top of page
Original_edited.jpg

విప్లవ కెరటం

#AyyalaSomayajulaSubrahmanyam, #విప్లవకెరటం, #ViplavaKeratam, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

నేను సైతం విశ్వసృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను - కవివాక్యం.

Viplava Keratam - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 03/08/2025

విప్లవ కెరటం - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత


నళిని ఎనిమిదో తరగతి చదువుతోంది. ఉన్నపళంగా ఓ రోజు బడి మాన్పించేసి “రేపు నీకుపెళ్ళి” అన్నారు. వారం తిరక్కుండానే ఆమెను భర్తతో పాటు పంపించివేశారు. భర్త, వాళ్ళ అత్తామామలు అందరూ ఒక తనని రైసుమిల్లులోకి తీసుకెళ్ళారు. 


’నళిని తన ఇల్లు ఎంత పెద్దదో అని ఆశ్చర్యపోయింది. మురిసిపోయింది. రానురాను అర్థమయ్యింది. వాళ్ళందరూ ఆ రైస్‌మిల్లులో ఓనరు వద్ద వెట్టి చాకిరీ చేస్తున్నారనీ.. పెళ్ళితో తనుకూడా కొత్త బానిసగా అక్కడికి వచ్చిందని. 


తమిళనాడు - ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న తడ జిల్లాలోని ఇరువక్కై అనే సంచార జాతి. సంచార తెగగా వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు. వ్యవసాయం తగ్గడంతో వారిలో కొందరు రైసుమిల్లులో పనిచేయసాగారు.


నళిని మామ ఎప్పుడో పనిచేసే చోట గాయపడి వైద్యం కోసం రూ. పదివేలు అప్పు తీసుకున్నాడట. చక్రవడ్డీతో దానిని నలభై వేలు చేసి - ఆ మొత్తం చెల్లించక పోవడంతో కుటుంబం మొత్తాన్ని వెట్టి బానిసలుగా చేసుకున్నాడట యజమాని. ఆ రైసు మిల్లు లో ఉప్పుడు బియ్యం తయారు చేసే ఫ్యాక్టరీ. వడ్లని నానబెట్టి, ఆవిరి మీద ఉడికించి, ఆరబెట్టి బియ్యంగా బస్తాలకెత్తడం మా పని. అలా రోజూ వంద బస్తాలెత్తితే మనిషికి రూ. మూడు వందలు ఇస్తారు. దానిని అతని కివ్వాల్సిన నలభై వేలకి జమ చేసేవాడు ఆ ఓనరు. 


రాత్రి తొమ్మిది నుంచి తరువాతి రోజు సాయంత్రం ఐదింటి దాకా పని ఉంటుంది. ఆ తరువాత అన్నం వండుకుని ఒక్కపూటే తిని కేవలం మూడుగంటలే నిద్రపోయేవాళ్ళు. ఆ తరువాత మళ్ళీ పని చేయవలసిందే. 


ఊహ తెలియని వయసు నళినిది. పనిచేయనని నళిని మొండికేస్తే ఆమె భర్త ఎదురుగానే కొట్టేవాళ్ళు. ఆ మిల్లులోకి అడుగు పెట్టాక మళ్ళీ ఐదేళ్ల వరకూ బయటి ప్రపంచాన్ని చూడలేదు నళిని. రజస్వలై తీవ్ర రక్తస్రావంతో అవస్థపడ్డా బయటకు పంపలేదు. 


నళిని గర్భవతి అయ్యాక కేవలం కాన్పుకోసమే బయటకు వెళ్ళనిచ్చారు. మూడురోజుల తరువాత ఆసుపత్రి నుంచి రాగానే పచ్చి బాలింతైనా సరే నళినితోనే పని చేయించారు. కాకపోతే - ఈ సారి పాప నవ్వుల్ని చూస్తూ తన వెట్టిచాకిరీ కష్టాలను మరిచిపోయేది. 


పాపకి ఏడాది వయసొచ్చింది. దీపిక అని పేరు పెట్టారు. ఓరోజు తలస్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టి వడ్లు ఆరబెట్టేందుకని వెళ్ళింది. గంట తరువాత పాలు పడదామని వస్తే ఉయ్యాలలో లేదు. పెద్ద పెట్టున ఏడుస్తూ వెళ్ళింది. చుట్టూ వెతికింది.. వెతికితే నీటి తొట్టిలో పడిపోయి ఉంది. స్పృహ లేదు. గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్తానని కాషియర్‌ దగ్గరకు వెళ్ళింది. 


‘ఓనర్‌ లేడు.. వచ్చే దాకా ఆగు’ అన్నాడు. ఊపిరి బిగపట్టుకుని పాప గుండెలపైన కొడుతూ - నీళ్ళు కక్కించడానికి ప్రయత్నిస్తూ వేచి చూసింది. ఓనరు వచ్చీ రాగానే విషయం చెబితే ‘నీ పిల్ల బతికితే ఎంత.. . చస్తే ఎంత.. బియ్యం బస్తాలకెత్తడం అయినాకే వెళ్ళు’ అన్నాడు. 


ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంది. బతిమాలగా బతిమాలగా అతని మనసు కరిగి ఆసుపత్రికి వెళ్ళేసరికి .. పాప శవమైపోయింది. ‘ఆలస్యంగా తెచ్చారమ్మా..’ అని వాళ్ళు అంటుంటే పేగులు కదిలేలా ఏడుస్తూ అలానే ఉండిపోయింది. 


పాపకి అంత్యక్రియలు చేయడానికి ఊరిజనం ఒప్పుకోలేదు. "సొంత ఊరు వెళ్ళండి" అన్నారు. 

"పని మాని వెళ్ళడానికి వీల్లేదు" అన్నారు. 


"ఆ బియ్యం పొట్టు కాల్చే చోటే పాతేయండి" అన్నాడు ఓనర్‌. 


నళినికి మొదటిసారి మనిషిని చంపేసేంతటి కోపం అప్పుడొచ్చింది. ఏది ఏమైనా, తన బిడ్డను తీసుకుని వాళ్ళ ఊరికెళతానని మొండికేసింది. చివరికి ఓనర్‌ ఒప్పుకున్నాడు. పంపించివేశాడు. 


కానీ పంపిన ఆరో రోజే నళిని ఇంటికి మనిషిని పంపాడు – "పనిలోకి రావాల్సిందే" అంటూ. 


బిడ్డ పోయిన బాధనుంచి కాస్తయినా తేరుకోకముందే ఎలా వస్తాం అని తిరగబడే తెగువలేని మొగుడు, చాతకాని మరుదులు, మామ – వాళ్ళు బానిసలుగా ఉండటానికి పుట్టామని.. . మా తలరాత ఇంతేనని సరిపెట్టుకున్నారు. చేసేదేమీ లేక, వాళ్ళతో పాటు మళ్ళీ మిల్లుకు వెళ్ళింది నళిని. 


ఇలా రోజులు గడిచిపోయాయి. నాలుగేళ్ళు కాలగమనంలో కలిసిపోయాయి. మళ్ళీ నళినికి కూతురు పట్టి తప్పటడుగులు వేస్తోంది. 


ఒక రోజు వాళ్ళు ఉడికించిన వడ్లు ఆరబెడుతూ ఉంటే.. చంటిపాప తల్లిని పిలుస్తూ.. అందులోనుంచి నడిచి వచ్చేసింది. 


అరికాళ్ళు బొబ్బలు తేలి బోరున ఏడుపు మొదలెట్టింది. తనను తీసుకుని ఆసుపత్రికి వెళదామంటే – "కాళ్ళకి బురద మన్ను పూసేయ్‌. బియ్యం బస్తాలెత్తాక ఆసుపత్రికి వెళదువు గానీ" అన్నాడు ఓనర్‌. 


నళిని కోపమంతా అణచుకుని, కాళ్ళు కిందపెడితే విలవిల్లాడుతున్న పాపని చంక నెత్తుకొని, పనులన్నీ పూర్తి చేసి ఆసుపత్రికి వెళ్ళింది. 


పాప పాదాలు చూసి డాక్టర్‌ నళినిని బాగా తిట్టింది. "నువ్వు తల్లివేనా?" అని. 


ఏం చెబుతుంది నళిని?


పాపకి ఐదేళ్లు వచ్చాక – ఒక రోజు పాపని బళ్ళో చేర్పిస్తానంది. 


"కూలిదాని కూతురు కూలియే అవుతుంది. కలెక్టర్‌ అవుతుందా?" అని ఓనర్‌ హేళనగా, వెటకారంగా అన్నాడు.. . 


అంతే.. ఆ క్షణం .. ఆమెలో నివురు గప్పిన ఆవేశం లావాలా పొంగుకొచ్చింది. ఓనర్‌పై తిరగబడింది నళిని. ఆ రోజు ఓనరు, మిగిలిన పనివాళ్ళతో కలిపి ఒళ్ళు వాతలు తేలేలా కొట్టారు. కానీ ఆ సంఘటన తరువాత నళిని మరింత మొండిఘటంగా తయారైంది. ‘మా మామ తీసుకున్న అప్పుకి నేను బానిసగా ఉండాలా.. ’ అని ప్రశ్నించసాగింది. ఇదంతా అక్కడ లారీకి బస్తాలు మోయడానికి వచ్చిన ఓ కొత్త వ్యక్తి గమనించాడు. అతను ఏమయిందని అడిగితే తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పింది నళిని. తను ఫిర్యాదు చేస్తానని, త్వరలోనే అధికారులు వచ్చి మిమ్మల్నందరినీ విడిపిస్తారని అతను చెప్పాడు.


కానీ అధికారులు వచ్చేరోజే ఆ విషయం ముందుగా తెలిసి - వాళ్ళ ఓనరు వాళ్ళని చీకటి గిడ్డంగిలో బంధించాడు. మిల్లుకి తాళం వేసి పారిపోయాడు. అర్ధరాత్రి ఆ మిల్లు బయట అధికారుల అలికిడి నళినికి వినిపించింది. “లోపల ఎవరూ లేనట్టున్నారు. మనకి తప్పుడు సమాచారం ఇచ్చారేమో” అన్న వాళ్ళ మాటలు వింటున్న నళిని గుండెలు జారిపోయాయి. వాళ్ళని విడిపించకముందే వెళ్ళిపోతారేమోనని నళినికి భయం వేసింది. అంతే, వాళ్ళ వాళ్ళందరూ వద్దంటున్నా వినకుండా ఇరవై అడుగుల ఎత్తున గోడ ఎక్కి అటువైపు దూకేసింది నళిని. కాలి మడమ విరిగిపోయింది.


అలానే కుంటుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి అధికారుల ముందు నిలిచింది. వాళ్ళలో ఓ మహిళ అధికారి ఉంది. ఆమె కాళ్ళు పట్టుకుని భోరుమని ఏడ్చేసింది. వాళ్ళు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్ళి నళిని వాళ్ళనందరినీ బయటకు తీసుకువచ్చారు. నళిని ఇచ్చిన వాంగ్మూలంతో ఆ రైస్ మిల్లు యజమానిని అరెస్టు చేశారు. వాళ్ళనందరినీ తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో ఉంచారు. చుట్టుపక్కల ఆంధ్ర, తమిళనాడు ఏరియాల్లో ఎంతోమంది వెట్టిచాకిరీ చేస్తున్నారని నళిని తెలుసుకుంది. నళినియే ముందుండి వెయ్యిమంది బానిసలని అలా విడిపించింది.. దాంతో నళిని పేరు అధికార వర్గాల్లో మార్మోగింది. మంచి గుర్తింపు వచ్చింది.


కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించ గలిగింది. అటువంటి వాళ్ళందరూ కలిసి ‘రిలీజ్డ్ బాండెడ్ లేబర్ అసోషియేషన్‌ (RBLA)’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం కూడా వారి చేత మహిళా సంఘాలనినే ఏర్పాటు చేయించి ఉపాధి చూపించింది. నళిని రకరకాల కుటీర పరిశ్రమలపై శిక్షణ తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుత్తణిలో “వర్ణం” పేరుతో బ్లాక్ ప్రింటింగ్ పరిశ్రమ ఏర్పాటు చేసింది. తనలాగే వెట్టి నుంచి విముక్తి పొందిన పద్నాలుగు మంది మహిళలతో ఆ పరిశ్రమ నడుస్తోంది. వెట్టి నుంచి బయటకొచ్చినప్పటి నుంచి అనేక వేదికలపై నళిని తన గళాన్ని వినిపిస్తూ మోటివేషన్ చేస్తోంది.


“జోష్ టాక్” వీడియోలో ప్రసంగానికి ఐదు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. నళిని జీవితం ఒక అడ్వెంచర్ సినిమాలా ఉందంటూ ఎంతోమంది నళినిపై డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్లు తీశారు. మహిళా సాధికారత, పరిశ్రమలకు సంబంధించిన పలు జాతీయ సమావేశాలకు, సెమినార్లకు వక్తగా వెళ్ళి మోటివేట్ చేస్తోంది. అక్రమ రవాణాకు గురైన ఆడవాళ్లు, వ్యభిచార కూపంలో మగ్గిన వారిని బయటకు తీసుకురావడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం నళిని తరచూ సమావేశమవుతోంది. ఈ మధ్య అక్రమ రవాణాకు సంబంధించి తెలంగాణ వుమెన్ సేఫ్టీ టీమ్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరై తన అనుభవాలను పంచుకుంది.


“నీ మాటలతో మా అందరికీ స్ఫూర్తినిచ్చారు తల్లీ” అంటూ డీజీపీతో సుమిత్ర బహుగుణా లాంటి వాళ్ళు పొగడడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. కళ్ళ వెంబడి ఆనందభాష్పాలు ఏకధాటిగా వచ్చేశాయి. “నీ కూతురు కలెక్టర్ అవుతుందా?” అని హేళన చేసిన మిల్లు ఓనర్ మాటలు ఆమె చెవుల్లో మోగుతూనే ఉండేవి. ఆ కసితో తన ఇద్దరు కూతుళ్లను మేనేజ్‌మెంట్ కోర్సులు చదిపిస్తోంది. కొడుకు పదో తరగతి చదువుతున్నాడు. వీళ్ళు కలెక్టర్లు కావచ్చు, కాకపోవచ్చు – కానీ తల్లిగా ఆమె పడ్డ కష్టం బాగా తెలిసిన వాళ్ళు. ఆ ఎరుక వాళ్ళను ఏ రకంగానూ దోచుకోని మంచి మనుషులుగా నిలబెడుతుంది. ఆ భరోసా చాలు ఆమెకు. 


——————————————శుభంభూయాత్‌————————————————


సమాప్తం


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page