వేకువ చుక్క - పుస్తకావిష్కరణ
- Gadwala Somanna
- Sep 3
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #VekuvaChukka, #వేకువచుక్క, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న "వేకువ చుక్క" పుస్తకావిష్కరణ మరియు"తెలుగు తేజం" పురస్కారం
Vekuva Chukka - Book Unveiling ceremony At Narasaraopet - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 03/09/2025
వేకువ చుక్క - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం
రచన: గద్వాల సోమన్న
నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్నను శ్రీశ్రీ కళావేదిక అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన "తెలుగు తేజం"పురస్కారం వరించింది.పల్నాడు జిల్లా, నరసరావుపేటలో భువనచంద్ర టౌన్ హాల్ లో శ్రీశ్రీ కళావేదిక నిర్వహించే తెలుగు భాష సాహితీ సంబరాల కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అత్యల్ప కాల వ్యవధిలో 77 పుస్తకాలు ముద్రించి,పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. అనంతరం వీరి 77వ పుస్తకం "వేకువ చుక్క" ను నరసరావుపేట శాసన సభ్యులు డా.చదవలవాడ అరబిందబాబు, శ్రీశ్రీ కళావేదిక సి. ఇ. ఓ డా కత్తిమండ ప్రతాప్ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగాఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక నాగేశ్వరావు, సంజీవ్ రాయుడు,కె. నాగేశ్వరయ్య, కవులు, కళాకారులు పాలొగొన్నారు. కృతికర్త, అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్ ఏ. జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.
-గద్వాల సోమన్న
Comments