top of page

వీడుకోలు

Writer's picture: A . Annapurna A . Annapurna

'Veedukolu' - New Telugu Story Written By A. Annapurna

'వీడుకోలు' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


లంచ్ బ్రేక్ టైం. హరి, తన బాక్సు తీసుకుని తినడానికి వెళ్ళినపుడు, దిగులుగా ఉన్న గిరిని అడిగాడు.

“గిరీ! ఏమిటీ విచారంగా వున్నావూ.. నీ వర్క్ కూడా ఈ రోజు స్లో గా వుంది. ఆరోగ్యం బాగాలేదా?“


“నాకేమి.. బాగానే ఉన్నా. నిన్న అమ్మని డాక్టర్ దగ్గిరకు తీసుకెళ్ళాను. ఆవిడకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వున్నాయి. ‘ఆలస్యం చేసావు. ట్రీట్ మెంట్ కి చాలా ఖర్చు చేయాలి’

అన్నాడు. నాజీతం ఇంటికి చాలదు. ఇక అమ్మకి ఎలా? తోచడం లేదు“


“నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ వున్నారు. ఫీజు తక్కువ. రేపు వెడదాం. ఈ వేయి రూపాయలు వుంచు“ అంటూ ఇచ్చాడు హరి.


“ఇప్పటికే నీకు చాలా బాకీ వున్నాను. ఎప్పటికి తీర్చగలను? థాంక్స్”.


మరునాడు ఆయుర్వేద మందులు కొని రమణమ్మకి ఇచ్చాడు. కానీ అవేమి పని చేయడం లేకపోగా కొత్త ఇబ్బందులు వచ్చాయి.


హరి ఆ విషయం తెలిసి కొత్త ఆలోచన చేసాడు.


“అవును గాని నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?” హఠాత్తుగా హరి కి, గిరిపెళ్లి చేసుకోలేదని గుర్తుకి వచ్చింది.


“ బలే అడిగావు. అసలే పేద బతుకు.. అమ్మకి అనారోగ్యం. నన్ను ఎవరు చేసుకుంటారు? ఈ రోజుల్లో అన్ని వున్నా అబ్బాయిలకు పెళ్లి కావడం లేదు. నాతో పరిహాసమా..!”

“లేదు, అంత దుర్మార్గుడిని కాదు. పేపర్లో ఒక యాడ్ చూసాను. అంగ వైకల్యం వున్నా ఒక మహిళా విడో తనకు నమ్మకస్తుడు ఆశయాలు వున్నా వ్యక్తి భర్తగా కావాలని ప్రకటన ఇచ్చింది.”


“ఐతే మనకేమిటి కలిసి వస్తుంది? ఆవిడకు భర్త వస్తాడు. నా కష్టాలు పెరుగుతాయి.”


“ఆవిడకు చాలా ఆస్తులు వున్నాయి. వాటిని చూసుకుంటూ అండగా వుండే మనిషి కావాలి. ఆవిడ లండన్ లో వుంది. నీ పరిస్థితి చెప్పి మీ అమ్మకి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే నీకే ఉపయోగం. అటు పెళ్లి - ఇటు అమ్మ జబ్బు నయం కావడం.. నీకు మంచి ఛాన్స్“.


“ఏమో ఇవన్నీ అంట సులువుగా జరుగుతాయా? ఆవిడకు నామీద నమ్మకం కుదరాలి. మనలను అర్ధం చేసుకోవాలి. నాకు ఇంగిలీషు రాదు. చదువా టెన్త్ ఫెయిల్, చాలా ప్రాబ్లమ్స్ వున్నాయి.”


“ అదంతా నేను చూసుకుంటాను. ఇంగిలీషు నేర్చుకోవచ్చు. నువ్వు సరే అను”.


“నాకైతే ధైర్యం చాలడం లేదు. తేడాలు వస్తే వెళ్లి జైల్లో కూర్చోవాలి”


“నామీద నమ్మకం ఉంచి నామాట విను. నీకు మహత్తరమైన అవకాశం. ఇది. వదులుకుంటే మల్లి ఎన్నటికీ రాదు.! బాగా అలోచించి త్వరగా చెప్పు. నీ శ్రేయోభిలాషిగా స్నేహితుడిగా చెబుతున్నాను. ఇంకెవరో ఈ అదృష్టాన్నీ దక్కించుకుంటారు”అని చెప్పి వెళ్ళిపోయాడు హరి.


గిరి -హరిల స్నేహం చాలా కాలం నాటిది. అరమరికలు లేనిది. హరి భార్య గిరికి బంధువు. ఆమె కూడా రమణమ్మను గిరిని అభిమానిస్తూ అవసరానికి సహాయంగా ఉంటుంది.

హరి ప్రకటన గురించి చెప్పినపుడు, గిరికి సలహా ఇచ్చింది.


“గిరీ ఈ అవకాశం వదులుకోవద్దు. హరి ఆవిడతో మాటాడి సెటిల్ చేస్తాడు. నువ్వు సరే అను. ”


గిరి కూడా ఆలోచించాడు. ప్రయత్నం చేద్దాము.. వేరే దారిలేదు.. అనుకున్నాడు.

హరి తో ఓకే చెప్పేడు.


ఆవిడపేరు ఇందుమతి. ఆవిడ నేను ఇండియా వచ్చి స్వయంగా కలిసి మాటాడుతాను అంటూ హరికి చెప్పింది. బయలుదేరి వచ్చింది.


హరి, భార్య సిరితోనూ, గిరి రమణమ్మలతోనూ మాటాడింది. వాళ్ళ మంచితనం పరిస్థితులు తెలుసుకుంది. వారిమీద నమ్మకం కుదిరేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.

హరికి- గిరి ఇవ్వ వలసిన బాకీ చెల్లించింది.


గిరికి రమణమ్మకి వీసాలు ఇప్పించి మూడు నెలల్లో వారిని తనతోబాటు లండన్ తీసుకువెళ్ళింది. హరి - సిరి మనసారా ఇందుమతిని అభినందించి వీడుకోలు చెప్పేరు.


గిరి లండన్ వెళ్ళేక ఇందుమతి వైభవం చూసి ఆశ్చర్య పోయాడు. అదృష్టం ఇలా కలిసి వస్తుందని అతను ఏనాడూ అనుకోలేదు. రమణమ్మకి కలో - నిజమో తెలియనంత అయోమయంగా వుంది. స్వర్గం అంటే ఇదే కాబోలు అనుకుంది. ప్రయాణం అలసట వలన జబ్బు ఎక్కువై వెంటనే పాపం ఆవిడ ఆసుపత్రికి పరిమితం అయి పోయినది. ఫ్రీ ట్రీట్మెంట్జరుగుతోంది ఇందుమతి పుణ్యం వలన.


తన జబ్బు, పేదరికం కొడుకుని ఎంత బాధించిందో, ఇప్పుడు వాడు సుఖ పడుతున్నాడు.. అదే చాలు. ఇందుమతి దేవత.. వాళ్ళు నూరేళ్లు చల్లగా ఉండాలి “ అనుకుంది.


గిరి - ఇందుమతిని సేవకుడిగా వినయ విధేయతలతో పూజిస్తాడు. ఆమె ఎలా చెబితే అలా ఆచరిస్తాడు.


తన జీవితానికి ఇంతటి సహాయం చేసిన హరికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పేదో. “గిరి నువ్వు మామూలుగా అందరిలా వుండు.. నేను చేసిన దానికంటే నీ విశాల హృదయం గొప్పది. కొడుకుగా మీ అమ్మగారి బాధ్యత పంచుకున్నావు, నా పట్ల జాలి కృతజ్ఞతా కాదు నేను కోరుకునేది.. అర్ధం చేసుకో..” అంది.


“మీరు దేవతా మూర్తులు. నేను భక్తుడిని. నన్ను ఇలాగ ఉండనీయండి. నాలో అహం పెంచవద్దు“ అన్నాడు.


“సరే! నీకు కొంత కాలం టైం ఇస్తాను.. ఇదిగో నా ఆస్తులు కంపెనీలు వాటి రాబడి ఉద్యోగులు వారి జీతాలు. ఇంతదాకా నా మేనేజర్ డాల్టన్ చూసేవాడు. అతడు నీకు అన్ని వివరిస్తాడు. చాలా నమ్మకం వున్నవాడు. అతడు వాళ్ళ దేశానికి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వలన ఇబ్బంది వచ్చింది. లేకుంటే మార్చవలసిన అవసరం లేదు. ఈ రోజునుంచి ఇంగిలీషు టీచర్ కూడా వస్తుంది. నేర్చుకో..! గిరీ నిన్ను ‘నువ్వు’ అని పిలుస్తుంటే దగ్గిరగా అనిపిస్తుంది. డోంట్ మైండ్..!”

“అలాగే! మీకు ఎలా బాగుంటే ఆలా పిలవండి. నేను మాత్రం మెం“ అనే పిలుస్తాను దయచేసి కాదనకండి“ అన్నాడు.


ఇందుమతి నవ్వింది. ”నాకంటే పదేళ్ల చిన్నవాడివి. అలాగే పిలు“ అంది.


“మీరు నాకంటే చిన్న పెద్ద అని ఆలోచించను. నాకు లైఫ్ ఇచ్చారు. అది చాలు. మీ భర్తగా గౌరవం ఇచ్చారు. అర్హత ఇచ్చారు. ఈ అదృష్టం చాలు.”


ఏడాది తిరిగేసరికి గిరి అన్ని నేర్చుకున్నాడు. ఇంగిలీషులో గడగడా మాటాడుతున్నాడు. కంపెనీని లాభాల బాట పట్టించాడు. ఇందుమతి నమ్మకాన్ని నిలబెట్టేడు. అన్ని విషయాలు హరితో చెప్పేడు. నీ వల్లనే నా జీవితం బాగుపడింది అన్నాడు. ఇండియా లో కంపెనీ పెడదామని ఇందుమతిని ఒప్పించి హరిని పార్ట్నర్ గా చేసాడు.


అంతా బాగా కలిసివచ్చి ఇందుమతి - గిరి మధ్య స్నేహ అనుబంధాలు మరింతగా అల్లుకు పోయాయి. ఇవి ఏమీ రమణమ్మకి తెలియవు. ఆమెకు లివర్ కిడ్నీ హార్ట్ వీలు ఉన్నంత వరకూ ఆర్గాన్స్ను ట్రాన్స్ప్లాంట్ చేశారు డాక్టర్లు.


ప్రాణం పోనివ్వరు.. అలాగని ఆరోగ్యం బాగుపడదు. ఒక మాటలో చెప్పాలి అంటే ‘జీవచ్చవానికి ఇన్సూరెన్స్ కంపెనీ కట్టే మనీ కోసం ట్రీట్ మెంట్ చేస్తూనే వుంది ప్రభుత్వ ఆసుపత్రి.’


ఒకరోజు ఇందుమతి వీడియొ మీటింగ్లో అందరి తోటి చెప్పింది.

“హరీ గిరీ సిరీ.. నేను ఈ దేశంలో ౩౦ ఏళ్లుగా వున్నాను. నిబద్ధతగల సిటిజెన్ గా టాక్స్ కడుతున్నాను. ఈ సంపద అంతా నా మొదటి భర్త విన్సెన్ట్ వలన సంక్రమించింది.


ఇప్పుడు నాతోబాటు గిరి, అతని స్నేహితుడు హరి కుటుంబం అందరూ అనుభవిస్తున్నారు. వారు కూడా కంపెనీ బాగు పడటానికి కృషి చేశారు. కాదనలేను.


ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటూన్నాను. గిరికి నా ఆస్తిలో ఒక వంతు నాలుగో భాగం కొన్ని కోట్లు ఇచ్చేస్తున్నాను. ఇవిగో డాక్యు మెంట్స్. వీరు నా లాయరు.. జార్జ్ ఫెర్నాండేజ్. వారి సలహా తోనే ఇదంతా చేసాను. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.”


హరి -గిరి నివ్వెర పోయి వింటున్నారు.


వాళ్ళ కి ఏమి అర్ధం కాలేదు. ఆవిడ ఇప్పుడు ఏమి చేయబోతోంది!


ఇక విడిపోదాం మీ దారి మీదీ.. అని చెబుతుందా..?


“మీ నిర్ణయానికి మేము నిబద్ధులం. మీకు ఆ హక్కు వుంది మెం..”. అన్నాడు గిరి.


“మరి ఇండియా లో కంపెనీ ఉంటుందా?” అడిగాడు హరి.


“గిరి వాటాకి ఇస్తున్నాను. మీ ఇద్దరూ నడుపుకో వచ్చు లేదా సేల్ చేయచ్చు. అది మీ ఇష్టం.”


“ఇప్పుడు మీ ఆస్తిని పంపకం చేయ వలసిన అవసరం ఏముంది? అది మీ ఇష్టం. గిరికి డివోర్స్ ఇస్తున్నారా?” అందోళనగా అడిగింది సిరి.


“ అవును. ఒక మహిళాగా నీ ఆలోచన సరి ఐనదే!”


“గిరి వొప్పుకున్నాడా?” హరి అన్నాడు.


“ఇప్పుడే మీ ఎదురుగానే చెప్పేడు. నా ఇష్టానికి బద్ధుడిని అని.”


“సరే! థాంక్స్ మెం..” అన్నారు హరి -సిరి, గిరి.. చేసేది లేక.


“ సలు నా ప్లాన్ను ఇప్పుడు చెబుతాను వినండి. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం. మా కంపెనీలు అన్ని నష్ట పోయి దివాళా తీసే స్థితికి వచ్చినపుడు విన్సెన్ట్ ఆత్మాహత్య చేసుకున్నారు. ఆ షాక్ లో కుమిలి పోయాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని నష్టాలనుంచి బయట పడాలని విన్సెన్ట్ ఆత్మకు శాంతి కలిగించాలని నిర్ణయిన్చుకుని నా స్నేహితులతో చర్చించాను.


నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ప్రకటన ఇచ్చాను.

గిరి చదువు లేక పోయినా తెలివిగా అన్ని అవగాహన చేసుకుని పరిస్థితిని చక్క బెట్టేడు. మీకు తెలియని అగ్రిమెంట్ మా మధ్య వుంది. పది ఏళ్ళు కలిసి ఉంటామని తర్వాత విడిపోవాలని నిర్ణయాన్ని గిరి అంగీకరించాడు.


అతడు తల్లి వైద్య సహాయం కోసము, నేను మా కంపెనీ బాగు కోసము ఈ అగ్రిమెంట్ చేసుకున్నాము. ఒక నెలలో గడువు తీరుతుంది. ఇప్పుడు రమణమ్మ గారిని డిశ్చార్జ్ చేస్తారు. ఆవిడ గడువు కూడా తీరిపోయినదని డాక్టర్ కబురు చేశారు.


ఇదిగో ఇతను విలియం విన్సెన్ట్. నా కొడుకు. అమెరికాలో ఇతని చదువు పూర్తి చేసుకుని వచ్చాడు. ఇంత కాలమూ అక్కడ నా తమ్ముడి దగ్గిర వున్నాడు. ఇకనుంచి కంపెనీ నా కొడుకే చూసుకుంటాడు. నాకు హెల్ప్ చేసిన మీ అందరికి ధన్యవాదాలు.


ఈ దేశం చదువుకోడానికి వచ్చాను. విన్సెన్ట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా కంపెనీలో ఈ దేశం వారు ఉద్యోగులుగా వున్నారు. పుట్టి పెరిగింది ఇండియా.

నాకు జీవితాన్ని ఇచ్చింది ఈ దేశం. అందుకే సమ న్యాయం చేసాను.


హరికి గిరికి ఉపాధి కల్పించి నా ఆస్తిలో భాగమూ ఇచ్చాను.

నా ప్రియమైన విన్సెన్ట్ నా వెంట నీడగా వున్నాడు.

అతని వారసుడికి తిరిగి అన్ని అప్పగించి నా బాధ్యత నిర్వర్తించాను. గుడ్ బాయ్!” అంటూ చెప్పి వీడుకోలు తీసుకుంది ఇందుమతి.

********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ




నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)














50 views0 comments

Comments


bottom of page