top of page

తెలివైన పెళ్ళాం


'Thelivaina Pellam' - New Telugu Story Written By Mohana Krishna Tata

'తెలివైన పెళ్ళాం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


రాము వ్యాపారం పెట్టాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు. రాము కు ఈ మధ్యే పెళ్లి అయ్యింది. తన పెళ్ళాం రమ్య, కొంచం చదువుకుంది..లోక జ్ఞానం ఎక్కువ..తెలివైంది కుడా..చదువుకున్న పెళ్ళాం..వచ్చినందుకు రాము ఎప్పుడూ సంతోషించేవాడు..


ఒక రోజు రాము తన భార్య తో...


"రమ్యా! నీకు తెలుసు కదా!..నేను ఎప్పటినుంచో మంచి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను...ఒక మంచి సలహా ఇచ్చి.. నన్ను ముందుకు నడిపే నీలాంటి పెళ్ళాం దొరికింది...

"నాకు తెలుసండి! "

"నేను అలోచించి చెబుతాను..." అంది రమ్య


ఒక వారం తరువాత...


ఈ వారం లో నేను చాలా అలోచించి...మన వీధిలో ఉన్న షాప్స్ అన్నిటినీ గమనించానండీ!


"ఏమండీ! ..మనం కాఫీ, టీ షాప్ పెడదాము...

"ఇదేమిటి రమ్యా! మన వీధిలో ఇప్పటికే..రెండు ఉన్నాయి కదా..!"

"అవును...మీరు చెప్పినది నిజమే!"

"అయితే...మనకు నష్టం వస్తుంది కదా?" అడిగాడు రాము

"రాదండీ!"

"ఒక సూపర్ మార్కెట్ కు ఒక సాల్ట్ ప్యాకెట్ కోసం వెళ్తే...అక్కడ సాల్ట్ ప్యాకెట్ తో పాటు...పక్కనే ఉన్న ఐటమ్స్ వైపు మన దృష్టి పడుతుంది...సాల్ట్ తో పాటు.. ఇంకొన్ని ఐటమ్స్ కొంటాము..అంటే ఆలోచించండి మరి!"

అలాగే! ఒక ఐటెం వంద కే ఇస్తారు..కాని డెలివరీ ఏమో రెండు వందలు వేస్తారు...మళ్లీ ఆలోచించండి!"

"ఈవన్నీ నీకు ఎలాగ తెలుసు రమ్యా..?"

"మా నాన్నగారి తెలివితేటలు...నాకు వచ్చాయని అంటారు అంతా!.."


పెళ్ళాం చెప్పిన విధంగా...ఒక కాఫీ షాప్ పెట్టాడు రాము...ఆ వీధిలో ఉన్న కాఫీ షాప్స్ కన్నా...ఒక రెండు రూపాయలు తక్కువ రేట్ ఫిక్స్ చేసారు...

పక్కన...స్నాక్ ఐటమ్స్ లో బిస్కెట్...చాక్లెట్...అన్నీ ఐటమ్స్ పెట్టారు...


"అయితే ...మనకి ఎలా వర్కౌట్ అవుతుంది?"

'వేరే షాప్ లో కన్నా...మన షాప్ లో కాఫీ, టీ తక్కువ రేట్ కాబట్టి ...ఇక్కడకే వస్తారు అందరూ..వచ్చిన వారు స్నాక్ ఐటమ్స్ కొంటారు...అవి అందరూ అమ్మే రేట్ కే మనం అమ్ముతాము...దాని చేత మనకు కాఫీ, టీ లో పెద్దగా లాభం లేకపోయినా...స్నాక్ ఐటమ్స్ పైనా లాభం ఉంటుంది...కస్టమర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి...మనకు లాభమే!"


అతి త్వరలోనే.. వాళ్ళ షాప్ చాలా ఫేమస్ అయ్యింది...ఇంకా పెద్ద షాప్ అయ్యింది...


పెళ్ళాం తెలివితేటలు చూసి.. చాలా మురిసిపోయాడు రాము...


******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


59 views0 comments
bottom of page