అమ్మను మించిన కొడుకా?
- P. V. Padmavathi Madhu Nivrithi
- 2 hours ago
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #AmmanuMinchinakoduka, #అమ్మనుమించినకొడుకా, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

అమ్మను మించిన కొడుకా? అత్తను మించిన కోడలా
Ammanu Minchina koduka - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 02/03/2026
అమ్మను మించిన కొడుకా? - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
ఆ రోజు మాధవ్ ఇంటికి రాగానే, "అమ్మా! కొత్త బ్యాగ్ కొంటా అన్నావు... చూపించు", అన్నాడు.
అమ్మ: "కొనలేదురా మాధవ్... డబ్బు చాలలేదు".
మాధవ్ నవ్వేశాడు, "నీకు పొదుపు మరీ ఎక్కువ అమ్మా!", అని.
--------------------------------------------------
2)
మరునాడు, మాధవ్ బాధగా వచ్చాడు ఇంటికి.
అమ్మ అడిగింది, "ఏరా అలా ఉన్నావు? కొత్త పుస్తకం కొంటాను అని వెళ్ళావు... ఏదీ చూపించు!"
"స్కూటీ ముందు ఉంచాను... కాళ్లు పెట్టుకునే చోట, కాళ్ల నడుమ జాగ్రత్తగా... ఎక్కడో జారిపడిపోయింది", అన్నాడు మాధవ్ బాధగా.
"పర్వాలేదురా... బాధ పడకు... నేను డబ్బులు మళ్ళీ ఇస్తాను... మళ్ళీ అదే పొరపాటు చేయకు", అన్నది చల్లని అమ్మ.
"ఈసారి బ్యాగ్ మరియు పుస్తకం... రెండు కొనుక్కో... పుస్తకం బ్యాగ్ లో పెట్టుకో జాగ్రత్తగా", అన్నది చల్లని అమ్మ చిరునవ్వుతో... ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తూ.
మాధవ్ కళ్ళలో నీరు కారింది, "నువ్వు బ్యాగ్ కోసం దాచుకున్న - పొదుపు చేసిన డబ్బులు నాకు వద్దు అమ్మా... నేను లైబ్రరీకి వెళ్లి చదువుకుంటాలే", అన్నాడు.
"పర్వాలేదురా... నేను ఈ నెల ట్యూషన్లు చెప్పి కాస్త కూడబెడతాను లేరా", అన్నది చల్లని అమ్మ.
అప్పుడు తీసుకున్నాడు డబ్బు మాధవ్.
--------------------------------------------------
3)
"బ్యాగ్ కొని అందులో కొత్తగా కొన్న పుస్తకం వేశాను... స్కూటీ హుక్ కి తగిలించాను కాళ్లు పెట్టుకునే చోట... ఇప్పుడు లేదు... జారిపోయిందో?... లేక... ఎవరైనా కొట్టేశారో?... నేను ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు... నాకు తెలియదు", బాధగా కూర్చీలో కూలిపోయాడు మాధవ్... ఇంటికి వచ్చి రాగానే.
"ఈసారి చేతికి వేసుకునే హ్యాండిల్ ఉన్న బ్యాగ్ మరియు పుస్తకం రెండు కొనుక్కో... ఇదిగో డబ్బు... ఇవి నేను చీర కోసం దాచుకున్న - పొదుపు చేసిన డబ్బులు"... అన్నది చల్లని అమ్మ... మళ్ళీ డబ్బు ఇస్తూ మాధవ్ కు.
మాధవ్ డబ్బులు తీసుకోడానికి సంకోచించాడు బాధగా.
"పర్వాలేదురా... నేను ఈ నెల 2 ట్యూషన్లు చెప్పి కాస్త ఎక్కువగా కూడబెడతాను లేరా", అన్నది చల్లని అమ్మ.
అప్పుడు తీసుకున్నాడు డబ్బు మాధవ్.
"అలాగేనమ్మా"... అంటూ స్కూటీలో ఉషారుగా వెళ్ళిపోయాడు మాధవ్.
-------------------------------------------------
4)
మాధవ్ ఇంటికి వచ్చాడు ఉషారుగా. చేతిలో పుస్తకం ఉంది.
2 గిఫ్ట్ ప్యాకెట్లు (ప్యాక్ చేసినవి) ఉన్నాయి చేతిలో.
అమ్మకు 2 గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చాడు, "నీకే అమ్మ... తెరువు", అని.
చల్లని అమ్మ ఆశ్చర్యంతో తెరిచింది గిఫ్ట్ ప్యాకెట్లు.
ఒక దాంట్లో బ్యాగ్ మరియు ఇంకో దాంట్లో చీర ఉంది.
"ఇవెక్కడివిరా? కొనడానికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?", అమ్మ ఆశ్చర్యంగా అడిగింది.
--------------------------------------------------
5)
మాధవ్ నవ్వుతూ "నా పుస్తకం రెండుసార్లు పోవడం... బ్యాగ్ పోవడం... అంతా అబద్ధం... నాటకం!"
"నీ అతి పొదుపు బంగారం కాబట్టి... నిన్ను ఆ పాత చిరిగిన చీరలో చూడలేకపోయాను. నీ కొత్త బ్యాగ్ మరియు కొత్త చీర... రెండు కోరికలు ఒకేసారి తీర్చాలి అనుకున్నాను... అందుకే ఈ పుస్తకం పోయింది అని రెండుసార్లు నాటకం ఆడాను... నన్ను క్షమించు... నీకు బాధ కలిగి ఉంటే", అన్నాడు మాధవ్.
"ఎందుకూరా అంత డబ్బు వ్యర్థం - వృథా చేశావు... నాకు షోకులెందుకు ఈ వయసులో?"... అన్నది అమ్మ నొచ్చుకుంటూ.
"పర్వాలేదు... ఈ రోజు నుండి వేసవి సెలవులు... నేను రెండు ట్యూషన్లు చెప్పి... ఉదయం మరియు సాయంత్రం (హాయినిచ్చే సంధ్యా సమయంలో)... రెండింతల డబ్బు సంపాదించి నీ పొదుపు డబ్బులో వేస్తాను", హామీ ఇచ్చాడు మాధవ్.
--------------------------------------------------
6)
అప్పుడు సరిగ్గా సాయంత్రం వేళ (అందాల సంధ్యా సమయం... చల్లటి గాలి వీచి... హాయినిచ్చే వేళ)
అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ ప్రాణ స్నేహితురాలు అందాల వింధ్య (6వ తరగతి నుండి), "అబ్బో... నువ్వు చల్లని అమ్మను మించిన బంగారు కొడుకువి!" అని కితాబు ఇచ్చింది.
"ఇంతటి మంచి నాటిక - ఉపాయం ఇచ్చిన నువ్వు
ఈ ఇంటి బంగారు కోడలివి... చల్లని అత్తను మించిన బంగారు కోడలివి", అన్నాడు మాధవ్ ఆమె చెవిలో రహస్యంగా.
"ఈసారి ఈ చల్లటి సాయంత్రం వేళ... ఇంటి లోపలికి వచ్చావా కోడలు పిల్లా... ఆ రోజు కాంపౌండ్ గేటు (ద్వారం) వద్ద నుండే వెళ్లిపోయావు... మాధవ్ ని మాత్రమే కలసి... ఆ చల్లటి సాయంత్రం వేళ",
అన్నది చల్లని అమ్మ అందాల వింధ్యను:- బార్బీ (బొమ్మ) జుట్టు నిమురుతూ.
ఆ బంగారు కుటుంబం (త్రయం) సభ్యులు నవ్వుకున్నారు హాయిగా.
శుభం.
------------------- చిన్న కథ సమాప్తం. -------------------
-------------- నీతి -------------------
1) అందరూ (ప్రతి ఇల్లు - కుటుంబం - కార్యాలయం) బంగారు కుటుంబంలా మెలగాలి... ఆప్యాయత - అనురాగం - అభిమానం - అనుబంధం - ఆత్మీయతతో... సహాయం చేసుకుంటూ
..
సంతోష పూరిత నిర్వహణ + ఆనందదాయక పరిష్కారాల తీరు + నిర్మాణాత్మక తీరుతో
... ...
కొట్లాటలు - జోక్యం - తప్పులు లెక్కపెట్టడం - నిందల ఆట - బలిపశువు చేయడం - హాని లేకుండా.
2)
ఇది సాధ్యం... కుటుంబ సలహాదారులు + సంతోష పూరిత నిర్వహణ సలహాదారుల వద్దకు (అందరూ) తరచుగా వెళ్తే... శిక్షణ తీసుకుంటే... వారి మంచి చిట్కాలు ఆచరిస్తే.
...
3)
అందరిలో కుళ్ళు, కుతంత్రాలు, భూత తత్వం మాయమైపోతుంది... కాస్త దూరంగా మెలిగితే... నెత్తికెక్కకుంటే.
అప్పుడూ అందరూ "దేవుడు చేసిన (మంచి) మనుషులు" అయిపోతారు... ప్రపంచం స్వర్గసీమలా మారిపోతుంది.
4)
తల్లిని మించిన దైవం లేదు.
5)
తల్లిదండ్రులు కలియుగ దైవాలు.
6)
వృద్ధాశ్రమాలను నిషేధించాలి
...
పిల్లలు వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని
చట్టం తేవాలి
...
తరచూ శిక్షణ ఇస్తే ప్రతి కుటుంబం - కార్యాలయం
...
"బంగారు కుటుంబం కార్యాలయం" లా మారిపోవడం - మెరిసిపోవడం ఖాయం
...
అదీ ఒక్క క్షణంలో.
7)
అందరు భూత తత్వం విడనాడాలి!
8)
Any human - any age, gender, profession... Should live with 100% Happy development management + WIN-WIN JOYFUL success SOLUTIONS + CONSTRUCTIVE nature... WITHOUT exploitation, harm, brokerage, timepass, destruction, devilish nature scapegoat. blame-game etc.
...
BAN old-age homes ... Make it a law that children should look after their parents well
...
YES! ...
HAPPY family life AND offices are possible VIA
regular training
&
Counseling
[BY
expert family counselors
AND
Professionals
OF
HAPPY Development Management
&
JOYFUL success SOLUTIONS
&
CONSTRUCTION - BUILDING nature.]
ధన్యవాదాలు
పివి పద్మావతి మధు నివ్రితి
--------- నీతి సమాప్తం -----
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
