top of page
Original_edited.jpg

ఉచిత బస్

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #UchithaBus, #ఉచితబస్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Uchitha Bus - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 21/11/2025

ఉచిత బస్ - తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

 

మినిస్టర్ కారులో వెళ్తుంటే...

కొందరు మగాళ్లు ప్లకార్డులు పట్టుకుని రోడ్ మీద బైఠాయించటంతో కారు ఆపాడు డ్రైవర్.


"ఏంటి ఈ గోల? అవతల నాకు సిఎంతో మీటింగ్. ఎందుకో కనుక్కోమని" విసుగ్గా తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ను పంపాడు మినిస్టర్ వెంకటరావు.


"సార్ ఉచిత బస్ వద్దని గోల చేస్తున్నారు. మీరు వెళ్ళి మాట్లాడండి. లేదంటే.. వాళ్ళు రోడ్ల మీదనే ఉంటారంట సార్."


ఇక లాభం లేదని కారు దిగి ఆందోళనకార్ల దగ్గరికి వెళ్ళాడు మినిస్టర్.


"ఏందయ్యా? మీ ఆడాళ్ళకు బావుంటదనేగా ఉచిత బస్ ఏర్పాటు చేసింది. మీ ఆడాళ్ళ నుండి మంచి రెస్పాన్సు ఉంటే.. మీరేమో ఇలా చేయటం బాగోలేదు. ఏంది కథ?"


"మా సోష ఏం చెప్పమంటారు సార్. ఇదివరకు పండగలకు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు మా ఆడాళ్ళు. ఇపుడు వూరకనే పోతన్నారు. మొన్న మా ఆవిడ పాలలో తోడుకు పెరుగనీ ఫ్రీ బస్ అని పొద్దున పుట్టింటికి వెళ్ళి... సాయంత్రం వస్తూ ఒక స్పూన్ పెరుగుతో వచ్చింది."


ఇంకొకతను "లేస్తూనే నైటీల మీదే చున్నీలు వేసుకుని బస్సులో పుట్టిల్లకు వెళ్ళి సాయంత్రాలు వస్తున్నారు. ఏందే? అంటే, 'మా అమ్మ వాళ్ళింట్లో గ్రైండర్ ఉంది పప్పు గ్రైండ్ చేసుకుని వస్తున్నా మీ టిఫిన్ కోసం..!' అని

చెప్తున్నారు సార్..!" బాధపడుతూ అన్నాడు.


"మా అత్తగారు, మా మరదలు వారానికి ఒకసారి వచ్చి నాల్గురోజులు ఉండి వెళ్తారు. బస్ ఛార్జీల బదులు మాకు ఎగస్ట్రా ఖర్చులు ఎక్కువవుతున్నాయి" అంటూ

ఇంకో వ్యక్తి వాపోయాడు.


"వాషింగ్ మిషన్ మాకుందని మా ఆవిడ, చుట్టాలు, రెండురోజుల కొకసారి వచ్చి బట్టలు ఉతుక్కొని అరబెట్టుకుని ఒకరోజు వుండి వెళ్తారు. వీళ్ళని మేపలేక చస్తున్నాను. ఉచిత బస్ కాదు కానీ పిల్లలకు ఉచిత చదువు పెట్టండి సార్..!" అంటూ అందరూ తమ ఆడాళ్ళ గురించి చెప్పుకుని బాధ పడ్డారు.


ఇంకా కొంతమంది వ్యక్తులు "ఉల్లిపాయలకు,పేస్టు, టీ పొడి తెచ్చుకోవడానికి, చివరకి పేలు చూపించుకోవటానికి కూడా బస్ ఎక్కి పుట్టిల్లకు వెళ్తున్నారు. మా కర్మ కాలి అదేమనీ అడిగితే.. ఫ్రీ బస్ కదా నిన్నేమన్నాచార్జీలు అడిగామా! అంటున్నారు సార్..!" అంటూ బోరుమని ఏడుస్తూ చెప్పారు.


"నాకు దారిస్తే.. నేను వెళ్ళి సీఎంతో వెళ్ళి మాట్లాడతాలే..! మీరు శాంతించండి. మీ డిమాండ్స్ ఒక కాగితం మీద రాసివ్వండి." అంటూ కారు ఎక్కాడు మినిస్టర్.


డ్రైవర్ ఫోన్లో "పప్పు గుత్తి, మూకుడు కోసం పుట్టింటికి పోవాలా? తాళం చెవి గూట్లో పెట్టీ వెళ్ళ”ని వాళ్ళావిడను విసుక్కుని ఫోన్ పెట్టీ కారు పోనిచ్చాడు.


డ్రైవర్ మాటలు విని ' అమ్మో..!ఫ్రీ బస్ గూర్చి సిఎం చెవిలో వూదాలనుకుని' గట్టిగా అనుకున్నాడు మనసులో మినిస్టర్ వెంకట్రావు.


సమాప్తం

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


bottom of page