top of page

తస్మైశ్రీ గురవేనమః

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

'Thasmaisri Guravenamaha' - New Telugu Story Written By Surekha Puli

'తస్మైశ్రీ గురవేనమః' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

గౌరవనీయులైన సత్యభామ ఉపాధ్యాయురాలి గారికి,


నమస్కారం !

నేను సిద్ధార్ధ, మీ విద్యార్థిని. మీ ఆశీస్సుల బలమే నా అభివృద్ధికి బాట.


మీరు మన పాఠశాల వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చేయుచున్నట్లు తెలిసినది. కాని మీ చిరునామ సేకరించుట చాలా కష్టతరమైనది.


నేను ప్రస్తుతము జైపూర్ లో కలెక్టర్ గా నియుక్తమైనాను. నా ఉన్నతికి కారణమైన మిమ్మల్ని తలచుకోని రోజు ఉండదు.


తెలంగాణ పల్లెటూరి ప్రభుత్వ పాఠశాలలో నాతో పాటు మరి కొందరు విద్యార్థులు "చదువు రాని దద్దమ్మలుగా" హేళనకు గురైన సమయాన్నే, మీరు "అపర సరస్వతీ దేవి" రూపంలో వచ్చి గణితశాస్త్ర ఉపాధ్యాయురాలిగా రోజు వారి అధ్యయనం కాక సెలవు రోజున ప్రత్యేకంగా మాకు ఎక్కాల నుండి మొదలు కొని పదవ తరగతి వరకు గణితశాస్త్రములో వందశాతం మార్కులతో ఉత్తీర్లను చేసిన ఘనత మీదే. మీకు మా తరగతి తరపున ఇచ్చిన బహుమతిని పాఠశాలకే అంకితమిచ్చిన మీ గొప్ప గుణానికి మీకు మీరే సాటి!


ఇతరత్రా ఉపాధ్యాయులు సెలవు తీసుకున్న వేళలో మా తరగతిలో జరుగు కోతిమూక అల్లర్లు భరించలేక ప్రధానోపాధ్యాయులు మాకు శిక్ష విధించిన సమయంలో మీరు సహృదయులై ప్రధానోపాధ్యాయుల అనుమతి పొంది మా అల్లర్లు భరించి, ఎంతో చాకచక్యముతో మా లోని నైపుణ్యమును పెకిలించి, తెలుగు, ఆంగ్ల వ్యాకరణము మరియు భూగోళశాస్త్రము, యొక్క విశిష్టతను మా మట్టి బుర్రల్లో బీజం నాటారు. పరీక్షలో గణితం తో పాటు ఈ మూడు విషయాల్లోనూ వందశాతం మార్కులు తెచ్చుకునే అవకాశం వున్నదని విద్యార్థులను సదా ఉత్తేజపర్చే మీ విశాల హృదయము మీ వృత్తికే మీరు మణిపూస.


మాలో ఒకడు శృంగార పుస్తకాలు తెచ్చి, రహస్యంగా చూస్తుంటే, మీకు పట్టుబడ్డాడు. చాలా ఆశ్చర్యమైంది మీ ధైర్యం చూసి, ఇతర ఉపాధ్యాయులు చూసీ చూడనట్టు ఊరుకున్నారు కారణం ఊరి అధ్యక్షుల పుత్రరత్నం. ఎన్నో ముచ్చట్లు, కధలు చెప్పి, మా లేత యువత యందు భ్రమించే చపలచిత్త దృష్టిని విద్యపై మరల్చిన మహనీయులు.


పాఠశాల పరుగు పందెంలో నాకు ముక్కు నుండి రక్తము కారుతూ ఉంటే అత్యవసర చికిత్స మేరకు నన్ను మీరు మీ ఇంటికి తీసుకు వెళ్లారు. మీ వారు మీతో దుర్భాషలాడారు. నేను చాలా బాధ పడ్డాను. మీ వైవాహిక జీవితం నిరుత్సాముగా ఉండేదని చాలా రోజుల తరువాత తెలిసింది. మీరు అబల కాదు సబల అని నా మనసు పదేపదే చెప్పేది.


దుండగుల బారి నుండి పసిపాపను రక్షించి రాష్ట్రపతి అవార్డు అందుకునే సభాపర్వాన, మీ ప్రతి రూపమైన మీ ఒక్కగానొక్క కూతురును దూరదర్శినిలో చూసాను. క్లిష్టమైన ద్విపాత్ర పోషణ (తల్లీదండ్రుల పాత్ర) పెంపకములో కూడా మీరు దిట్ట అన్పించారు.


మా పెద్దలు నాకు వివాహము చేయతలచినారు. మీ అమ్మాయిని నేను వివాహము చేసుకోవాలని నిశ్ఛయించుకున్నాను. నేను ఆశ్వీయుజ మాసంలో హైదరాబాద్ వచ్చి మిమల్ని కలుస్తాను, దయచేసి మీరు మీ అమ్మాయిని ఒకసారి అడిగి, మీ సమ్మతి తెలియ చేయండి.


గురు దక్షిణ ఇవ్వాల్సిన నేను, మీరు పంచి ఇచ్చిన సమయస్ఫూర్తి, క్రమశిక్షణతో పెంచిన మీ కూతురిని నాకు కన్యాదానం చేయమని అర్థిస్తున్నాను.


అట్లు కాని పక్షంలో నా తరపున ఎటువంటి సహాయ, సహకారాలు కావాల్సి వచ్చినా.. నేను మీ సేవ కై వున్నాను.


మీ ఏకైక భావి జీవితాన్ని నేను సేవించి, తరించి ధన్యుడనయ్యే అవకాశం కలిగించండి.


నా ఈ చిన్ని కోరిక మన్నించండి.


సదా మీ ఋణంలో..

ప్రేమతో..


మీ సిద్ధార్ధ

****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/surekha

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


45 views5 comments
bottom of page