top of page
Original.png

భువిపై దైవాలు తల్లిదండ్రులు!

7 hours ago
2 min read

తల్లిదండ్రుల ప్రేమ, త్యాగం, కుటుంబ అనుబంధాన్ని ప్రతిబింబించే భువిపై దైవాలు తల్లిదండ్రులు తెలుగు కవిత చిత్రం.

BHuvipai Daivalu Talidandrulu - Telugu Inspirational Poem | A. Sandhyarani Siripragada

భువిపై దైవాలు తల్లిదండ్రులు! - తెలుగు ప్రేరణాత్మక కవిత | ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

Published in manatelugukathalu.com on 13/10/2026


భువిపై దైవాలు తల్లిదండ్రులు! – ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

మన జీవితంలో కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా, వారి విజయమే తమ జీవిత పరమార్థంగా భావించే తల్లిదండ్రుల ప్రేమకు వెలకట్టలేం.

తల్లి తన మమతతో పిల్లలను పెంచితే, తండ్రి తన కష్టార్జితంతో వారికి బంగారు భవిష్యత్తును అందించడానికి శ్రమిస్తాడు. ఈ నిస్వార్థ ప్రేమను, త్యాగాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని కవయిత్రి ఏ. సంధ్యారాణి సిరిప్రగడ గారు ‘భువిపై దైవాలు తల్లిదండ్రులు!’ అనే కవితలో ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు.


భువిపై దైవాలు తల్లిదండ్రులు!

వారి ప్రేమకు ప్రతిరూపాలు పిల్లలు!

రక్తాన్ని పాలుగా పట్టే తల్లి!

స్వేదాన్ని డబ్బుగా మలిచే తండ్రి!

వంశోద్ధారకులకై కష్టనష్టాలకోర్చె తండ్రి!

ముద్దు మురిపాలలో ఓలలాడించే తల్లి!

బాధ్యతల ఒడిలో బందీ అయ్యే తండ్రి!

ఆశా జ్యోతులవలే కాపాడుకునే తల్లి!

తండ్రి వాత్సల్యం నిర్మలం నిస్వార్థం!

తల్లి రుణం జన్మజన్మల బంధం!

పిల్లల కంట చూడలేరు కన్నీరు!

ప్రాణమైనా వడ్డి ఇచ్ఛే సిరులు!

నూరు గురువులకు సమానం ఒక తల్లి పంచే జ్ఞానం!

ధర్మరక్షణ క్రమశిక్షణ తండ్రి చూపే మార్గం!

కఠినత్వం తండ్రి వ్యక్తిత్వం!

క్షమాగుణం తల్లి స్వభావం!

నిరంతర త్యాగం తల్లిదండ్రుల అస్తిత్వం!

పిల్లల కీర్తి ప్రతిష్టలే తల్లిదండ్రుల మోక్షం!

పిల్లల ఆనందం తల్లిదండ్రులకు స్వర్గం!

తల్లిదండ్రులు వెలసిన గృహమే మమతల మందిరం!   


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


ఏ. సంధ్యారాణి సిరిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

నా పేరు ఏ. సంధ్యారాణి సిరిప్రగడ.


నేను చదువుకుంది బీకాం., ఎంబీఏ., ఎల్ఎల్ బి.

ఇంజనీరింగ్, ఎంబీఏ, & ఎంసీఏ కాలేజిలలో అసోసియేట్ ప్రోఫేసర్‌గా చేశాను. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశాను. మాసపత్రికలు, ఆన్లైన్ పత్రికలు, వేరువేరు పోటీల కోసం, సామాజిక మాధ్యమాల గ్రూపుల కోసం ఇప్పటివరకు మొత్తం దాదాపు 40 కథలు, 20 కవితలు వ్రాసాను. 2011 నుంచీ 2014 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో 'రాణి సంధ్య' పేరుతో 18 వ్యాసాలు అచ్చయ్యాయి.  2025లో జెవి పబ్లికేషన్స్ వారి 'ధీర' పుస్తకంలో నావి నాలుగు కథలు అచ్చయ్యాయి. వివిద పోటీలలో ప్రథమ, ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను. ఒక పోటీ కోసం మినీ నవల కూడా వ్రాసాను. నవల వ్రాయాలని కోరిక ఉంది. కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయడమే కాకుండా నాకు పాటలు పాడడం, చిత్రలేఖనం చాలా ఇష్టం. నా స్వస్థలం, నివాసం హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page