top of page
Writer's pictureNallabati Raghavendra Rao

వాళ్ల నిర్ణయం అమోఘం.. అద్భుతం


'Valla Nirnayam Amogham Adbhutham' New Telugu Story Written By Nallabati Raghavendra Rao

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

హరహరమహాదేవయ్యకి 90 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి.. భార్య అన్నపూర్ణమ్మ కు 80 ఏళ్లు..

కొడుకు శ్రీవిష్ణు, కోడలు శ్రీవల్లి.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు.. వర్క్ ఫ్రమ్ హోమ్.

ఇంకా.. సంవత్సరం వయసు నిండి.. అప్పుడే పడి పడి లేస్తూ బుడిబుడి నడకలు వేస్తున్న మనవడు 'చందు'.

వృద్ధ దంపతులు ఇద్దరూ తన అవసాన కాలం ఆనందంగా గడపడానికి.. తన కొడుకు కోడలు ఇంట్లో అనుకూల వాతావరణం తమకు లేదని భావిస్తూ నెల రోజుల నుంచి తర్జన భర్జనలు పడుతూ.. తట్టుకోలేని పరిస్థితిలో ఒక నిర్ణ యానికి వచ్చేశారు.

వాళ్ళిద్దరూ తమ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్కులో మూలగా ఉన్న సిమెంట్ బల్లమీద కూర్చు న్నారు.. ఇద్దరి చేతులలోనూ వైట్ పేపర్, బాల్ పెన్ ఉన్నాయి.

"అన్నపూర్ణ! మనం పడ్డ క్షోభను గురించి నీ మనసు లో ఏమనుకుంటున్నావు? ఆ భావం పూర్తిగా వాళ్ళు ఇద్దరకు అర్థమయ్యేలా ఈ పేపర్ మీద రాయి.. నేను కూడా నా దగ్గరున్న పేపర్ మీద రాస్తాను" అంటూ భార్యకు చెప్పాడు.. హరిహరమహాదేవయ్య.

అంతే.. ఇద్దరూ తమ స్మృతిపథం లోని విష యాలను గుర్తుచేసుకుంటూ తాము అనుభ వించిన బాధను అక్షరాల రూపంలో పెట్టటం ఆరంభించారు.

"ఒరేయ్ శ్రీ విష్ణు.. భోగి పండుగ నాడు ఆవుపేడతో పిడకలు చేసి దండ కట్టి నా మనవడు చేత భోగి మంట లో వేయిద్దాం అనుకున్నాను. మీరిద్దరూ.. 'కుదరదు'.. అన్నారు. ఆ భోగి పిడక విభూది నుదుటన బొట్టు పెట్టుకుంటే.. వచ్చే భోగి వరకు ఆయురారోగ్యాలతో ఉంటారురా.. అని నెత్తీ నోరు మొత్తు కు చెప్పినా.. కాదన్నారు.. ‘ఇప్పుడు భోగిమంటలు భోగి పిడక లు ఎక్కడ ఉంటాయి???.. ఆ చాదస్తాలు అన్నీ ఇప్పుడు కుదరదు..’ అంటూ చాలా చిరాకు పడ్డారు.

‘ఆ విభూదికి ముఖం మచ్చ పడిపోతుంది బాబోయ్!!’ అన్నారు మీరిద్దరూ. ఎలర్జీలు.. దానికడుపుమండ.. ఇంకేదో ఇంకేదో వచ్చేస్తుంది అన్నారు ఇంగ్లీషులో.


సరే మీరిద్దరూ ఏమీ తెలియని చిన్నపిల్లలు అనుకోవడానికి.. అలా కాదు కదా.. నీకేమో గడ్డం బోల్డంత పెరిగింది. నీ పెళ్ళానికేమో ఆ మాయదారి ఉంగరాల జుట్టు కి పాలిష్ పెట్టడానికే టైం సరిపోవడం లేదు. ఎంత మహా నగరంలో ఉంటే మాత్రం.. సాంప్రదాయాలు మొత్తం మూటగట్టి పక్కన పెట్టేసి బ్రతకాలంటే మా వల్ల కాదు.

పోనీ సంవత్సరాదికి వేప పచ్చడి అయినా చేయనిచ్చారా?.. కనీసం మనవడు చందు అయినా కొత్త బట్టలు కట్టుకోవాలి రా అంటే విన్నారా?? కావాలంటే మీరు కట్టుకోండి మాకు అక్కర్లేదు అన్నారు.. మాకు బట్టలు లేక కాదు.

నూతన సంవత్సరం.. అది ఒక సాంప్రదాయం రా.. అంటే వినలేదు మీరు. ఒక మూలన ఆకు వేసి పెద్దలకు భోజనం పెట్టుకోవాలి రా.. అంటే కూడా పొసగనిచ్చారు కాదు.. చి చి ఎందు కొచ్చిన బ్రతుకు అనిపిస్తుంది. ఈ వయసు లో మాకు ఏం కావాలి.. ? అర్థం చేసుకోవడం లేదు మీరు.

చందుని కాళ్ల మీద వేసుకొని ఆడిస్తుంటే అలా వద్దు మట్టి అంటుకుంటుంది అంటారు.. లాక్కొని పోతారు. అసలు మీకు ఒక విషయం తెలుసా.. మా రోజుల్లో మా కుటుంబాల్లో అలాంటి పిల్లలను మేము కాళ్ళమీద పడుకో బెట్టుకుని.. ప్రతిరోజూ తెల్లవారుజామునే నూనె రాసి నలుగు పెట్టే వాళ్ళం. కుంకుడు కాయ పులుసు తో తల అంటి గోరువెచ్చని నీళ్ళు పోస్తే పిల్లలు బంతి పువ్వు లాగా ఉండేవారు రా.. ఇప్పుడు మీరు ఏమంటున్నారు. ఆ 'నెట్టుపెట్టి' ద్వారా నలుగుపిండి తెప్పించారు.. అదేమో గడ్డకట్టుకు పోయింది.. ఇంట్లో తయారుచేసుకోవచ్చు రా అంటే విన్నారు కాదు.

అంతా మీ ఇష్టం.. ఆలనాపాలనా సరిగ్గా లేక పిల్లోడు ఎలా తయారయ్యాడో చూడు.. పిల్లోడిని మా చేతిలో పెట్టరు. మీరేమో సరిగ్గా చూడలేరు. ఏ.. నేను సరిగ్గా పెంచబట్టే కదా నువ్వు ఇంత వాడి వయ్యావు.. ఆ బుద్ధి జ్ఞానం కూడా లేదు నీకు. నీకు లేనప్పుడు కోడలు పిల్ల కు ఎక్కడి నుంచి వస్తుంది.. ఆవిడగారు కూడా తందానతాన అన్నట్టు ప్రవర్తిస్తుంది.

అసలు.. "కాళ్ళగజ్జకంకాలమ్మ" గురించి మీకు ఏమి తెలుసు రా.. నేను నీ చిన్నప్పుడు ఆడించిన ఆటలన్నీ మరిచిపోయావు. ఇప్పుడు అవి వద్దు అని.. ఆ దిక్కు మాలిన.. ఆ "నెట్టుపెట్టె".. పిల్లోడి ఎదురుగా పెట్టిపెట్టి ఆ లేత బుర్రకు ఇంగ్లీష్ నేర్పించేయాలనుకుంటున్నావు.

నేర్పించుకో.. తప్పులేదు.. కానీ మన సంస్కృతిని మంటకలపకు రా..

శ్రీ విష్ణు.. నీమాట అటుంచు కోడలు శ్రీవల్లి కూడా.. నీలాగే నడుచుకుంటుంది. మా మీద గౌరవం బొత్తిగా లేదు.. పోయిన వేసవికాలం లో.. కరెంటు పోయింది జనరేటర్ లేదు.. కనీసం ఆ విసనకర్ర వెతికి ఇచ్చిందా.. చందు ని పడుకో పెట్టడంలోనే ఆవిడకు 24 గంటలు సరిపోతున్నాయి.

"చందు బట్టలకు బటన్ ఊడిపోతే.. సూది దారం తో కుట్టడం కూడా రాకుండా బ్రతుకుతుంది.. నీ పెళ్ళాం శ్రీవల్లి కి కనీసం పూజలు చేయడం కూడా అలవాటు చేయలేదు వాళ్ల వాళ్లు!.. పోనీ నాకు తెలిసిన ఏదో నేను నేర్పుతామంటే నేర్చుకుంటుందా?

పూజా విధానం ఇలా చేయాలమ్మ.. అని.. నేను చెప్పబోతుంటే..

" నాకు తెలుసు అత్తయ్య.. నెట్టులో చూసేను.

అంటూ దాన్ని ఇష్టం వచ్చినట్లు చేసి పడేస్తుంది నీ పెళ్ళాం శ్రీవల్లి.. పెళ్లి చూపుల్లో బొద్దుగా, బుద్ధిగా కనబడిందని సరే.. అన్నాను. మోసపోయానురా.

" ఆ మాయదారి 'నెట్టుపెట్టె' తో.. మీ ఇద్దరికీ 24 గంటలు సరిపోవడం లేదు. ఆ దిక్కుమాలిన "నెట్టుపెట్టె".. అదే మీకు అమ్మానాన్న.. చుట్టo..

స్నేహితుడు.. !

అవును మరి మాకన్నా ఎక్కువ విషయాల్ని నేర్పు తుంది ఆ ముదనష్టపు పెట్టె.

దాన్నే నమ్ముకోండి.. మోసి కని పెంచిన మమ్మల్ని పక్కన పెట్టేయండి.

మీ వ్యవహారాలలో మీరు బిజీగా ఉన్నప్పుడు.. మేము చెప్పిన ఏ విధానము మీరు అవలం బించకుండా నడు చుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మీ ఎదురు గుండా మేము ఉండడం దేనికి రా. తిని పడుకోవడానికే కదా..

మీ 'నెట్టుపెట్ట' లే మీకు జీవితం.. ఆహారం.. నిద్ర..

దాని కడుపు మండ.. అది వచ్చి మా బిడ్డలను మాకు దూరం చేసింది రా.. "

అన్నపూర్ణమ్మ తను రాసిందంతా భర్తకు విని పించింది.

"సరే.. మన బంగారం మంచిది కానప్పుడు.. ఇతరులను నిందించడం అనవసరం.. మధ్య లో ఆ కంప్యూ టర్ ఏమి చేసింది??? ఒక విధంగా చెప్పాలంటే అదే కదా మన అందరికీ తిండి పెడుతుంది రోజులు మారా యి అన్న పూర్ణా.. మనమే మారలేకపోతున్నాము..

నిజం చెప్పాలంటే మనవి ఎందుకూ పనికిరాని పాత సాంప్రదాయలే కదా!.. పాత చింతకాయ పచ్చడి కాలం నాటి మనుషులo మనం.. ఇంకా పాత చింత కాయ పచ్చడి ఊరిఊరి కాస్త రుచిగా అయినా ఉంటుంది. మనం మాత్రం ఎందు కు పనికిరాని చప్పని చప్పిడి తిండి లాంటి వాళ్ళం. వేస్టు మనుషులం అన్నమాట..


వేస్ట్ బకెట్ అయినా ఉపయోగకరంగా ఉంటుంది. చెత్త తనలో పోసుకుంటూ దాని ధర్మం అది నిర్వర్తిస్తూ ఉంటుంది. మనిద్దరం వాళ్ల దృష్టిలో వేస్టు బకెట్టు కన్నా కొరగాని వాళ్ళం అన్న మాట! బాగా గుర్తుకు తెచ్చు కుని మనసుకు గాయం కలిగిన విషయా లన్నీ కలగలిపి రాత్రికి మిగిలింది కూడా రాయి".. అంటూ భార్య రాసిన కాగితం ఆమె చేతికిచ్చేసి తను రాసింది చదవ నారంభించాడు హరహర మహదే వయ్య.

"వినాయకచవితికి ఏం చేశారు మీరు.. పాల వెల్లి కట్టాలిరా అంటే పాలవెల్లి లేదు.. గుడ్డు లేదు అన్నారు.. అవన్నీ ఇక్కడ కుదరవు అన్నారు. మేము ఇద్దరం ఎంత బాధ పడిపో యామో మీ ఇద్దరికీ తెలుసా??.. ఉండ్రాళ్ళు ఏమిటి తాలికలు ఏమిటి అన్నారు..

అసలు ఆరిది అంటే ఏమిటి అని అడిగారు????.. చిన్నప్పుడు మేము చేసి పెట్టడం.. నువ్వు శుభ్రంగా తినడం మరిచి పోయావటరా శ్రీ విష్ణు.. కోడలు శ్రీవల్లి మాట అలా ఉంచు నీ బుద్ధి ఏమైందిరా.. ఎంత కంప్యూ టర్ ఉద్యో గాలు అయితే మాత్రం.. జీవితం కంపు కొట్టించుకుంటే ఎట్లా.. ?

దసరా సరదాలు తీరనిచ్చారా.. ? బాణం ఇంట్లో తయారు చేయకపోయినా.. మార్కెట్ నుండి కొని తెచ్చి.. రంగు బుక్కా పొడి. , . నామనవడి చేత మనమే కొట్టేస్తూ పిల్లలు అందరితో ఆడు కునే లా చేయాలిరా ఆ సరదా మళ్లీ సంవత్స రానికి గాని రాదురా అంటే,

విన్నారా.. ? కళ్ళు పోతాయి.. వద్దు అన్నావు.. నిన్ను ఆడించ లేదా ఆ విధంగ.. ! నీకు కళ్లు పోయాయా??

దీపావళికిమాత్రం మందు సామాను వద్దు గుండు సామాను వద్దు అన్నారు.. చందు కాల్చకపోయినా చూస్తాడు రా ఆనందపడ తాడు రా.. సరదాగా కాల్పించాలి రా అంటే ఒక్క రూపాయి మందు సామాను కూడా తెచ్చావు కాదు.. కాళ్లు చేతులు కాలిపో తాయి అన్నావు.. తాతగారుగా పోనీ నేను తెచ్చి ఇంట్లో పెడితే ఆచిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రా లు.. మతాబులు.. పెంటలో పాడేయండి అన్నావు. ఆ చిన్న పిల్లోడిని కూడా మాకు కాకుండాచేసి పడేస్తున్నారు.. మీరిద్దరూ.

తాతమామ్మ లతో సరదా ఆటలు ఆడనివ్వరు. మీ అమ్మ చెప్పినట్టు.. ఆ 'నెట్టుపెట్టె' లో ఉన్నవన్నీ నేర్పి స్తామంటారు.. ఇప్పుడు ట్రెండు మారింది అంటు న్నారు.. పాతకాలం అలవాట్లతో పిల్లలు మనసు ఎదగదు అంటు న్నారు.. తిండి కూడా పాత కాలం నాటిది వద్దు అంటున్నారు.. రకరకాల కొత్త అల వాట్లు నేర్చుకొని ఫాస్ట్గా ముందుకు వెళ్లక పోతే బ్రత కలేము అంటున్నారు.. ఇంకా నోటికొ చ్చింది ఏదేదో వాగేస్తున్నారు.. తల్లిదండ్రు లంటే దమ్మిడికాసు లో 60 వంతు.. విలువ లేకుండా పోయింది మీ ఇద్దర కు.

మా అమ్మానాన్నలకు మేము ఎంత భయపడే వాళ్ళ మో మీ ఇద్దరికీ ఏమైనా తెలుసు రా ?

ఏమైనా గట్టిగా మాట్లాడితే.. గది తలుపు గడి య పెట్టుకొని కూనిరాగాలు తీసుకోవడం.. ఆ పూట భోజనం మానేయడం.. మళ్లీ మేమే బ్రతిమిలాడ డం.. ఇష్టం లేనట్టు నటిస్తూ సాయంత్రం భోజనం కన్నా డబల్ టిఫిన్ లాగిన్ చేయడం.. భలే ఉంది మీ ఇద్దరి వరస. రకరకాల విద్యలు.

నేర్చుకోండి రా నువ్వు కోడలు 90 రకాల విద్యలు నేర్చుకుని సుఖంగా బ్రతకండి. మాకెందుకు రేపో ఎల్లుండో ఊడిపోయే వాళ్ళం.. మేము ఇలాగేపోతాం.

.. మాకు ఇదే ఇష్టం.. మీతో సమానంగా మేము గుడు గుడు గుండం ఆడలేము. "

"మీరిద్దరూ మూతిముడుచుకోవడాలు.. చిరాకు పడడాలు.. ఇంగ్లీషులో మా మీద గుసగుసలు చెప్పుకోవడాలు.. మమ్మల్ని పట్టించు కోకపో వడం.. మీ అదోరకం చూపులు.. మేమిద్దరం మీ ఇద్దరికీ అడ్డంగా ఉన్నామన్నమీఫీలింగ్.. భరించ లేకపోతు న్నాము.. రెండు పూటలా భోజనం చేసిన మాకు అరగటం లేదు.. తట్టు కోలేక పోతున్నాము.. అందుకే ఈ నిర్ణయం"

హరిహరమహాదేవయ్య.. తను రాసింది అంతా చదివి భార్యకు వినిపించాడు..

"ఓస్ ఇంతేనా.. ఇంకా చాలా బాధలు పడ్డాము కదా.. మీరేదో తెగ రాసి పొడిచేస్తారేమో అనుకున్నాను.. మీ కన్నా నేనే ఒక పిసరనయo..

మనల్ని ఎలా ఏడిపించారు వాళ్ళు.. గుర్తులేదా..

ఆ బాధలన్నీ మరిచిపోయారా.. ? కాస్త మంచి కూర వండి పెడితే అన్నీ మరిచి పోయి ఇహిహి ఇహిహి అని నవ్వేస్తారు.. మీరు. అసలు మీ వల్లే వాళ్ళిద్దరూ ఇలా తయారయ్యారు. మొదట నుండి సరైన అదు పాజ్ఞలలో పెడితే.. ఈరోజు మనకీ కర్మ పట్టేది కాదు. "

భర్త హరిహరమహాదేవయ్య తో విసవిసగా మాట్లాడుతూ అంది భార్య అన్నపూర్ణమ్మ.

"ఇదేదో బావుందే.. వాళ్లని ఏమీ అనలేక నన్ను అంటు న్నావ్.. ఇంకా రాత్రి మిగిలి ఉంది కదా రాత్రికి బోల్డంత రాస్తాను కదా.. ఆ కంగారు ఏమిటి.. ఇలాగా కంగారుగా మాట్లాడబట్టే వాళ్ళు నిన్ను కూడా లోకువ చేసేసారు. తల్లి అన్న బుద్ధి వాడికి గాని.. అత్తగారు అన్న జ్ఞానం ఈ కోడలు పిల్లకు కానీ.. లేకుండా పోయాయి".

"అన్నపూర్ణ.. మిగిలిన విషయాలు గుర్తుకు చేసు కుని రాత్రికి ఇంటిదగ్గర రాద్దాం.. సరే, మన ఇద్దరికీ రెండు బ్యాగులు సదిరావుకదా.. మందు లు.. గట్రా రెడీగా ఉన్నాయి కదా.. పూర్తిగా రాసిన మన ఈ ఇద్దరు పేపర్లు రెండూ మడిచి గదిలో బల్ల మీద పెట్టి ఎగిరి పోకుండా తాళం కప్ప పెడదాం. మనం వెళ్ళిపోయేది తెల్లవారు జామున 5 గంటలకు. ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కేద్దాం.. ఇదిగో మన ముఖాలు మన ఊరి వారు ఎవ్వరికీ కనబడకుండా.. వాళ్ళు ఎవరూ మనల్ని పలకరించకుండా నేను నెత్తి మీద టవల్ కప్పు కుంటాను. నువ్వు చీరకొంగు చుట్టుకో.. అర్థ మవుతుంది కదా దారిలో మనల్ని గుర్తుపట్టి ఎవరైనా పలకరించినా ఎవరితోటి మాట్లాడకు.

మహా అయితే రెండు మూడేళ్లు బతుకుతాం.. ఏ ఏ.. ఏదో ఒక ఊరిలో దేవుడి గుడి దగ్గర కొబ్బరి చిప్పలు తింటూ బ్రతక లేమా?? బ్రతక లేకపోతేచస్తాం..

ఇన్నాళ్లు బ్రతికి ఇంత రాజ భోగం అనుభవించాం చాలదా..

ఎంతోమంది చుట్టాలు.. స్నేహితులు.. వాళ్ళ అందరితోటి ఇన్నాళ్ళు చాలా సరదాగా గడిపాము

మా ఊరిలో మనిద్దరికీ సన్మానం కూడా జరిగింది.

చాలా గౌరవంగానే జరిగింది కానీ అగౌరవం ఏమాత్రం లేదు. ఇప్పుడంటే లేదు కానీ.. బోల్డన్ని బంగారాలు కూడా పెట్టుకున్నాం

హోదాగానే.. బ్రతికాo. అన్ని సరదాలు తీరి పోయాయి

గుడులు గోపురాలు మొత్తం అన్నీ చుట్టపెట్టాం.

పూజలు పునస్కారాలు బోల్డన్ని చేసుకున్న ఆనంద జీవితం మనది.. వెంకటేశ్వర కళ్యాణా నికి పీటల మీద కూడా కూర్చున్నాం.. గుర్తు ఉందా?యాత్రలన్ని తిరి గేసాం.. అన్నట్టు శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్లి.. ఎంత రాజభోగం అనుభవించాం మనమే విఐపిలo అనుకుని.. రెడ్కార్పెట్ మీద నడిపించారు. డైరెక్టుగా గర్భ గుడిలోకి తీసుకెళ్లి పోయారు. అది విచిత్రమైన సంఘటన. "

హరహరమహాదేవయ్య.. చెప్పడం ఆపి భుజాన టవల్ తీసుకొని కళ్ళు రెండు ఒత్తుకున్నాడు.. అన్నపూర్ణమ్మ కూడా తన పమిట కొంగుతో కళ్ళు ఒత్తుకుంది.

తమ చేతిలోని పేపర్లు రెండూ మడిచి జాగ్రత్త పెట్టు కుని.. ఇంటి ముఖం పట్టారు.. హరిహర మహాదేవ య్య.. అన్నపూర్ణమ్మ లు

ఆ రాత్రికి చాలాసేపు ఆలోచించి ఆలోచించి.. ఇంకా రాయవలసింది అంతా పూర్తిగా రాసి.. జాగ్రత్తగా ఇద్దరి పేపర్లు మడిచి బల్లమీద పెట్టి తాళంకప్ప బరువు పెట్టారు. పెద్ద గడియారం లో పన్నెండు గంటలు కొట్టింది. ఆ శబ్దం తమ గుండెల మీద ఎవరో కసుక్కున కసుక్కున తొక్కుతున్న భావన కలిగింది. తమాయించుకున్నారు.

నిద్ర పోవడానికి ప్రయత్నించారు. అటూఇటూ ఎంత దొర్లినప్పటికీ నిద్ర పట్టలేదు. తెరలు తెరలుగా దొంత రలు దొంతరలుగా అలలు అల లుగా గుర్తుకొస్తున్న గత సంఘటనలన్నింటినీ తొక్కి పెట్టుకుంటున్నారు.. అలా అలా తెల్ల వారు జామున 5 గంటలు అయింది.

పైకిలేచి తమ రెండు బ్యాగులు చేత్తో పట్టుకొని తాము రాసిన పేపర్లు మడచిపెట్టి అక్కడే ఉన్న బల్లమీద భద్రంగా పెట్టాము అని మరొక్క సారి నిర్ధారించుకుని.. శబ్దం కాకుండా తమ గది తలుపులు తెరిచారు..

' అంతే.. అంతే.. '

గడప అవతల క్రింద నేల మీద దృశ్యం చూసి.. నిశ్చేష్టులైపోయారు.. తమ ఇద్దరి హృదయా లలో ఆనందపు లావా ఉబికి ఉబికి పెల్లుబికి పైపైకి విరజిమ్ముతున్న ఆనందం కలిగింది.

క్షణం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏదో మాట్లాడుకున్నారు.. నవ్వుకున్నారు.. పరవశించి పోయారు.

వెంటనే తమ చేతిలోని బ్యాగులతో వెనక్కు నడిచారు. అలమర లో పెట్టేశారు. బల్ల మీద పెట్టిన తాము రాసిన రెండు కాగితాలు తీసి ముక్కలు ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసారు.

ఎదర రూములో.. కొడుకు కోడలు ఇంకా నిద్ర పోతున్నట్టుగా గ్రహించారు.

వెంటనే గబగబా.. ఆప్యాయతగా అభిమానం గా ప్రేమను ఆపుకోలేక ఇద్దరూ తమ గది గడప దాటి బయటకు వచ్చారు.. ఒక్కసారిగా.

రాత్రి తల్లిదండ్రుల దగ్గర పడుకొని తెల్లవారు జామున 5 గంటలకు మెలుకువ వచ్చేసి పక్క మీద నుంచి లేచి ఆ గదిలో తాత మామ్మలు అయిన తామిద్దరి కోసం చుట్టూ చూసి కనబడక బుడిబుడి నడకలతో బయటకు నడుచు కుంటూ వచ్చి.. తమ గది తలుపుల దగ్గర నిలబడి బోసినవ్వులతో తల పైకెత్తి తామి ద్దరి వైపు చూస్తూ..

" ఈహిహి.. ఈహిహి". ఎక్కడకు వెళ్ళి పోతారు..

తాతయ్య.. నానమ్మ నా కోసమైనా ఉండరా" అన్నట్టు చూస్తున్న.. మనవడు 'చందు' ముఖం లక్ష కోట్ల వోల్టుల పవర్ఫుల్ ఎలక్ట్రికల్బల్బు లా కనిపించింది... ఆ వృద్ధ దంపతులు ఇద్దరికీ!!!

హరిహరమహదేవయ్య అన్నపూర్ణమ్మ లు.. ఆనందంతో మనవడి ని ఒకేసారి పైకి లేవదీసి ఎత్తుకొని.. గుండెలకు హత్తుకుని ఆనందంతో ముద్దాడారు!!..

"కన్నా.. చందు.. అరేయ్.. నీతో పాటు బుడి బుడి నడకలు మేము కూడా వేయాలి రా. అంతేనా.. నీతోపాటు పరుగు పెట్టాలి.. కోతి కొమ్మచ్చి ఆడాలి కదా. ఇంకా సరదాసరదాగా నువ్వు కూడా మమ్మల్ని పిడిగుద్దులు గుద్దు తుంటే అవి కూడా మహదానందంగా మేము భరించాలి కదరా. తాతామామ్మలుగా ఈ ఆనందాలన్నీ నీకు దూరం చేసే హక్కు.. మాకు లేదు రా. అప్పుడే మా జీవిత సంపూర్ణ ధర్మం కూడా పూర్తి గా పూర్తవుతుంది! నీకు అన్యాయం చేయమురా.. ముద్దుల మనవడా.. ఇన్నాళ్ళు.. నీ అమ్మానాన్నల వల్ల అనుభవిం చిన బాధ.. నీ బోసి నవ్వుల ముందు మరిచిపోయాoరా.. "

అలా మనసులో అనుకుంటున్న.. ఆ వృద్ధ దంపతులు ఇంకా మనవడిని ముద్దాడుతూనే ఉన్నారు.

ఇప్పుడు హరిహరమహాదేవయ్య అన్నపూర్ణమ్మ లలో గతించిన క్షోభ బాపతు బాధ.. అణు మాత్రం కూడా లేదు.

భవిష్యత్తులో ఇంకా కఠినమైన సమస్యలు ఎదురైనా మనవడి కోసం తట్టుకోగల శక్తి వాళ్లలో ఏర్పడి ప్రాణం ఉన్నంత వరకు మనవడి దగ్గరే ఉండిపోవాలని పూర్తిగా నిశ్చయించుకున్నారు.

వాళ్లు ఎంచుకున్న మార్గం ఇప్పుడు వాళ్ళిద్దరికీ స్వర్ణ రహదారిలా కనిపిస్తుంది.. !

************************************

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు



46 views0 comments

Comentários


bottom of page