అదీ అసలు సంగతి
- Vangeepuram Shashirekha
- Jun 13
- 2 min read
అపార్థం కథ, కుటుంబ కథ, సెక్యూరిటీ గార్డ్ కథ, దాంపత్య జీవితం, తెలుగు కథలు, మన తెలుగు కథలు, సరదా కథ, సామాజిక కథ, తెలుగు సాహిత్యం, కుటుంబ హాస్యం, జీవిత సత్యాలు, చిన్న కథలు, తెలుగు రచయితలు, భావోద్వేగ కథ, మానవ సంబంధాలు, అపోహలు

Adee Asalu Sangathi - Telugu Comedy Story | Vangeepuram Shashirekha
అదీ అసలు సంగతి - తెలుగు హాస్య కథ | వంగీపురం శశిరేఖ
Publishes in manatelugukathalu.com on 13/06/2026
మనకు కనిపించిన ప్రతి విషయం నిజమే అనుకోవడం సహజం. కానీ కొన్నిసార్లు నిజం చాలా సాధారణంగా, మన కళ్ల ముందే దాగి ఉంటుంది. "అదీ అసలు సంగతి" కథలో వసుంధర, శర్మగారు, సెక్యూరిటీ గార్డ్ రాజు మధ్య జరిగిన చిన్న సంఘటన ద్వారా అపార్థాలు ఎలా పుడతాయో, వాస్తవం ఎంత భిన్నంగా ఉండవచ్చో రచయిత్రి వంగీపురం శశిరేఖ చమత్కారంగా ఆవిష్కరించారు. చివర్లో చిరునవ్వు తెప్పించే ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
“ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోతోంది. దేనిమీద ధ్యాస ఉండదు, ఏ విషయమైనా రెండు మూడుసార్లు చెప్పాల్సి వస్తోంది” అని భర్త మీద తనలో తను సణుక్కుంటోంది వసుంధర.
శర్మగారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువవ్వడం తోనో లేదా పిల్లలు దూరంగా ఉన్నారనే బెంగతోనో అన్యమనస్కంగా ఉంటున్నారు కొన్ని రోజులుగా.
ఇద్దరికీ కాలక్షేపం బాగానే ఉంటుంది రోజూ. కాసేపు ఏదోక వాదనలు, పిల్లల ఫోనులు, అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువులు, పండగలు పబ్బాలతో సందడిగానే గడిచిపోతాయి వాళ్ళ రోజులు.
ఓ రోజు పనులన్నీ అయి తీరుబడిగా కూర్చున్నప్పుడు కాలింగ్ బెల్ మ్రోగడంతో తలుపు తీసింది వసుంధర. ఎదురుకుండా సెక్యూరిటీ గార్డ్ రాజు నిల్చొని ఉన్నాడు. సామాన్యంగా మేము రాత్రి ఇచ్చిన తినుబండారాల తాలూకు బ్యాగ్ బయట పెట్టేసి వెళ్ళిపోతాడే అనుకుంటూ ఉండగా, నీళ్ళు నములుతూ అన్నాడు, “అమ్మా మీకో సంగతి చెప్పాలమ్మా! ఎలా చెప్పాలో తెలియట్లేదు.”
“ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు రాజు, దానిలో ఏముంది?” అంది వసుంధర ఆత్రుతగా.
“అమ్మా! సారు అప్పుడప్పుడు మన గేటుకి దూరంగా బండి ఆపుతారమ్మా. ఒక అమ్మాయి ఎవరో, సారు బండి ఎక్కుతుంది” అని నసిగి వెళ్ళిపోయాడు.
రాజు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది వసుంధర.
‘ఎంత పరిశీలిస్తారు వీళ్ళు అందరినీ!’ అని అబ్బురపడింది.
అసలు సంగతేంటంటే, సామాన్యంగా ఇద్దరూ కలిసే స్కూటర్ మీద బయటికి వెళ్తారు. ఈ మధ్య రోడ్డు వేయడానికి కంకర, గేటు ముందు పోయడంతో బండి స్కిడ్ అయితే కష్టమని, తను కొంచెం దూరం నడిచి బండి ఎక్కుతోంది.
మరి తనని దూరం నుండి చూసి గుర్తుపట్టలేదా, లేక చుడీదార్ వేసుకున్నప్పుడు చూసి ఇంకెవరో అనుకున్నాడా అని ఆలోచనలో పడింది. ఏది ఏమైనా ఈ రోజుకి ఒక కొత్త టాపిక్ దొరికింది నవ్వుకోవడానికి. ‘అసలు సంగతి రాజుకి చెప్పాలి, అందరికీ విషయం దండోరా వేయకముందే’ అనుకుని నవ్వుకుంది.
***************************************
వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ
నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం
గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా
ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. మా మనవడు
ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.




Comments