ఒక మాట
ఒక మాట, మంచి మాట, మాటల విలువ, ప్రేరణాత్మక వ్యాసం, వ్యక్తిత్వ వికాసం, జీవన విలువలు, తెలుగు వ్యాసం, కొత్త విరిత

Oka Mata - Telugu Inspirational Article | Kotha Viritha
ఒక మాట - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 25/07/2026
మనం సహజంగా మాట్లాడే ఒక చిన్న మాట... ఎదుటివారి జీవితంలో గొప్ప మార్పుకు కారణం కావచ్చు. ప్రతి వ్యక్తి తనలో తాను ఎన్నో సమస్యలు, సందేహాలు, బాధలతో ప్రయాణిస్తున్న సమయంలో మనం చెప్పే ఒక ప్రోత్సాహకరమైన మాట వారికి ఆశను, ధైర్యాన్ని, కొత్త దారిని చూపించగలదు. 'ఒక మాట' అనే ఈ హృదయాన్ని తాకే వ్యాసం మాటల విలువను, వాటి ప్రభావాన్ని ఎంతో సరళంగా కానీ లోతుగా వివరిస్తుంది.
కొంతమందికి అది కేవలం క్యాజువల్‌గా మాట్లాడిన మాట.
మరికొంతమందికి అదే జీవితాన్ని మార్చే పరిష్కారం.
మనం మరిచిపోయే వాక్యం, ఎదుటివారు జీవితాంతం గుర్తుంచుకోవచ్చు.
ఎందుకంటే ప్రతి మనిషి తన తన సమస్యలతో ప్రయాణిస్తుంటాడు.
నీకు సాధారణంగా అనిపించిన ఆలోచన, వారికి కొత్త దారిని చూపించవచ్చు.
నీకు చిన్న సూచనగా అనిపించిన మాట, వారికి పెద్ద ధైర్యం ఇవ్వవచ్చు.
ఒక్కోసారి మనం చెప్పిన మాటలోనే వారికి ఆశ కనిపిస్తుంది.
మరోసారి అదే మాటలో వారికి సమాధానం దొరుకుతుంది.
అందుకే మంచి మాట ఎప్పుడూ చిన్నది కాదు.
అది ఎవరి జీవితంలో ఏ పాత్ర పోషిస్తుందో మనకు తెలియదు.
ఒక చిరునవ్వు బాధను తగ్గించగలదు.
ఒక ప్రోత్సాహం అడుగులు ముందుకు వేయించగలదు.
ఒక అనుభవం, మరొకరి సందేహాన్ని తొలగించగలదు.
మన మాటలు మనకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి.
అవి ఎవరి మనసులో ఎంతకాలం నిలుస్తాయో కూడా చెప్పలేం.
అందుకే మాట్లాడే ముందు మాటను తూచా తప్పకుండా ఎంచుకోవాలి.
ఎందుకంటే మంచి మాటకు ఖర్చు ఉండదు.
కానీ దాని విలువ మాత్రం అమూల్యం.
ఒక మాట... ఒక మనసుకు ఆశ కావచ్చు.
నీకు సాధారణ సంభాషణ... వారికి అసాధారణ పరిష్కారం.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Nice, ఎదుటివారి ముందు పాజిటివ్ గా మాట్లాడటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
👌
Stunning post!