలను ఎక్కలేకపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేకపోయింది. రాజు నిరాశతో గుర్రాన్ని చెర్నాకోలతో అదిలించాడు.


వృద్ధ గుర్రం ముందుకు కదలలేక పట్టుతప్పి కాలుజారి కింద పడింది. గుర్రంపై ఉన్న రాజు కింద పడ్డాడు. పెద్ద గాయం తగిలి నడవలేకపోయాడు. గుర్రం కాలు విరిగి పడిన చోటు నుండి లేవలేకపోయింది.


దీన్ని చూసిన విశ్వక్సేనుడు దారి మధ్యలో దిక్కుతోచక సాయం కోసం ఎదురుచూడసాగాడు.


మంచి ఎండలో దాహంతో అల్లాడిపోయాడు. గుర్రం నొప్పికి విలవిలలాడటం చూసి కంటతడి పెట్టాడు.


బాగా చీకటి పడుతున్న వేళలో ఓ యువకుడు అటు వచ్చి రాజును, గుర్రాన్ని పరీక్షించాడు. గుట్టపై ఉన్న తన పూరి గుడిసె వద్దకు తీసుకెళ్లాడు.


తనకు తెలిసిన వైద్యంతో గుర్రం కాలుకి కట్టుకట్టాడు. రాజు గాయానికి పసరు పూయడంతో బాగైంది.


నాలుగు రోజుల తర్వాత రాజు మళ్లీ గుర్రం ఎక్కి గుట్టపైకి చకచకా వెళ్లాడు. తనను రక్షించిన యువకుడు తనకు, గుర్రానికి మంచి పుష్టికరమైన ఆహారం పెట్టడంతో గుట్టపైకి వేగంగా ఎక్కి ప్రజల కష్టాలను తెలుసుకోసాగాడు.


దారి సౌకర్యం లేక రాళ్ల గుట్టపైకి ఎక్కి దిగలేక కింద పడి కాళ్లు, చేతులు విరుచుకుని బాధపడుతున్న వారిని కళ్లారా చూశాడు రాజు. తనను సమయస్ఫూర్తితో వైద్యం అందించి ఆదుకున్న యువకుడి సేవను ఆదర్శంగా తీసుకుని వెంటనే అతడిని వైద్యుడిగా నియమించి వారికి సేవలు అందించేలా చేశాడు.


తాగడానికి నీళ్లు లేక, నివాసానికి తగిన ఇల్లు లేక, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ సరైన తిండి లేక అల్లాడుతున్న ప్రజల కష్టాలను చూసి రాజు మనసు చలించింది. అవసరమైనంత ధనం కేటాయించి వారికి సరైన దారి, ఇళ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు.


అష్టకష్టాలు పడుతున్న తమను సమయస్ఫూర్తితో ఆదుకుని ఆదర్శంగా నిలిచిన రాజు విశ్వక్సేనుడిని ఆనందంతో ప్రజలు అభినందించారు.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



బోగా పురుషోత్తం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 







మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



బోగా పురుషోత్తం

పరిచయం: బోగా పురుషోత్తం https://www.manatelugukathalu.com/profile/purushotham/profile

1997 నుంచి బాలల కథలు రాస్తున్నాను. కార్టూన్లు గీస్తున్నాను.  1998లో నేను ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలలో ఎడిటోరియల్ కార్టూన్లు గీశాను. ఇప్పటి దాకా ప్రజాశక్తి, విశాలాంధ్ర వార్త, ఆంధ్రజ్యోతి వార పత్రికతో పాటు వివిధ వార, మాస పత్రికలలో 2 వేల కార్టూన్లు ప్రచురితమయ్యాయి. కథలు సైతం 150 దాకా రాశాను. అందులో అన్ని కథలు బుజ్జాయి, బాలజ్యోతి, బాలమిత్ర, మొలక, ఈనాడు (హాయ్ బుజ్జీ), ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వి6 వెలుగు దినపత్రికల ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రిక తిరుపతి డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను..






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page