top of page

దేవకన్య.. కిడ్నాప్.. మెసేజ్ ఓవర్

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #DevakanyaKidnapMessageOver 

#దేవకన్యకిడ్నాప్..మెసేజ్ఓవర్, #TeluguChildrenStories, #TeluguMoralStories, #నైతికకథలు, #కొసమెరుపు

Devakanya Kidnap Message Over - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 05/05/2025

దేవకన్య.. కిడ్నాప్.. మెసేజ్ ఓవర్ - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)


"దేవకన్య.. కిడ్నాప్.. మెసేజ్ ఓవర్".. అనే మాటలు పోలీస్ జీప్ లో ఉన్న "టెలిఫోన్ కాల్స్ ట్రేసర్ 

ట్రాకర్ పరికరం - యంత్రం" యొక్క లౌడ్ స్పీకర్ నుండి వెలువడింది. 


అదో కొత్త నూతన సాంకేతికత అయిన ఎ. ఐ (AI) తో కనుగొన్న సైంటిఫిక్ ఫోన్ కాల్ మాటలు పట్టేసే పరికరం. 


500 (5 వంద) మీటర్ల దగ్గర - దూరం.. లోపు.. వచ్చిన ఫోన్ కాల్స్ పట్టేయగలదు.. ట్రాక్ - ట్రేస్ చేయగలదు. 


చుట్టూ చూసారు పోలీస్ లు. అప్పుడే తమ పోలీస్ జీప్ పక్క నుండి దూసుక పోయిన 'తెల్ల కార్' నుండి వచ్చిన టెలిఫోన్ కాల్ శబ్దాలు అని రూడీ.. నిర్ధారణ అయిపోయింది. 



2)

వెంటనే జీప్ స్టార్ట్ చేసారు పోలీసులు. 


తెల్ల కార్ ముందుకు దూసుకు పోతుంది. 


పోలీస్ జీప్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. 



500 మీటర్ల లోపు దూరంలో వచ్చారు కార్ కి. 


"నన్ను కాపాడండి" అంటూ పెడ బొబ్బలు, అరుపులు, ఏడ్పులు.. ఆడ కంఠం నుండి.. వినిపిస్తున్నాయి.. ఆ తెల్ల కార్ నుండి. 



3)

తెల్ల కార్ లోని వారు పోలీస్ జీప్ ను గమనించారేమో.. మెయిన్ రోడ్ వదిలేసి.. కుడి సందు, - గల్లీ లోకి మలుపు తిప్పారు కార్ ను. 



జీప్ కూడా ఆ సందు రాగానే.. కుడి కి మలుపు తిప్పింది. 


ఎక్కడా కార్ కనిపించలేదు. 


కాస్త దూరంగా పోనిస్తే.. దూరంగా మళ్లీ మెయిన్ రోడ్ మీద ఆ కార్ కనిపించింది. 



పోలీస్ జీప్ డ్రైవర్ స్పీడ్ పెంచాడు. 


మళ్లీ పోలీస్ జీప్ 500 మీటర్ల లోపు దూరంలో వచ్చింది తెల్ల కార్ కి. 


మళ్లీ స్త్రీ ఆర్తనాదాలు వినిపించాయి, "నన్ను ఏమీ చేయకండి.. మీకు దండం పెడతాను.. " అని. 



4)

పోలీస్ జీప్ దగ్గర పడటం రేర్ వ్యూ మిర్రర్ (వెనుక దృశ్యం కనిపించే అద్దం) లో పడిగట్టారేమో.. మళ్లీ తెల్ల కార్ స్పీడ్ పెంచింది. 


దూరంగా వెళ్ళిపోయింది జీప్ కి. 


ఈ సారి యెడమ వైపు సందులో తిప్పారు తెల్ల కార్ ను. 


5)


పోలీస్ జీప్ కూడా ఆ సందు రాగానే యెడమ వైపు తిరిగింది. 


ఎక్కడా కార్ ఆచూకీ లేదు. 


అన్ని వైపులా చూసారు. ఏ సందు లో గాని కనపడ లేదు. 


మెయిన్ రోడ్ కి తిప్పారు పోలీస్ జీప్ నీ. 


దూరంగా తెల్ల కార్ కనబడింది. 

 

అంటే తెల్ల కార్ లో ఉన్న కిడ్నాపర్ల డ్రైవర్ చాలా చాక చక్యంగా కార్ నడుపుతున్నాడు. 


6)


పోలీస్ జీప్ వేగం పెంచింది. 


500 మీటర్ల దూరం లోపే చేరువ అయ్యింది తెల్ల కార్. 


ఈ సారి ఇలా వినిపించింది పోలీసుల కు తమ జీప్ లో ఉన్న "టెలిఫోన్ వాయిస్ - ట్రాకర్' నుండి.. ఆడ కంఠం.. 


"మీకు ఎంత ధనం కావాలన్నా ఇస్తాను.. నన్ను ఇక్కడే వదిలిపెట్టండి.. ఏమీ చేయవద్దు.. " అని ఆర్ధనాధాలు.. అదే స్త్రీ కంట ధ్వనిలో. 



7) 

తెల్ల కార్ మళ్లీ కుడి వైపు సందులోకి తిరిగింది. 


పోలీస్ జీప్ సందు లోకి తిరిగింది కానీ.. కార్ జాడ యే లేదు.. సందులలో గాని, మెయిన్ రోడ్ మీద గాని. 



8)

పోలీసులు భద్రంగా అన్నీ సందుకలో చూస్తూ.. మెయిన్ రోడ్ లోకి వచ్చి పడ్డారు మళ్లీ. 


ముందుకు పోనిచ్చాడు జీప్ డ్రైవర్ వాయు వేగంతో. 


పది నిముషాలు గడిచాయి. తెల్ల కార్ జాడ యే. లేదు. 


ఇంకొంచం ముందు పోనిచ్చాడు జీప్ డ్రైవర్. 


మెయిన్ రోడ్ మీద ఎక్కడా కార్ కనపడ లేదు. 


ఇంకాస్త ముందుకు వెళితే.. కుడి వైపు సందులో కార్ ఆగి ఉన్నది, ఒక బంగ్లా ముందు. 


9)

పోలీస్ జీప్ ఆపారు ఒక గోడ పక్కగా.. కార్ లోని వారికి కనపడకుండా. 


అందరూ కార్ లోనే ఉన్నారు.. ఇద్దరు ముందు వరస సీట్లలో.. నలుగురు వెనక సీట్ వరుసలో. 


పోలీసులు జీప్ దిగారు. 



నిశ్శబ్ధంగా ముందుకు సాగారు.. ప్రాకారు అనటం సబబు.. పిస్తొల్లు చేతిలో పెట్టుకొని. 


కార్ ను చేరుకోగానే.. తలుపులు తెరిచారు. 

ఆశ్చర్యం! వెంటనే తెరుచు కున్నాయి. అంటే లాక్ చేయలేదు కార్ తలుపులు. 


అందులో 5 గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి.. చిరునవ్వుతో.. స్నేహితుల్లా మాట్లాడుకుంటూ కనిపించారు. 


ఈ సారి పోలీసులు ఆశ్చర్య పోయారు. 


10)


"మీ కార్ ఫోన్ నుండి.. "దేవ కన్య - కిడ్నాప్.. మెసేజ్ ఓవర్.. " అనే శబ్దాలు వినిపించాయి.. మా జీప్ లోని 'ఫోన్ ట్రేసర్ యంత్రం' లో'".. పోలీసులు అస్సలు విషయం చెప్పారు.. పిస్తోలు దించకుండా. 


అబ్బాయిలకు అప్పుడు విషయం అర్థం అయ్యింది. 


ఆ కార్ పక్క ఉన్న బంగ్లా వైపు వేలు చూపించారు. 


పోలీసులు అటు చూస్తే.. అది ఓ సినిమా థియేటర్ హల్. 

దాని (ఆ థియేటర్) పేరు దేవకన్య. అందులో కిడ్నాప్ అనే సినిమా నడుస్తుంది. 


ఆ సినిమా పోస్టర్ లు సృష్టం చెబుతూనే ఉన్నది ఆ విషయం. 


పోలీసులు విస్తూ పోయారు. 



11)

"మరి ఆ ఆర్తనాదాలు ఓ ఆడ కంఠం ది.. " పోలీసులు పిస్తోల్ దింపకుండా నే అడిగారు కార్లో ఉన్న 5 గురు అబ్బాయిలను మరియు ఒక్క అమ్మాయిని. 


ఆ అమ్మాయి పక పక నవ్వింది. కార్ లోని రేడియో స్విచ్ ఆన్ చేసింది. 

అందులో సినిమా వస్తుంది.. అక్కడ నుండి ఓ అమ్మాయి ఆర్తనాదాలు.. ఆ సినిమా లోని శబ్దాలు. 



పోలీసులకు ఇంకా అనుమానం పోలేదు. 


"మరి ఇంత స్పీడ్ లో కార్ ఎందుకు నడిపించారు.. సందులలో కార్ ను తిప్పుతూ.. "


ఈ సారి అమ్మాయి, 5 గురు అబ్బాయిలు గట్టిగా నవ్వారు చేతి వాచీ చూపిస్తూ. 


సినిమా మాటినీ ఆట మధ్యానం 2 గంటలకు.. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి కార్ ను వేగంగా నడిపించారు.. అన్న మాట. 



"మరి.. ఇంకా కార్ లోనే ఎందుకు కూర్చున్నారు?".. పోలీసులకు అనుమానం ఇంకా పోలేదు. 


అంతలో ఆ తెల్ల కార్ లోని వారు ఫోన్ చేసిన స్నేహితులు ఇంకో (నీలం రంగు) కార్ లో వచ్చారు. "హాయ్ హాయ్.. " అనిచెప్పుకున్నారు. 


వెంటనే 5 అబ్బాయిలు, ఆ అమ్మాయి.. తెల్ల కార్ దిగి.. నీలం కార్లో నుండి దిగిన స్నేహితులతో.. ' దేవకన్య ' సినిమా హాల్ (థియేటర్) లోకి వెళ్ళిపోయారు.. 'కిడ్నాప్' సినిమా చూడటానికి. 


పోలీసులు చకితం నుండి తేరుకున్నారు.. నవ్వుకున్నారు.. వారి జీప్ లోని ఆధునిక టెక్నాలజీ పరికరం.. '500 మీటర్ల సమీపం లోనీ.. ఫోన్ కాల్ యొక్క ట్రాకర్ - ట్రేసెర్ యంత్రం.. తెచ్చిన తంటాకు. 

 


------ (చిన్న కథ సమాప్తం) ----------


నీతి:

యంత్రాలకు మంచి లు - లాభాలు ఉంటాయి.. తంటాలు కూడా ఉంటాయి. 


------ (చిన్న కథ + నీతి సమాప్తం) ----------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comments


bottom of page