శ్రీలేఖ తీర్చిన సమస్య
- P. V. Padmavathi Madhu Nivrithi

- 1 day ago
- 4 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #శ్రీలేఖతీర్చినసమస్య, #SreelekhaTheerchinaSamasya, #TeluguChildrenStories, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Sreelekha Theerchina Samasya - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 22/01/2026
శ్రీలేఖ తీర్చిన సమస్య - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు. ఇద్దరూ చదువులు ముగించుకొని ప్రయోజకులుగా మారారు. ఇద్దరూ తెలివైన, చురుకైనవారు, గుణవంతులు, శక్తియుక్తులు కలవారు.
తన వ్యాపారం ఎవరి చేతిలో పెట్టాలో తేల్చుకోలేకపోయాడు ఆ వ్యాపారి.
2)
ఎందరినో అడిగాడు. ఎవరూ చెప్పలేకపోయారు.
3)
ఒకసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు.
స్నేహితుడు ఇద్దరు కొడుకులను ఎన్నో రీతుల్లో పరీక్షించాడు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లు తోచింది. ఏదీ నిర్ధారించలేకపోయాడు.
4)
అప్పుడే అక్కడికి పలహారం ప్లేట్లతో వచ్చిన స్నేహితుడి కూతురు, వారిద్దరికీ పలహారం ఇస్తూ ఉంటే, ప్లేట్ కింద పడిపోయింది.
ఒకటిచ్చింది చెంపపై ఇద్దరు కొడుకులను.
ఒక కొడుకు చిన్నగా నవ్వుతూ, "నన్ను క్షమించు" అన్నాడు.
ఇంకో కొడుకు,
"నువ్వు పలహారం ఒలకబోసి నన్ను కొడతావా? ఏది ధర్మం? ఏది న్యాయం?" అన్నాడు కోపంగా.
2)
నవ్వి... "క్షమించు" అని చెప్పిన కొడుకు చేతిలో వ్యాపార నిర్వహణ పెట్టమని శ్రీలేఖ వ్యాపారికి సూచన చేసింది.
"ఏది ధర్మం ఏది న్యాయం?" అన్న కొడుకుని, ఆ వ్యాపారంలోనే, సరుకు నాణ్యత చూసే బాధ్యత - ఉద్యోగం - శాఖలో పెట్టమని సూచించింది.
అక్కడ చేరిన వారందరూ శ్రీలేఖను ప్రశ్నార్థకంగా చూస్తుంటే, ఇలా అంది చిరునవ్వుతో...
"వ్యాపారం విజయం సాధించాలంటే... కోపం ఉండకూడదు, నాణ్యత తగ్గకూడదు."
"బలం, అనుకూలత, శక్తి యుక్తులను బట్టి వ్యక్తులను ఆయా శాఖలలో, ఉద్యోగాలలో నియమించాలి."
"స్నేహపూరిత, శాంతమైన, చల్లని తత్వం, అనుకూలత, నియమం లేక అనుకూల పని ఇచ్చుట వ్యక్తి బలం బట్టి, మరియు సరుకు - సేవ నాణ్యత, తరచు మంచి శిక్షణ ఇవ్వడం అందరికీ... అన్నీ అవసరమే"... అని వ్యాపార విజయ రహస్యాన్ని పురి విప్పింది శ్రీలేఖ.
3)
అక్కడ చేరిన వారందరూ శ్రీలేఖ తెలివిని - చతురతను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
వారందరూ అప్పటికప్పుడే, అక్కడకక్కడే, ఏకగ్రీవంగా శ్రీలేఖను ఆ వ్యాపార సంస్థ సలహాదారురాలుగా నియమించారు.
4)
త్వరలో... ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పురోగతి, అభివృద్ధి, అభ్యుదయం చెందింది. వర్ధిల్లింది. ధనార్జనతో పాటు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చింది అక్కడి వారందరికీ.
5)
త్వరలో... శ్రీలేఖ తన చాతుర్యంతో అంతర్జాతీయ సలహాదారురాలు - మేనేజర్ అయింది. ధనార్జనతో పాటు అంతర్జాతీయ కీర్తి ప్రతిష్ఠలు పొందింది - గడించింది.
6)
త్వరలో శ్రీలేఖ (వ్యాపారి స్నేహితుడి కూతురు)
అంతర్జాతీయ (ప్రపంచ) ఆబ్జెక్టివ్స్ క్విజ్ టీచర్ల బృందంగా
+
ప్రపంచ సంతోషపూరిత (WIN-WIN ఆనందదాయక పరిష్కారాల తీరు) నిర్వాహకురాలుగా
+
ప్రపంచ మంచి - మానవత్వం - నిర్మాణాత్మక ఆలోచనలు కలిగిన సలహాదారులుగా
పేరు గడించింది... అందరికీ సహాయం చేస్తూ... నిర్మల హృదయంతో... దయ, పట్టుదల, దీక్ష, ఓర్పు, సహనం, సహాయశీలి తత్వం, నేర్పు, చతురతతో.
VERY SOON, Shreelekha became
World Objectives Quiz Teachers TEAM
+
International HAPPY development -WIN-WIN JOYFUL success SOLUTIONS managers TEAM
+
World Counselors TEAM
VIA KINDNESS + smartness + helping nature + HAPPY Development - CONSTRUCTIVE attitude.
--------- చిన్న కథ సమాప్తం -----------
నీతి:
ఆపదలో ఉపాయం అవసరం... దిగులు కాదు.
తర్కంతో ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చు... అనుకున్నది సాధించవచ్చు.
వ్యాపార విజయానికి - మేనేజర్‌కు అవసరం:
కోపం లేని స్నేహ తత్వం
శాంతి - చల్లని స్వభావం
నాణ్యత గల సరుకులు
నిజాయితీ
కొనుగోలుదారుల వైపు "మంచి సేవ" గుణం
అనుకూలత నియమం లేక అనుకూల పని ఇచ్చుట వ్యక్తి బలం బట్టి
4.
వ్యాపారం విజయానికి - మేనేజర్‌కు తెలియాల్సింది:
ఎవరి బలం - అనుకూలత ఏమిటి???
ఎక్కడ ఉపయోగపడుతుంది???
ఎక్కడ ఎవరిని నియమించాలి ???
ఎలా మంచి శిక్షణ ఇవ్వాలి - ఇప్పించాలి... తరచు... ఉద్యోగులకు... అన్ని విషయాలలో ???... అనే నేర్పు అవసరం.
--------- చిన్న కథ: నీతి సమాప్తం -----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments