స్థిత ప్రజ్ఞత—సాధన మార్గం
- Ganti Subrahmanya Sarma

- 2 days ago
- 2 min read
Sthitha Prajnatha - Sadhana Margam - Telugu Special Article | Ganti Subrahmanya Sarma
స్థిత ప్రజ్ఞత—సాధన మార్గం - తెలుగు ప్రత్యేక వ్యాసం | గంటి సుబ్రహ్మణ్య శర్మ
Published in manatelugukathalu.com on 09/08/2026
జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనసు కలత చెందడం సహజం. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోవడం, విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోవడం కూడా మానవ సహజ స్వభావమే. అయితే ఏ పరిస్థితి ఎదురైనా మనసు యొక్క సమతౌల్యాన్ని కోల్పోకుండా ఉండగలగడం ఒక గొప్ప సాధన.
అదే స్థిత ప్రజ్ఞత.
మానవ జీవనం నది వలే ప్రవహించినా, ఏటికి ఎదురీదుతూ కాలం గడపడం కూడా ఎల్లకాలం వీలుపడక పోవచ్చు. కానీ జీవితపు ఆటుపోట్లను సమభావంతో స్వీకరిస్తూ, అదురు బెదురు లేకుండా జీవించగలిగేవారే స్థితప్రజ్ఞులు కాగలరు. ఇంకా సరళ భావంలో చెప్పాలంటే నిజ జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను సమభావంతోనూ, శాంతబుద్ధితోనూ, స్వీకరించడమే స్థితప్రజ్ఞత అవుతుంది.
మానవులు ఎల్లప్పుడూ తమతమ స్వభావ రీత్యాగానీ, ఇతరులు కావించే దూషణ భూషణ తిరస్కారాల ద్వారా కానీ, లేదా మరే ఇతర ఐహిక వాంఛల పట్ల కానీ చలించక, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనసు యొక్క సమతౌల్యతను కోల్పోకుండా ఉండటమే స్థిత ప్రజ్ఞత అవుతుంది.
గీతాధర్మం కూడా స్థిత ప్రజ్ఞత ఆవశ్యకతనీ, దానిని సాధించే మార్గాలను వివరిస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ స్థితప్రజ్ఞత, దానిని సాధించడానికి గలమార్గాలను సూచించాడు. ఆ మార్గాలు ఏమిటంటే, ఇంద్రియ నిగ్రహం, నిష్కామకర్మ, ఆత్మతత్వ విచారణ, సాత్వికాహార స్వీకరణ, సాధారణ జీవన శైలి, ధ్యానయోగ మార్గము, సరయిన గురూపదేశము మొదలైనవి.
“స్థిత ప్రజ్ఞుడు” అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు తెలుగులో దీని అర్థం “స్థిరమైన బుద్ధి గలవాడు” లేదా “సమచిత్తం కలిగిన వ్యక్తి” అని. ఈ పదం ముఖ్యంగా భగవద్గీతలో వాడబడింది, అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక స్థితప్రజ్ఞుడి లక్షణాలను వివరిస్తాడు (అధ్యాయం 2, శ్లోకం 54-72).
అదేవిధంగా గౌతమ బుద్ధుడు తన అష్టాంగ మార్గాన్ని అనగా సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, మరియు సమ్యక్ సమాధి వంటి వాటిని తాను స్వయంగా ఆచారిస్తూ, తద్వారా స్థిత ప్రజ్ఞతను సాధించి, ఇతరులకు ఆ మార్గాన్ని నిర్దేశించడం ఒక గొప్ప చారిత్రక వాస్తవం.
స్థిత ప్రజ్ఞతను కలిగి ఉండటం అంటే కేవలం మనోభావాలను అణచుకోవడమే కాక, అన్ని కాలమాన పరిస్థితులను, వాటి నిజమైన దృక్కోణం లో చూడగలగడమే!
అనగా సుఖదుఃఖాలను, భోగదారిద్ర్యాలను, దూషణ భూషణలను, సమభావంతో స్వీకరిస్తూ, విపత్కర పరిస్థితుల్లో కూడా శాంత స్వభావాన్ని ప్రదర్శిస్తూ, స్వీయ నియంత్రణ, విచక్షణలను పాటిస్తూ ముందుకు సాగడమే స్థిత ప్రజ్ఞత అవుతుంది. అటువంటి వారే స్థిత ప్రజ్ఞులు కాగలరు. ఇంకా తత్వవిచారణ, సాత్వికాహారస్వీకరణ, సర్వమానవ సమానత్వము, సర్వజీవకోటి పరిరక్షణ వంటి అంశాలు కూడా మానవులను స్థిత ప్రజ్ఞులు కావిస్తూ, వారిని మహనీయుల బాట పట్టిస్తాయి.
@@@@@@@@@
గంటి సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
గంటి సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర ప్రదేశ్ న్యాయ శాఖలో 34 సంవత్సరాలు ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే, న్యాయ శాఖలో పని చేసిన అనుభవంతో, అమలాపురం లో తొలిసారిగా ఏర్పాటైన సాయంకాల న్యాయ కళాశాలలో, గౌరవ జిల్లాకోర్టు రాజమహేంద్రవరం వారి అనుమతి పొంది, బీ ఎల్ పట్టా సాధించారు. అనంతరం మరలా వారి అనుమతి తోనే ఎల్ ఎల్ ఎమ్ కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా పూర్తి చేసారు. అదేవిధంగా హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ నుండి “సైబర్ లా” లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసారు. కాకినాడ, రాజమండ్రి కోర్టులలోనూ, అమరావతి, హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి హై కోర్టు బార్ అసోసియేషన్ లో జీవితకాల న్యాయవాద సభ్యులుగా ఉన్నారు.
ఉద్యోగంలోనూ, ఆ తరువాత కూడా వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు. న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు.







Comments