అమ్మ మనసు
- Bhallamudi Nagaraju

- 46 minutes ago
- 3 min read
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #అమ్మమనసు, #AmmaManasu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Amma Manasu - Telugu Family Story |Bhallamudi Nagaraju
Published in manatelugukathalu.com on 14/03/2026
అమ్మ మనసు - తెలుగు కథ
రచన: భళ్లమూడి నాగరాజు
“పరీక్షల ముందు కళ్ళు కనిపించకుండా పోయిన కొడుకు…
కానీ అతని తల్లి చేసిన పని ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది.”
అమ్మ మనసును ఈ కథలో అద్భుతంగా చూపారు రచయిత శ్రీ భళ్ళముడి నాగరాజు గారు.
రాఘవ రోజూ కన్నా ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. క్షణం తీరిక లేకుండా పని చేయడం తో అతని మొఖం బాగా నీరశించి పోయింది. భోజనం చెయ్యడానికి కూడా సమయం దొరక్కపోవడంతో తీసుకొని వెళ్లిన లంచ్ బాక్స్ బ్యాగ్ లోంచి తీసి టీపాయి మీద పెడుతూ. ..
“ఈ రోజు భోజనం చెయ్యలేదోయ్”అన్నాడు సరళ వంక చూస్తూ.
“అయ్యో …భోజనం మానేసి పనేంటండీ ..ఆరోగ్యం పాడైపోదా .. కనీసం జ్యూస్ అయినా తాగేరా ”అంది మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ
“తాగేనోయ్ ..అయినా చాలా నీరసంగా ఉంది త్వరగా భోజనం పెట్టు”అని అన్నాడు బట్టలు మార్చుకుంటూ.
ఇలాంటి సమయంలో అర్జున్ సంగతి చెప్తే టెన్షన్ పడతారని,మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది సరళ .
రాఘవ భోజనం చేస్తూ ..కాస్త స్థిమిత పడ్డాక ..అర్జున్ అప్పుడే నిద్రపోయాడేంటి,చదివేడా“అని అడిగేడు రాఘవ.
”ఆ ..ఎదో చదివాడు లెండి ..ముందు మీరు ప్రశాంతగా భోజనం చేసి ,కాస్త రెస్టు తీసుకోండి”అంది మరి మాటలు పొడిగించకుండా .
“ఎదో చదవడం ఏంటి ..మూడు రోజుల్లో పరీక్షలు ఉండగా ..ఇన్నాళ్లు చదివింది వేరు. పరీక్షల ముందు బాగా చదివించాలి కదా….నిద్రలేపు,చదివిస్తాను”అని అన్నాడు కాస్త కోపంగా
“మీరు బాగా అలసట గా ఉన్నారు.మీరు కంగారు పడకండి .తెల్లారున లేపి చదివిస్తాను.”అంది అతన్ని శాంత పరుస్తూ.
రాఘవ ఒడిశా రాష్ట్రం రాయగడ కు దగ్గర లో ఓ ప్రెవేట్ పరిశ్రమ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఉన్న ఒక్క కొడుకుని బాగా చదివించాలని జిల్లాలోనే మంచి పేరున్న కాన్వెంట్ లో చదివిస్తున్నాడు. తనలా అర్జున్ ఇబ్బంది పడకూడదన్నదే అతని ఆలోచన.
రాఘవ మంచం మీద వాలేడే తప్పా నిద్ర రాలేదు. సరళ వంటింట్లో పనులు ముగించుకొని బెడ్ రూమ్ లోకి వస్తూ “ఇంకా నిద్ర పోలేదా”అంది రాఘవ ని చూస్తూ.
“నిద్ర రావడం లేదోయ్. అర్జున్ గురించే బెంగగా ఉంది. పరీక్షలు ఎలా రాస్తాడో అని. పోనీ ఆఫీస్ లో సెలవు పెట్టి దగ్గరండి చదివిద్దామనుకుంటే ,ఇయర్ ఎండింగ్ కదా పనులన్నీ పూర్తి చెయ్యాలి “అంటూ బాధ పడ్డాడు.
“చూడండి వాడి చదువు గురించి బెంగ పడకండి. తెలివైన వాడు,బాగా చదువుకుంటాడు.కానీ …“
”హు. ..కానీ...ఏంటి.. ఏమైంది చెప్పు ..ఇప్పుడు బాగా చదవడం లేదా ..”ఆతృత తో ప్రశ్న ల వర్షం కురిపించాడు.
“వాడికి చదవాలన్న ఆశక్తి ఉంది . ఈ రోజు కళ్ళు ఎర్రగా అయిపోయి ,పుస్తకం చూస్తే చాలు కంట నీరు కారుతోంది . ఎంతకీ తగ్గక పొతే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళేను. కళ్ళకు విశ్రాంతి లేకుండా అదేపనిగా చదవడం ఇలా అయ్యిందని చెప్పి, కంటిలో డ్రాప్స్ వేసేరు. అవి వేయడం వల్ల కళ్ళు మంట తో పాటు అక్షరాలు కనబడటం లేదని ఏడుస్తూ నిద్రపోయాడు.“అంటూ ఉదయం నుంచి జరిగినవన్నీ పూస గుచ్చినట్లు వివరించింది సరళ.
సరళ మాటలు విన్న రాఘవ ఒక్క సారిగా గాలి తీసిన బెలూన్ లా అయిపోయాడు.”ఇన్నాళ్లు కష్టపడి చదివిస్తే పరీక్షల ముందు ఎందుకిలా అయ్యింది. కళ్ళు మంట తగ్గక పోయి , వాడు పరీక్షలు బాగా రాయలేక పొతే, డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఇన్నాళ్లు మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.”అంటూ కన్నీరు పెట్టుకున్న అతన్ని చూసి
“ఏంటి చిన్న పిల్లాడిలా. .అధైర్యపడకండి. రేపు ఉదయం కి అన్నీ సర్దుకుంటాయి. . ఉదయం లేపి నేను చదివిస్తాను “అని ధైర్యం చెప్పడంతో నిద్రలోకి జారుకున్నాడు.
ఎవరో మాట్లాడుతున్న శబ్దం రావడంతో నిద్రనుంచి మేల్కొని స్టడీ రూమ్ వైపు మెల్లగా వెళ్ళేడు. అర్జున్ మంచం మీద పడుక్కొని ఉన్నాడు. కళ్ళమీద పసుపులో తడిపిన క్లాత్ వేసి ఉంది. సరళ వాడి ప్రక్కనే కూర్చొని చదువుతోంది , అర్జున్ వింటున్నాడు.
“అర్జున్ అర్ధం అయిందా …లేదా మరోసారి చదవమంటావా”అంది సరళ
“అర్ధం అయిందమ్మా. ..కానీ భయం వేస్తోంది పరీక్షలు రాయగలనా”
అర్జున్ అలా అనేసరికి అదంతా చూస్తున్న రాఘవకి ఒక్కసారి జాలి వేసింది . గబాలున వెళ్లి వాడిని గుండెకు హత్తుకొని
“నీకేమి భయం లేదు అర్జున్. నువ్వు పరీక్షలు బాగా రాయగలవు అంటూ ధైర్యం చెప్పేడు రాఘవ.
పరీక్షల రోజు వచ్చింది. కళ్ళు మంటలు కాస్త తగ్గడం తో అర్జున్ పరీక్ష హాల్ కు వెళ్ళేడు. వాడు పరీక్ష రాసి వచ్చే వరకూ సరళకు క్షణం ఒక యుగంలా గడిపింది. అర్జున్ వస్తూనే అమ్మని చుట్టేసుకొని “పరీక్ష బాగా రాసేను అమ్మా..ఈ మూడురోజులు నాకోసం నువ్వు ఎంతో కస్టపడి చదివేవు . .నువ్వే లేకుంటే నేను లేనమ్మ”అంటూ సరళ గుండెల్లో దూరిపోయాడు. అప్పుడే వచ్చిన రాఘవ కళ్ళతోనే సరళకి కృతజ్ఞతలు చెప్తూ,అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టి ఫైవ్ స్టార్ చాక్లెట్ అందించాడు.“సరళా అందుకే అన్నారు అమ్మ మనస్సు గొప్పదని”అంటూ ఆమెకు మనస్సు లోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాఘవ.
***
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం




Comments