top of page
Writer's pictureBVD Prasada Rao

సంపుటి మురిసింది - ఎపిసోడ్ 6



'Samputi Murisindi Episode 6' - New Telugu Web Series Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 07/01/2024

'సంపుటి మురిసింది ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సంచిక, ప్రమథ ల కూతురు సంపుటి. తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా 'పద, పెళ్లి చేసుకుందా’మంటుంది. అబ్బాయిలతో ఆలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్ తో సంపుటి విషయం ఫోన్ లో మాట్లాడుతుంది.


శ్రీకర్, వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించానని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు. పీజీలో రాఘవ, సంపుటిలు క్లాస్ మేట్స్ అవుతారు. ఇద్దరూ కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు. ఇంటర్వ్యూ కి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తే, అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.


 సంపుటి, రాఘవలు, వాళ్ళ పేరెంట్స్ సమావేశమవుతారు. ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు. పెద్దల ఇష్ట ప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరూ.

శ్రీహరి చక్కగా పని చేస్తున్నట్లు అభిప్రాయ పడతారు సంపుటి, రాఘవలు.


ఇక సంపుటి మురిసింది ఎపిసోడ్ 6 చదవండి.. 

కారు సాఫీగా సాగిపోతుంది.


"నువ్వు చెప్పిన లగాయితు ఆలోచిస్తున్న.. శ్రీహరి కొత్త కెమికల్ ఫార్ములా ఏమై ఉంటుంది." సడన్ గా అన్నాడు రాఘవ.

"నేను పట్టి అడగ లేదు. ఏమై ఉంటుందో. నాలోనూ ఆ ఆలోచనే రన్ అవుతుంది." రాఘవను చూస్తూ చెప్పింది సంపుటి.


"ఏమైనా.. తెలుస్తుంది.. అతడు కెమిస్ట్రీ మీద నిర్దిష్టమైన గ్రిప్ పొందాడు." చెప్పాడు రాఘవ.


చిన్నగా తలాడించిందే తప్ప.. సంపుటి ఏమీ అనలేదు.

"కదూ." రెట్టించాడు రాఘవ.


"ఆఁ. అవునవును." అనేసింది సంపుటి.


"మరే.. నువ్వు తన ఇన్స్పిరేషన్ విగా.." అంటున్న రాఘవ వైపుకు.. చూపును తిప్పి.. "అది అతడు చెప్పింది." అనేసింది సంపుటి.


"నిజమే. ప్రత్యక్షంగా నాకు ఎఱికేగా. నిన్ను ఆసరాగా తీసుకుంటే.. సాధించడం ఈజీ." మెత్తగా నవ్వేడు రాఘవ.


"అబ్బ అచ్ఛా." చిత్రంగా అంది సంపుటి.


వెంటనే.. "ఏదేది.. మరో మారు అనవా." సంపుటిని చూస్తూ అడిగాడు రాఘవ సరదాగా.


"ఏది." వింతవుతుంది సంపుటి.


"అదే.. అబ్బ అచ్ఛా.. అన్నావుగా.. అది." చెప్పాడు రాఘవ.


ఆ వెంబడే..

"అది నీ గొంతుతో చాలా థ్రిల్లింగ్ గా వినిపిస్తుంది." అన్నాడు.

"ఛుఫ్. చాల్లే." మొహం పక్కకు తిప్పుకుంటూ నవ్వుకుంది సంపుటి.


***

తమ తిరుపతి బ్రాంచి విజిటింగ్ ముగించుకున్నారు.. సంపుటి, రాఘవ.


వాళ్లు ఆ బ్రాంచి నుంచి బయలుదేరబోతున్నారు.

అప్పుడే..

సంపుటికి ఫోన్ చేసింది సంచిక.


"మేము రైలు ఎక్కాం." చెప్పింది.


"గుడ్. ఇక్కడికి వచ్చిన మా పని కూడా ఐంది. ఈ బ్రాంచి తీరు.. మా ఇద్దరినీ సంతృప్తి పరిచింది." చెప్పింది సంచిక.


ఆ కాల్ కట్ అవుతుండగానే..

రాఘవకి ఫోన్ చేసింది వాగ్దేవి.


"వాళ్ల ట్రైన్ కదిలింది. మేము ఇంటికి బయలుదేరాం." చెప్పింది.


"సరే. ఇక్కడి మా పని ఐంది. ఈ రాత్రికి హోటల్ లో ఆగి.. రేపు తిరిగి బయలు దేరుతాం." చెప్పాడు రాఘవ.


ఆ కాల్ ముగిసేక..

"వెల్.. సుధాకర్ గారూ.. మళ్లీ కలుద్దాం." అన్నాడు రాఘవ.. ఆ బ్రాంచి ఇన్చార్జి కమ్ టీచర్ తో.


"య. మీ పని తీరు బాగుంది. ఇలానే అందిస్తుండండి." చెప్పింది సంపుటి.

"తప్పక." అనేసాడు సుధాకర్. 


ఆ వెంటనే.. "కనీసం మీకు డిన్నర్ నైనా అరేంజ్ చేసే అవకాశం ఇవ్వండి." అన్నాడు.


"నో ఫార్మాలిటీస్ ప్లీజ్. ఉయ్ మేనేజ్. డోన్ట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్." నవ్వేడు రాఘవ.


"మీకు బ్రాంచిలోని ఎకామిడేషన్ బాగుందిగా." అడిగింది సంపుటి.


"చక్కగా ఉండగలుగుతున్నాను." సాఫీగా చెప్పాడు సుధాకర్.


ఆ తర్వాత..

ఆ ఇద్దరు.. తమ బ్రాంచికి దరిలోనే ఉన్న హోటల్ లో బస చేసారు.

సంపుటి రిప్రైష్ కై.. రూంలోని బాత్రూం వైపు కదిలింది.. టవల్ తో.


రాఘవ సోఫాలో కూర్చున్నాడు. టీపాయ్ మీది నేటి దిన పత్రిక తీసుకున్నాడు. పేజీ పేజి వార్తలను చదువుతున్నాడు.

అతడిని.. జిల్లా పేజీ లోని.. ఓ బాక్స్ ఐటమ్.. ఆకట్టుకుంది.

అందులోని ఫోటోనే చూస్తూ అతడు అలా ఉండి పోయాడు.. అందులోని వార్త చదవకనే. 


నెమ్మదవుతూ ఆ వార్త చదివాడు.

రాఘవ చలిస్తున్నాడు.

అప్పుడే అక్కడికి సంపుటి వస్తూ..

"లే. నువ్వు వెళ్లిరా. ఆకలిగా ఉంది. డిన్నర్ కు వెళ్లి వద్దాం." అంది. 


"ముందు ఇలా వచ్చి కూర్చోవా." మెల్లిగా అన్నాడు రాఘవ.


రాఘవ పక్కనే.. సోఫాలో కూర్చుంది సంపుటి.

సంపుటికి తన చేతలోని పేపర్ అందించి.. 

"ఇది చూడు." అంటూ ఆ బాక్స్ ఐటమ్ చూపాడు.


సంపుటి ఆ వార్త చదివింది.

"ఓ. గుడ్. ఇంటరెస్టింగ్ న్యూస్." అంది.


ఆ వెంబడే..

"షి మస్ట్ బి ఏన్ ఐడియల్ గర్ల్." అంది.


"ఆమె.. కావ్య." చెప్పాడు రాఘవ సడన్ గా.


"య. వార్తలో రాసుందిగా." తల తిప్పి రాఘవను చూస్తుంది సంపుటి.


"తను.. నా ఇంటర్మీడియట్ మేట్." చెప్పాడు రాఘవ.


"ఈజ్ ఇట్." ఆశ్చర్యమయ్యింది సంపుటి.


"నేను చెప్పి ఉన్నానుగా. నేను.. ఈమె లవ్ ప్రపోజల్ నే తిరస్కరించాను." చెప్పాడు రాఘవ.


వెంటనే సంపుటి మాట్లాడలేక పోయింది. తిరిగి తల తిప్పి.. ఆ న్యూస్ బాక్స్ లోని కావ్య ఫోటోనే చూస్తూ ఉంది.


చిన్నగా కదులుతూ.. "వార్తను బట్టి.. ఇక్కడే.. తిరుపతిలోనే.. కావ్య ఉంటుంది. ఒక సారి కలుద్దామా." అడిగేసాడు రాఘవ.


తల ఎత్తి.. రాఘవనే చూస్తూ ఉండి పోయింది సంపుటి. తను ఏమీ అన లేక పోతుంది.


"ప్లీజ్.. సంపుటి." నెమ్మదిగా అన్నాడు రాఘవ.


"సరే. రేపు కలుద్దామా." అంది సంపుటి.


"రేపా.. ఇప్పుడు పోతే కాదా." రాఘవ అన్నాడు నంగిలా.


సంపుటి జాలి ఐంది. సెల్ఫోన్ తీసుకొని.. టైం చూస్తూ.. 

"నైన్ దాటుతుంది. ఈ టైంలో బాగోదు." అంది.


"అంతేనా." ఢీలా అయ్యాడు రాఘవ.


సంపుటి మరింత చప్పబడిపోయింది. ఐనా ఏమీ అనక మూగగా రాఘవనే చూస్తుంది.


'సర్లే. రేపు పోదాంలే. నీకు ఆకలి అన్నావుగా. పద. వెళ్దాం." లేచాడు రాఘవ.


"వెళ్లి రిప్రైస్ అవ్వు." చెప్పింది సంపుటి.


"లేదులే. ముందు డిన్నర్ కానిద్దాం." కదిలాడు రాఘవ.


సంపుటి మరేమీ అనలేక.. లేచి.. కదిలింది.


 ***

నిద్ర లేచి.. ఇటు మంచం అంచున కూర్చున్న సంపుటి.. అప్పుడే మంచం అటు చివరన నుండి నిద్ర లేచి వస్తున్న రాఘవకు.. 'గుడ్ మోర్నింగ్' చెప్పింది.


"గుడ్ మోర్నింగ్. అప్పుడే నిద్ర లేచావా." అడిగాడు రాఘవ.


"ఆఁ. ఇప్పుడేలే." చెప్పింది సంపుటి.


ఆ వెంబడే..

"నువ్వు సరిగ్గా నిద్ర పోలేదు. నీ కళ్లు ఎర్రయ్యాయి." అంది సంపుటి.. అతని మొహం లోకి చూస్తూ.


"కొత్త ప్లేస్ గా." అనేసాడు రాఘవ.


"లేదులే." అనేస్తూ..

"త్వరగా తయారై.. వెళ్లి.. కావ్యను కలుద్దాం." అంది సంపుటి.


రాఘవ ఏమీ అనక.. బాత్రూం లోకి దూరాడు.


 ***

"కారు ఆపు. ఇదిగో ఆ బోర్డ్." అంది సంపుటి.


అప్పటికి రాఘవ రైట్ సైడ్ వైపు చూస్తున్నాడు.

"ఇటు.. లైప్ట్ వైపు చూడు." చెప్పింది సంపుటి.


అటు చూస్తూ.. "అవును ఇదే." అంటూనే..

'కావ్య ట్యూషన్ సెంటర్'.. బయటికే చదివేసాడు రాఘవ.


అప్పుడే సంపుటి కారు దిగింది.

రాఘవ దిగి వచ్చేక.. ఇద్దరూ ఆ బోర్డ్ ఉన్న ఇంటిలోకి నడిచారు.


పిల్లలు ఉన్నారు. ట్యూషన్ నిర్వహింపబడుతుంది.

రాఘవ, సంపుటిల రాకను చూసిన కావ్య.. చెప్పుతుంది ఆపి.. అటు బ్లాక్ బోర్డ్ వైపు నుండి కదిలి.. ఇటు వచ్చింది.

రాఘవను పట్టి పట్టి చూస్తూ..

"నువ్వు.. మీరు.. రాఘవ కదూ." అంది. తను బాగా తడబడింది.


రాఘవ చిన్నగా నవ్వుతున్నాడు.

ఫోటోలో చూసి ఉండడంతో.. కావ్యను సులభంగానే గుర్తించింది సంపుటి.


"రండి." అంటూనే కావ్య.. ఆ హాలు నుండి ముందున్న రూంలోకి నడిచింది.


ఆ ఇద్దరూ ఆమె వెనుకే వెళ్లారు.

"కూర్చొండి." అంది కావ్య.. కుర్చీలు చూపిస్తూ.


రాఘవ, సంపుటి కూర్చున్నారు.

"నువ్వు.. మీరు.. కూర్చొండి." చెప్పగలిగాడు రాఘవ.


కావ్య ఎదురు కుర్చీలో కూర్చుంది.

ఎన్నాళ్లో తర్వాత కనిపిస్తున్న కావ్య.. అతడిని తబ్బిబ్బు పరుస్తుంది. ఆమెనే చూస్తూ ఉండి పోయాడు.

అది గుర్తిస్తూనే..

"పేపరులో మీకై అచ్చయింది చూసాం." చెప్పుతుంది సంపుటి.


"రాత్రే." అప్పుడే అన్నాడు రాఘవ.


"అవును. నిన్నటి పేపరులో వచ్చింది." చెప్పింది కావ్య.

ఆ వెంబడే..

"వద్దన్నాను. కానీ విలేఖరి చెల్లి నా స్టూడెంట్. వార్త వస్తే చాలా మందికి తెలుస్తుందని.. అతను నా ఫోటో తీసుకొని.. ఆ వార్త రాసాడు." నెమ్మది నెమ్మదిగా చెప్పింది.

"అది వాస్తవం. మీ లాంటి వారి తీరు విస్తరణ కాబడాలి. మీరు నిజంగా ఒక ప్రేరేపకురాలు." చెప్పాడు రాఘవ.


"మీకంటే కాదు లెండి." అంది కావ్య వెంటనే.


రాఘవ, సంపుటి మొహాలు చూసుకుంటున్నారు.

"మీ ప్రకటన చూసాక.. మీ గురించి తెలుసుకున్నాను. మీరు ఈ మధ్య ఇక్కడ బ్రాంచి కూడా పెట్టారుగా." చెప్పింది కావ్య.. రాఘవనే చూస్తూ.


"ఓ. ఆ వివరాలు మీకు తెలుసా." అంది సంపుటి.


ఆ వెంబడే..

========================================================================

ఇంకా వుంది..

======================================================================== 

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







80 views0 comments

Commentaires


bottom of page