top of page
Original.png

వేడుకల పేరుతో - వృధా ఖర్చులు

#AAnnapurna, #అన్నపూర్ణవ్యాసాలు, #VedukalaPeruthoVrudhaKharchulu, #వేడుకలపేరుతోవృధాఖర్చులు


Vedukala Perutho Vrudha Kharchulu - New Telugu Article Written By A. Annapurna Published in manatelugukathalu.com on 23/01/2026

వేడుకల పేరుతో - వృధా ఖర్చులు - తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి


'రెండు నెలలుగా ఒకటే ఫంక్షన్లు. ఇండియాలో ఇరుక్కుపోయానే... అని విసుగు వచ్చింది!


ఏదో పెళ్లి, ముఖ్యమైన బంధువులతో గెట్-టుగెదర్... ఎటూ ఇండియా విడిచి వెళ్లిపోతున్నా. అందరినీ కలిసినట్టు ఉంటుంది అనుకుని చాలావరకు అవాయిడ్ చేశాను.


నాకైతే షాపింగ్ చేయడాలు అమెరికాలో కంటే చీప్ కనుక కొనేయాలి... ఇంటిని నింపేయాలి. ఆ రీమా పెద్ద పోజు... ఆరు నెలలకోసారి ఇండియా రావడం, ఏవో తెచ్చి ఎగ్జిబిట్ చేయడం... అనే పోటీకి నేను వ్యతిరేకం.

ఎక్కడున్నా హద్దుల్లో ఉండటం, గౌరవప్రదంగా ఉండటం, అమెరికన్లతో స్నేహం - నాకిష్టం.

కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు. పుస్తకాలూ, సాహిత్యం, లైబ్రరీ ఉంటే చాలు. మంచి మ్యూజిక్, సాంగ్స్, మూవీస్ ఇష్టం. ఇంటిపని, వంటపని హాబీలు. తోచదు అనే మాట నాకు అర్థం కానిది.


కొంతకాలం ఇండియాలో ఉండాల్సి వచ్చింది. సొంత పనుల కోసం.


తెలిసినవారు ''మా అబ్బాయి పిల్లలు అమెరికా నుంచి వచ్చారు. మనవరాలికి ఓణీ ఫంక్షన్ చేస్తున్నాం. పార్టీకి రావాలి,'' అని పిలిచారు.


''సారీ అండీ... వీలు కాదు. అదే రోజు వేరే పని ఉంది,'' అని చెప్పాను.


''అలా వీలు లేదు. మీ పని వాయిదా వేసుకోండి...'' అన్నారు వాళ్ళు.


''అలా పోస్ట్‌పోన్ చేసేది కాదు. లాయరుగారితో పని. ఆయన ఇప్పట్లో దొరకరు,'' అన్నాను.


ఇదెక్కడి గొడవ. వాళ్లకి ఫంక్షన్ ముఖ్యం కావచ్చు. మనల్ని బలవంతపెట్టడం సరి కాదు అనే జ్ఞానం లేదు.


వారితో వాదన ఎందుకని ఊరుకున్నాను.


మా లాయర్ అప్పాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేశారు. అర్జెంటు పనిమీద ఢిల్లీ వెళ్లాలి అంటూ.


''పోనీ వెళ్దామా... మూర్తిగారి అబ్బాయి నా స్టూడెంట్. పెళ్లికి చూడటమే... ఇప్పుడు మంచి పొజిషన్‌కి వచ్చాడు,'' అన్నారు మావారు.


మా వారికి ఎవరు, ఎందుకు ఏ పార్టీకి పిలిచినా వెళ్లడం అంటే మహా ఇష్టం. అప్పుడప్పుడు నా పోరు పడలేక మానేస్తారు కానీ మూర్తిగారి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.


మీరు ఒక్కరే వెళ్ళండి... అంటే... అది ఆడవాళ్ళ ఫంక్షన్. ఒక్కడిని వెళ్తే బాగోదు అనడంతో, నాకు ఇష్టం లేకపోయినా ఆయన కోసం వెళ్లవలసి వచ్చింది. ఈ ఒక్కటి ఎలాగో భరిద్దాం. ఇకనుంచి అమెరికాలో ఈ మొహమాటాలు ఉండవు... అక్కడ ఇండియన్స్ ఎవరూ తెలిసినవాళ్లు మేము ఉండేచోట లేరు... అనుకుని వెళ్లాను.


ఇక చూసుకోండి, తలనొప్పి మొదలైంది. పెద్ద సౌండ్‌తో మ్యూజిక్, డాన్సులు, పాటలు... చెవులు గల్లుపడిపోయాయి. అక్కడి లైటింగ్‌కి, వాళ్ళు వేసుకున్న డ్రస్సులు, నగల ధగధగలకు కళ్ళు మంటలు వచ్చాయి. లేచి అటూ ఇటూ తిరిగితే 'అదేమిటి మీకు నచ్చలేదా? రండి' అంటూ నన్ను లాక్కువచ్చి కోలాటం గ్రూప్‌లో కలిపేసింది ఇంటావిడ.


మూడు గంటల పాటు ఆ గందరగోళం ఎలాగో భరించి, లంచ్ స్టార్ట్ చేశాక అయిందనిపించి, ఇంటికి వచ్చి పడి, ఒకటే నిద్రపోయాను ఆ అలసటకి.


అసలు ఇలాంటి ఫంక్షన్లకి టీనేజ్ పిల్లలను పిలిస్తే ఎంజాయ్ చేస్తారు. బంధువులు అందరినీ కలిసాం కదా అని సంతోషించవచ్చు.


కానీ పరిచయస్తులను పిలవడం అవసరం లేదు. పైగా మనకు గిఫ్ట్ తప్పదు. వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్లాస్టిక్ డబ్బా. వెళ్లి రావడం క్యాబ్‌కి ఖర్చు. తలనొప్పి. భోజనం టైమ్ దాటిపోయి ఇబ్బంది. వెళ్లి రావడానికి పట్టే టైమ్ మరో అలసట.


ఎంత త్వరగా వీళ్ళను తప్పించుకు పోదామా అని ఎదురు చూస్తున్నా!


అమెరికాలో పద్ధతులే వేరు. చాలా కంఫర్టబుల్. అందరినీ పిలవరు. పిలిచినా ఫంక్షన్లు ఇబ్బందిగా ఉండవు.


వాళ్ళు అమెరికన్స్.


ఇండియన్ వారిని మేము కావాలని దూరం పెట్టాము. అనవసర ఆడంబరాలు భరించలేక.


అక్కడ నా ప్రాణం హాయిగా ఉంటుంది. మొహమాటాలు తెలియవు. 'వస్తావా - రావా' అంతే, కచ్చితమైన ఒక్కమాట. పట్టింపులు లేవు. పీకిపాకం పెట్టరు. ఇంట్లో ధ్వని కాలుష్యం ఉండదు. వాళ్ళ గొప్పతనం ఎగ్జిబిట్ చేయడం ఉండదు.


ఫుడ్ కూడా మనం తినేది ఒకటే ఉంటుంది. మోస్ట్‌లీ పిజ్జా (నాన్-వెజ్ మనం ఎలాగా తినం). పిచ్చిపాటలు, డాన్సులు ఉండవు. ''షో'' ఉండదు.


ఎంత సింపుల్ గిఫ్ట్ ఇచ్చినా ఏమీ అనుకోరు.


అలా మన వాళ్లు కూడా నేర్చుకుంటే ఎంత బాగుంటుంది!


.మా వారికైతే ఎవరో దొరికారు. అసలే మాటకారి. పైగా ప్రొఫెసర్. ఇక నన్ను మరిచిపోయి మరో ప్రపంచంలోకి వెళ్లిపోయారు.


*******************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page