'Ulli Raju - New Telugu Story Written By Mohana Krishna Tata
'ఉల్లి రాజు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కంగారుపడుతూ.. ఏడుస్తూ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది కావ్య.
"ఎందుకు ఏడుస్తున్నావు" అని వాళ్ళ తాతయ్య అడిగారు.
"నేను స్కూల్ లో.. ఇప్పుడు క్లాస్ లీడర్ కదా!"
"అవును.. అయితే!" అడిగాడు ఆత్రుతగా తాతయ్య
"మా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తున్నారు. తర్వాత, ఎవరు బాగా చదివితే, వాళ్ళే క్లాస్ లీడర్ ఆవుతారంట..
ఎప్పుడూ.. లీడర్ గా ఉండడం నాకు ఇష్టం. చాలా బాధ వేసింది తాతయ్య! అందుకే ఏడుస్తున్నాను.. ఎప్పుడూ నేనే లీడర్ గా ఉంటాను.. చెప్పండి మా ఫ్రెండ్స్ కి..”
"మీ ఫ్రెండ్స్ చెప్పింది నిజమే కావ్య! నీకు అర్ధమవ్వాలంటే టమోటా- ఉల్లి కథ తెలియాలి..
చాలా సంవత్సరాల మునుపు, ఊరిలో ఉన్న కూరగాయల సమావేశంలో.. ‘ఎవరు గొప్ప?..’ అని గొడవపడుతున్నాయి.
‘నేను ఎప్పుడూ కూరలలో రాజునే!’ అంటోంది వంకాయ.
‘నన్ను చాలా ఇష్టంగా తింటారు. నన్ను ఎన్నో రకాలుగా వండుకుని తింటారు. గుత్తి వంకాయ గా.. నేను చాలా ఫేమస్’.
‘బెండకాయ.. నేను కూరలలోనే రాణి అని అందరికి తెలుసు. నన్ను తింటే, తెలివితేటలు పెరుగుతాయి అని అందరు తింటారు’.
‘చిన్న పిల్లలు మమల్ని చాలా ఇష్టంగా తింటారు’ అని దుంప కూరలు గట్టిగా అంటున్నాయి.
మిగిలిన కూరలన్నీ కూడా, మేము గొప్పంటే, మేము గొప్ప అని మాట్లాడుతున్నాయి.
ప్రస్తుతం రాజు గా ఉన్న టమోటా.. ‘నేను ఇప్పుడు చాలా డిమాండ్ లో ఉన్నాను. నా రేట్ చాలా పెరిగింది. చాలా మంది రైతులు నా వల్ల గొప్పవాళ్ళై, ఆనందంగా ఉన్నారు. నేను చాలా గ్రేట్! నేనే అందరికన్నా గొప్ప. ఎప్పుడూ నేనే రాజుని’.
‘నన్ను వాడినంత గొప్పగా ఎవరిని వాడరు. నన్ను అన్నిటిలో ఎక్కువగా వాడతారు. వండే ప్రతి కూరలో నేను ఉంటాను.. తెలుసా?’ అంది ఉల్లి. ‘వాడకాన్ని బట్టి చూస్తే, నేనే రాజు ని’.
‘నీకు రాజు అయ్యే అర్హత ఎప్పటికి రాదు. నీ రేట్ ఎప్పుడు అటు ఇటు గానే ఉంటుంది.. టమాటా లాగా అంత గొప్పగా ఏమి పెరగదు..’ గేలి చేసాయి మిగతా కూరలు..
‘నాకూ ఒక రోజు వస్తుంది.. నా డిమాండ్.. టమోటా కన్నా , మిగిలిన కూరల కన్నా ఎక్కువ అవుతుంది. అయినా.. దేని రుచే దానిది.. దేని విలువ దానిది. నా విలువ నాది’ అని చెప్పింది ఉల్లి.
కాలం చాలా వేగంగా మారుతుంది. జనాలు టమోటా కొనడము మానేశారు. టమోటా రేటు మార్కెట్ లో పడిపోవడం మొదలుపెట్టింది. రోజు రోజుకు మార్కెట్ విలువ తగ్గిపోతూ వస్తుంది.. టమోటా ని పండించే రైతులు, ఉల్లి ని నిర్లక్ష్యం చేసారు.. తద్వారా.. ఉల్లిపాయల కొరత తో, దాని రేట్ రోజు రోజు కు పెరిగిపోతూ వచ్చింది.
కూరగాయలన్నీ, షాక్ అయ్యాయి.. ఉల్లి ఎప్పటికీ.. రాజు అవదని మనం అనుకున్నాము. చాలా చులకనగా మాట్లాడాము. టమోటా ని రాజు గా ఇంక కొనసాగించలేము అని నిర్ణయించుకున్నాయి. ఉల్లి ని కొత్త రాజు గా అన్ని కూరగాయలు ఒప్పుకున్నాయి..
అప్పటినుంచి, అన్ని కూరలకు, సమానంగా రాజు అయ్యే అవకాశం వచ్చింది”.
“సారీ తాతయ్య! ఇంకెప్పుడూ, నేను గొప్పలకు పోను.. అందరికి సమాన అవకాశం ఉంటుందని తెలిసింది”.
"నువ్వు తప్పు తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది." అని మెచ్చుకున్నాడు తాతయ్య
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comentários