top of page
Original.png

స్వార్థపరుడు


ప్రేమతో పాటు బాధ్యత కూడా అవసరం
ప్రేమతో పాటు బాధ్యత కూడా అవసరం

Swarthaparudu - Telugu Inspirational Story | Mayukha

స్వార్థపరుడు - తెలుగు ప్రేరణాత్మక కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 02/05/2026


ఒక తండ్రి జీవితమంతా సంపాదించినది కేవలం ఆస్తి కాదు—గౌరవం.అయితే, ఒక కొడుకు స్వార్థం ఆ గౌరవాన్ని క్షణాల్లో నేలమట్టం చేయగలదు.

“స్వార్థపరుడు” కథలో రాజయ్య అనే గౌరవనీయ వ్యక్తి తన కొడుకుపై పెట్టుకున్న నమ్మకం ఎలా పరీక్షకు గురైందో,అదే సమయంలో ఒక తప్పు తెలుసుకున్న కొడుకు ఎలా మారాడో భావోద్వేగంగా చూపిస్తుంది.

ఈ కథ మనకు ఒక గొప్ప నిజాన్ని చెబుతుంది:👉 ప్రేమతో పాటు బాధ్యత కూడా అవసరం.


ఒక ఊరిలో రాజయ్య అనే పెద్దమనిషి ఉండేవాడు. అతను పేరుకు తగ్గట్టే ఎంతో ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, నిజాయితీకి మారుపేరుగా ఉండేవాడు. ఆ ఊరిలో రాజయ్య మాట అంటే అందరికీ వేదం. రాజయ్య కూడా ఆ ఊరి ప్రజలందరికీ ఏం సహాయం కావాలన్నా, వారు ఆపదలో ఉన్నా ఆదుకుంటూ ఉండేవాడు.


అతనికి ఒక్కటే కొడుకు, పేరు శ్రీను. రాజయ్య తన కొడుకుని గొప్పవాడిగా చూడాలనే ఉద్దేశంతో పట్నంలో చదివించడం మొదలుపెట్టాడు. కానీ శ్రీను, పట్టణంలోని రంగురంగుల ప్రపంచానికి ఆకర్షితుడై వ్యసనాల పాలయ్యాడు.


తండ్రి పంపించే డబ్బు సరిపోక, తండ్రికి తెలియకుండా తన సొంత ఊరిలో ఉన్న ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టి జల్సాలు చేయడం మొదలుపెట్టాడు.


ఇవేమీ తెలియని రాజయ్య తన కొడుకు పట్టణంలో బాగా చదువుతున్నాడు అనుకుని, అందరికీ కొడుకు గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టాడు. "పండిత పుత్రః పరమ శుంఠః" అన్నట్టుగా మంచితనంతో, అందరికీ ఆదర్శప్రాయుడైన రాజయ్యకి తలవొంపులు తెచ్చేలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇదేమీ తెలియని రాజయ్య కొడుకు గొప్ప ప్రయోజకుడు అవుతాడని ఆశిస్తూ, ఊరి అందరికీ గొప్పగా చెబుతున్నాడు.


ఈ విషయం ఒక్కసారిగా ఊర్లో అందరికీ తెలిసింది. దాంతో రాజయ్య తలెత్తుకుని తిరగలేకపోయాడు. ఎప్పుడూ గౌరవంతో తలెత్తుకుని తిరిగే రాజయ్య, తన కొడుకు చేసిన పనికి అందరి ముందు అవమానంతో కుంగిపోయాడు. గడప దాటి బయటకు రాలేక ఇంట్లోనే కన్నీరుమున్నేరయ్యాడు.


ఆ సమయంలో ఆ ఊరిలోనే ఉన్న ఒక ఉపాధ్యాయుడు రాజయ్యతో ఇలా అన్నాడు: "రాజయ్య! నువ్వు నీ జీవితమంతా తీయని చెరుకుగడ లాగా అందరికీ మేలు చేశావు. నీ వంశం చాలా గొప్పది, కానీ దురదృష్టవశాత్తు నీ కొడుకు నీ వంశానికి ఒక వెన్ను లాగా తయారయ్యాడు.


చెరుకుగడకు వెన్ను వస్తే, అది బయటకు చూడడానికి అందంగా కనిపించినా, లోపల ఉన్న తీపిని అంతా పీల్చేస్తుంది. అలాగే ఉత్తముడైన తండ్రికి పుట్టిన ఈ చెడ్డ కొడుకు నీ గౌరవాన్ని క్షణంలో పాడు చేశాడు. దీనికి నువ్వు కూడా ఒక కారణమే! కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడో చూసుకోకుండా గుడ్డిగా నమ్మావు, దాని ఫలితమే ఇది" అని సుతిమెత్తగా రాజయ్యను కూడా మందలించాడు.


ఈ మాటలు విన్న శ్రీనులో పశ్చాత్తాపం మొదలైంది. తన స్వార్థం వల్ల తన తండ్రికి వచ్చిన చెడ్డ పేరును, ఎవరి దగ్గరా తలవంచని తండ్రి మొదటిసారిగా ఊరివారి ముందు తలవంచడం చూసి చలించిపోయిన శ్రీను, తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. తన వల్ల పోయిన ఇంటి గౌరవాన్ని మళ్లీ కష్టపడి సంపాదిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.


సత్ప్రవర్తన కలిగిన సంతానం వంశానికి వెలుగునిస్తే, దుర్మార్గపు ఆలోచనలు ఉన్న ఒక్కడున్నా అది వంశ నాశనానికి దారి తీస్తుంది.


******శుభం *******


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page