top of page

వాట్సాప్ గందరగోళం


'Whatsapp Gandaragolam' - New Telugu Story Written By Mohana Krishna Tata

'వాట్సాప్ గందరగోళం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సుందరం కొత్తగా, స్మార్ట్ ఫోన్ కు అప్‌గ్రేడ్ అయ్యాడు. తన భార్య రమ్య కూ ఒక ఫోన్ తీసుకున్నాడు.


"రమ్యా! కొత్త ఫోన్ లో మొదటగా ఏం చేద్దామో చెప్పు?"

"ఇంకెందుకు ఆలోచిస్తారండి! వాట్సాప్ ఇన్స్టాల్ చేసేద్దాం!"


"ఒసేయ్! ఎవరైనా వినాయకుడి శ్లోకాలో, లేకపోతే భక్తి పాటలో వింటారు. ఈ వాట్సాప్ గోల ఎందుకే ఫస్ట్ లోనే?"


"మీకు తెలియదండి! మా ఫ్రెండ్స్ కు వాట్సాప్ లేకపోతే.. , నిద్రపట్టదంటా!.. మా ఫ్రెండ్స్ కే కాదండీ! ఒక్క 2 నిముషాలు వాట్సాప్ ఆగిపోయిందనుకోండి, లోకమే తలకిందులైపోతుందటా.. మా ఫ్రెండ్ చెప్పిందండీ..


"తెలుసుకొని సంతోషించావులే!"


తప్పక, భార్య-భర్త ఇద్దరూ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు.


కొన్ని రోజులు గడిచాక..


"ఏంట్రా సుందరం! వాట్సాప్ ఫోన్ లోంచి తీసేసావంటా! ఫ్రీ యే కదరా! ఎందుకు తీసేసావు? ఎలారా! ఇంక నీతో కాంటాక్ట్ చెయ్యడం మరి?" అన్నాడు సురేష్


"ఒరేయ్ సురేష్! నువ్వు నా స్నేహితుడవే కదా! పక్క ఇంట్లోనే ఉంటావ్ కదా, మీకు-మాకు ఒక గ్రూప్ ఎందుకు రా చెప్పు?"


"అందరికీ ఒకొక్క మెసేజ్‌లు పెట్టే బదులు, నీకు, మీ ఆవిడకు, మా ఆవిడకు ఒకే మెసేజ్ తో సరిపోతుందిగా.. అని తడపడుతూ.. అన్నాడు సురేష్. నీకు పొద్దున్న గుడ్ మార్నింగ్ పెట్టాలి కదా, రాత్రయితే గుడ్ నైట్ పెట్టాలా! నీకు లాగే, అన్ని గ్రూప్స్ కు మెసేజ్‌లు పెట్టాలి కదరా?" ఇవన్నీ మిస్ అయిపోతావు కదా మరి? వాట్సాప్ తీసేస్తే ఎలా మరి?"


"బయటకు వెళ్తే చొక్కా వేసుకోవడం మానేసిన పర్వాలేదు గాని, ఫోన్ మెసేజ్ లేక పొతే రోజు గడుస్తుందా.. చెప్పు.. సిగ్నల్ లేకపోయినా, ఫోటో పెట్టాలన్నా.. కావాలి కదా.. నీకు మెసేజ్‌లు కొత్త కాబట్టి అలా ఉంది. అలవాటైపోతుందిలే.. " అన్నాడు సురేష్


"ఒరేయ్! నీకు ఒక మాట చెప్పనా? మొన్న మా ఆవిడ, "హాయ్! ఎక్కడున్నారండి? అని మెసేజ్ పెట్టింది. " అన్నాడు సుందరం


"నువ్వు బయట ఉండి ఉంటావు కదా మరి!"


"ఇంట్లోనే ఉన్నాను రా, మేడ మీద మొక్కలకు నీళ్లు పోస్తున్నాను"


"పొనీలేరా! మీ ఆవిడకు అరిచే శ్రమ తగ్గిందిగా!"


"నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తావుగా అన్నిటికీ.. "


"నీకు ఒక మెసేజ్ వచ్చినట్టుంది! చూసుకో" అన్నాడు సుందరం

"అన్నయ్యగారు! బాగున్నారా? ఉండండి! కాఫీ తీసుకొస్తున్నా!"

"ఎవరు రా! అంత అభిమానంగా పలకరించింది?"

సురేష్ ఫోన్ లో మెసేజ్‌లు చూసుకుంటున్నాడు.


"ఎవరురా! అంటే చెప్పవేమి.. " కోపంగా అడిగాడు సుందరం.

"మీ ఆవిడ రా! కాఫీ తెస్తాను, వెయిట్ చెయ్యండి అని మెసేజ్ పెట్టింది"


"చూసావా!.. ఇదీ సంగతి.. " అన్నాడు సుందరం

"పొనీలేరా! నన్ను చెల్లెమ్మ కమ్మని కాఫీ తాగనీ!"


"ఎవరికీ రా మెసేజ్ పెడుతున్నావ్?"

"చెల్లెమ్మకు రా!"

"బాగున్నానని చెబుతున్నా!.. వాట్సాప్ మెసేజస్ వస్తున్నాయా? అని అడుగుతున్నాను"

"ఇదేమి పలకరింపు రా!"


"మరి ఈ సంగతి చెప్పరా!.. "అన్నాడు సుందరం


"ఏమిటో అది?"


"మొన్న నా స్కూల్ ఫ్రెండ్ కలిసాడు రా - వాడు ఒక గ్రూప్ లో నా నెంబర్ యాడ్ చేసాడు.

కాలేజీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అంటా.. నా నెంబర్ యాడ్ చేసారు.. వాళ్ళ కష్టాలన్నీ వినాల్సి వొస్తుంది, రోజూ కూర్చొని.. ఆ మెసేజ్‌లు చూస్తూ.. "


"ఆఫీస్ లో ఒక గ్రూప్.. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి రెస్ట్ తీసుకున్నా.. ఫోన్ ఎత్తకున్నా.. ఒక మెసేజ్ పెట్టేస్తారు.. వర్క్ చెయ్యమని..


పాత ఆఫీస్ కి ఒక గ్రూప్.. ఆఫీస్ మారిపోయినా.. పాత ఆఫీస్ సోది వినడానికి ఒక గ్రూప్.. పోనీ ఎగ్జిట్ అవుదామంటే.. అవసరం ఉంటుందేమో నని భయం.. "


ఇది మరీ దారుణం..


పనిమనిషికి ఒక గ్రూప్.. మొన్న, పని మనిషి రాలేనని, గ్రూప్ లో మెసేజ్ పెట్టింది రా..

పాలు పొసే వాడు ఒక గ్రూప్.. వర్షం.. ఈరోజు రానని..

కేబుల్ టీవీ ఒక గ్రూవ్.. వైర్ కట్ అయ్యిందని..

ఇంటర్నెట్ కు ఒక గ్రూప్.. ఫైబర్ కట్ అయ్యిందని..


మొన్న, అలా.. పార్క్ కు వెళ్ళానా!.. అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ను కలిసాను. వాళ్ళ కు ఒక గ్రూప్.. అందులో, సీనియర్‌ సిటిజన్లకు సబ్ గ్రూప్..

మా కాలనీ అంతటికి ఒక గ్రూప్..

అపార్ట్మెంట్ లో ఒక గ్రూప్.. అందులో ఆడవారికి మళ్ళీ ఇంకొక గ్రూప్..


ఇన్ని గ్రూప్స్ తో రోజు ఎలా మొదలవుతుందో తెలుసా..


ఉదయం 5 అయ్యేసరికి.. గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు.. ఒక 100.. కాలింగ్ బెల్ కొట్టినట్టే..

నిద్రాభంగం మొదలు..


ఒక గంట పడుకుందాం అంటే!.. ఈలోపు..


"వాకింగ్ కు వస్తున్నారా? ఐ యాం వెయిటింగ్" పక్క ఇంటి అయన పెడతాడు ఒక మెసేజ్.

వాకింగ్ కు వెళ్తాను. కాసేపు ఫ్రెండ్స్ అందరూ.. పార్క్ చుట్టూ వాకింగ్ చేస్తాం..

మనసు చాలా ఉల్లాసం గా ఉంటుంది రా.. వాకింగ్ అయిన తర్వాత, ఒక గ్లాస్ నీళ్లు తాగితే, ఇంకా బాగుంటుంది రా..


అయితే రేపటినుంచి, నేను కూడా జాయిన్ అవుతాను, మీ గ్రూప్ లో..


"మీ గ్రూప్ లో కాదు రా! మీ అందరితో అనాలి.. "


"అలాగే మహాప్రభూ!"


వాకింగ్ నుండి, అలా రిటర్న్ వస్తుంటే, ఇంటినుంచి మా ఆవిడ ఫోన్..


"ఏవండీ! మీరు ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళలేదండి? మెసేజ్‌లు సౌండ్ తో ఫోన్ మోగిపోతుంది. పూజ కూడా సరిగ్గా చేసుకోలేక పోతున్నా.. పోనీ, సైలెంట్ లో పెడదామంటే, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతామేమో భయం!


"కాసేపైనా ప్రశాంతంగా ఉందామని, ఫోన్ వదిలేసాను రమ్యా.. అర్ధంచేసుకోవే!"


ఇంటికి వచ్చేసాక, ఫోన్ తీసి చుస్తే, హై బీపీ-షుగర్ లాగా మెసేజ్‌లు ఒక ౩౦౦ ఉంటాయి..

ఒక్కొకటి చూస్తూవుంటే.. మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి.. గ్రూప్ లోంచి ఎగ్జిట్ అవలేము, అలాగని మోత భరించలేము..


ఈమధ్య, ప్రతివాడు, లొకేషన్ పెట్టమని మెసేజ్‌లు.. టీవీ రిపేర్ చేసేవాడు, బాత్రూమ్ కడిగేవాడు.. అందరూ.. ప్రకటనలకు కూడా మెసేజ్‌ లే!

ఈ మధ్య.. మన ప్రమేయం లేకుండానే, కొత్త గ్రూప్స్ కూడా యాడ్ అయిపోతున్నాయి..


మొన్నటికి మొన్న.. ఎవరో.. "అల్పపీడనం శుభాకాంక్షలు" అని మెసేజ్ పెట్టాడు.


అంతా.. మెసేజ్‌లు గంగరగోళం..


"ఒరేయ్ సుందరం! ఇవన్నీ తప్పవురా!.. భరించాల్సిందే.. లేకపోతే.. మనం బ్రతకలేం.. "


"అవును లేరా! మనుషులు.. మనసులతో మాట్లాడడం మానేసారు.. ఫోన్ లు, మెసేజ్‌ లతో మాట్లాడుతున్నారు మరి!"


****************

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


29 views0 comments

Comments


bottom of page