వంటవాడు
- Addanki Lakshmi

- 16 hours ago
- 4 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #Vantavadu, #వంటవాడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vantavadu - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 06/12/2025
వంటవాడు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
మూర్తి తల్లిదండ్రులు సీతమ్మ, రామయ్యకు ముగ్గురు మగపిల్లలు. మూర్తి ఆఖరివాడు. ముగ్గురూ చదువుల్లో మేధావంతులు.
ఆడపిల్లలు లేకపోవడం వల్ల మూర్తికి అమ్మంటే ప్రేమతో చేదోడు వాదోడుగా పనిలో ఉండేవాడు. వంటలో సహాయం చేసేవాడు. అందుచే వంటలో అతనికి కాస్త అనుభవం ఉంది..
మూర్తి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మంచి జీవితం తెచ్చుకుంటున్నాడు. భార్య రత్న చదువుకుంది.
ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుంది.
కరోనాటైంలో ఆఫీసు మూసేశారు. ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో పనులు జరుగుతున్నాయి. మూర్తి ఆఫీసు పనులు చేసి బోర్ కొట్టినప్పుడు భార్య రత్నకు వంటల్లో సహాయం చేస్తాడు,
ఒకరోజు ఏం జరిగిందంటే, ,
___&&&&__
" ఏమండీ, ఇదిగో కాఫీ.. ” రత్న, మూర్తి కి కాఫీ ఇస్తూ.
“నే నొక విషయం చెప్పనా..” అంటూ నసిగింది.
"చెప్పు, ఎందుకు సందేహం..”- మూర్తి టి. వి చూస్తూ..
"మరి, ఏంలేదు, సోమవారం నుంచి ఆఫీసు తెరుస్తారు కదా. వెళ్తారా..”
"అదేంటి.. ఇంట్లో కూర్చుని వుంటే డబ్బు ఎలా వస్తుంది, తిండి ఎలా గడుస్తుందీ, ఇప్పటికే కంపెనీలన్నీ నష్ట పోయాయి.. "
"అది, కాదండీ, పోనీ జాబ్ మానేయ రాదూ.. "
"జాబ్ మానేయాలా.. నీకేం పిచ్చి పట్టిందా.. ఇద్దరు పిల్లలతో నెలకి.. ఏదో, బొటాబొటి గా వచ్చే జీవితంతో ఇల్లు గడుస్తోంది, అయినా ఇంట్లో కూర్చుని వుంటే
డబ్బు ఎలా వస్తుంది, తిండి ఎలా, నాకు టైంపాస్ ఎలా.. "
"టైం ఇప్పుడు గడిచి పోతోందిగా.. అలాగే.. " రత్న నసిగింది, ,
"ఏమిటి నీ ఉద్దేశ్యం, సరిగా చెప్పు.. "
"మరి ఏంలేదండీ, , మీరు జాబ్ మానేసి.. మనం కేటరింగ్ బిజినెస్ పెట్టు కుందాము. పైన మూడవ అంతస్తులో ఆ శెట్టిగారిది కేటరింగ్ బిజినెస్ కదా.
3 ఫ్లాట్లు కొన్నారు. 2 కార్లు. ఎంతో దర్జాగా వుంటారో.. ఆయనకి చదువా సంధ్యా..
మీరూ వున్నారు. సాఫ్ట్వేర్ అన్న మాట యే గానీ.. ఏం ఉపయోగం.. క్యాట్ రింగ్ అయితే బోలెడు లాభాలు. ఇంట్లో వంట వండుకో అక్కర్లేదు. ఆ క్యాటరింగ్ చేసిన పదార్థాలు మనము కూడా తినేయొచ్చు.. "
అంది హుషారుగా రత్న.
"మనకేం వస్తుందే, బిజినెస్ కి చాలా తెలివి వుండాలి. రకరకాల వంటలు తెలియాలి.. "
"లేదండీ, మీకు అన్ని రకాల వంటకాలు వచ్చేసాయి ఇప్పుడు. ఇంకొన్ని బెంగాలీ స్వీట్లు, పంజాబీ వంటకాలు నేర్చు కుంటే, మీరు వంటలు వండడం, లో ఎక్సుపర్టు అయిపోతారు. సౌత్ ఇండియన్ వంటకాలు బాగా వచ్చేసాయి. "
"ఏదో అప్పుడప్పుడు సరదాకి చేస్తున్న వంటలే కాని నాకేం వస్తాయే"
"లేదండీ, మీరు చాలా బాగా చేస్తారు వంటలు,
మొన్న మీరు రవ్వ లడ్డు చేసారు కదా, పక్కింటి బామ్మ గారు ఎంత మెచ్చు కొన్నారో.. "
"ఏమిటి రవ్వ లడ్డు బామ్మ గారికి పెట్టావా?"
"అవునండి! మా ఆయన చేశారు అని చెప్పాను.
ఆరోజు మైసూరు పాక్ చేశారు కదా, మా ఫ్రెండ్ సరోజ కి పెట్టేను. అది మిమ్మల్ని ఎంత మెచ్చుకుందో.. ‘నోట్లో వేసుకుంటే కరిగి పోతుంది’ అంటూ ‘ఇంత బాగా హోటల్ వాళ్ళు కూడా చెయ్యరు’ అంది.
గోంగూర పచ్చడి కూడా ఇచ్చాను, ఇస్తే, వాళ్ళాయన కి ఎంతో
నచ్చేసిందిట.. మీ వంటలు తిని మా ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటున్నారండి. హోటల్ వాళ్లు కూడా ఇంత బాగా చేయరు అంటున్నారు. నీవెంత అదృష్టవంతురాలివే, ఇంత చక్కగా వండి పెట్టే భర్త దొరికాడు నీకు అంటూ మెచ్చుకుంటారు.. వాళ్ళందరూ, నన్ను చూసి ఈర్ష పడుతున్నారు. మీ చేతి వంటలు అందరికీ నచ్చుతున్నాయి.. " అంటూ చెప్పుకుపోతోంది..
“ఆపు ఆపు నీ సోది.. ఏమిటి.. నే నేదో టైంపాస్ కి నీకు సహాయం చేస్తుంటే.. నేవండిన వంటలన్నీ
అందరీకీ నుంచి పెడుతున్నావా.. నా పరువు తీస్తున్నావు కాదటే.. పైగా ఉద్యోగం మానేయమని సలహా.. క్యాటరింగు పెట్టాలా.. నీకేమైనా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? నా చదువు ఏమిటి.. నా ఉద్యోగం ఏమిటి.. ఏదో సరదాగా వంటలో నీకు సహాయం చేస్తే, నీ ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు తీస్తావా.. నీకు ఏమైనా బుద్ధి ఉందా"
"అది కాదండీ. మన మంచికే నేను చెబుతున్నాను.. ఆ క్యాటరింగ్ బిజినెస్ లో డబ్బులు బాగా వస్తాయి.
ఈ ఉద్యోగాల్లో ఎదుగు బొదుగు వుండదు. ఏడాదంతా కష్టపడి చాకిరీ చేస్తే ఒక వెయ్యి రూపాయలు పెంచుతారు. అంతే కదా"
"సరే.. నీవు చెప్పినట్లే. మంచి ఆలోచనే.. అయితే విను..
మొన్న ఒక కిలో రవ్వ లడ్డు చేసాకదా ఎన్ని వున్నాయి"
"ఏమీ లేవండి. అన్ని అయిపోయాయి. పిల్లల నేను తినేసి, మిగిలినవి పక్కింటి వాళ్ళకి ఇచ్చేసా.. "
"క్రిందటి వారం చేసిన 2 కిలోల చక్కి లాలు ఎన్ని వున్నాయి.. "
"రెండు కిలోలు ఏమి మిగులుతాయి, పిల్లలిద్దరూ బాగున్నాయి అని ఒక్క రోజు లో లాగించేసారు.. "
"అంతకు ముందు చేసిన ఒక కిలో కజ్జికాయలు, కిలో మైసూరు పాక్, రెండు కిలోల బాదుషా, ఒకకిలో సున్నుండలు, రెండు కిలోల.. రవ్వ లడ్డు
ఇంకా ఎన్ని మిగిలాయో చెప్పు”
"ఏమి మిగులుతాయి అండి పిల్లలు అస్తమానం తింటూ ఉంటారు"
"చూసావా కిలోలు కిలోలు లాగించేస్తున్నారు,
నువ్వు నీ పిల్లలు.. ఒక్కొక్కళ్ళు పది కిలో లు బరువు పెరిగి పోయారు.
మళ్లీ జిమ్ములో జేరతామంటూ గొడవ.. దానికి డబ్బు ఖర్చు.
క్యాటరింగు బిజినెస్ పెట్టాలా.. ఏంచేస్తాం. వండినవన్నీ మీరే తినేస్తారు.
చేసిన దానిలో ఒక్కటి రుచి చూద్దాం అన్నా మిగల్చరు.
ఇంక బిజినెస్ ఏం చేయాలి, వెళ్ళి పని చూచుకో..
పోనీకదా అని సెలవుల్లో నీకు సాయం చేస్తూ ఉంటే,
నీ బోడి సలహా, రేపటి నుంచి వంటగది లో కొచ్చి నీకు సహాయం చేసేది లేదు.. వెళ్ళి పని చూచుకో..
క్యాటరింగ్ బిజినెస్ ట, బుద్ది లేకపోతే సరీ, మళ్లీ ఇలా వాగావంటే చెంప చళ్ళు మంటుంది ఏమిటి అనుకుంటున్నావు, " అంటూ మూర్తి
అరిచాడు.
రత్న ముఖం మాడ్చు కొని వంటగదిలోకి వెళ్ళింది.
&&&&&&_
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు
**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,
కథలు, రుబాయీలు, బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను.




Comments