అమ్మవారి అవతారములు

Ammavari Avatharamulu - New Telugu Poem| Vemparala Durga Prasad
అమ్మవారి అవతారములు - తెలుగు కవిత | వెంపరాల దుర్గాప్రసాద్
Published In manatelugukathalu.com On 11/10/2026
అమ్మవారి అవతారములు – శరన్నవరాత్రుల ప్రత్యేక పద్యాలు
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
శరన్నవరాత్రులు జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించే పవిత్రమైన ఉత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారు దసరా ఉత్సవాలలో ప్రతిరోజూ ఒక్కో విశిష్ట అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
2026 అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ ఉత్సవాలలో బాలాత్రిపురసుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, మహాచండీదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు.
ఈ పది దివ్యరూపాల విశిష్టతను, జగన్మాత కరుణను, భక్తుల పట్ల అమ్మవారి అనుగ్రహాన్ని కవి వెంపరాల దుర్గాప్రసాద్ గారు తేటగీతి, ఆటవెలది ఛందస్సులలో పద్యరూపంగా అందించారు.
శరన్నవరాత్రుల సందర్భంగా ఆ పది భక్తి పద్యాలను మనతెలుగుకథలు పాఠకుల కోసం అందిస్తున్నాము.
శరన్నవరాత్రుల సందర్బంగా …
అక్టోబర్ 11 నుండి శరన్నవరాత్రుల సందర్బంగా విజయవాడ లో ఇంద్ర కీలాద్రి పైన అమ్మవారి అవతారములను క్రింది విధముగా అలంకరిస్తారు.
ఆ 10 అవతారములు పై
క్రింది పద్యములు.
--------
మొదటి రోజు..బాలాత్రిపురసుందరి అవతారము మీద పద్యము.(తేటగీతి)
---
భండుడను ఖలుని వలన బాధ నొంది,
సురలు వేడిరి దుర్గను స్తోత్రములను.
ఘాతములు తొలగించగ మాత కదిలి,
భండుని దునిమి సురలకు బాధ తీర్చి,
బాలత్రిపురనామమ్మున వాసి గాంచె.
2వ రోజు ..గాయత్రీదేవి అవతారం మీద పద్యము. (ఆటవెలది).
--
కవచ మగును వేద గాయత్రిగ కొలువ
శ్రద్ధచూపి పిలువ శక్తి నిచ్చు
సాధకులకు సులభ సాధ్యమగు జనని
వేదశాస్త్ర ములకు వెలుగు నొసఁగు.
3వ రోజు..అన్నపూర్ణ అవతారము మీద పద్యము (ఆటవెలది) .
--
అన్నపూర్ణ యనగ నఖిలలోకములను
రక్షజేసి జేర్చు లక్ష్యములను
తల్లి శరణువేడు దానవులను కూడ
కరుణజూపి యామె కాచునెపుడు.
4వ రోజు శ్రీ చండి అవతారము మీద పద్యము.(ఆటవెలది)
౼౼౼౼౼౼౼౼౼
శీఘ్ర ప్రగతి నొసఁగు శ్రీచండి కరుణను
వేడుకొనిన చాలు వెతలుతీరు.
పరమ పావనమగు పద్మాక్షి పదసేవ
సలుపు జనులు భువిని సౌఖ్యమొందు.
5వ రోజు..లలితా దేవి అవతారము మీద పద్యము.(ఆటవెలది)
--
లలిత నామధేయ లావణ్యరూపిణి
జనుల రక్షసేయుజనని తాను.
కొలుచువారి కెపుడు కొంగుబంగారమై
శుభములిచ్చు తల్లి సుగుణశీలి.
6వ రోజు..సరస్వతీ దేవి అవతారము మీద పద్యము.(ఆటవెలది)
----
తెలుగు భాష లోని తేనెసొగసులైన
కవులు వ్రాయు దొడ్డకావ్యమైన
శ్రావ్యమైన రాగసంగీత ఝరులైన
వాణి కరుణవలన పరిమళించు.
7వరోజు శ్రీ మహాలక్ష్మి అవతారము మీద పద్యము.(ఆటవెలది)
---
సకలజనులు కోరు శక్తియుక్తులనిచ్చి
వేడుకొనెడి వారి వేదనలను
బాపి, నిలచియుండు భాగ్యములనుగూర్చు,
లక్ష్మిశరణు మనకు లాభమొసగు.
8వ రోజు దుర్గాదేవి అవతారము మీద పద్యము.(ఆటవెలది)
---
ఖడ్గ బాణములను కరముల ధరియించి
ఖలుని వధకు కదిలె కనకదుర్గ
దురితములను బాపు దుర్గనీవనివేడు
జనులనెపుడు కాచు జగతినందు.
9 వ రోజు మహిషాసుర మర్ధని అవతారము మీద పద్యము.(తేటగీతి)
---
రంభుని కొమరుడు మహిష రాక్షసుండు
బ్రహ్మ గూర్చితపముసేసి వరము నొందె.
సురలు కూడ వానివలన శోక మొంద
రాక్షసుడిని దునుమ వచ్చె రమణిదుర్గ.
10 వ రోజు..రాజరాజేశ్వరి అవతారము మీద పద్యము(ఆటవెలది)
---
దుష్ట దానవులను దునిమిన కాళిని
సరళమైనరీతి స్వాగతించి
లలిత రూపమైన రాజరాజేశ్వరీ
మాత యనుచు కొలువ, మహిని కాచు.
======================================

Subharambham - New Telugu Poem| Vemparala Durga Prasad
శుభారంభం - తెలుగు కవిత | వెంపరాల దుర్గాప్రసాద్
Published In manatelugukathalu.com On 19/03/2026
నూత్న వర్షపు తొలి ఋతువగు వసంతపు ఆగమనం
కోయిల పాడే తీయటి పాటల మనోహర శబ్ద సోయగం
మామిడి పూతల నిండు వనముల హరిత దర్శనం
నెమలి ఆటలందు, జింకక్రీడ లందు ప్రకృతి వీక్షణం
తేనె సేకరింపులబడి తరువుల వెంట తుమ్మెదల పయనం
విరియు మల్లెల పూదోటల సుగంధపు తెమ్మెరలాఘ్రాణం
కొత్త వత్సరమునకు, కొంగ్రొత్త ఆశలకు,తపనలకారంభం
మనిషి మనసుకు కళ్లెమెరుగని భావనలకు తొలి సంబరం
నామమున “పరాభవము” గాని, ఇచ్చునది గొప్ప సందేశం
అనుభవాల సోపానముగా మనిషి మార్పుకు సంకేతం
సమస్యలనెదుర్కొని వీరులు సాధించు విజయ పథం
శ్రమను నమ్మి, నీతి మరువని కొత్త జీవితపు ధృడ సంకల్పం
కవి సమ్మేళనములందు కళాహృదయుల సాంప్రదాయ సంరంభం
అదే సుమా నూత్న సంవత్సరపు వేడుకకు తెచ్చు శుభారంభం
మనమంత కలసి ఆహ్వానిద్దాము పరాభవ నామ సంవత్సరం.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





Comments