top of page
Original.png

విచిత్రం

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Vichitram, #విచిత్రం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Vichitram - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 19/11/2025

విచిత్రం - తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

"రోజా..! ఆ చుక్కలు ఎంత బాగున్నాయో చూసావా? వాటిని కోసి, నీ జడలో అలంకరించనా?"


"ఈ రోజు నేను పువ్వులు కొని పెట్టుకున్నా రాజా.. వేస్ట్ అయిపోతాయి. రేపు ప్లాన్ చెయ్యి ఆ చుక్కలని.. అవి అక్కడే ఉంటాయి లే.. ఫ్రీ ఏ కదా"


"జోక్.. భలే జోక్ పేల్చావే.. "


"ఈ మధ్య కామెడీ షోస్ లో మా అమ్మాయిలే టాప్ లో ఉన్నారు.. మేమూ పంచ్ లు వెయ్యగలం"


"హ..! హ..! హ..! నవ్వాను లే"


"నవ్వింది చాలు గానీ.. పల్లీలు ఒక పది ప్యాకెట్స్ చెప్పు.. అలాగే ఆ ఐస్‌క్రీము వాడు అలా చూస్తూనే ఉన్నాడు.. ఒక నాలుగు తీసుకో"


"నన్ను ప్రేమించడానికి వచ్చావా? లేకపోతే తినడానికి వచ్చావా రోజా?"


"తింటే.. బుర్ర బాగా పనిచేస్తుంది.. బాగా ప్రేమ పలుకులు వస్తాయి రాజా"


"బాబూ! చాలా సేపటి నుంచి చూస్తున్నావుగా.. మేడం గారికి అడిగినవి ఇవ్వు.. కొంచం రేట్ చూసి ఇవ్వు"

"సరే" అంటూ నవ్వుతూ అన్నీ ఇచ్చాడు ఐస్‌క్రీము వాడు, పల్లీల అబ్బాయి.

 

'ప్రేమకోసం ఇవన్నీ కొనక తప్పదు మా మగవారికి.. ఎంతైనా ఈ అమ్మాయి మనసు, ప్రవర్తన చాలా విచిత్రం' అనుకున్నాడు రాజా.

 

"సర్..! మా కొత్తింటి గృహప్రవేశం.. మీరు తప్పక రావాలి" అన్నాడు పల్లీ అబ్బాయి.

 

"కంగ్రాట్స్!!! .. ఎలా కొన్నావు పల్లీలు అమ్ముకుంటూ?"


"ఇన్ని సంవత్సరాలనుంచి మీలాంటివారు నా దగ్గర కొంటున్న వాటినుంచి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను.. ఇంకో సంవత్సరం ఇలాగే మీరు సహకరిస్తే, ఒక కారు కొందామనుకుంటున్నాను సర్.. "


"మన పెళ్ళి అయ్యేలోపు ఇక్కడ వారంతా ఇళ్లు కట్టేసుకుని, పెళ్ళిళ్ళు చేసేసుకుని, పిల్లలు కూడా కనేస్తారేమో"


"రాజా..! దేనికైనా టైం రావాలి.. ముందు పల్లీలు తిను వేడిగా.. ఐస్‌క్రీము తిను చల్లగా.. "


రాజా, రోజా.. ఇద్దరు రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో మునిగిపోయారు. ఇంకా కొన్నాళ్ళైతే వరదలు వచ్చే ప్రమాదం ఉందని వారిని చూస్తున్న జనం అనుకుంటున్నారు. 

ఇద్దరు తిరగని చోటు అంటూ లేదు. పార్క్లు, బీచ్ లు, సినిమా హాల్స్ మొత్తం అన్నీ చుట్టేశారు. బోర్ కొట్టి.. జూపార్క్ కూడా వదలలేదు.. అక్కడ జంతువులూ వీరిని చూసి "మళ్ళీ వచ్చార్రా బాబు అమర ప్రేమికులు" అని అనుకునేవి 


పార్క్ లో బెంచీలు, చెట్లు అన్నీ వీరి ప్రేమకు సాక్ష్యాలే. ఎగిసే కెరటాలు వీరి ప్రేమకు గర్జించే సాక్ష్యం. పార్కులో పల్లీలబ్బాయి, బీచ్‌లో పానీపూరీవాడు, ఐస్‌క్రీము అబ్బాయి అందరూ వీరిని రోజూ పలకరించేవారే.. ఫ్రీగా కాదు లెండి, డబ్బులకి వారి దగ్గరవి తెలివిగా అమ్ముకుని. 


ఇలా వీరు చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ వుంటే, ఒకరోజు మన విలన్ కంట పడింది. ఎవరో కాదు, రోజా తండ్రి బంగారుబాబు. పేరుకు తగ్గటే, బంగారం వ్యాపారం, బాగా ఉన్న కుటుంబం. రాజా ఒక సామాన్యుడని తెలిసి.. మనసు తట్టుకోలేకపోయింది పాపం. కూతురు పుట్టాకే తన వ్యాపారం మూడు దుద్దులు ఆరు నెక్లెస్లు లా పెరిగింది. అందుకే కూతురిని గట్టిగా మందలించడానికి అతని ప్రేమ రెడ్ సిగ్నల్ వేసింది. 

ఒకరోజు.. 


"రోజా..! నీకు ఒక మంచి సంబంధం చూసాను.. వారిది మనలాగే బంగారం వ్యాపారమే.. టీవీలో ఎప్పుడూ ఒక బట్టతల అంకుల్ ప్రకటనలో వస్తారుగా.. ఆయనే నీకు కాబోయే మామగారు.. పెద్ద షాప్ లు ఆయనకు బోలెడు ఉన్నాయి. మనది బంగార వ్యాపారమే, వారికి వజ్రాల వ్యాపారం కూడా ఉంది.. "


"లేదు నాన్నా..! నేను రాజాను ప్రేమించాను.. అతనినే పెళ్ళి చేసుకుంటా"


"రాజా ఒక సామాన్యుడు.. నీకు బంగారం కనీసం ఒక గ్రాము కొనగాలడా? వజ్రం అంటే అసలు తెలియదేమో. మన స్టేటస్ కి తగ్గ సంబంధం కాదు. అతనిని చేసుకుని, నువ్వు ఎలా సుఖపడగలవు? సినిమాలో చూపించినట్టుగా రాత్రిళ్ళు సైకిల్ తొక్కో, ఆటో నడిపో నీకు బంగారం, వజ్రాలు కొంటాడేమో అనుకోకు.. ఇది జీవితం. ఆడవారికి చీరలు, నగలు లేకపోతే, పిచ్చి పట్టినవారిలాగా అయిపోతారు.. బాగా ఆలోచించి చెప్పు రోజా"

ఒక వారం అంతా.. ఆ కొత్త పెళ్ళికొడుకు రోజూ రోజాను కలుస్తూ.. గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నాడు. మర్నాడు రాజాకు తనకి వచ్చిన పెళ్ళి సంబంధం గురించి చెప్పడానికి రోజా అతని దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఈ విషయం రాజా చెవిన పడింది. రోజా వచ్చి చూసేసరికి.. అప్పుడు రాజా చిరిగిన చొక్కా.. మాసిన గడ్డంతో.. చింపిరి జుట్టులో.. ఎదురుగా అరడజను మందు సీసాలు.. పక్కనే ఒక కుక్కపిల్లతో కనిపించాడు. 


'నా ప్రేమ దక్కలేదని పాపం ఎలాగయిపోయాడో.. దేవదాసు మళ్ళీ పుట్టాడేమో.. ' అంటూ కంట నీరు పెట్టుకుంది రోజా. ఆ కుక్కపిల్లకి ఏమైనా పెడుతున్నాడో లేదో పాపం' అనుకుని అక్కడనుంచి వెళ్ళిపోయింది. 


పాపం పిచ్చి రోజా..! నేను బాధపడుతున్నాను అనుకుని ఏడ్చేసింది! ఇంట్లో షేవింగ్‌ బ్లేడ్ లేక షేవింగ్ చేసుకోలేదు.. కటింగ్ చేసుకోడానికి డబ్బులు లేవు. షర్టు మేకుకు తగిలి చిరిగింది. ప్రేమ భగ్నమైందని తాగుతున్నానని అనుకుంది. కాని నేను సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి తాగుతున్నానని రోజాకు తెలియదు. పాపం ఈ కుక్కపిల్ల కూడా నా లాగే పార్టీ చేసుకుంటోంది. నా నెలజీతమంతా పల్లీలకి, పానీపూరికీ, ఐస్‌క్రీములకీ, సినిమాలకి, గిఫ్ట్‌లకీ అయిపోతే నేను ఎలా బతికేది? ఆమెను పెళ్ళిచేసుకుని ఎలా హ్యాపీ గా ఉండేది? ఇప్పటికే ఊరంతా అప్పులు. దేవుడు కరుణించాడు.. తన పీడ వదిలింది" అంటూ బాటిల్ పైకెత్తి గొంతులో చల్లటి బీర్ పోసుకున్నాడు రాజా. 


దారిలో.. రోజా తన మనసుతో మీటింగ్ పెట్టింది. 


రాజా దగ్గరేముంది.. ? పానీపూరి, పల్లీలు మళ్ళీ కొనమంటే తెగ ఆలోచిస్తాడు.. డిస్కౌంట్ అడుగుతాడు. హోటల్ లో తిందామంటే, బండి దగ్గర పది రూపాయల ఇడ్లీ ఇప్పిస్తాడు. ఎందుకంటే.. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అని కవర్ చేస్తాడు'. నాన్న చూసిన అబ్బాయి ఇప్పటికే రెండు వజ్రాల నెక్లెస్లు, రెండు వజ్రాల ఉంగరాలు కానుకగా ఇచ్చాడు. డిన్నర్ అంటే, ఫైవ్ స్టార్ లేక టెన్ స్టార్ హోటల్లోనే ఇస్తాడు. డబ్బులంటే అసలు లెక్కే లేదు. ఆలోచిస్తే, వజ్రాలు తోడుంటేనే లైఫ్ హ్యాపీ గా ఉంటుంది! ' అని మనసులో నిర్ణయించుకుంది రోజా. 


*********


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page