ఊత కర్ర - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- Sep 29, 2025
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #UthaKarra, #ఊతకర్ర, #మేఘమాల, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "ఊత కర్ర" పుస్తకావిష్కరణ హైదరాబాద్ లో
Utha Karra - Book Unveiling ceremony At Hyderabad - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/09/2025
ఊత కర్ర - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త బాలబంధు గద్వాల సోమన్న రచించిన 78వ పుస్తకం "ఊత కర్ర"పుస్తకావిష్కరణ ఎ. ఎస్. రావు నగర్, కాప్రా, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విశ్వనరుడుడా. గుఱ్ఱం జాషువా జయంత్యోత్సవం మరియు జాతీయ కవి సమ్మేళనం పురస్కరించుకొని, కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ, టీవీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్, విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ ఏ. ఎల్. కృష్ణ రెడ్డి, కళారత్న శ్రీ బిక్కి కృష్ణ, డా. ఆచార్య ఫణింద్ర, విశ్రాంత బ్యాంక్ ఆఫీసర్, కవి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, డా. రాధా కుసుమ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని విశ్రాంత ఉద్యోగి శ్రీ దామరాజు శంకరం గారికి అంకితమిచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 78 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి రవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, శ్రీ బద్రీనాథ్, శ్రీ డా. తులసి వెంకట రమణాచార్యులు శ్రీమతి ధనమ్మ మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 'ఊత కర్ర 'కృతికర్త గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్ ఏ. జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అభినందించారు.
గద్వాల సోమన్న "మేఘమాల" పుస్తక పరిచయ సభ రవీంద్ర భారతిలో
----------------------------------------------------
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న విరచిత "మేఘమాల" పుస్తక పరిచయ సాహిత్య సభ రవీంద్ర భారతి, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. "తెలంగాణ భాషా సాంస్కృతిక సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ మరియు చౌడూరి కళాపీఠం హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో " జరిగిన ఈ పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సాహిత్య సభ సాహితీ మిత్రుల మధ్యలో జగరడం విశేషం. అత్యల్ప కాల వ్యవధిలో 79 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. వైరాగ్యం ప్రభాకర్, విజిటింగ్ ప్రొఫెసర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం డా. కాంచనపల్లి గోవర్ధన్ రాజు, ప్రముఖ కవి, సినీ నటుడు సాదనాల వెంకట స్వామి నాయుడు, చౌడూరి నరసింహారావు, కవులు, కళాకారులు పాలొగొన్నారు.
-గద్వాల సోమన్న






















Comments