top of page
Original.png

ఆ 7 సెకన్లు

#PadmavathiKomaragiri, #పద్మావతికొమరగిరి, #TheSevenSeconds, #ఆ7సెకన్లు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

The Seven Seconds - New Telugu Story Written By Padmavathi Komaragiri

Published In manatelugukathalu.com On 02/03/2026

ఆ 7 సెకన్లు - తెలుగు కథ

రచన: పద్మావతి కొమరగిరి 

“నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ మార్కులు కాదు…

మొదటి 7 సెకన్లు!”

పద్మావతి కొమరగిరి గారి ఆ 7 సెకన్లు కథలో ఆ సమయం విలువ తెలుసుకోండి.


విజయ ఒక డైనమిక్ కార్పొరేట్ బాస్. ఆమె ఆఫీసులో అసిస్టెంట్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. బయట సౌమ్య, రేఖ కూర్చుని ఉన్నారు. సౌమ్య గోల్డ్ మెడలిస్ట్, కానీ ఇలాంటి పెద్ద ఆఫీసులో ఇంటర్వ్యూ కి  రావడం ఇదే మొదటిసారి కావడంతో కాస్త ఒత్తిడికి లోనవుతోంది. రేఖ మాత్రం ప్రశాంతంగా ఉంది.


విజయ కాలింగ్ బెల్ నొక్కగానే సౌమ్య లోపలికి వెళ్ళింది. విజయ ఫైల్ చూస్తూ ఉంది. సౌమ్య లోపలికి రాగానే విజయ ఫుల్ పర్సనాలిటీని చూడగానే ఒక్కసారిగా కంగారు పడింది. తడబాటు: ఆ కంగారులో విజయను విష్ చేయడం పూర్తిగా మర్చిపోయింది. విజయ కూర్చోమని చెప్పకముందే, సౌమ్య వెళ్లి కుర్చీలో కూర్చుండిపోయింది. తన ఫైల్‌ను రెండు చేతులతో వణుకుతూ గట్టిగా పట్టుకుంది. విజయ తల పైకెత్తి చూసింది.


ఒక గోల్డ్ మెడలిస్ట్ ఇలా కంగారు పడటం, కనీస మర్యాద పాటించకపోవడం విజయకు నచ్చలేదు. ఆ మొదటి 7 సెకన్లలోనే సౌమ్య ఎంత తెలివైనదైనా, ప్రెజర్ హ్యాండిల్ చేయలేదని విజయకు అర్థమైపోయింది. తరువాత సౌమ్య గుడ్ మార్నింగ్ చెబుతుంది, కానీ విజయ బదులు చెప్పకుండానే ఆమె సర్టిఫికెట్స్ అడుగుతుంది.


సౌమ్య వణుకుతున్న చేతులతో ఫైల్ ఇస్తుంది. విజయ ఫైల్ చూడకుండానే సౌమ్య ముఖంలోకి చూస్తుంది. సౌమ్య కిందకు చూస్తూ ఉంటుంది. "సరే సౌమ్య, నువ్వు వెళ్ళచ్చు. కాసేపటిలో మేము అనౌన్స్  చేస్తాం" అని చెప్పి మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కుతుంది విజయ.


చివరి అభ్యర్థి రేఖ నిటారుగా నడుస్తూ విజయని  ఆత్మవిశ్వాసంతో పలకరిస్తుంది. "గుడ్ మార్నింగ్ మేడమ్. ఐ యామ్ రేఖ" అంటున్న ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ "వెరీ గుడ్ మార్నింగ్ రేఖ, కూర్చోండి" అని చెప్పింది విజయ.


రేఖ థాంక్స్ చెప్పి గౌరవంగా కూర్చుంటుంది. ఆమె చేతులు టేబుల్‌పై క్లియర్ గా ఉన్నాయి. నిశితంగా పరిశీలిస్తుంది విజయ. తర్వాత సౌమ్య ని కూడా లోపలకి పిలిచి

"మీ ఇద్దరి మార్కులు చూశాను. ఇక్కడ ఇంటర్వ్యూ కి వచ్చిన అందరికంటే మీ ఇద్దరూ  అన్ని విషయాలలో పోటీ పడ్డారు. కానీ సౌమ్యకు రేఖ కంటే ఆరు  శాతం ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ... నేను ఈ ఉద్యోగం రేఖకే ఇస్తున్నాను" అని అనౌన్స్ చేసింది విజయ.


"అదేంటి మేడమ్, సౌమ్యగారికి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా మరి..." అని అడిగింది విజయ పర్సనల్ అసిస్టెంట్ నీలిమ.


"అవును నీలిమ. కానీ సౌమ్య లోపలికి వచ్చిన మొదటి 7 సెకన్లలోనే ఆత్మవిశ్వాసం లేదనిపించింది. కానీ రేఖ తన నవ్వుతో, నిలబడిన తీరుతో 'నేను దేనికైనా సిద్ధం' అని నిరూపించుకుంది" అని చెప్పింది విజయ.


"సౌమ్యా! నీ సర్టిఫికెట్ నీ మేధస్సును చూపిస్తే, నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఉద్యోగ ప్రపంచంలో నీ వ్యక్తిత్వానికే ఎక్కువ విలువ ఉంటుంది. ఇంకొక్కటి గుర్తుపెట్టుకో సౌమ్యా, ఓటమి నీకు పాఠం నేర్పాలి కానీ నిన్ను కుంగదీయకూడదు. నీ చదువు నీ బలం, నీ ప్రవర్తన నీ ఆయుధం కావాలి. తదుపరి ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. వచ్చే మూడు నెలల్లో ఇంకా కొన్ని ఉద్యోగ ప్రకటనలు మా ఆఫీస్ నుంచి వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ లక్" అంటూ విజయ హుందాగా సౌమ్య  భుజం తట్టింది.


***

కొమరగిరి పద్మావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొమరగిరి పద్మావతి

నా పేరు కొమరగిరి పద్మావతి. నేను కథలు రాస్తాను.

ఎక్కువ చదవడం వల్ల రాయడం వచ్చి ఉంటుంది . నా రచనలు అన్నీ నా స్వంత ఆలోచనల నుంచి పుట్టినవే. ఎక్కడి నుంచీ కాపీ చేయడం లేదు, అనువదించడం లేదు, ఎవరినీ అనుకరించడంలేదు.

కథలు రాయడం నాకు చాలా ఇష్టం. మనుషుల జీవితాల్లో జరిగే విషయాలు, భావాలు, అనుభవాలు నా రచనల్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. పాఠకులు కథ చదివి, అది అర్థం అయ్యేలా, మనసుకు హత్తుకునేలా ఉండాలని నా లక్ష్యం.

రాయడం నాకు ఒక ఆనందం, అభిరుచి. ప్రతి కథ నాకు ప్రత్యేకం.










bottom of page