'Prakruthi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'ప్రకృతి' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
పుష్పేషు జాతి, పురుషేచు విష్ణు, నారీచ రంభ, నగరేచ కంచి- ప్రకృతిలో అందమైన వేమిటో కవి వర్ణించినా మొదటి మూడు పరమాత్మ, ప్రకృతి సంబంధించినవి. - కంచి నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దినది మానవుడు. మనిషి తనకు తాను అందంగా తీర్చి దిద్దుకోవాలంటె ప్రకృతి మీద ఆధారపడవలసిందే. నిత్యము పరిశుభ్రంగా స్నానము, ఉతికిన బట్టలు, తైల సంస్కార జుట్టు ఇవి దేహ సంబంధమైనవైతె- మంచి మనసు, దయా గుణము, సత్యవాక్కు, ధార్మిక గుణము, తల్లిదండ్రుల పూజించుట పెద్దలను గౌరవించుట, శిశువులందు ప్రేమ, తోబుట్టువులందు అనురాగము మున్నగు సద్లక్షణాలు కలిగి ఉంటేనే రాణిస్తారు.
ఇక ప్రకృతిలో పుట్టింది కనుక పుష్పము ఎదగడానికి కావలసి వనరులు ప్రకృతే సమకూరుస్తది. విష్ణు విశ్వమంతా వ్యాపించి సమస్త జీవకోటి మనుగడకు ఆయనే కారకుడు-ఆధారము-రంభ స్వతసిద్ధముగా జన్మించి అమృతము సేవించుచు దేవలోకములో ఉంటది కనుక ఆమెకు ఏలాంటి అవసరాలు లేవు.
మానవులకే ఆహారము, పానీయము, ఆహార్యము, ఆవాసము అవసరము కనుక తనకు తానే సృష్టించుకోవాలి-తిర్యక్ జంతు జాతికి, జలచరములకు ప్రకృతి వనరులే ఆధారము.
ఒక్క మానవుడే జీవనము సాగించాలంటె శ్రమ పడవలసిందే-అయితె దానికి మేధ, శారీరక శ్రమ ఉపయోగించక తప్పదు-ఐనా ప్రకృతే సింహ భాగము తోడ్పడుతుంది. పంచభూతాల రూపములో-
ఆమె పేరు మణీచక - చామ చిరంటివయసులో తనకు తాను రంభగా పోల్చుకొని మిడిసి పడుతుంది- రోజూ తీర్చి దిద్దుకొనుడులోనే కాలము గడుపుతుందేకాని కష్టానికి ఓపదు-తల్లిదంద్రుల గారాబు పట్టి. సదా అలంకరణ వస్తువులు వాడటముచే ముఖ వర్చస్సూ తగ్గుతూ వస్తుంది. ఆమె చెల్లెలు పేరు సౌమ్యగంధ - సౌమ్యగంధకు సోకులంటె గిట్టవు-ప్రకృతి సిద్ధమైన అందాన్నే నిలుపుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులకు సహాయకారిగా ఉంటూ ఇంటిపనులు చక్కదిద్దుతుంటుంది.
కూతుర్లలో పెద్దదిగనుక తలిదండ్రులు మణీచక పెళ్ళి చేయాలని తలంచుతారు.
అన్ని లక్షణాలు సరిగా చూసి ధవళాంశ్ అనే ఒక అబ్బాయిని మణీచకకు సరి దోడు అని ఎంచి పెళ్ళి చూపులకు పిలుస్తారు.
పెళ్ళి చూపులకు వచ్చిన ధవళాంశ్ మణీచకను కాదని సౌమ్యగంధ నచ్చిందని చెబుతాడు. తలిదండ్రులు ఛాయ-జీవన్ లు మనసులో ఎంతో బాధపడుతు 'ముందు పెద్ద కూతురు పెళ్ళి కానిది చిన్నదాని పెళ్ళి సాధ్యము కాదు' అని జెబుతారు- 'సరె తరువాత మీకు తెలియజేస్తాము' అని చెప్పి పెళ్ళి చూపులకు వచ్చిన వారు వెళ్ళిపోతారు.
తండ్రి జీవన్ బిడ్డ మణీచక వైపు చూస్తూ "చూసినవా అమ్మా! నీ సోకులు ఎంతవరకు వచ్చిందో. ముఖ వర్చస్సు తగ్గి నిన్ను మెచ్చకుండా పోయినారు. ఇకనైన పై మెరుగులకు ప్రాకులాడక, చెల్లెలులా ప్రకృతి సిద్ధమైన ఆకారాన్ని నిలుపుకుంటూ వస్తె బాగుంటుంది" అని కొంత నిర్లిప్తత భావం తో అంటాడు.
తల్లి ఛాయ కూడా అదే మాట చెబుతుంది. తల్లి దండ్రి మాటలకు తాత్కాలికంగా నొచ్చుకున్నా కొంత ఆలోచనలో పడుతుంది మణీచక. అప్పుడు తెలుసుకుంటుంది మణీచక అందం ప్రకృతి, అలంకరణ వికృతి అని.
ఆ రోజు నుండి ప్రకృతి వ్యతిరేకమైన అలంకరణ వస్తువులు వాడకము మానేస్తుంది. అలాగే అమ్మబెట్టే తిండినే తింటు బయటి తిండిని కూడా మానేస్తుంది-ఈ మార్పుకు సంతసిస్తారు తల్లిదండ్రులు.
జీవన్ ఛాయలది ఒకటే మాట ప్రకృతి ప్రసాదించిన వనరులు వాడుకుంటూ ఆనందమయ జీవనము సాగించాలని. పై మెరుగులకని రసాయన వస్తువులు వాడుట, ఒంగలేని తనానికి బయటి ఆహారము తెచ్చుక తినుట, కాస్తగూడా శారీరక శ్రమకు ఓర్వకుండుట-సదా సెల్ఫోన్ పట్టుక తిరుగుట, గంటల తరబడి టీ వీ ల ముందు కూర్చునుట అన్నీ అనర్థదాయకమని తెలుసుకోవాలి అని వారి తపన. ఇంకా మన ఊరు మనభాష మరువకుండుట మంచివారి లక్షణమని వారి భావన.
మొత్తము మీద పట్టుబట్టి ఇద్దరు కూతుర్లను సక్రమ మార్గములో నడిచేటట్టు చేసి ఇద్దరి పెళ్ళిళ్ళు ఆర్భాటానికి, కులగోత్ర పట్టింపులకు పోకుండా జరిపిస్తారు.
సమాజములో ఆదర్శంగా నిలుస్తారు ఛాయా జీవన్ దంపతులు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments