top of page

కొత్త బంగారు లోకం ఎక్కడుంది?


'Kotha Bangaru Lokam Ekkadundi' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్


అవినీతి లేని సమాజం కావాలి నాకు

కోపం లేని లోకం కూడా కావాలి

బాధే లేని దునియా ఎక్కడుందో.. చెప్పండి కాస్త...

బానిసత్వం లేని బ్రతుకు ఎప్పుడో.. ఎక్కడో...

ఆ లోకం కోసం ఎక్కడెక్కడో వెతికాను

ఎందర్నో మేధావుల్ని అడిగాను.

ఎక్కడా ఆ లోకం దొరకలేదు

ఎవరూ ఆచూకీ చెప్పలేదు

ఎన్నో పుస్తకాలు చదివాను

ఎన్నో ఏళ్ళు నిరీక్షించాను

చివరికి కనిపెట్టేశాను

ఆ లోకం ఎక్కడో లేదు నా మనసులోనే ఉందని నా తోనే ఉందని

మనసును ప్రేమతో నింపితే

అహంకారం వదిలి అందర్నీ అభిమానిస్తే

ఆ లోకం నాలోనే ఉంటుంది

అప్పుడే అంతులేని ఆనందం కలుగుతుంది.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




1 則留言


Gandavalli Sireesha
Gandavalli Sireesha
2021年9月03日

Yes it's true 👍good poem

按讚
bottom of page