'Yamunda Nenu Yama Busy 1' New Telugu Story
Written By Penumaka Vasantha
'యముండ.. నేను యమ బిజీ 1' తెలుగు కథ
రచన, పఠనం: పెనుమాక వసంత
యమలోకాధిపతి యమధర్మ రాజు మంచం నుండి లేస్తూనే సెల్ తీసి వాట్స్అప్ చూసుకున్నాడు. త్రిమూర్తులు నుండి మేసేజ్ ఉంది.
'క్లౌడ్ మీటింగ్ కి వెంటనే రా.. ఐడి- కరోనా, పాస్ వర్డ్- ఒన్ క్రోర్ (నంబర్స్ లో). ఒక పావు గంటలో సిద్ధం గా ఉండాలి యమా!'
'మొన్ననే కాల్ చేసి బండ బూతులు తిట్టారు. మళ్ళీ ఇపుడు ఏమి దొబ్బులు పెట్టట్టానికి అయ్యి ఉంటుందో? మరణాలను ఆపమంటారు. నేను ఏమి చేయను? ఆ గాలి, (వాయు) దేముడికి ఎన్ని సార్లు చెప్పానో. ఆకరోనా వైరస్ ని స్ప్రెడ్ చేయకురా మగడా అని. అపుడు ఎపుడో వెకేషన్ అని చైనా వెళ్ళాడు వస్తూ.. ఈ కరోనా ని తెచ్చాడు. లైఫ్ లో బిజీ గా ఉంరాలనుకున్నాను గానీ మరీ ఇంత బిజీ గా కాదు. త్రిమూర్తులు ఒకవైపూ మరోవైపు ఈ కరోనా చావులతో నాకు వాచి పోతుంది. '
ఇంతలో చిత్రగుప్తుడు కాల్ చేస్తున్నాడు. "ఏంటి గుప్తా?"
" ప్రభూ.. భూలోకం లో "మరణాలు" ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళని తీసుకొచ్చే తాడులు లేవు ప్రభూ.."
"అబ్బా.. అమెజాన్ లో ఆర్డరు పెట్టు గుప్తా"
"పెట్టాను ప్రభూ.. స్టాక్ లేదంటున్నారు"
"నైలాను చీరలకు ఆర్డర్ పెట్టు. తాడులకి బదులు చీరలతో.. జనాలను లాక్కురమ్మని చెప్పు.
సరే.. భటులని నాకు క్లౌడ్ జూమ్ మీటింగ్ కి ఆరేంజ్ చేయమని చెప్పు.."
" చిత్తం మహాప్రభో" అన్నాడు గుప్త.
క్లౌడ్ మీటింగ్ లో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఉన్నారు.
"మాస్క్ లు వేసుకొచ్చారుగా.. గుడ్. లేదంటే.. మాకు వస్తుంది ఆ వైరస్" అన్నారు త్రిమూర్తులు.
యముడిని, గాలి దేవుణ్ణి పిచ్చి తిట్లు తిట్టారు.. త్రిమూర్తులు.
యముడు "గాలి దేముడుది తప్పు. లోకం అంతా స్ప్రెడ్ చేశాడు" అన్నాడు.
"నేను స్ప్రెడ్ చేస్తే నువ్వు ఏమి చేస్తున్నట్లు? ప్రాణాలను కాపాడాలి కదా" అన్నాడు గాలిదేముడు
వెటకారంతో.
ఇది చూస్తూ కలహభోజనడు నారదుడు 'అబ్బా! ఎన్నాళ్ళు అయిందో ఈ పోట్లాటలు విని.. ఎంత హాయిగా ఉంది వీళ్ళు తిట్టుకొంటుంటే'
"ఆపండి! మీ వాదనలు మా భక్తులు పోయి మేము ఏడుస్తుంటే.." అన్నారు శివకేశవులు.
నారదుడు అందుకొని "ఇంకొన్నాళ్ళలో అసలు భూలోకమే ఖాళీ అయి అందరూ యమలోకం లోనే ఉంటారు నారాయణ" ముసిముసిగా నవ్వుతూ అన్నాడు.
యముడికి కోపం వచ్చి "డోంట్ పుట్ స్టిక్స్" అన్నాడు నారదుడితో.
"స్టిక్స్ అనగా నేమి?" అన్నాడు నారదుడు ఏమి తెలియనట్లు.
"పుల్లలు. చాలునా.." అని "ఇపుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి.. కరోనా మహమ్మారి.. గురించి. మీరు సంభాషణని తప్పు తోవ పట్టించవద్దు" అని విష్ణువు అందర్నీ తిట్టాడు.
"ఏమి చేస్తారో ? నాకు తెలీదు. మీరు ఇద్దరు ఇక మరణాలను ఆపండి. గాలి.. నువ్వు వైరస్ ని స్ప్రెడ్ చేయటం ఆపి కరోనా వచ్చిన వాళ్ళకి గాలి అందే ఏర్పాటు చూడు" అన్నాడు.
"యమ.. నువ్వు పోయే ప్రాణాలను పోకుండా కాపాడు" అనిచెప్పి ఇద్దరిని పంపారు త్రిమూర్తులు.
త్రిమూర్తులు నారదుడితో "నువ్వు భూలోకం లో ప్రజలకు గాలి వార్తలు కాకుండ, కరోనా తగ్గుతుంది, ఎవరు భయపడవద్దు.. అనే న్యూస్ టీవీ చానల్స్ కి స్ప్రెడ్ చేయమని చెప్పు. వారు నీలాగే గాలి వార్తలు పోగేసి జనాలను భయపెడతారు కదా? టీవీలో వార్తల వల్ల.. కూడ జనాలు భయపడి పైకి వస్తున్నారు."
"అలాగే ! చెప్తాను" అన్నాడు నారదుడు.
యముడుకి గుప్తా కాల్ చేసి "ప్రభూ! మీరు ఒకసారి సభకి రావాలి. ఎపుడూ వీడియో కాల్స్ చేస్తూ వర్క్ ఫ్రం హోం అంటూ ఇంట్లో వుంటే ఎట్లా ప్రభూ.. నేను ఒక్కడిని మానేజ్ చేయలేక చస్తున్నా. "
"ఎవరితో టాక్.. చేస్తున్నావో గుర్తుందా.. నేను యముండ. "
'మట్టి కుండేమి? కాదు' అని చిత్రగుప్తుడు లోపల అనుకొని "చిత్తం.. కొత్త సభ్యులు వచ్చారు ప్రభూ! ఒక్కసారి రండి ప్లీస్. "
"సరే ఇంట్లో ఉండి బోరింగ గా ఉంది, వస్తున్నాను. సభను సిద్దం గా ఉంచండి" అని యముడు స్టార్ట్ అయ్యాడు.
ఇక ఇక్కడ సభను సిద్దము చేయాలని గుప్త అందరినీ ఎలర్ట్ చేస్తున్నాడు. "అందరూ మాస్క్లు వేసుకొనీ తగలబడండి.. "
"తగలబడే గా ఈడకు వచ్చినాము. ఇక నువ్వు ప్రత్యేకం గా చెప్పేదేమీ?" అని జయప్రకాష్ రెడ్డి అన్నాడు.
"కొత్తగా వచ్చిన వాళ్లనుండి వైరస్ మా యమధర్మ రాజుకు.. రాకూడదని. మా ప్రభువులు కూడా మాస్క్ వేసుకుంటున్నారు. ఇక అందరూ సైలెన్స్" అన్నాడు గుప్తా.
" కరోనా మరణ విజేత, అతల, సుతల, పాతాళ విఖ్యాత సామ్రాట్ యమధర్మ రాజు విచ్చేస్తున్నారహో..'
భటుల కరతాళ ధ్వనులతో యముడు వచ్చి ఆసనంలో కూర్చున్నాడు.
=============================================================
ఇంకా వుంది...
యముండ.. నేను యమ బిజీ - 2 త్వరలో..
=============================================================
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు
Comentarios