సూక్తి చంద్రిక - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna
- May 5
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #సూక్తిచంద్రిక, #SukthiChandrika, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

సోమన్న "సూక్తి చంద్రిక" పుస్తకావిష్కరణ ఎర్నాకులం, కేరళలో
Sukthi Chandrika Pusthakavishkarana - Book Unveiling ceremony At Ernakulam - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/05/2025
సూక్తి చంద్రిక పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
పెద్దకడబూర్ మండల పరిధిలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు డా. గద్వాల సోమన్న 68వ పుస్తకం "సూక్తి చంద్రిక" పుస్తకావిష్కరణ అలువా, ఎర్నాకులం జిల్లా, కేరళ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ఫా. సన్నీ జోసఫ్ ఇటలీ వారి సిల్వర్ జూబ్లీ మహోత్సవం సందర్భంగా ప్రావిన్షియల్ రెవ. ఫా. క్రీస్తురాజు, ఫా. సన్నీ జోసఫ్ విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఆవిష్కరించారు. అనంతరం అనతి కాల పరిధిలో 68 పుస్తకాలు రచించిన గద్వాల సోమన్నను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యన్. జోజప్ప, ప్రభుదాస్, సుశీ రాజు, యం. జోజప్ప, చార్లెస్, జార్జి, బాలస్వామి, బి. జోసఫ్, రాజేష్, రత్నాకర్, అశోక్ మున్నగు వారు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
-గద్వాల సోమన్న
Comments