top of page
Original.png

ఉపదేశ గీత

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #పుష్పవిలాసము, #ఉపదేశగీత,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Upadesa Geetha - New Telugu Poem Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 05/11/2025 

ఉపదేశ గీత - తెలుగు కవిత

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు


1. తే.గీ.

చిరుగు పీలిక దుస్తుల తిరుగ నేల?

వలదు పెండ్లనుచు సహజీవనములేల? 

మందు మాదక ద్రవ్యాల మత్తు లేల?  

క్రాంతి పధమున నడవండి  కన్య లార.


2. తే.గీ. 

 మత్తులో తూగి, చదువులు మాననేల?  

వనిత ప్రేమకై ప్రాణాలు వదల నేల?  

కన్న వారిని బాధించు కపట మేల? 

ఉత్తములుగ జీవించుడు యువకులార. 


3. తే.గీ. 

భార్య నగ్నిలో కాల్చెడి క్రౌర్యమేల?

నాతి  మానమ్ము దోచెడి  నైచ్యమేల ?

ముసలి తల్లిని విడనాడు మోసమేల?

పుణ్య కర్మలు చేయుడు పురుషులార. 


4. తే.గీ. 

అత్త మామలు వద్దన్న ఆంక్ష లేల? 

అక్రమ ప్రణయ  బంధాల హత్య లేల? 

 బిడ్డ లువలదు వలదన్న పెండ్లి యేల?

ధర్మ మార్గాన సాగండి తరుణులార!    


5. తే.గీ.

తల్లి దండ్రులు హర్షించు దారి లోన,  

ధర్మ కార్యాలు చేయుచు, దయను కలిగి

భరత మాతగర్వించెడి పనులు చేసి

మహిని కీర్తిని పొందండి మనుజులార!



 పుష్ప విలాసము


స్వఛ్చతకు ప్రతిరూపమైన మల్లెపూలు 

శుభ సంకేతములైన పచ్చ చామంతులు

అనురాగ సూచకమైన యెర్రగులాబీలు 

విరబూచి,  వినిపించె జీవన గీతాలు.


ఆధ్యాత్మికతని పెంచు తెల్ల కలువపూలు  

భక్తి భావములు కలిగించు మందార పూలు  

వెలుగు దోవన తిరుగు సూర్య కాంతిపూలు

వికసించి,  చూపెను దివ్యలోక  పధాలు. 


పార్వతీ దేవిని మురిపించు చంపకాలు 

కైలాసనాధుని సేవించు తుమ్మిపూలు 

వేంకటేశుని భజియించు పొగడపూలు

కుసుమించి వెలిగించె సాలోక్య దారులు.


పూదోటలో నిలిచిన క్షణాలు

ఆత్మీయ భావోన్నతికి కారణాలు 

సృజనాత్మకతకు ప్రేరకాలు 

చిదానందానుభూతికి కారకాలు. 


***


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page