top of page
Original.png

శ్రీరామ వాత్సల్య చిహ్నం


రామసేతు నిర్మాణ సమయంలో ఉడుతను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్న శ్రీరాముడు, ఉడుత వీపుపై తన వేళ్ల గుర్తులు ప్రసాదిస్తున్న దివ్య దృశ్యం.
రామసేతు నిర్మాణ సమయంలో ఉడుతను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్న శ్రీరాముడు, ఉడుత వీపుపై తన వేళ్ల గుర్తులు ప్రసాదిస్తున్న దివ్య దృశ్యం.

Srirama Vatsalya Chihnam Telugu Special Article | Ganti Subrahmanya Sarma  

శ్రీరామ వాత్సల్య చిహ్నం - తెలుగు ప్రత్యేక వ్యాసం | గంటి సుబ్రహ్మణ్య శర్మ

Published in manatelugukathalu.com on 07/06/2026


ఎన్ని మార్లు విన్నా, మరెన్ని మార్లు పఠించినా, ఎప్పటికీ రామాయణ కథ, కావ్యాలు, జనజీవన జాగృతమూ, జీవన్ముక్తి కారకము అనేది జగద్విదితం. భూమిపై పుట్టిన జీవరాశుల్లో అత్యంత ముఖ్యమైనది, చాలా అరుదైనది మానవ జన్మ మాత్రమే. అందుకే “జంతూనాం నరజన్మ దుర్లభం” అనేది కావ్యోక్తి.


అంటే ఈ భూలోకంలోని ప్రాణులలో మానవజన్మ లభించటం చాలా గొప్ప అదృష్టం అని వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ భూలోకంలో మానవుడిగా జన్మించిన వారు అసలు ఈ లోకంలో ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఈ లోకంలో నేను ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నాను అనే ముఖ్య ఉద్దేశ్యాన్ని, జన్మ రహస్యాన్ని తెలుసుకోకుండానే చనిపోయి, తిరిగి మరలా జన్మిస్తున్నారు.


ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నట్లు చెప్పబడినా, అందులో ముక్తిని, మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్న ఏకైక జీవి మానవుడు మాత్రమే. అంటే మిగిలిన జీవుల్లో ముక్తి పొందేవి లేవని కాదు. కానీ ఇతర జీవుల కంటే, ముక్తిని, మోక్షాన్ని పొంది, ఆ భగవంతుడిలో ఐక్యమై, మరొక జన్మలేని, జన్మ రాహిత్యాన్ని, అనగా మోక్షాన్ని పొందాలంటే అందుకు ఏకైక సాధనం ఈ మానవజన్మ మాత్రమే.


అన్ని ఇతర జీవరాసులూ కూడా తొలుత మానవజన్మకు కృషి చేసి, అది సాధించిన తరువాతనే మోక్ష మార్గాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అని గరుడ పురాణం చెబుతుంది.


మానవ జన్మ దేవతలకు కూడా అత్యంత ఇష్టమైన జన్మ. ఎందుకంటే ఆ మానవజన్మలో మానవులు చిత్తశుద్ధితో, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే, భగవంతుడు తన దివ్యప్రేమానురాగాలని అందిస్తాడు, మరియు మోక్ష సాధనకు అనువైన మార్గం అనేది మన సిద్ధాంతం. కాబట్టి, మన జీవితం ఆ దిశగా ముందుకు సాగాలంటే మనం చేసే ప్రతి పనిలోనూ ధర్మ దీక్ష తప్పనిసరి కావాలి. అంటే మనం ఆచరించే ప్రతీ పనినీ, స్వార్థ చింతనతో కాక, నిరంతర న్యాయ మార్గంలో ముందుకు సాగాలి.


ఏ పనిలో అయినా విజయం సాధించాలి అంటే అందుకు ధర్మమార్గము లేదా ధర్మ దీక్ష అనే రెండు మార్గాలు కావాలి. అటువంటి ధర్మం, దానికోసం చేసే దీక్ష కూడా మానవులకు వారి ఆముష్మిక శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

రామాయణ పుణ్య కాలంలో యావత్తు వానర సైన్యం రావణ లంకలో బందీ అయిన సీతామహసాధ్వి కొరకు వారధి నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు.


వారి కృషికి తోడు, ఒక చిన్న ఉడుత తన బుల్లి నోటితో చిన్న చిన్న రాళ్లను, తన చిన్న తోకను నీటిలో తడిపి, దానికి అంటిన ఇసుకను నీటిలో వేస్తూ తాను కూడా రామకార్యంలో భాగం కావడాన్ని తొలుత సుగ్రీవుడు గమనించాడు. అనంతరం ఆయన ఆ విషయాన్ని శ్రీరాముడికి విన్నవించగా, ఆ పావన రాముడు ఆ ఉడుత శరీరాన్ని తన చేతితో పట్టుకొని వాత్సల్యంతో నిమిరినపుడు, ఆ ఉడుత వీపుపై శ్రీరామ చేతి వేళ్ల ఆనవాళ్లు పడి, ఆ తరువాత శాశ్వతంగా ఉండిపోయాయి. దాని ఫలితమే ఆ ఉడుత జాతి అంతా శ్రీరామ స్పర్శా చిహ్నాలతో నేటికీ అలరారుతూ ఉండడం, ధర్మదీక్షా ఫలితమే.


ఉడుత ఈ సృష్టిలో అల్ప ప్రాణి అయినా కూడా, అది తన జీవితకాలంలో మనకు చేసే సాయం, మనం ఇతర మానవులకు చేసే సాయం కన్నా కూడా ఎంతో గొప్పది. ఆహారంలో లభించే గіంజలను, ఇతర విత్తనాలను తాను తిన్నంత తిని, తన రెండు నోటి దవడల మధ్య నింపుకొని, భూమిలో చిన్న చిన్న గుంటలను తవ్వి అందులో దాచుకొని, తర్వాత ఆయా ప్రదేశాలను తనే మరచిపోతుంది. కాలక్రమంలో అవి మొక్కలుగా ఎదిగి వృక్షాలవుతాయి.


ఆ విధంగా ఒక ఉడుత ద్వారా ఏర్పడే వృక్షాలు వందల సంఖ్యలో ఉండడం అత్యంత అరుదైనదే కాక ఆశ్చర్యం కూడా. అందుకే ఈ కాలంలో కూడా ఉడుతలను ప్రేమించేవారు, పూజించే వారు ఉంటారు. ఉడుత శకునం కానీ, దర్శనం కానీ అదృష్టంగా కూడా భావిస్తారు. అందుకే ఈ ఉడుత దర్శనం, దానికి అందించే ఆహారం కూడా మానవులకు భక్తి, ముక్తి మార్గాన్ని, నిరంతర శ్రీరామ ప్రేమ మార్గాన్ని నిర్దేశిస్తాయి.


@@@@@@@@@


గంటి సుబ్రహ్మణ్య శర్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

గంటి సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర ప్రదేశ్ న్యాయ శాఖలో 34 సంవత్సరాలు ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే, న్యాయ శాఖలో పని చేసిన అనుభవంతో, అమలాపురం లో తొలిసారిగా ఏర్పాటైన సాయంకాల న్యాయ కళాశాలలో, గౌరవ జిల్లాకోర్టు రాజమహేంద్రవరం వారి అనుమతి పొంది, బీ ఎల్ పట్టా సాధించారు.  అనంతరం మరలా వారి అనుమతి తోనే ఎల్ ఎల్ ఎమ్ కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా పూర్తి చేసారు. అదేవిధంగా హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ నుండి “సైబర్ లా” లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసారు.  కాకినాడ, రాజమండ్రి కోర్టులలోనూ, అమరావతి, హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.  ప్రస్తుతం అమరావతి హై కోర్టు బార్ అసోసియేషన్ లో జీవితకాల న్యాయవాద సభ్యులుగా ఉన్నారు.

ఉద్యోగంలోనూ, ఆ తరువాత కూడా వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు.  న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 3 out of 5 stars.

Nice

Like
bottom of page