top of page

స్నేహం కోసం


'Sneham Kosam' New Telugu Story

Written By Radhika Krishnan Adari

'స్నేహం కోసం' తెలుగు కథ

రచన: A. రాధికా కృష్ణన్


తొలి పలుకులు..

"ప్రతి ఒక్కరి జీవితానికి తెచ్చెను అందాలు..

మన జీవితంలోని బంధాలు.."

"పేగు బంధాలు..

రక్తసంబంధాలు..

భార్యాభర్తల బంధాలు..

స్నేహ బంధాలు..

ప్రేమ బంధాలు..

వెదజల్లెను మన జీవితంలోని సుగంధాలు.."


రెండు మనసుల కలయికతో..

మూడుముళ్ల బంధంతో..

నాలుగు దిక్కుల పందిరిలో..

పంచభూతాలు సమక్షంలో..

ఆరు ఋతువుల ఆధ్వర్యంలో..


నీతో ఏడు అడుగులు వేయించింది..

నిను నా జీవిత భాగస్వామిగా

ఆహ్వానించింది..

ఆనందాల హరివిల్లు కి నాందిపలికింది..

తన ప్రాణాన్ని సైతం స్నేహానికై

సమర్పించింది..

సంతోషంగా కన్నుమూసింది..


రెండే అక్షరాలు కానీ వర్ణించడానికి వర్ణమాల కూడా సరిపోదు..

అదే స్నేహం..

నా ఈ చిరు నేస్తాలు కథను చదవండి.. ఆనందించండి..

పైరు పంటల పచ్చదనం..

చల్లగాలుల చిలిపితనం..

అందమైన పూలవనం..

అందరి మనసులు దోచే స్థలం..

అంతటి రమ్యమైన ప్రదేశంలో ఇద్దరు ప్రేమికులు.


ఆదిత్య: ఏమిటి కవిత ఇక్కడికి తీసుకొచ్చావు?..

కవిత: నీకు ఎప్పటినుండో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.

ఇంతలో కవిత ఏమి జరగకూడదని ఊహించిందో అదే జరిగింది.

ప్రపంచంలో ఏదో ప్రళయం వచ్చినట్లు ఆదిత్య ఫోన్ మొగుతుంది. ఫోన్ మాట్లాడుతునే అక్కడి నుంచి పరుగులు తీ‌సాడు. (కవిత ఎంత పిలుస్తున్నా వినిపించికోకుండ.).


కవితని ఒంటరిగా అలా వదిలేసి వెళ్లిపోవడం కవితను ఎంతో అయోమయానికి గురిచేసింది..

అసలు ఎవరి కోసం అని అంతలా పరుగులుతీస్తున్నాడు.

ఆదిత్య పరుగులు తీస్తూ వస్తుండగా,


ఇంతలో..

ఒక వీధిలో..

కొందరి మగాళ్ల మధ్యలో..

ఒక ఆడపిల్ల అవస్థపడటం గమనించాడు..


మానవత్వాన్ని మరచి మృగాళ్ల ప్రవర్తిస్తున్న వారికి ఆదిత్య బుద్ధి చెప్పాడు..

ఆదిత్య: తనకి ఎవరూ లేరు అనుకుంటున్నారా..

కష్టం వస్తే కాపాడే ఖడ్గాన్ని అవుతాను..

తనని నడిపించే నాన్న నవుతాను..

తనకి లాలి పాడే అమ్మను అవుతాను..

అండగా ఉండే అన్ననవుతాను..


అన్నిటికన్నా ప్రాణమిచ్చే ప్రాణస్నేహితుడినవుతాను..

తేడా వస్తే ప్రాణంతీస్తాను..

అందరు పల్లవికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయారు.


ఆదిత్య తనని అక్కడినుంచి తీసుకొనివెలుతూ..

ఆదిత్య: ఏంటి పల్లవి నీకు ఎన్ని సార్లు చెప్పాను ఒంటరిగా బయటకు రావద్దని, సమయానికి నేను చూసానుకనుక సరిపోయింది.


పల్లవి: ఈ సమాజం ఆడదాన్ని ఆటబొమ్మ కింద చూస్తుంది..

ఒంటరిగా ఉండే నాలాంటి ఆడవాళ్లంటే మరి చులకనగా చూస్తుంది..

అందుకే ఆడవాళ్లపై అగాయిత్యాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది..

మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతుంది..


ఆదిత్య:మరొక్కసారి నువ్వు ఒంటరిని అనిఅనకు, నీకు తోడుగా ఎప్పటికి నేను ఉన్నాను..ఉంటాను..

పల్లవి: అనాధకి అండగా నిలుస్తున్ననిన్ను అన్నా అనాలో ఆప్తుమిత్రుడు అనాలో తెలియడంలేదు.

ఆదిత్య: అంతకుమించి.


పల్లవి: అవును ఇంతకీ నేను ఇక్కడ ఉన్నాను అని నీకెలా తెలిసింది.

ఆదిత్య: మన మిత్రుడు ఫోన్ చేసాడు..

నువ్వు ఆపదలో ఉన్నావు అని చెప్పాడు..

అందుకే నీమిత్రుడు నేను కాపాడడానికై వచ్చాడు..

పల్లవి: ఎక్కడ నుండి వస్తున్నావు.


ఆదిత్య: బాగా గుర్తు చేసావే బాబు, అక్కడ కవిత నాకోసం ఎదురుచూస్తూఉంటుంది, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు నేను మళ్ళీ కలుస్తాను.

పల్లవి: అయ్యో.. తనని ఒంటరిగా వదిలేసి వచ్చావా??? సరే సరే తొందరగా వెళ్ళు తనునీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది.


మళ్లీ పరుగులు తీస్తూ కవితను చేరుకున్నాడు ఆదిత్య.


కవిత: ఏంటి ఆదిత్య అల హఠాత్తున వెళ్ళిపోయవు,

ఎవరు ఫోన్ ఆ పల్లవియేన, ఏం పని ఉంది దానికి, ఒక్క క్షణం కూడా నీతో మాట్లాడుకోనివ్వదా (పల్లవిపై కోపాన్ని ప్రదర్శిస్తూ..)


ఈ మాటలు విన్న ఆదిత్యకి కోపం పొంగువచ్చి, కవిత పై చేయి చేసుకున్నాడు.


ఆదిత్య: నీపై చెయ్యిచేసుకున్నది పల్లవిపై కొపడ్డావనికాదు..తనని "దాన్ని" అని మాట్లాడినందుకు.

అసలు నీకు ఏమి తెలుసు అని అలా మాట్లాడుతున్నావు, ఒక విషయం చెపుతాను విను.


నాకు ఊహ తెలిసిన వయసులో నా జీవితంలోకి వచ్చింది..

నా పెదవులపై చిరునవ్వులు పూయించింది..

నా జీవితాన్ని రంగులమయం చేసింది..

పల్లవి నా జీవితంలోకి వచ్చిన మరుక్షణం నా జీవితమే మారిపోయింది..

చివరికి నన్నే మరిచిపోయింది..

ఒక రోజు కలువ పువ్వులాంటి కళ్ళు కంటతడి పెడుతున్నాయి..

కమలాత్ముని రష్మీశోకి కమలము భంగినట్లు, ఆమె మొము విచ్చుకున్నది..

ఆ సంఘటన నా మదిని గిచ్చుతున్నది..

నా పాదాలు ఆమెవైపు పరుగులుతీస్తూ.. ఆమెను చేరుకున్నది..


ఆదిత్య: ఎందుకు బాధపడుతున్నావు??? (ఆమె చెతులుచూసాను గాయలతోనిండివున్నవి), అయ్యో ఏమైంది ఎక్కడ పడిపోయావు???

పల్లవి: వచ్చేటప్పుడు దారిలో పడిపోయాను..

అందువల్ల ఇప్పుడు అన్నం తినలేకపోతున్నాను..

చాలా ఆకలితో ఉన్నాను..


ఆదిత్య: అయ్యో అవునా! సరే ఆగు, నేను తినిపిస్తాను..(అలా తనకి గోరుముద్దలు తినిపించాను నా 12 ఏళ్ల ప్రాయంలోనే).

పల్లవి: ఎవరు నాకు ఎప్పుడూ ఇలా తినిపించు లేదు..

అందుకే అమ్మ ప్రేమ నాకు తెలియలేదు..

ఆదిత్య: నీకు అమ్మ నాన్న లేరా?? మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు??

పల్లవి: ఇరువురి కలయిక వల్ల జన్మించాను..

కానీ ఇప్పుడు ఒంటరినై జీవిస్తున్నాను..

ఒక ఆశ్రమం కలిగించిన ఆశ్రయంలో నివసిస్తున్నాను..


ఆదిత్య: నువ్వు ఎప్పుడూ అలా బాధపడకు ఇక నుండి నేను తోడుగా ఉంటాను.

(తర్వాత తనని ఆశ్రమం దగ్గర దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిన కానీ నాకు తన మాటలే గుర్తుకువస్తున్నాయి. అదేసమయంలో అమ్మ నాన్న బయటికి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామని మాట్లాడుకుంటున్నారు..


అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అది విన్న మా తల్లిదండ్రులు చాలా ఆనందించారు.. )

ఆదిత్య: అమ్మ నాన్న మనం ఎప్పుడు సమయం ఉన్నా బయటకి వెళ్ళే గడుపుతాముకదా! ఈసారి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మన సమయాన్ని గడిపివద్దాం అమ్మ.

(నా కోరికను మన్నించి అమ్మ నాన్న నేను, పల్లవి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ పల్లవి చాలా దిగులుగా కూర్చుని అన్నం తినను అని మారంచేస్తుంది,

నేను దగ్గరకు వెళ్లాను.)


పల్లవి: ఆదిత్య నువ్వు ఏంటి ఇక్కడ? (మొములో చిరునవ్వు చిగురించింది.)

ఆదిత్య: అది తర్వాత చెప్పుతానుకాని ముందు నువ్వుతిను.

(అని నా చేతులతో తినిపించాను..

తనతో రోజు అంతా ఆడుకున్నాను..

చాలా ఆనందంగా ఉన్నాను..)


తండ్రి: మనం చాలా ప్రదేశాలకు వెళ్ళాము కానీ నువ్వు అక్కడ ఎక్కడ ఇంత ఆనందంగా ఆడుకోవడం.. సమయం గడపడం.. మేము చూడలేదు ఆదిత్య.

(అలా మా నాన్నగారు అడిగినప్పుడు నాకు తెలియలేదు,

ఆనందం అనేది మన చుట్టూ ఉన్నా.. మనం వెళ్ళిన ప్రదేశాన్నిబట్టి కాదని..


మన మనసుకి నచ్చిన వాళ్ళు మన పక్కన ఉండటం వల్ల అని..

ఆ రోజు నుండి మాకు ఎప్పుడు సమయం దొరికినా అక్కడికే వెళ్తాము, ఇప్పటికీ పల్లవికి ప్రతి ఆదివారం ఆశ్రమానికి వెళ్లి అన్నం తినిపిస్తాను లేకుంటే తినదు. ).


కవిత: అసలు మీ బంధాన్ని నేను ఏమనుకోవాలి.

ఆదిత్య: నవమాసాలు మోసి కన్నవాళ్ళని అమ్మ అంటారు..

బాధ్యత నేర్పిన వాళ్ళని నాన్న అంటారు..

స్నేహం కోసం ఉండేవాళ్ళని స్నేహితులు అంటారు..

ప్రేమ కోసం ఉండేవారిని ప్రేమికులు అంటారు..

కానీ ఒకరికి ఒకరు గా ఉండే వాళ్లను ఏమంటారో నాకు తెలియదు, బహుశా దానికి ఇంకా పేరు పెట్టలేదు ఎవరు..


కవిత ఈ మాటలన్నీ విని..

ఆదిత్యను వెనుకనుండి గట్టిగా కౌగిలించుకుని..

నన్ను క్షమించు ఆదిత్య, ఒక అమ్మాయి తను ప్రేమించినవాడు తనతోనే ఉండాలి..

తనతోనే సమయం గడపాలి..

తనతోనే ప్రేమను పంచాలి..అన్ని కోరుకుంటుంది.

అలానే నేను అనుకున్నాను..

అందుకే నువ్వు వేరే వాళ్ళతో ప్రేమగా ఉండడం తట్టుకోలేక పోయాను..

ఐ లవ్ యు ఆదిత్య.


కవితలో మార్పుని గమనించి..

తన ప్రేమను అంగీకరించి..

తన కౌగిలిలో బంధించి..

తన ప్రేమ అంగీకారాన్ని తెలిపాడు ఆదిత్య.

ఆదిత్య: నీకు ఒక విషయం చెప్పాలి.

కవిత: చెప్పు ఆదిత్య.

ఆదిత్య: పల్లవి అనాధ కాదు.


కవిత: (ఈ మాటలు విన్న కవిత ఆశ్చర్యానికి గురిఅయింది. )

ఏమి మాట్లాడుతున్నావు ఆదిత్య నాకు ఏమీ అర్థం కావడం లేదు.

ఆదిత్య: అవును కవిత తనకి ఒక కుటుంబం ఉంది, వాళ్ళని ఎలా అయిన వెతికి పట్టుకుని, పల్లవికి బహుమతిగా ఇస్తాను, ఇదే నా జీవితాశయం.

కవిత: నీ ప్రేమలోనే కాదు..

నీ జీవితంలోనే కాదు..

నువ్వు చేసే ప్రతిపనిలోను నీతో నిలుస్తాను..

నీకు తోడుగా నడుస్తాను..

అలా వారి ఇరువురి మధ్య ప్రేమ ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వారివారి గృహములకు చేరుకున్నారు.ఆదిత్య ఇలా ఇంటికి చేరుకోగానే. పల్లవి పరుగుపరుగున ఆదిత్య దగ్గరకు వచ్చింది..

ఎంతో ఆవేదనలో ఉంది..

కళ్ల వెంట నీళ్లు చిందిస్తోంది..

ఆదిత్య: ఏమైంది పల్లవి???

ఇంతలో కవిత కూడా ఒక పేపర్ తీసుకుని ఆదిత్య దగ్గరకు వచ్చింది.

పల్లవి కవిత రాకను గమనించింది..

తన కన్నీటిని తుడుచుకుంది..

చిరునవ్వుతో స్వాగతం పలికింది..


ఆదిత్య: ఏంటి కవిత ఇలా వచ్చావు?? చేతిలో ఆ పేపర్ ఏమిటి???

కవిత: హమ్మయ్య! పల్లవి నువ్వు ఇక్కడే ఉన్నావా, ఈ పేపర్ నీకోసమే పల్లవి.

పేపర్ నాకోసమ? అస్సలు ఏమై ఉంటుంది అని

పల్లవి, కవిత దగ్గర నుండి పేపర్ తీసుకుంది..

అది చదివిన పల్లవి చిరుపెదవులపై చిరునవ్వు చిగురించింది..

తన సమస్యకు ఇదే పరిష్కారం అనిఅనుకుంది..

పల్లవి: నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు, నువ్వు తెచ్చిన ఈ పేపర్ నా సమస్యకు పరిష్కారం గా నిలిచింది.

ఆదిత్య: అసలు ఏమైంది.. పల్లవి ఆ పేపర్ లో ఏముంది..

పల్లవి: నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను పెరిగింది ఆశ్రమంలోనే,

అక్కడ నన్ను అమ్మ లాలించింది..

నాన్నలా నడిపించింది..

ప్రేమను పంచింది..

నన్ను ఏ స్థాయిలో నిలిపింది..

ఆశ్రమంలోని దాది..

తను అనారోగ్యంతో చాలా బాధపడుతుంది..

తన కొడుకులు సైతం తనను పట్టించుకోవడం మానేసారు. అందరూ ఉన్నా అనాథలా..

చావుబ్రతుకుల మధ్యలా..

కన్నీరు మున్నీరు అవుతుంది ఆ తల్లి.


ఆదిత్య: కానీ మనం ఎలా సహాయపడతాం, మన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు.

పల్లవి: ఎలా సహాయ పడతాం? అని ఆలోచించడం వల్లనే ఈ రోజు ఆ తల్లి అందరు ఉన్న అనాధ అయిపోయింది. ఎలాఅయినా సహాయపడవచ్చు అని ఆలోచించి చూడు పోయే ప్రాణానికి సైతం ప్రాణం పోయవచ్చు.


తన కొడుకుల మనం కూడా తనని వదిలేస్తే అసలు బ్రతుకుతున్న బ్రతుకే అర్థంలేదు..

ఎలా అయినా నేను ఈ పేపర్లు ప్రకటించిన కథల పోటీలు పాల్గొంటాను..

ఒక మంచి కథలు రాస్తాను..

తప్పక విజయం సాధిస్తాను..

ఇక నేను బయలుదేరుతున్నాను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.. అని పల్లవి ఆశ్రమానికి వెళ్ళి పోయింది.


ఆదిత్య: పల్లవి మాత్రం ఏదో చేయాలని బలంగా సంకల్పించుకుంది..

తప్పకుండా సాధిస్తుంది..

ఆ తల్లి కి అండగా నిలుస్తుంది..

కవిత: అవును ఆదిత్య, అసలు ఆశ్రమం లోని దాది తనకు ఏమీకాదు..

ఏ విధమైన రక్త సంబంధంలేదు..

తినకి జన్మని ఇవ్వలేదు..

కానీ ఆ తల్లికి సహాయపడాలి అనే పల్లవి తపన ఈ లోకంలో అందరికీ ఉంటే ఏ తల్లి అనాధ కాదు..

ఇలా ఆపసోపాలకి గురికాదు..

తన ప్రాణాలని కోల్పోదు..

ఆదిత్య: పల్లవి ఎవరికి కష్టం వచ్చినా చూస్తూ ఉండలేదు,

కష్టాల్లో ఉన్న వారిని కడతేరుస్తుంది..

బాధపడేవారికి బంధువవుతుంది..

అందుకే తను అందరి మనసులో నిలిచిపోతుంది..


ఆదిత్య, కవిత వారివారి ప్రేమలో మునిగిపోయారు, ఎలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. పల్లవి అందరికీ గట్టిపోటీ ఇచ్చే విధంగా కథను రాయడంలో నిమగ్నమైపోయింది..

ఇలా వీరి జీవితప్రయాణం సాగుతూ ఉండగా, ఒకరోజు పల్లవికి ఆదిత్య దగ్గర్నుండి ఫోన్ వచ్చింది తనని వెంటనే ఆసుపత్రికి రమ్మని. ఫోన్ మాట్లాడడం అయిపోగానే పల్లవి ఎంతో కంగారుపడుతూ ఆస్పత్రికి చేరుకుంది..


అక్కడ తను చూసిన దృశ్యం తనని ఎంతో ఆవేదనకు గురిచేసింది..

అక్కడ తలుపువద్దే జీవస్ శవంలా నిలబడిపోయింది..

అక్కడ లోపల్నుండి ఈ విధంగా మాటలు వినిపిస్తున్నాయి.

కవిత: బాధపడకు ఆదిత్య నాకేమీ కాదు, (ఎంతో నీరసంగా మాట్లాడుతూ ఆదిత్యను ఓదారుస్తుంది).

ఆదిత్య: నీకు ఏంజరిగినా నేను తట్టుకోలేను కవిత..

ఎందుకంటే నా ఊపిరి నువ్వు..


నా సర్వస్వం నువ్వు..

నేను బ్రతకలేను లేకుంటే నువ్వు..

(కన్నీరు మున్నీరవుతూ, కవిత పై అపారమైన ప్రేమను వ్యక్త పరిచాడు).

ఈ మాటలన్నీ వింటున్న పల్లవి కళ్ళవెంట కన్నీళ్ళు తిరిగాయి.

తన కన్నీటిని తుడుచుకొని లోపలికి వెళ్ళింది..

కవితని ఆస్థితిలో చూసి కళ్ళువెంట నీళ్లు పెట్టుకుంది..

పల్లవి: అసలు ఏమిజరిగింది ఆదిత్య??, వైద్యులు ఏమన్నారు???

ఆదిత్య: ఏమొ తెలియదు పల్లవి, హఠాత్తున కళ్లుతిరిగి పడిపోయింది.. వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చాను.


పల్లవి: ఇప్పుడు నీకు ఎలా ఉంది కవిత.

కవిత: నాకేంటి పల్లవి, చాలా బాగున్నాను ఆదిత్యయే కంగారు పడి ఎక్కడికి తీసుకువచ్చేసాడు.

పల్లవి: సరే జాగ్రత్త, కవితను జాగ్రత్తగాచూసుకో ఆదిత్య, నేను వైద్యునితో మాట్లాడివస్తాను.

అనీ, పల్లవి వైద్యునివద్దకు బయలుదేరింది.


పల్లవి: నమస్కారమండి నేను కవిత స్నేహితురాల్ని.

వైద్యుడు: అవునా! రా తల్లి కూర్చో.

పల్లవి: కవితకి ఇప్పుడు ఎలా ఉందండి.

వైద్యుడు: కొన్ని పరీక్షలు చెయ్యాలి అమ్మ, చేస్తేనే గాని ఏమీ చెప్పలేం.


పల్లవి: ఇది నా చరవాణి, పరిక్షల అనంతరం నాకు ఫలితాలు తెలియజేయండి.

అని పల్లవి చరవాణిని వైద్యుడికిచ్చీ..తిరిగి కవిత దగ్గరకు వచ్చింది.

ఆదిత్య: పల్లవి ఏమన్నారు వైద్యులు?? అంతా బానే ఉంది కదా!! ఇంటికి తీసుకెళ్లిపోవచ్చా కవితని??


పల్లవి: తీసుకెళ్ళిపోవచ్చు కానీ.. రేపు ఏదో చిన్న పరీక్ష చేయాలంట, ఆదిపూర్తయ్యాక తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు.

పల్లవి మాటలు విన్నాక ఆదిత్య కవిత మరియు వారి కుటుంబసభ్యులు ఊపిరి తీసుకున్నారు.

ఇంతలో కవిత పల్లవితో..


కవిత: పల్లవి నీ కథలపోటి రేపే కదా! నువ్వు వెళ్ళి దానికి సిద్ధపడు, ఇక్కడ వీళ్లంతా ఉన్నారుగా నన్ను చూసుకోవడానికి.

పల్లవి: సరెఅయితే నువ్వు జాగ్రత్త. ఆదిత్య, కవితని బాగా చూసుకో..

తన కళ్ళవెంట కన్నీళ్లు వచ్చినప్పుడు అవి తుడిచే మొదటి చేయి నీదేకావాలి..

మీరు జీవితాంతం కలిసి ఉండాలి..

ఇక వెళ్తున్నాను.


కవిత: బాగానే చూసుకుంటాడు పల్లవి, రేపు నీపోటీని వీక్షించడానికి ఆదిత్య వస్తాడు, నువ్వు ఏమి బాధపడకు.

అని చెప్పి పల్లవికి వీడ్కోలు పలికారు..


పల్లవి విజయాన్ని వీక్షించడానికి అందరూ వెయ్యికళ్ళతో వేచిచూస్తున్నారు..

ఆ సమయం రానే వచ్చింది.

ఆదిత్య తన స్నేహితురాలి విజయాన్ని చూడాలని ఎంతోఆశతో పోటీజరిగే స్థలానికి పయనమయ్యాడు.


ఇంతలో ఆదిత్య పల్లవికి ఫోన్ చేశాడు..

ఆదిత్య: ఎక్కడున్నావు పల్లవి?? నేను నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను.

పల్లవి: అప్పుడే వచ్చేసావా! నేను వస్తూవున్నాను..


ఆదిత్య: నీ విజయపు తొలిమెట్టుని చూడడానికి నీమిత్రుడు ఎప్పుడు ఒకమెట్టు ముందేఉంటాడు.

పల్లవి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఆదిత్య, ఎంతసేపటికి పల్లవి రాక కానరాలేదు.

ఇంతలో ఆదిత్య మిత్రుడు అటువైపుగా రావడం ఆదిత్య గమనించాడు. తనని పిలిచి పల్లవి ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు.


మిత్రుడు: ఆ ఇందాకే ఆశ్రమం దగ్గర కనిపించింది..

నీకు ఇవి ఇమ్మని ఇచ్చింది..

అని చెప్పి.. పల్లవి ఇచ్చినవి ఆదిత్యకు అందజేసి.. మిత్రులు వెళ్ళిపోయాడు.

అసలు ఏంజరుగుతుందో ఆదిత్యకు ఏమీ అంతుపట్టడం లేదు, అసలు పల్లవి పంపినది ఏమిఅయి ఉంటుంది..


దానిని ఆదిత్యకు ఎందుకు ఇచ్చింది..

వెంటనే ఆదిత్య, అసలు పల్లవి ఏమి పంపించిందో అనే ఆరాటంతో వాటిని తెరచి చూసాడు.

వాటన్నిటినీ చూసి ఆదిత్య ఆచార్యపోయాడు..తన నోటివెంట మాట కూడ మొదల్లేదు..

ఏంటి తను పోటీకి పంపవలసిన కథ నాకు పంపింది.. అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఆ కాగితాలు అన్నీ తీసిచూస్తుండగా.. ఇంతలో మరొక దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు..

అసలు అది ఏమిటాఅని తీసి చూసాడు..


అది ఒక డైరీ, అసలేముంది ఇందులో అని చదవడం ప్రారంభించాడు..

పల్లవి చేతి రాతతో రాసిన..

వారి జీవితంలో జరిగిన..

మరపురాని మధురానుభూతులను..

జీవితంలో మైమరిచిపోలేని సంఘటనలను..

ఆ డైరీలో ఆదిత్య చదువుతూ తన సమయాన్నే మర్చిపోయాడు..


డైరీలో అంతలా నిమగ్నమైపోయాడు..

అలా చదవడం కొనసాగిస్తూ డైరీ చివరాకరి వరకు చిరునవ్వులు చిందిస్తూవచ్చాడు..

ఆఖరి పేజీ చదువుతూ పల్లవియే తనతో మాట్లాడుతున్న భావనలో ఉండగా..

ఆదిత్య నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను..

నీతో ఎలా చెప్పాలో తెలియడం ఈ డైరీతో పంచుకున్నాను..

నిన్నరాత్రి వైద్యుడు నాకు ఫోన్ చేసారు.


వైద్యుడు: నీకు ఒక విషయం చెప్పాలమ్మ, ఎలా చెప్పాలో తెలియడం లేదు తల్లి, కానీ ఒక వైద్యునిగా చెప్పడం నా వృత్తి ధర్మం.

వైద్యుని మాటలు విన్నకా నా మదిలో కంగారు మెదిలింది.

పల్లవి: అసలు ఏమైందండీ కవితకి.

వైద్యుడు: కవితా ఇంక ఎన్నో రోజులు బ్రతకదమ్మ, తనకే తెలియని గుండె సమస్యతో బాధపడుతుంది..


అందువల్లనే తను ఒక్కొక్కసారి ఊపిరితీసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది..

ఈ సమస్యతో బాధపడుతున్న వారి ప్రాణాలు ఎప్పుడు కోల్పోతారో వారికే తెలియదు.

ఈ మాటలను విన్న నామది స్తంభించుకుపోయింది, జలధారల్లా కన్నీటి దారాలు చిరుచెంపలపై చెమ్మనిమిగిల్చాయి.


పల్లవి: లేదు అలా జరగడానికివీల్లేదు, ఎలాగైనా కవిత బ్రతకాలి దయచేసి ఏదోఒకటి చేయండి.

వైద్యుడు: ఉన్నది ఒకటే పరిష్కారం, తన గుండెనుతీసి మరొక గుండెను అమర్చాలి, కానీ తల్లి..

పల్లవి: కానీ.. ఏమిటండీ?? చెప్పండి.


వైద్యుడు: ఈ రోజుల్లో గుండెదానం చేసేవారు ఎవరున్నారు??

పల్లవి: మీరు దానికోసం చింతించకండి, నేను నా గుండును ఇస్తాను..

అంతేకాదు నాశరీరంలోని ఉన్న అన్ని భాగాలను నేనుదానం చేస్తాను..

దయచేసి కవితను కాపాడండి. (కళ్ళవెంట కన్నీళ్లు కుమ్మరిస్తూ).

పల్లవి మాటలకి వైద్యులు ఆశ్చర్యపోయారు.


వైద్యుడు: నువ్వు చూస్తున్న ఈ త్యాగానికి నీకు చేతులెత్తి నమస్కరించాలని ఉందితల్లి.

పల్లవి: ఎన్ని దానాలు చేస్తే పుణ్యం వస్తుందో తెలియదు కానీ, అవయవ దానంచేస్తే తప్పకలభిస్తుంది.


పుణ్యం కోసం నేను ఈ పని చేయడం లేదు.

ఈ అవయవాలు మనం బ్రతికున్నంత కాలం మాత్రమే మనతోఉంటాయి..

అదే మరొకరికి ఇస్తే వారికి ప్రాణంపోస్తాయి..

వారు జీవించినంత కాలం ఎన్నోసంతోషాలనీస్తాయి..

మన జన్మని చరితార్థం చేస్తాయి..

ఈ విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కవిత వాళ్ళకి చెప్పవద్దని, అవయవధానానికి అంగీకరిస్తూ సంతకం చేసాను..


ఇప్పుడు నా గుండెను కవితకి ఇవ్వడానికి వెలుతున్నాను..

ఆశ్రమ దారికి కూడా వైద్యులే ఉచిత చికిత్స చెస్తున్నారు. చివరిగా నాదొక కోరిక, నేను రాసిన ఈ కథని పోటీకి పంపలేకపోయాను, కానీ ఎట్టిపరిస్తితిలోను ఈ కథ అందరూ చదవాలి..

ఒక మార్పుని ఆసిస్తూ రాసిన నా ఈ కథ అందరిలోనూ మార్పు తేవాలి..

ఈ డైరీ చదివి నువ్వు నన్ను చేరుకొనెసరికి నేను ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతానేమో అని బెంగగా ఉందిరా.. కానీ నా తుదిశ్వాస నీ ఒడిలో వీడాలని ఉందిరా..


ఈ మాటలు చదవగానే ఆదిత్య గుండెల్లో వేదన ఉప్పొంగీ..

పల్లవిని ఎలా అయినా కాపాడుకోవాలని ఆసుపత్రికి ఆగమేఘాలమీద వెళ్ళాడు.

ఆసుపత్రిలో పల్లవిని అలా చూసి, పల్లవి తలని తన ఒడిలో వాల్చుకొని, గుండెలు పగిలేలా ఏడుస్తూ..

ఆదిత్య: కవిత లేకుండా బ్రతకలేను అని ఆలోచించావేగానీ, నువ్వు లేకుండా ఎలా బ్రతకగలను అనుకున్నావే..


నా ప్రేమ కోసం కవితను బ్రతికించి నాకు ఇచ్చావు.. ఇప్పుడు నేను బ్రతకడం కోసం నీ ప్రేమని నాకు ఎవరుఇస్తారే.

కన్నీరు మున్నీరవుతున్న ఆదిత్యనీ వైద్యులు ఓదార్చారు.

మీరైనా వద్దని చెప్పుఉండొచ్చు కదా అండి, ( వైద్యులని అడిగా ఏడుస్తూ..)

వైద్యులు: మేముచెప్పిన తను వినలేదు, నీ కోసం ఏం చేసినా తక్కువే అంది..

ఆ ఒక్క మాటతో మా అందరి నోళ్ళు కట్టేసింది..


దయచేసి బాధపడుకూ నీ చేతుల మీదుగా ఈ లోకాన్ని వీడిపోవాలనే తన కోరికను నెరవేర్చు.

పల్లవి కోరిక మేరకు చిరకాల చెలిమికి తనే చితిపెట్టాడు.


పల్లవి ఆఖరి కోరికను ఎలా అయినా నెరవేర్చాలని..

తను రాసిన కథను అందరికీ అందుబాటులోకి తేవాలని..

తన తల్లిదండ్రులను తనకి బహుమతిగా ఇవ్వాలని..

వీరి స్నేహాన్ని అందరికీ చాటి చెప్పాలని..


ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆదిత్య, కవితలకు

“కథా విజయం” “ఈనాడు దినపత్రిక“ ద్వారా ఒక అవకాశం తలుపు తట్టింది..

పల్లవి రాసిన కథను ఆ పోటీకి పంపించారు.

విజయం కోసం వేచిచూస్తూ ఉండగా..

ఒకరోజు కవిత టెలివిజన్ చూస్తూ ఉండగా..


ఇందులో ఒక ప్రసారాలను మార్చుతూ ఉండగా..

ఒక ప్రసారాన్ని చూసి ఆశ్చర్యపోయింది..

వెంటనే “ఆదిత్య”.. “ఆదిత్య”.. అని కేకలు వేస్తున్నట్లు ఆదిత్యను పిలిచింది..

ఇంతలో ఆదిత్య, ఏం జరిగిందో అనే కంగారులతో పరుగులు తీస్తూ వచ్చాడు.

ఆదిత్య: ఏంటి కవిత అలా అరిచాను, ఏం జరిగింది?? (ఎంతో కంగారు పడుతూ)

కవిత: ఒకసారి టెలివిజన్ చూడు..


అది చూసిన ఆదిత్య కూడా ఆశ్చర్యపోయాడు..

ఇంతలో కవిత..

కవిత: ఏంటి ఆదిత్య ఇది! పల్లవి కోసం, ప్రసాద్ కేంద్రం వాళ్ళు వాళ్ళు ఎవర్నో అడుగుతున్నారు ఏంటి??


అసలింతకీ ఈ ప్రచారంలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు??

ఆదిత్య: అంటే పల్లవి పుస్తకాన్ని అందరూ చదివారు అన్న మాట, కవిత మన పల్లవి కల నెరవేర్చిసాము, (ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ).

ఆదిత్య మాటలు ఏమీ అర్థం కాలేదు కవితకి..

కవిత: పల్లవి పుస్తకాన్ని అందరూ చదివారని..

ఒక గొప్ప విజయం సాధించిందని..

తన కల నెరవేరిందని..


నాకర్థమైంది ఆదిత్య, కానీ అదంతా చేసింది నువ్వు కదా?? మరి టెలివిజన్ వాళ్ళు ఇంకెవర్నో ప్రచారం చేస్తున్నారు ఏంటి??

ఆదిత్య: కవిత నువ్వు టెలివిజన్ వీక్షిస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడే వస్తాను.

అని కవితకు చెప్పి ఎంతో కంగారుగా బయల్దేరాడు.


ఆదిత్య చెప్పినట్లుగానే కవిత పల్లవి కోసం.. తను రాసిన పుస్తకం కోసం.. ప్రసారమవుతున్న ” సంచలనం” అనే ప్రచారాన్ని వీక్షిస్తుంది.

ఆ ప్రసారకేద్రం వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు..

ఆ తల్లిదండ్రులు ఏ సమాధానం ఇవ్వడం లేదు.

ప్రసారకేంద్రం వాళ్ళు: మీ అమ్మాయి మీకు ఇంత పెద్ద ఘనతను తెచ్చినందుకు మీరు ఎలా భావిస్తున్నారు..


తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు అధిష్టించాలని తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో చేస్తారు అలా పల్లవికై మీరేం చేసారు..


“పుట్టగానే ఆశ్రమంలో వదిలేసారు”.. అనే సమాధానం వెనుక నుండి వినిపించింది.

అందరూ ఎవరా అని ఆత్రంగా వెనక్కి తిరిగి చూశారు..

ఆదిత్య నడుచుకుంటూ వారివైపుగా వస్తున్నాడు..

ప్రసారకేంద్రం వాళ్ళు: ఇంతకీ మీరు ఎవరండి???

ఆదిత్య: మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం నేను..

పాపం ఆ తల్లిదండ్రులను అడిగి ఇబ్బంది పెట్టకండి, వారికి ఏమీ తెలియదు.

ఆదిత్య మాటలు వినగానే అందరూ అయోమయంలో పడ్డారు.


ఆదిత్య: మీరు ఏమి తెలుసుకోవలన్న నన్ను అడగండి.

ప్రసారకేంద్ర వాళ్ళు: అసలు మీరు పల్లవికి ఏమి అవుతారు???

ఆదిత్య: నేను పల్లవి మిత్రుడిని.


ప్రసారకేంద్ర వాళ్ళు: మరి వీరిద్దరూ పల్లవికి ఏమి అవుతారు???

ఆదిత్య: పల్లవికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు.. కానీ, పాపం వారికే తెలియదు, పల్లవి ఎవరో అనేది.. ఎలా తెలుస్తుంది అండి, పుట్టిన బిడ్డ కళ్ళు తెరవకమునిపే కాటికి పంపించాలనుకున్న కసాయి వాళ్ళకి.


ఆడపిల్ల పుట్టగానే ఇంట్లో ఎన్నో వెలుగు తెస్తుంది..

సిరి సంపదలను కుమ్మరిస్తుంది..

కుటుంబాన్ని ఆనందాల హరివిల్లు చేస్తుంది..

అని అనుకొనే రోజులు కనుమరుగవుతున్నావి..

ఆడపిల్ల పుట్టగానే పురిట్లోనే ప్రాణంతీస్తున్నారు..

లేదా చెత్త కుప్పలపాలు చేస్తున్నారు..


ఆడపిల్లలు వద్దు..మగాడే ముద్దు..అనేవాళ్ళకి పెట్టాలి హద్దు..

(ఎంతో ఆవేదనని వ్యక్తం చేస్తూ..).

పల్లవి ఎప్పుడు నాతో ఒక మాట అనేది.

“పిల్లలు పుట్టగానే ప్రాణం తీస్తున్న ఈ రోజుల్లో, నాకు ఇలా ఒక ఆశ్రమంలో ఆశ్రమాన్ని కలిగించారు అంటే నా తల్లిదండ్రులకు నాపై ఏంత ప్రేమ”.. అనేది ఆ ప్రేమతోనే తనకు వచ్చే ఈ ఫనత అంత తన తల్లిదండ్రులకే దక్కాలని కథ చివరిలో తన చిరునామాకి బదులుగా తన తల్లిదండ్రులు చిరునామా రాయమని నాకు చెప్పింది..

ప్రసారకేంద్ర వాళ్ళు: అంటే ఆ కథని మీరే రాసారా???

ఆదిత్య: లేదు పల్లవినే రాసింది.


ఈ మాటలన్నీ విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు..

తన బిడ్డను ఎలా అయినా చూడాలని రోధీంచారు, ప్రసారకేద్రం వాళ్ళు కూడా పల్లవి అసలు ఎక్కడుంది మాకు చూడలని ఉంది దయచేసి చెప్పండి అని ఆదిత్యను వేడూకున్నారు.

ఆదిత్య సరే చూపిస్తాను నాతో రండి అని అన్నాడు.


అవన్నీ వీక్షిస్తున్న కవిత అయోమయంలో పడిపోయింది..

పల్లవి చనిపోయి చాలా కాలమైంది, కానీ ఆదిత్య తనని వారికి ఎలా చూపిస్తాను అంటున్నాడు. నాకసలు ఏం అర్థం కావడం లేదు అని అనుకుంది కవిత మనసులో..

ఇంతలో ఆదిత్య వారందరినీ కవిత వద్దకు తీసుకునివచ్చాడు.

కవిత ఆదిత్యని చూడగానే ఆవేశంలో..


కవిత: ఏంటి ఆదిత్య పల్లవి చనిపోయింది కదా! మరి ఇప్పుడు వీళ్ళందరికీ తనని ఎలా చూపిస్తావు.

కవిత మాటలు అందరిని స్తంభింపజేసాయి.

తల్లిదండ్రులు: కన్నీరు కారుస్తూ మరి మాతో పల్లవిని చూపిస్తాను అన్నావు కద బాబు, దయజేసి నా కుతురిని నాకు చూపించు, మేము చేసిన తప్పుకి తనని క్షమాపణ అడగాలి అని ఆదిత్యను పట్టుకొని ఎంతో రోదించింది ఆ తల్లి.


ఆదిత్య: చూడండి అమ్మ ఇకనుండి మీకు నాకు మన అందరికీ తినే పల్లవి.

అని కవితను చూపించాడు.

ఎందుకంటే కవిత ప్రతి గుండెచప్పుడులోనూ పల్లవి బ్రతికేవుంది..

నాతోనే ఉంది..


ఇకనుండి నువ్వు కవితవుకావు పల్లవివి అని కవితని పల్లవిగా ఈ లోకానికి పరిచయం చేశాడు.

ఆ తల్లిదండ్రులు కవితని తమ కూతురు పల్లవిగా గుండెకు హత్తుకున్నారు..

ఆడపిల్ల విలువ తెలుసుకున్నారు..


పిల్లలను కనకున్న పర్వాలేదు కానీ, కని అనాధలను చేయకండి..

వారి బ్రతుకులను బలితీయకండి..

అందరూ ఉన్న అనాథలను చెయ్యకండి..

***

A. రాధాకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: A. రాధికా కృష్ణన్

నా ఆలోచనలకు పదును పెట్టాను...

అక్షరమాలను సైతం చుట్టాను..‌.

ఎన్నో పదాలను జల్లెడ పట్టాను...

కమ్మని కవితగా కూడగట్టాను...

కవితతో ఎన్నో హృదయపు తలుపులను తట్టాను...

తట్టిన మదిలో మొదటి స్థానాన్ని కొట్టాను...

కలంతో కవితలకు కమ్మని కావ్యాలను కానుకగా ఇవ్వడానికే పుట్టాను...

-RADHIKAKRISHNA AADARI


189 views0 comments

Commentaires


bottom of page