top of page

ఊహా లోకం - 1


'Uha Lokam 1' New Telugu Big Story


Written By Lakshmi Madan



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఊహా లోకం పెద్ద కథ మొదటి భాగం


వంటింట్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి వరండాలో పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ కి ఇచ్చింది వందన.


"ఏమండీ కాఫీ" అన్నది.


"అక్కడ పెట్టి వెళ్ళు" అన్నాడు చిరాగ్గా ప్రసాద్.


ఈ మధ్య వందనను చూసి ఊరికే చిరాకు పడుతున్నాడు.. దానికి కారణం లేకపోలేదు, పిల్లలు కొంచెం పెద్దవారై యిన కొద్దీ వందన లావుగా మారిపోయింది. పెళ్లయిన కొత్తలో ఎంతో సన్నగా ఉండేది. మరొక కారణం కూడా ఉంది ప్రసాద్ చిరాకుకి.. ఒకప్పుడు ప్రసాద్ ప్రేమించిన అమ్మాయి ఎంతో అందంగా ఉండేది. ‘ఆ అమ్మాయిని చేసుకుని ఉంటే ఇలా పిప్పళ్ళ బస్తాల మారిపోయేది కాదు’ అని ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉన్నాడు.


వందన బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. పిల్లలను నిద్రలేపి వారిని స్కూలు పంపడానికి బాక్సులు రెడీ చేస్తుంది. ఆరోజు ప్రసాదుకు సెలవు కావడం వల్ల ఇంట్లోనే ఉన్నాడు. ఉద్యోగం చేస్తాడు. క్లర్క్ గా మొదలైన ఉద్యోగం ఇప్పుడు మేనేజర్ వరకు వెళ్ళింది. చక్కని ప్రతిభతో తన వృత్తిని నిర్వర్తిస్తున్నాడు ప్రసాద్. వందన కూడా ఉన్నంతలో సరిపెట్టుకొని కాపురాన్ని అందంగానే తీర్చిదిద్దుకుంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించి మంచి పేరునే తీసుకొని వచ్చింది. మొదట్లో ప్రసాద్ ఆమెతో బాగానే ఉండేవాడు. తను ప్రేమించిన అమ్మాయి అప్పుడప్పుడు గుర్తు వచ్చినా వందన వ్యక్తిత్వాన్ని నచ్చి ప్రేమగానే చూసుకునేవాడు. కానీ ఆమె చాలా లావు అయిందని కారణంతో ఈమధ్య కొంచెం చిరాకు పడుతూ మధ్య మధ్యలో తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నాడు. అంతకుమించి అతనికి కూడా ఏ వ్యసనాలు లేవు.


ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయాడు ప్రసాద్. తన బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి తరచుగా బ్యాంకుకు వచ్చేది. ఆ అమ్మాయి ఏదో కంపెనీలో ఉద్యోగం చేసేది. దాని తాలూకు ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకుకు ఎక్కువగా వచ్చేది.


ఒకరోజు క్యాజువల్ గా పని చేసుకుంటున్నాడు. తన కౌంటర్ దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి..


"ఎక్స్క్యూజ్మీ సార్ కాస్త ఈ అమౌంట్ చెక్ చేస్తారా" అని అడిగింది.


తలెత్తి చూసిన ప్రసాద్ ఆమెను చూసి కళ్ళు తిప్పుకోలేక పోయాడు. సంస్కారం అడ్డొచ్చి తలదించుకున్నాడు కానీ వివరాలు చెప్పాలనే నెపంతో ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఆమెకు ఇవ్వాల్సిన వివరాలు ఇచ్చి ఇంకా కొన్ని ఇవ్వకుండా కాసేపు వెయిట్ చేయించాడు, అమ్మాయిని ఎక్కువసేపు చూడొచ్చనే కారణంతో.


గులాబీ రంగు షిఫాన్ చీర కట్టుకొని, దానికి మ్యాచింగ్ బ్లౌజ్.. మెడలో సన్నని ముత్యాల దండ చెవులకు చిన్న ముత్యాల దుద్దులు పెట్టుకొని ఉంది. పెద్ద జడ వేసుకొని చివర్లు అలా వదిలేసి నడుస్తుంటే, ఊగుతున్న జడ ఎంతో ముచ్చటగా అనిపించింది. మేని రంగు మరీ తెల్లగా కాకుండా, మరీ నల్లగాను కాకుండా మద్యస్థంలో ఉంది. పెద్ద కళ్ళు, చక్కని ముక్కు, లిప్స్టిక్ వేయకుండా మెరుస్తున్న పెదాలు, కనీ కనపడకుండా పెట్టుకున్న ఒంటి రాయి ముక్కుపుడక.. చిన్న బొట్టు ధరించి ఎంతో అందంగా సింపుల్గా కూడా ఉంది. మాట్లాడుతుంటే మరీ అందంగా ఉంది... సన్నని స్వరం.. తీయని పాటలా ఉంది...


ఇలా రోజు ఆ అమ్మాయి వస్తుంటే అతని మనసు ఉత్సాహంతో ఉరకలు వేసేది... ఆమె రాని రోజు వెలితిగా అనిపించేది.


అలా కొన్ని రోజులు గడిచాయి... ఆ అమ్మాయి కూడా ప్రసాద్ తో చనువుగా మాట్లాడ సాగింది. ఆమె పేరు ఆమె లాగే అందంగా ఉంది. ఆమె పేరు సౌందర్య.


తర్వాత కొన్ని రోజులు ఆ అమ్మాయి బ్యాంక్ కి రాలేదు. రోజు ఎదురు చూస్తున్న ప్రసాద్ కి మనసు వెలితిగా అనిపించేది.


అలా కొన్ని రోజులు గడిచాయి.. ఒక రోజు ఆ అమ్మాయి బ్యాంక్ కి వచ్చింది. ప్రసాద్ మనసు పురి విప్పిన నెమలిలా మారింది... సౌందర్య చక్కగా ప్రసాద్ క్యాబిన్ దగ్గరకి వచ్చింది.


"హాయ్ ప్రసాద్ గారూ " అన్నది.


"హాయ్ సౌందర్య గారూ! ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? " అన్నాడు.


కొంచెం సిగ్గు పడుతున్నట్లుగా చూసి.. " నాకు నిశ్చితార్థం జరిగింది" అన్నది చిన్న స్వరంతో.


ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు ప్రసాద్.


విన్నది నిజమో కాదో నని మళ్ళీ అడిగాడు..


"ఏంటి? " అని..


"ఎంగేజ్మెంట్ అయ్యింది.. అందుకే రాలేదు" అన్నది సౌందర్య.


ఒక్క సారి ఆశల సౌధం కూలినట్లు అనిపించింది ప్రసాద్ కు.


ఇక ఆఫీస్ లో ఉండాలని అనిపించ లేదు...


మెల్లిగా లేచి " సౌందర్య గారూ! ఈ రోజు నేను ఉండటం లేదు.. మీరు మేనేజర్ దగ్గరకి వెళ్లి మీ పని చేయించు కొండి" అన్నాడు.


"సరే ప్రసాద్ గారూ.. నేను బ్యాంక్ కి రావడం ఇదే చివరి సారి.. జాబ్ రిజైన్ చేసి మావారి తో పాటు అమెరికా వెళుతున్నాను " అన్నది.


ఇంకా భూమిలో కూరుకు పోయినట్లు అనిపించింది...


మొహంలో ఏమీ తెలియకుండా..


"సరే సౌందర్య గారూ... congratulations & all the best" అని చెప్పి ఇంటికి వెళ్ళి పోయాడు.

==============================================


ఇంకా ఉంది..

==============================================

లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.



36 views0 comments
bottom of page